Guppedantha Manasu December 9th Episode: శైలేంద్రను విచారించిన ముకుల్.. అడుగుడుగునా ఇరికించిన వసు, రిషి మాయంపై సస్పెన్స్-guppedantha manasu serial december 9th episode mukul investigate shailendra and rishi car found on road ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Guppedantha Manasu Serial December 9th Episode Mukul Investigate Shailendra And Rishi Car Found On Road

Guppedantha Manasu December 9th Episode: శైలేంద్రను విచారించిన ముకుల్.. అడుగుడుగునా ఇరికించిన వసు, రిషి మాయంపై సస్పెన్స్

Sanjiv Kumar HT Telugu
Dec 09, 2023 08:03 AM IST

Guppedantha Manasu Serial Today Episode: గుప్పెడంత మనసు సీరియల్‌‌ డిసెంబర్ 9వ తేది ఎపిసోడ్‌లో శైలేంద్రను ముకుల్ విచారిస్తాడు. సారథి, ఎమ్ఎస్ఆర్, కాలేజీ కోసం అప్పు తీసుకోవడం వంటి ప్రశ్నలతో శైలేంద్రకు ఊపిరాడనివ్వడు ముకుల్. ఇలా గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

గుప్పెడంత మనసు సీరియల్‌‌ డిసెంబర్ 9వ తేది ఎపిసోడ్‌
గుప్పెడంత మనసు సీరియల్‌‌ డిసెంబర్ 9వ తేది ఎపిసోడ్‌

Guppedantha Manasu Serial Episode 938: గుప్పెడంత మనసు సీరియల్‌లో రిషి కారు రోడ్డు మీద కానిస్టేబుల్‌కు కనిపిస్తుంది. ఇది రిషి సార్ కార్‌లా ఉందే అని ముకుల్‌కు కాల్ చేసి చెబుతాడు. అది ఎలా పార్క్ చేసి ఉంది. నార్మల్‌గా ఉందా, కిడ్నాప్ జరిగినట్లుగా ఉందా అని ముకుల్ అడిగితే.. ఏం తెలియట్లేదు సార్ అని కానిస్టేబుల్ చెబుతాడు. దాంతో కారు ఫొటో, లొకేషన్ పెట్టమంటాడు ముకుల్.

ట్రెండింగ్ వార్తలు

మ్యానేజ్ చేస్తాలే

మరోవైపు ఆ ముకుల్ వస్తున్నాడని కంగారుగా శైలేంద్రకు చెబుతుంది దేవయాని. అప్పుడే వస్తున్నాడా. ఏం చేయాలో తెలియట్లేదు అని శైలేంద్ర అంటే.. తెలియకపోవడం ఏంటీ. తప్పించుకోడానికి ఆలోచించే టైమ్ ఉంటుందనే కదా పొడిపించుకున్నావ్. అదంతా చేసి ఎందుకు అని మరింత టెన్షన్ పడుతుంది దేవయాని. ఏదో ఒకటి మ్యానేజ్ చేస్తాలే మామ్ అని శైలేంద్ర అంటుంటే కార్ సౌండ్ వినిపిస్తుంది. ధరణి వచ్చి ముకుల్ గారు వచ్చారు. ఆయన్ను రమ్మంటున్నారని చెబుతుంది.

నేను తీసుకొస్తా వెళ్లు అని ధరణిని పంపిస్తుంది దేవయాని. ఇప్పుడేం చేస్తావ్ నాన్నా. నువ్ ఇక్కడే ఉండు. నేను ఏదోటి చేసి పంపించేస్తాను అని దేవయాని హాల్లోకి వెళ్తుంది. ఏంటండి మీరు. ఇప్పుడే కదా డిశ్చార్జ్ అయ్యాడు. అప్పుడే అంటారేంటీ. ఒక నాలుగైదు రోజులు రెస్ట్ ఇచ్చాకా.. పూర్తిగా కోలుకుంటాడు కదా అని ఫైర్ అవుతుంది దేవయాని. ప్రాణపాయ స్థితిలో ఉన్నప్పుడే ఇంట్రాగేట్ చేస్తాం. అలాంటిది మీకు ఇంత టైమ్ ఇచ్చాం. మా పై అధికారులకు అప్డేట్ ఇవ్వాలి కదా అని ముకుల్ అంటాడు.

ఇంకా పచ్చిగానే ఉన్నాయి

గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. ఎలా వస్తాడు అని దేవయాని అంటుంది. హాస్పిటల్‌ నుంచి వచ్చినవాడు. హాల్లోకి రాలేడా. వీల్ చైర్ కూడా ఉందిగా అని అనుపమ అంటుంది. నువ్ తల్లి స్థానంలో ఉంటే నీకు తెలుస్తుంది నా బాధ అని దేవయాని అంటుంది. చట్టం ముందు తల్లి తండ్రి ఉండరు అని అనుపమ అంటుంది. బెడ్ రూమ్‌లోకి మీరే వెళ్లి ఇంట్రాగేట్ చేయడం ఓకే కదా సార్ అని వసుధార అంటుంది. నాకు ఓకే అని ముకుల్ అంటాడు.

శైలేంద్రే ఇక్కడికీ రావడమే కరెక్ట్ అని ఫణీంద్ర అంటాడు. దాంతో నేను వెళ్లి తీసుకొస్తాను అని మహేంద్ర అంటాడు. అక్కడికి వెళ్తే తప్పించుకునేలా చేస్తావ్ వదినా అని మనసులో అనుకున్న మహేంద్ర బెడ్ రూమ్‌లోకి వెళ్తాడు. యముడు వచ్చాడని చెప్పి శైలేంద్రను తీసుకొస్తాడు మహేంద్ర. కిందకి వచ్చిన శైలేంద్రను ముకుల్ ఇంట్రాగేట్ చేస్తాడు. మీకు పై అధికారాలపై గోల్ లేదా అని ముకుల్ అడిగితే.. మా అమ్మ నాన్న చెప్పింది చేయడమే తప్పా ఇంకేం లేదని శైలేంద్ర అంటాడు.

బ్లాక్ మెయిల్ చేసి

ఓసారి ఎండీ సీటులో కూర్చుంటానని అన్నారు కదా సార్ అని వసుధార అంటుంది. అవును. కానీ అనుభవం లేదని నేనే వద్దన్నాను అని ఫణీంద్ర అంటాడు. తర్వాత సారథి మీ ఫ్రెండే కదా. రిషి ఫ్రాడ్ చేసినట్లు ఇష్యూ చేసింది అతనే. కానీ, జగతిని ఎవరో బ్లాక్ మెయిల్ చేసి రిషిపై నింద వేసేలా చేశారు. అది చేసింది సారథేనా అని ముకుల్ అడుగుతాడు. సారథి వెనుక ఇంకెవరైనా ఉండొచ్చు కదా అని వసుధార అంటుంది.

సారథి పరారిలో ఉన్నాడు. మీకు చెప్పకుండానే వెళ్లాడా అని ముకుల్ అంటే.. చెబితే ఎందుకు వెళ్లనిస్తాను అని శైలేంద్ర అంటాడు. కరెక్టే.. మరి ఎమ్ఎస్ఆర్ కూడా మీ ఫ్రెండ కదా. కాలేజీని చేజిక్కుంచుకోవాలని అనుకున్న అతని నుంచి అప్పు ఎందుకు తీసుకున్నారు. తీసుకున్నారు. కాలేజీ ఇస్తానని అగ్రిమెంట్ మీద సంతకం ఎందుకు చేశారు అని ముకుల్ అడుగుతాడు. అప్పుడు సరిగ్గా చూడలేదని శైలేంద్ర అంటాడు.

వాయిస్ పోల్చుకోవాలి కదా

అలా చూడకుండా ఉంటావ్. కొంచెమైనా బుద్ధిలేదా అని అనుపమ అంటుంది. కాలేజీ మీ చేతుల్లో లేకపోతే మీరు ఏం చేస్తారు అని ముకుల్ అడిగితే.. అడుక్కు తింటాడు. పది నిమిషాలు అని ఇన్ని ప్రశ్నలు ఏంటీ అని దేవయాని ఫైర్ అవుతుంది. వాయిస్ పోల్చుకోవాలి కదా మేడమ్ అని శైలేంద్ర వాయిస్ వినిపిస్తాడు ముకుల్. దాంతో అనుపమ షాక్ అవుతుంది. షూటర్‌తో శైలేంద్ర మాట్లాడింది ధరణి గుర్తు చేసుకుంటుంది. ఇది ఆయన వాయిసే అని అనుకుంటుంది.

ఈ వాయిస్ గురించి నాకు ఎందుకు చెప్పలేదు మామ్ అని శైలేంద్ర అడుగుతాడు. నువ్ హాస్పిటల్‌లో ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు చెబితే డిస్టర్బ్ అవుతావని అని దేవయాని అంటుంది. ఇది దానికంటే దారుణంగా ఉంది. అచ్చం నా వాయిస్‌లానే ఉందని శైలేంద్ర అంటాడు. మీలా కాదు. మీదే అని హండ్రెడ్ పర్సంట్ మా నమ్మకం. మీదేనా ఈ వాయిస్ అని ముకుల్ అడుగుతాడు. దాంతో శైలేంద్ర సైలెంట్‌గా ఉండిపోతాడు. చెప్పండి సార్ మీదేనా అని మళ్లీ అడుగుతాడు ముకుల్.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.