Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్‌ షోలో గుప్పెడెంత మనస్సు సీరియల్ నటి.. వైల్డ్ కార్డ్‌తో ఎంట్రీ..!-guppedentha manasu serial dharani will going to the bigg boss season 6 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్‌ షోలో గుప్పెడెంత మనస్సు సీరియల్ నటి.. వైల్డ్ కార్డ్‌తో ఎంట్రీ..!

Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్‌ షోలో గుప్పెడెంత మనస్సు సీరియల్ నటి.. వైల్డ్ కార్డ్‌తో ఎంట్రీ..!

Guppedentha Manasu Dharani: బిగ్‌బాస్ సీజన్ 6 షోలో ఈ సారి 19 మంది కంటెస్టెంట్లు పాల్గొంటున్నారు. వీరిలో గుప్పెడెంత మనసు ఫేమ్ ధరణి కూడా ఇందులో ఉన్నారని తెలుస్తోంది. సెప్టెంబరు 4 నుంచి ఈ షో ప్రారంభం కానుంది.

గుప్పెడెంత మనసు (Hotstar/Twitter)

Guppedentha Manasu Dharani: బిగ్‌బాస్ సీజన్ 6కు రంగం సిద్ధమైంది. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న రియాల్టీ షో ఆదివారం నాడు ఘనంగా ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ ఫాపులర్ షో గురించి సర్వత్ర చర్చ జరుగుతోంది. ఈ సారి ఎవరెవరు పాల్గొంటున్నారు? ఎలాంటి టాస్కులు ఉంటున్నాయి? ఎన్ని రోజులు నిర్వహిస్తారు? లాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎప్పటిలానే ఈ సారి కూడా నాగార్జునే ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. సెప్టెంబరు 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్ల గురించి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది. తాజాగా ఈ సీజన్‌లో బుల్లితెర నటి, గుప్పెడెంత మనస్సు ఫేమ్ ధరణి కూడా పాల్గొంటున్నారని తెలుస్తోంది.

గుప్పెడెంత మనస్సు సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో హీరో రిషికి వదిన పాత్రలో నటిస్తున్న ధరణి తన అమాయకపు నటన, అందంతో ఆకట్టుకుంది. ఆమె అసలు పేరు జ్యోతి పూర్ణిమ. ఇటీవల ఈమె చేస్తున్న ధరణి పాత్రలో మరో నటి సీతామహాలక్ష్మీ ఎంట్రీ ఇచ్చింది. దీంతో పాత ధరణి స్థానంలో కొత్త నటి వచ్చినట్లు తెలుస్తోంది. మంచి నటనతో గుర్తింపు తెచ్చుకున్న జ్యోతి పూర్ణిమను తీసివేయడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.

ఆమె బిగ్‌బాస్ షోకు వెళ్తుందని, అందుకే సీరియల్ నుంచి తప్పుకున్నట్లుగా వార్తలు ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. బిగ్‌బాస్ సీజన్ 6లో జ్యోతి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు టాక్. తన అమాయకపు నటనతో గుప్పెడెంత మనస్సు సీరియల్‌లో మెప్పించిన మన ధరణి.. గొడవలు, అల్లర్లతో రసవత్తరంగా సాగే బిగ్‌బాస్ షోలో ఏమేరకు అలరిస్తుందో వేచి చూడాలి.

ఈ సారి మొత్తం 19 మంది కంటెస్టెంట్లును హౌస్‌లోకి పంపించనున్నారు. సెప్టెంబరు 4న ప్రారంభమయ్యే ఎపిసోడ్‌లో 15 మందిని, ఆ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ రూపంలో మరో నలుగురిని పంపనున్నట్లు సమాచారం. చలాకి చంటి, యూట్యూబర్ ఆదిరెడ్డి, హీరో అర్జున్ కల్యాణ్, కామన్ మ్యాన్ కింద రాజేశేఖర్, శ్రీహాన్, సింగర్ రేవంత్, దీపిక పిల్లి, వాసంత కృష్ణన్, గలాటా గీతూ, నటి శ్రీ సత్య, అభినయ శ్రీ, రోహిత్ తదితరులు పాల్గొంటున్నారని తెలుస్తోంది.