Guppedantha Manasu : రిషి చనిపోయాడా? శైలేంద్ర మరో ప్లాన్.. మూడేళ్లు ముందుకు గుప్పెడంత మనసు-guppedantha manasu today episode killers attack on rishi and vasudhara mother died ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Guppedantha Manasu Today Episode Killers Attack On Rishi And Vasudhara Mother Died

Guppedantha Manasu : రిషి చనిపోయాడా? శైలేంద్ర మరో ప్లాన్.. మూడేళ్లు ముందుకు గుప్పెడంత మనసు

HT Telugu Desk HT Telugu
Jun 01, 2023 10:16 AM IST

Guppedantha Manasu : గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకు ఆసక్తిగా సాగుతోంది. రౌడీలకు ఫోన్ చేసి.. రిషిని చంపేయమని శైలేంద్ర చెబుతాడు. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

గుప్పెడంత మనసు సీరియల్
గుప్పెడంత మనసు సీరియల్

రిషి మీద రోజురోజుకు శైలేంద్రకు పగ పెరుగుతూనే ఉంది. ఓ రౌడీకి కాల్ చేసి రిషిని చంపేయమని శైలేంద్ర చెబుతాడు. మంచి సమయం కోసం వెయిట్ చేస్తున్నామని రౌడీలు చెబుతారు. అంత టైమ్ లేదని శైలంద్ర అంటాడు. వాడు బతికి ఉంటే నాకు చాలా పెద్ద ప్రాబ్లమ్ అవుతుంది అంటాడు శైలేంద్ర. మీకు ఎంత డబ్బులు కావాలంటే అంత ఇస్తాన్నానని చెబుతాడు. సరే సర్ అని రౌడీ అంటాడు. గతంలో కూడా మిస్ చేశారని, ఈసారి ఎట్టిపరిస్థితుల్లో మిస్ కావొద్దని వార్నింగ్ ఇస్తాడు. మీ ప్లాన్స్ మీద నాకు నమ్మకం లేదని, నేను చెప్పినట్టుగా చేయండని ప్లాన్ చెబుతాడు శైలేంద్ర.

సీన్ కట్ చేస్తే.. జగతి దీర్ఘాలోచనలో ఉంటుంది. ఇక నుంచి ఈ కాలేజీ నుంచి నువ్ తప్పుకోవాలని రిషితో చెప్పిన మాటలు జగతీ గుర్తు చేసుకుంటుంది. గతంలో జరిగిన విషయాలు అన్నీ.. మనసులో మెదులుతుంటాయి. రిషి విషయంలో తప్పి చేసినట్టుగా ఫీల్ అవుతుంది జగతి. రిషి ఫొటో దగ్గరకు వెళ్తుంది. నాన్న రిషి.. నేను తప్పు చేశానని, కానీ అది నీ క్షేమం కోసం చేశానని చెబుతుంది. మేం చేసిన పనికి మా మీద కొప్పడుతావ్ అనుకున్నా.. కానీ ఇలా అందరినీ వదిలేసి వెళ్తావనుకోలేదు అని బాధపడుతుంది. వసుకు దూరం అవుతావని అస్సలు అనుకోలేదని ఏడుస్తుంది జగతి.

నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను నాన్న, వసు ఎక్కడ ఉందో ఎలా ఉందో తెలియదు, మీ డాడీ బాధను చూస్తుంటే.. నా మనసు ముక్కలవుతుంది అనుకుంటుంది. నీ మంచి కోసం తీసుకున్న నిర్ణయం ఈరోజు శాపంగా మారిందని, క్షమించని కొడుకు రిషి ఫొటో ముందు జగతి బోరున ఏడుస్తుంది. నీ ప్రాణాలు కాపాడుకునేందుకు ఇలా చేశానని, కానీ పరోక్షంగా నీ ప్రాణాలు తీశానని బాధపడిపోతుంది.

మరోవైపు రిషి ఒంటరిగా తనలో తాను ఆలోచిస్తూ.. నడుచుకుంటూ వెళ్తాడు. ఇదే సమయంలో రౌడీలో వేరే వ్యక్తిని తరుముతూ వస్తారు. సర్ కాపాడండి అంటూ వస్తాడు. వీడు నిన్ను కాపాడుతాడు.. మేం చూస్తామని రౌడీలు వెటకారంగా అంటారు. వీడి ముందే నిన్ను చంపుతామని అంటారు. ఇదంతా అర్థంకాక రిషి చూస్తుంటాడు. రౌడీలతో ఫైట చేస్తాడు రిషి. ఇదే సమయంలో ఇద్దరు రౌడీలు రిషిని పట్టుకుంటారు. మరో వ్యక్తి వచ్చి రిషిని కత్తితో పొడుస్తాడు.. ఇలా రిషిని కత్తులతో పొడుస్తారు. రిషి చనిపోయాడని రౌడీలు వెళ్లిపోతారు.

మరోవైపు జగతి ముందు రిషి ఫొటో కిందపడుతుంది. ఇలా జరిగిందేంటి అని జగతి బాధపడుతుంది. నా కొడుకు ఏదైనా అపదలో ఉన్నాడా అని ఆలోచిస్తుంది. ఫొటో మీద పగిలిన గాజులు తీస్తూ ఉంటే.. చేయి కోసుకుని.. రక్తం రిషి నుదుటి మీదకు వెళ్తుంది. దేవుడా నా కొడుకుని నువ్వే కాపాడాలని జగతి వేడుకుంటుంది.

సీన్ కట్ చేస్తే..మన ప్లాన్ సక్సెస్ అయిందని శైలేంద్రకు రౌడీలు కాల్ చేస్తారు. వాడిని లేపేసినట్టుగా చెబుతారు. డబ్బులు ఎంత కావాలంటే అంత తీసుకెళ్లండి అంటూ శైలేంద్ర చెబుతాడు. నా కలను నిజం చేశావ్.. థ్యాంక్స్ తమ్ముడు అనుకుంటాడు శైలేంద్ర. ఇక కాలేజీ ఎండీ అయిపోతానని ఊహల్లో ఉంటాడు. మరోవైపు రిషి రక్తపుమడుగుల్లో పడి ఉండటాన్ని చూసిన స్థానికులు అంబులెన్స్ కు కాల్ చేసి పిలుస్తారు. మరోవైపు మహేంద్ర అక్కడకు వస్తాడు. కానీ అక్కడుంది రిషి అని అతడికి తెలియదు. అంబులెన్స్ వచ్చి.. రిషిని తీసుకెళ్తుంది. ఇదే సమయంలో కాల్ రావడంతో రిషిని మహేంద్ర చూడడు. ఏ తల్లి కన్న బిడ్డో .. భగవంతుడా ఏం కాకుండా చూడయ్యా అనుకుని వెళ్లిపోతాడు మహేంద్ర.

రిషిని ఆసుపత్రికి తీసుకొస్తారు. ఎవరూ లేకుండా అడ్మిట్ చేసుకోవడం కుదరదని డాక్టర్ వెళ్లిపోతాడు. పోలీస్ కేసు ఏదైనా అయితే ఇబ్బంది అని డాక్టర్ అంటాడు. వసు కూడా ఆసుపత్రి దగ్గరే ఉంటుంది. ఈ మాటలు దూరం నుంచి వింటుంది. డాక్టర్ వద్దకు వచ్చి.. మీరు డాక్టర్ అయి ఉండి.. ఇలా చేస్తారా.. ఎన్ఓసీ మీద సంతకం పెడుతుంది. రిషిని ఆసుపత్రిలోపలికి తీసుకెళ్తుంటే.. చేతికి ఉన్న బ్రేస్ లేట్ కనిపిస్తుంది. ఇది రిషి సర్ ది కదా అనుకుంటుంది. చూసేందుకు వెళ్తూ ఉంటే.. వెనకాల నుంచి నర్సు పిలుస్తుంది. వసుధార గారు.. మీ అమ్మ ఇక లేరు అని చెబుతుంది. దీంతో వసు షాక్ లోకి వెళ్తుంది. అమ్మా అంటూ ఏడుస్తూ వెళ్తుంది. అమ్మ ఏమైందమ్మా అని బోరున ఏడుస్తుంది వసు.

ఇంకోవైపు రిషికి ట్రీట్మెంట్ మెుదలుపెడతారు డాక్టర్లు. కానీ అప్పటికే ఆలస్యమైంది. రిషి కూడా చనిపోయినట్టుగా డాక్టర్లు నిర్ధాణకు వస్తారు. రిషి విషయంలో ఏమనాలో తెలియక జగతితో మహేంద్ర మాట్లాడటం మానేస్తాడు. శైలేంద్ర, దేవయాణి కాలేజీని ఎలా సొంతం చేసుకోవాలో అర్థంకాక సైలెంట్ గా ఉండిపోతారు. వసు తల్లిని, రిషిని దూరం చేసుకుంది.

సీన్ కట్ చేస్తే.. మహేంద్రకు జగతి కాఫీ తీసుకొస్తుంది. మహేంద్ర నేను చేసింది తప్పే.. అందుకు ఇంత పెద్ద శిక్ష వేయాలా అని వేడుకుంటుంది జగతి. ఇలా మౌనంగా ఉంటే తట్టుకోలేకపోతున్నానని అంటుంది. ప్లీజ్ మాట్లాడమని అడుగుతుంది. కానీ మహేంద్ర మౌనంగా ఉంటాడు. నా రూమ్ లోకి కాఫి పంపించమని ధరణికి అరిచి చెబుతాడు. ఇదంతా.. శైలేంద్ర, దేవయాణి పై నుంచి చూస్తారు. ఇదే కంటిన్యూ అయితే జగతికి విరక్తి పుడుతుందని అంటుంది. ఇన్ని రోజులు అయినా.. నాకు కాలేజీ ఎండీ పదవి దక్కలేదని శైలేంద్ర అంటాడు. ఇక ఓపిక పట్టి లాభం లేదని.. కొత్త డ్రామా స్టార్ట్ చేయాలని శైలేంద్ర చెబుతాడు. రిషి, వసుధారనే పంపించానని పిన్నిని పంపించడం ఎంత పని అంటాడు శైలేంద్ర. కచ్చితంగా కాలేజీ ఎండీ అవుతానని తల్లి దగ్గర శైలేంద్ర శపథం చేస్తాడు. దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

IPL_Entry_Point