Guppedantha Manasu Serial Timings: గుప్పెడంత మ‌న‌సు ఫ్యాన్స్‌కు షాక్ - సీరియ‌ల్ టైమింగ్స్ ఛేంజ్ - కొత్త టైమింగ్స్‌ ఇవే!-guppedantha manasu serial timimgs changed star maa disney plus hotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu Serial Timings: గుప్పెడంత మ‌న‌సు ఫ్యాన్స్‌కు షాక్ - సీరియ‌ల్ టైమింగ్స్ ఛేంజ్ - కొత్త టైమింగ్స్‌ ఇవే!

Guppedantha Manasu Serial Timings: గుప్పెడంత మ‌న‌సు ఫ్యాన్స్‌కు షాక్ - సీరియ‌ల్ టైమింగ్స్ ఛేంజ్ - కొత్త టైమింగ్స్‌ ఇవే!

Nelki Naresh Kumar HT Telugu
Jan 17, 2024 11:23 AM IST

Guppedantha Manasu Serial Timings: గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ టైమింగ్స్‌ను స్టార్ మా ఛేంజ్ చేసింది. ఈ సీరియ‌ల్‌ను రాత్రి నుంచి మ‌ధ్యాహ్నానికి షిప్ట్ చేశారు. జ‌న‌వ‌రి 22 నుంచి ఈ కొత్త టైమింగ్స్ ప్ర‌కారం సీరియ‌ల్ టెలికాస్ట్ కానున్న‌ట్లు స్టార్ మా ప్ర‌క‌టించింది.

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్
గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్

Guppedantha Manasu Serial Timings: గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ ఫ్యాన్స్‌కు స్టార్ మా ఛానెల్‌ షాకిచ్చింది. ఈ సీరియ‌ల్ టైమింగ్స్‌ను ఛేంజ్ చేసింది. ప్ర‌స్తుతం గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ సోమ‌వారం నుంచి శ‌నివారం వ‌ర‌కు సాయంత్రం ఏడు గంట‌ల నుంచి ఏడున్న‌ర వ‌ర‌కు స్టార్ మాలో టెలికాస్ట్ అవుతుంది. తాజాగా ఈ సీరియ‌ల్ టైమింగ్స్ మార్చేశారు. రాత్రి నుంచి మ‌ధ్యాహ్నానికి సీరియ‌ల్‌ను షిప్ట్ చేశారు. జ‌న‌వ‌రి 22 నుంచి ఈ సీరియ‌ల్ మ‌ధ్యాహ్నం 1.30 నుంచి రెండు గంట‌ల వ‌ర‌కు టెలికాస్ట్ కాబోతోంది. ఈ విష‌యాన్ని స్టార్ మా ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించింది.

టాప్ టీఆర్‌పీ రేటింగ్‌...

స్టార్ మాలో టెలికాస్ట్ అవుతోన్న సీరియ‌ల్స్‌లో హ‌య్యెస్ట్ టీఆర్‌పీ రేటింగ్‌ను ద‌క్కించుకుంటోన్న టాప్ టెన్‌ సీరియ‌ల్స్‌లో ఒక‌టిగా గుప్పెడంత మ‌న‌సు నిలిచింది. గ‌త వారం ఈ సీరియ‌ల్‌కు 6.08 టీఆర్‌పీ రేటింగ్ వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం స్టార్ మాలో ప్ర‌సారం అవుతోన్న సీరియ‌ల్స్‌లో బ్ర‌హ్మ‌ముడి, నాగ‌పంచ‌మి, కృష్ణ‌ముకుంద మురారి, మ‌ల్లి సీరియ‌ల్స్ టీఆర్‌పీ రేటింగ్ ప‌రంగా టాప్ ప్లేస్‌లో ఉన్నాయి.ఒక‌ప్పుడు గుప్పెడంత మ‌న‌సు రేటింగ్ ప‌రంగా టాప్ ప్లేస్‌లో నిలిచింది. మెల్ల‌మెల్ల‌గా ఆద‌ర‌ణ త‌గ్గ‌డంతో ఇప్పుడు టాప్ టెన్‌లోకి ప‌డిపోయింది.

నేటి ఎపిసోడ్‌లో ఏం జ‌రిగిందంటే?

రిషిని వ‌సుధార ఎక్క‌డ దాచిపెట్టిందో ఎన్ని ప్లాన్స్ వేసిన శైలేంద్ర క‌నిపెట్ట‌లేక‌పోతాడు. దాంతో రిషి చ‌నిపోయిన‌ట్లుగా కాలేజీలో పుకార్లు సృష్టిస్తాడు శైలేంద్ర‌. ఆ పుకార్ల నిజ‌మ‌ని కాలేజీ స్టూడెంట్స్‌, లెక్చ‌ర‌ర్స్ న‌మ్ముతారు. వ‌సుధార ఎండీ సీట్‌లో కూర్చున్న త‌ర్వాత కాలేజీప్ర‌తిష్ట మ‌స‌క‌బారిపోతుంద‌ని ఆమెపై ఫైర్ అవుతారు. వ‌వ‌సుధార కార‌ణంగా కాలేజీ కుప్ప‌కూలిపోతుండ‌టం తాను త‌ట్టుకోలేక‌పోతున్నానంటూ , కాలేజీని మూసేయ‌డం మంచిదంటూ శైలేంద్ర ఎమోష‌న‌ల్ అవుతున్న‌ట్లు నాట‌కం ఆడుతాడు. బోర్డ్ మెంబ‌ర్స్‌లో వ‌సుధార ప‌ట్ల ఉన్న ద్వేషాన్ని మ‌రింత పెంచుతాడు.

రిషి స‌మాధానం...

రిషి ఎక్క‌డున్నాడో, ఏమైపోయాడో చెప్పాల్సిందేన‌ని బోర్డ్ మెంబ‌ర్స్ వ‌సుధార‌ను ప‌ట్టుప‌డ‌తారు. కానీ తెలివిగా శైలేంద్ర ప్లాన్‌ను వ‌సుధార తిప్పికొడుకుతుంది. తాను క్షేమంగా ఉన్న‌ట్లు రిషి చేత శైలేంద్ర‌కు వాయిస్ మెసేజ్ పంపిస్తుంది. ఎండీగా వ‌సుధార‌నే క‌రెక్ట్ అని, ఆమె మాత్ర‌మే కాలేజీకి ముందుకు న‌డిపించ‌గ‌ల‌ద‌ని చెబుతాడు. మినిస్ట‌ర్‌తో పాటు మిగిలిన బోర్డ్ మెంబ‌ర్స్‌ను రిషి క‌న్వీన్స్ చేస్తాడు. ఎండీ సీట్‌ను ద‌క్కించుకోవ‌డానికి శైలేంద్ర వేసిన ఈ ప్లాన్ కూడా ఫెయిల‌వుతుంది. మ‌హేంద్ర కూడా శైలేంద్ర‌కు గ‌ట్టిగా క్లాస్ పీకుతాడు. నీకు కాలేజీకి ఏం సంబంధం లేద‌ని అత‌డిపై ఫైర్ అవుతాడు.

Whats_app_banner