OTT Horror Thriller: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో హారర్ థ్రిల్లర్ చిత్రం.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడంటే..-gv prakash fantasy horror adventure thriller kingston streaming date and time on zee5 ott in two languages ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Horror Thriller: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో హారర్ థ్రిల్లర్ చిత్రం.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడంటే..

OTT Horror Thriller: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో హారర్ థ్రిల్లర్ చిత్రం.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడంటే..

OTT Horror Thriller: కింగ్‍స్టన్ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు ఆసన్నమైంది. మరికొన్ని గంటల్లోనే ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. తెలుగులోనూ రానుంది. ఈ సినిమాను ఓ ప్లాట్‍ఫామ్‍లో ఎప్పుడు చూడొచ్చంటే..

OTT Horror Thriller: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో హారర్ థ్రిల్లర్ చిత్రం.. తెలుగులోనూ స్ట్రీమింగ్

తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా నటించిన కింగ్‍స్టన్ సినిమా మార్చి 7న థియేటర్లలో విడుదలైంది. మంచి హైప్‍తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, అంచనాలను అందుకోలేక కమర్షియల్‍గా ప్లాఫ్‍గా నిలిచింది. ఈ హారర్ ఫ్యాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీకి కమల్ ప్రకాశ్ దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ కింగ్‍స్టన్ చిత్రం స్ట్రీమింగ్‍కు సమయం ఆసన్నమైంది.

మధ్యాహ్నం స్ట్రీమింగ్‍కు..

కింగ్‍స్టన్ సినిమా రేపు (ఏప్రిల్ 13) మధ్యాహ్నం 12 గంటలకు జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. తమిళంతో పాటు తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. దీంతో మరికొన్ని గంటల్లో ఈ చిత్రాన్ని జీ5లో చూడొచ్చు.

ఒకే సమయానికి ఓటీటీతో పాటు టీవీ ప్రీమియర్‌కు కింగ్‍స్టన్ సినిమా రానుంది. అందుకే అర్ధరాత్రి కాకుండా రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఈ చిత్రం జీ5 ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. అదే సమయానికి జీ తమిళ్ టీవీ ఛానెల్‍లోనూ ఈ మూవీ ప్రసారం కానుంది.

కింగ్‍స్టన్ చిత్రం సముద్రం బ్యాక్‍డ్రాప్‍లో హారర్ ఎలిమెంట్లతో సాగుతుంది. ట్రైలర్, ప్రమోషన్లతో ఈ చిత్రంపై చాలా హైప్ వచ్చింది. కానీ థియేటర్లలో ఈ చిత్రం అంచనాలను అందుకోలేదనే మిక్స్ట్ టాక్ వచ్చింది. ఈ సినిమాలో జీవీ ప్రకాశ్ కుమార్ కింగ్ అలియాజ్ కింగ్‍స్టన్ క్యారెక్టర్ చేశారు. అళగమ్ పెరుమాళ్, ఎలాంగో కుమార్‌వేల్, దివ్యభారతి చేతన్, సాబుమోన్ అబ్దుసమాద్ కీరోల్స్ చేశారు.

కింగ్‍స్టన్ చిత్రాన్ని పార్లల్ యూనివర్సల్ పిక్చర్స్, జీ స్టూడియోస్ బ్యానర్లపై జీవీ ప్రకాశ్ కుమార్, భవానీ శ్రీ, ఉమేశ్ కేఆర్ భన్సాల్ నిర్మించారు. ఈ మూవీకి జీవీ ప్రకాశే మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది.

బాక్సాఫీస్ డిజాస్టర్

కింగ్‍స్టన్ సినిమా రూ.6కోట్లలోపు కలెక్షన్లే సాధించింది. ఈ మూవీ సుమారు రూ.20కోట్ల బడ్జెట్‍తో రూపొందింది. ఈ చిత్రానికి మోస్తరు ఓపెనింగ్ వచ్చినా ఆ తర్వాత వసూళ్లలో డ్రాప్ కనిపించింది. మిశ్రమ స్పందన దక్కడంతో పుంజుకోలేకపోయింది. డిజాస్టర్‌గా నిలిచింది.

కింగ్‍స్టన్ స్టోరీలైన్

తమిళనాడులోని తూవతూర్ గ్రామంలో ఈ మూవీ స్టోరీ సాగుతుంది. సముద్రంలో చేపలు పట్టకుండా ఆ గ్రామ మత్స్యకారులను 1982లో ఓ అతీత శక్తి శపిస్తుంది. ప్రస్తుత కాలంలో కింగ్ అలియాజ్ కింగ్‍స్టన్ (జీవీ ప్రకాశ్ కుమార్) డబ్బు కోసం స్మగ్లింగ్‍తో కలిసి పని చేస్తుంటాడు. అయితే, శాపానికి సంబంధంచిన అనూహ్యమైన విషయాలు తెలియడంతో గ్యాంగ్‍ను అతడు వదిలేస్తాడు. గ్రామస్తుల సమస్యను తీర్చి చేపలు పట్టుకునేలా చేయాలని అనుకుంటాడు. దీంతో సముద్రంపైకి వెళతాడు. కానీ ప్రమాదాలు అతడికి ఎదురవుతాయి. ఆ శాపం వెనుక మిస్టరీ ఏంటి? కింగ్‍స్టన్ సవాళ్లు ఛేదించాడా? ఆ అతీత శక్తి పని పట్టాడా? అనేది కింగ్‍స్టన్ సినిమాలో ఉంటాయి.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం