Guppedantha Manasu Ending Episode: శైలేంద్రకు శిక్ష-మారిన దేవయాని- మను ఏంజెల్ పెళ్లి- గుప్పెడంత మనసుకు శుభం కార్డ్
Guppedantha Manasu Serial August 31st Episode: గుప్పెడంత మనసు ఆగస్ట్ 31వ తేది ఎపిసోడ్‌తో సీరియల్‌కు శుభం కార్డ్ పడింది. కుట్రలు కుతంత్రాలు చేసిన దేవయాని మారిపోతే.. శైలేంద్రకు ప్యూన్‌గా శిక్ష వేస్తాడు రిషి. మరోవైపు ఏంజెల్‌తో మనుకు పెళ్లి ముహుర్తం పెడతాడు మహేంద్ర. రిషి, వసుధార సంతోషంగా ఉంటారు.
Guppedantha Manasu Serial Today Episode: గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్‌లో మహేంద్రను కాపడటం, శైలేంద్ర మాట్లాడింది ఫోన్‌లో రికార్డ్ చేయడం గురించి రిషి చెబుతాడు. రిషి, వసుధారను మహేంద్ర రూమ్‌లో లాక్ చేసి వెళ్లిపోగానే వాళ్లకు మను కాల్ చేస్తాడు. వసుధార లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. మహేంద్ర సార్‌ను శైలేంద్ర కిడ్నాప్ చేసి ఎక్కడికీ తీసుుకెళ్తున్నాడు అని తాను చూసింది చెబుతాడు మను.
దాంతో వసుధార షాక్ అవుతుంది. నేను వాడిని ఫాలో అవుతున్నాను. లొకేషన్ పంపిస్తాను. మీరు ఇక్కడికి వచ్చేయండి అని మను అంటాడు. మేము ఇప్పుడు వచ్చే పొజిషన్‌లో లేము. శైలేంద్ర గురించి మేము నిజాలు చెప్పేసరికి మమ్మల్ని డోర్ లాక్ చేసి మావయ్య ఒక్కరే వెళ్లిపోయారు అని వసుధార అంటుంది. సరే ఓకే అని మను అంటాడు. వెంటనే అనుపమకు కాల్ చేస్తాడు మను. మనం ఇక్కడి నుంచి ఎలా బయటపడాలి అని కంగారుపడతాడు రిషి.
హీరోల మను ఎంట్రీ
ఇంతలో అనుపమ వస్తుంది. డోర్ లాక్ కీ ఉందా అని అనుపమ అడిగితే.. లేదు మేడమ్. పగలకొట్టండని వసుధార అంటుంది. మీరు ఇక్కడికి అని రిషి అడిగితే.. మను ఫోన్ చేసి చెప్పాడు అని అనుపమ అంటుంది. తర్వాత శైలేంద్ర మాట్లాడిన మాటలను మను వీడియో రికార్డ్ చేస్తాడు. వీడిని ఎలా చంపాలో అని రౌడీలు ప్లాన్ చేసుకుంటుంటే.. మను హీరోలా ఎంట్రీ ఇస్తాడు. తర్వాత రౌడీలను చితక్కొట్టి మహేంద్రను విడిపిస్తాడు.
ఈ క్రమంలో మను తలకు ఒకడు గన్ పెడతాడు. దాంతో మిగతా రౌడీలు అంతా నవ్వుతారు. అప్పుడు మను కూడా నవ్వుతాడు. చప్పట్లు కొడుతూ మహేంద్ర, మను ఇద్దరూ నవ్వుతారు. వన్ టూ త్రీ అని ఇద్దరూ లెక్కపెడుతుంటే గన్ మిస్ అయ్యేలా రౌడీ చేతికి కర్ర విసురుతూ రిషి ఎంట్రీ ఇస్తాడు. రేయ్ ఎవర్రా నువ్ అని రౌడీలు అంటే.. కథానాయకుడు అని మహేంద్ర అంటాడు. తర్వాత రిషి, మను అన్నదమ్ములు ఇద్దరూ తండ్రి మహేంద్ర కోసం ఫైట్ చేస్తుంటారు.
ఇద్దరు చేయి కలిపి మరి ఫైట్ చేస్తుంటారు. ఇదంతా సినిమా లెవెల్‌లో ప్లాన్ చేశారు. కొడుకులిద్దరూ ఫైట్ చేయడం చూసి గర్వంగా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటాడు మహేంద్ర. తర్వాత మహేంద్ర, రిషి, మను ముగ్గురు మీసంపై చేయి వేసి మెలేస్తారు. ఇద్దరితో మహేంద్ర బయటకు వస్తాడు. అదంతా విని శైలేంద్ర షాక్ అవుతాడు. పెద్దమ్మ ఈ చేతితోనే చిన్నప్పుడు గోరు ముద్దలు తినిపించావ్. అమ్మ వదిలేసిపోయాక అమ్మవై పెంచావ్. తల్లిలా ప్రేమ పంచావ్ అని రిషి అంటాడు.
కుట్రలు పన్నడమేంటీ
నీ కంట్లో కన్నీళ్లు వస్తే నా ప్రాణం విలవిల్లాడేది. నువ్ ఎప్పుడు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకునేవాడిని. నా జీవితంలో పాతికేళ్లు వెనక్కితిరిగి చూసుకుంటే నువ్వే ఉంటావ్. నీ మాటే నాకు శాసనం. నువ్ చెప్పింది చేసేవాన్ని. నీకు ఏరోజు ఎదురుతిరగలేదు. అసలు నేను ఏ తప్పు చేశాను. నాకెందుకు ఇంత పెద్ద శిక్ష వేశావ్. నా ముందు ప్రేమ నటిస్తూ నా వెనుక కుట్రలు పన్నడం ఏంటీ. పెద్దమ్మే అమ్మ అనుకున్నాను అని రిషి అంటాడు.
నువ్ చాలా మారిపోయావ్ పెద్దమ్మ. మా పెద్దమ్మ బంగారం. నువ్ నన్ను పెంచిన పెద్దమ్మవి కాదు. నిన్ను నా మనసుకంటే ఎక్కువగా నమ్మాను. నేను అసలు ఏం పాపం చేశాను పెద్దమ్మ. కన్నతల్లికి దూరమయ్యాను. అమ్మ వచ్చాకా మళ్లీ తిరిగి పొందాలనుకున్నాను. కానీ, అది కూడా దూరమైంది. మీరు దూరం చేశారు. విషం పెట్టి చంపడం ఏంటీ పెద్దమ్మ. నా మీద కక్ష్య సాధించడం కోసం నా తల్లిని ఎందుకు చంపారు. మీరు పెంచిన చేతులతోనే నా పీక పిసికి చంపేస్తే అయిపోయేది కదా. ఈ నరకయాతన ఉండేది కాదుగా అని రిషి అంటాడు.
ఇదంతా ఎందుకు. ఎండీ పదవి కోసమా. పదవి కోసం ఇన్ని దుర్మార్గాలు చేయాల. పదవి కోసం ఇన్ని దారుణాలు చేయడానికి సిద్ధపడతారా. ఇదంతా అవసరమా మీకు. నాతో ఒకే ఒక్క మాట చెబితే సరిపోయేది కాదు కదా. నేను మీ మాట కాదనని తెలుసు కదా. నాతో చెప్పకుండా ఇన్ని నేరాలు చేశారు. సరే పెద్దమ్మ మీకు కావాల్సింది మీకు ఇస్తాను. మరి నాకు కావాల్సింది నాకు ఇస్తారా. ఎండీ పదవి మీకిస్తాను. మా అమ్మను నాకిస్తారా అని రిషి అంటాడు.
కుప్పకూలిపోయిన రిషి
దాంతో దేవయాని కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్ అవుతుంది. ఈ కారులు, బంగ్లాలు వద్దు. నాకు నా తల్లి కాదు. నా తల్లిని తీసుకొస్తారా. మీరు నా తల్లిని ఇస్తారా అని రిషి అడుగుతాడు. చేయకూడని తప్పు చేశాం. పదవి దక్కించుకోవాలన్న ఆశతో తీరని నష్టం చేశాం. నన్ను క్షమించు రిషి అని కాళ్లపై పడుతుంది. మీరు ఇలా చేయకూడదు. మిమ్మల్ని దేవతలా చూశాను. కుట్రలు కుతంత్రాలు చేశారంటేనే నేను తట్టుకోలేకపోతున్నాను అని కుప్పకూలిపోతాడు రిషి.
ఈ ఒక్కసారి నన్ను క్షమించు అని దేవయాని అంటుంది. దాంతో ఆస్తి పత్రాలు దేవయానికి ఇచ్చి మాకు ఏ ఆస్తి వద్దని, అన్ని మీరే తీసుకోండని అంటాడు. కానీ, మీరు కోరుకున్న కాలేజీ మాత్రం మీకు ఇవ్వలేను. పదవి కోసమో, పరపతి కోసమో కాలేజీని నా దగ్గర పెట్టుకోవట్లేదు. డీబీఎస్టీ కాలేజీని మా తాతయ్య స్థాపించారు. అందులో ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్ ఉంది. అది నీ చేతుల్లో పెట్టలేను. మీకు కావాల్సింది నేను ఇవ్వలేకపోతున్నాను అని రిషి అంటాడు.
అన్నయ్య ఒక పదవి తీసుకోవాలంటే అర్హత ఉండాలి. అది నీకు లేదు. కుట్రలు, కుతంత్రాలు చేస్తే దక్కవు. అది మనకు కావాలంటే ముందు తెలుసుకోవాలి. ఒక్కో మెట్టు ఎక్కి లక్ష్యాన్ని సాధించుకోవాలి అని రిషి అంటాడు. ఇన్నాళ్లు దానికోసం చేసిన దుర్మార్గాలు వృధా అవుతుంటే చూస్తూ ఊరుకుంటానా. నాకు కాలేజీని అప్పజెబుతావా అని శైలేంద్ర అంటే.. ఫణీంద్ర వచ్చి చెంపలు వాయిస్తాడు. నువ్ చేసిందే తప్పు కాలేజీ అప్పజెపుతారా అని ఫణీంద్ర అంటాడు.
అడ్డుకున్న వసుధార
రిషి అడ్డుకుంటాడు. నీకు కాలేజీ కాదురా ఇంట్లోనే స్థానం లేదు అని ఫణీంద్ర అంటాడు. నా తప్పులన్నీ చేశాక. నేను ఇలా ఉండకూడదు. మీ అందరిని చంపి అయినా కాలేజీ సొంతం చేసుకుంటాను అని శైలేంద్ర అంటూ గన్ తీసి రిషికి గురి పెడతాడు. అంతా షాక్ అవుతారు. కాలేజీ ఇస్తావా చస్తావా అని శైలేంద్ర అంటాడు. నా ప్రాణం పోయినా కాలేజీ నీకు ఇవ్వను అని రిషి అంటాడు. వసుధార అడ్డుకుంటుంది. ఇద్దరూ కలిసే చావండి అని శైలేంద్ర అంటాడు.
దేవయాని కూడా వద్దని అంటుంది. వసుధారను పక్కకు నెట్టి చంపు అన్నయ్య అని రిషి అంటాడు. అందరూ చెప్పన శైలేంద్ర వినడు. రిషి గుండెలపై గన్ పెడతాడు. దాంతో దేవయాని అడ్డుగా వస్తుంది. వద్దు అని చెబుతుంది దేవయాని. నేను ఎండీ కావాలి. నువ్ రాజమాత కావాలి. ఓపిక పట్టి పట్టి చిరాకు వస్తుంది. అడ్డుకుంటే నిన్ను కూడా షూట్ చేయాల్సి వస్తుంది అని శైలేంద్ర అంటాడు. అయితే షూట్ చేయిరా అని దేవయాని అనేసరికి శైలేంద్ర షాక్ అవుతాడు.
ముందు నన్ను చంపి ఆ తర్వాత రిషి జోలికి వెళ్లు. చంపు అని దేవయాని అంటుంది. దాంతో శైలేంద్ర గన్ కిందకు దించుతాడు. ఆగిపోయావేంటీ అన్నయ్య. చంపేయ్.. అన్నయ్య. పెద్దనాన్నను, నన్ను, డాడ్‌ను, ఆఖరికి వదినను కూడా చంపేయ్. కానీ, ఎవ్వరూ లేకుండా ఎండీ సీటులో కూర్చుని ఏం చేస్తావన్నయ్య ఒక్కడివే. నా అనుకునేవాళ్లు లేకుండా ఎండీ అనే ట్యాగ్ లైన్ నిజమైన సంతోషాన్ని ఇస్తుందా. మన అనేవాళ్లు లేకుండా ఏం సాధించినా వృధానే అని రిషి అంటాడు.
ఇన్నాళ్లు తప్పులు చేశాం. ఇక మారదాంరా. ఎండీ పదవిలో నిన్ను గొప్పగా చూడాలని అనుకున్నాను. కానీ, రిషి, మీ నాన్న, బాబాయ్ ఉండగా అది చాలా చిన్నదిరా. వదిలేయ్ అని దేవయాని అంటుంది. లేదు. నేను వినను. నా అహం దెబ్బతింటుంది. ఇన్నాళ్లు దానికోసమే ప్రయత్నించాను. ఒకటి నేను అనుకున్నది దక్కించుకోవాలి. లేదా నేను చచ్చిపోవాలి అని తలకు గన్ గురిపెట్టుకుంటాడు శైలేంద్ర. నువ్ చావాలనుకుంటే నేను ఎప్పుడో చంపేవాడిని. నాకు ఏ ఒక్క బంధాన్ని దూరం చేసుకోవాలని లేదు అని రిషి అంటాడు.
అదొక్కటే ప్రాయిశ్చిత్తం
లేదు. మీరు మాట్లాడుతుంటే నేను ఎన్ని తప్పులు చేశానో. ఎన్ని దారుణాలు చేశానో. సారీ రిషి నన్ను క్షమించు అని శైలేంద్ర గన్ పేలుస్తాడు. అంతా భయంతో కళ్లు మూసుకుంటారు. కానీ, శైలేంద్ర గన్‌ను రిషి పక్కకు తిప్పుతాడు. దాంతో శైలేంద్ర బతికిపోతాడు. అది చూసి శైలేంద్ర షాక్ అవుతాడు. గన్ లాక్కుని బయట పడేస్తాడు రిషి. నేను చేసిన తప్పులకు శిక్ష అనుభవించాలి. అదొక్కటే ప్రాయిశ్చిత్తం అని శైలేంద్ర అంటాడు.
అన్నయ్య నువ్ మారావ్. నిజంగా నువ్ శిక్ష కోరుకుంటే అది నేను విధిస్తాను అని రిషి అంటాడు. నేను చేసిన తప్పుకు ఎంత పెద్ద శిక్ష అయినా అనుభవిస్తాను అని శైలేంద్ర అంటాడు. కట్ చేస్తే.. కాలేజీలో అంతా మీటింగ్‌లో మాట్లాడుకుంటారు. ఇంతలో శైలేంద్ర ప్యూన్ డ్రెస్సులో కాఫీ తీసుకొస్తాడు. ప్యూన్‌గా ఉన్న శైలేంద్రతో ఫణీంద్ర, వసుధార, మహేంద్ర ఆడుకుంటారు. డాడ్ అని శైలేంద్ర డాడ్ ఏంటీ అని ఫణీంద్ర అంటాడు. సారీ సర్ అని శైలేంద్ర అంటాడు.
వర్క్ చేయడం నేర్చుకో అని మహేంద్ర అంటే.. దీనికి కూడా ట్రైనింగ్ ఉంటుందా అని శైలేంద్ర అంటాడు. నీకు ట్రైనింగ్ ఇచ్చిన వేస్ట్‌రా. నీ సీనియర్స్ దగ్గర నేర్చుకో అని మహేంద్ర అంటాడు. నేర్చుకుంటాను సార్. అన్ని నేర్చుకుంటాను. ప్యూన్ దగ్గరి నంచి ప్రిన్సిపాల్ వరకు అందరి పనులు నేర్చుకుంటాను. రిషి సార్ చెప్పినట్లుగా ఒక్కో మెట్టు ఎదుగుతూ ఫైనల్‌గా ఎండీ అవుతాను అని శైలేంద్ర అంటాడు. దానికి అంతా నన్వుతారు.
ఇద్దరు కొడుకులు
ఏంటీ నవ్వుతున్నారు. ఏదో ఒకరోజు ఎండీ అవుతాను అని శైలేంద్ర అంటాడు. ఇంతలో మహేంద్రకు కాల్ చేసి ఫారెన్ వెళ్లిపోతున్నట్లు మను అంటాడు. వెళ్లిపోవడం ఏంటీ. ఏంజెల్ ఏం కావాలి. నీకు ఏంజెల్‌కు పెళ్లి ఫిక్స్ చేశాం మాట్లాడేందుకు వస్తున్నాం అని మహేంద్ర అంటాడు. అది కాదు సార్ అని మను అంటే.. సార్ ఏంటీ డాడీ అని మహేంద్ర అంటాడు. అన్నయ్య ఇప్పుడు నాకు ఇద్దరు కొడుకులు అని మహేంద్ర అంటాడు.
నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి రిషికి చెబుతుంటే.. ఏంటా అని ఆతృతగా శైలేంద్ర ఏంటీ వసుధార అది అని అంటాడు. ఫణీంద్ర మీద చేయి వేసి అలా అంటే ఫణీంద్ర రేయ్ అని వారిస్తాడు. దాంతో సారీ సార్ అని శైలేంద్ర చేయి తీస్తాడు. అంతా నవ్వుకుంటారు. ఇంతటితో గుప్పెడంత మనసు సీరియల్‌కు శుభం కార్డ్ పడిపోయింది.