Guppedantha Manasu Mahendra:సీరియల్ నటితో గుప్పెడంత మనసు మహేంద్ర పెళ్లి - వెడ్డింగ్ డేట్ ఇదే!
Guppedantha Manasu Mahendra: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ సాయికిరణ్ పెళ్లి చేసుకోబోతున్నాడు. కోయిలమ్మ సీరియల్ నటి స్రవంతితో ఏడడుగులు వేయనున్నాడు. డిసెంబర్ 7న వీరి పెళ్లి జరుగనుంది. పెళ్లి పనులు మొదలుపెట్టినట్లు సాయికిరణ్, స్రవంతి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
Guppedantha Manasu Mahendra: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ సాయికిరణ్ అలియాస్ మహేంద్ర 46 ఏళ్ల వయసులో పెళ్లి పీటలు ఎక్కుతోన్నాడు. కోయిలమ్మ సీరియల్‌లో తనతో కలిసి నటించిన స్రవంతితో ఏడడుగులు వేయబోతున్నాడు. డిసెంబర్ 7న వీరి పెళ్లి జరుగనుంది. పెళ్లి పనులు మొదలుపెట్టినట్లు సాయికిరణ్, స్రవంతి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. పెళ్లి కార్డులు పంచుతోన్న ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేశారు.
రెండో పెళ్లి...
సాయికిరణ్‌కు ఇది రెండో వివాహం. గతంలో వైష్ణవి అనే అమ్మాయిని పెళ్లాడాడు. కానీ మనస్పర్థలతో వైష్ణవి నుంచి సాయికిరణ్ విడాకులు తీసుకున్నాడు. వీరికి ఓ పాప ఉంది.
మహేంద్ర పాత్రలో....
గుప్పెడంత మనసు సీరియల్ సాయికిరణ్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సీరియల్‌లో మహేంద్ర పాత్రలో సాయికిరణ్ కనిపించాడు. కొడుకు ప్రేమ కోసం తల్లడిల్లే తండ్రిగా నాచురల్ యాక్టింగ్‌తో బుల్లితెర అభిమానులను మెప్పించాడు.
టాప్ యాక్టర్‌గా...
తెలుగు సీరియల్స్ ఆర్టిస్ట్స్‌లో టాప్ యాక్టర్స్‌లో ఒకరిగా సాయికిరణ్ కొనసాగుతోన్నాడు. గుప్పెడంత మనసు కంటే ముందు మౌనరాగం, ఇంటిగుట్టు, అభిలాష, కోయిలమ్మ, శివలీలలు, వెంకటేశ్వర వైభవంతో పాటు పలు టీవీ సీరియల్స్‌లో కీలక పాత్రలు పోషించాడు. తెలుగుతో పాటు తమిళం, మలయాళ సీరియల్స్‌లో సాయికిరణ్ నటించాడు.
ప్రస్తుతం పడమటి సంధ్యారాగం సీరియల్‌లో లీడ్ యాక్టర్‌గా నటిస్తోన్నాడు. మరోవైపు తెలుగులో స్రవంతి కళ్యాణం కమనీయం, నాగపంచమితో పాటు పలు సీరియల్స్ చేసింది. కోయిలమ్మ సీరియల్‌లో నటిస్తోన్న టైమ్‌లో సాయికిరణ్, స్రవంతి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారినట్లు సమాచారం.
నువ్వే కావాలితో హీరోగా...
సీరియల్స్ కంటే ముందు తెలుగులో హీరోగా కొన్ని సినిమాలు చేశాడు సాయికిరణ్. నువ్వే కావాలి మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సాయికిరణ్ ప్రేమించు, డార్లింగ్ డార్లింగ్, మనసుంటే చాలు సినిమాల్లో కథానాయకుడిగా నటించాడు. నువ్వే కావాలి పెద్ద హిట్టయినా తరుణ్, రిచా స్థాయిలో సాయికిరణ్‌కు ఫేమస్ కాలేకపోయాడు గోపి, సప్తగిరి ఎల్ఎల్‌బీ, నక్షత్రంతో పాటు మరికొన్ని సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశాడు. సాయికిరణ్ తండ్రి రామకృష్ణ 1970-80 దశకంలో టాలీవుడ్‌లో టాప్ సింగర్స్‌లో ఒకరిగా నిలిచాడు.