Guppedantha Manasu September 12th Episode: వసుధారతో ప్రేమించిన సంగతిని విశ్వనాథం, ఏంజెల్‌లకు చెబుతానని రిషితో చెబుతుంది జగతి. కానీ రిషి వద్దని అంటాడు. నువ్వైనా నిజమని చెప్పమని అంటే తనకు ధైర్యం సరిపోవడం లేదని చెబుతాడు.
నేను నమ్మిన వాళ్లు బతికి ఉండగానే నా ప్రాణం తీశారని, కానీ విశ్వనాథం, ఏంజెల్ చావు బతుకుల్లో ఉన్న తన ప్రాణాలను కాపాడి సొంత మనషుల్లా ఆదరించారని రిషి అంటాడు. మాకు ఎందుకు ఈ శిక్ష అని రిషిని కన్నీళ్లతో ప్రాధేయపడుతుంది జగతి. శిక్ష వేసింది మీరు అంటూ జగతి మాటలకు బదులిస్తాడు రిషి.
నీకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి చేసుకుంటావా అని కొడుకును ప్రశ్నిస్తాడు మహేంద్ర. నా తలరాత అలా రాసి ఉంటే చేసుకుంటానేమో అంటూ తండ్రి ప్రశ్నకు సమాధానం చెబుతాడు రిషి. విశ్వనాథం, ఏంజెల్‌లకు నిజం చెప్పాలని అనిపిస్తే చెప్తాను. వాళ్లకు చెప్పలేని పరిస్థితి ఎదురైతే మౌనంగా ఉండిపోతాను.
ఏదైనా వారి నిర్ణయానికే కట్టుబడి ఉంటానని తండ్రితో అంటాడు రిషి. మధ్యలో కలుగజేసుకున్న చక్రపాణి అల్లుడుగారు అంటూఏదో చెప్పబోతాడు. కానీ అతడి మాటల్ని మధ్యలోనే రిషి ఆపేస్తాడు. అల్లుడుగారు అనే పిలుపు నాకు సమస్యలు తెచ్చిపెడుతుందని అంటాడు. విశ్వనాథం, ఏంజెల్‌లకు ఎవరూ ఏ నిజాలు చెప్పొద్దని అందరికి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు రిషి.
ఏంజెల్‌ను రిషి పెళ్లి చేసుకుంటే నువ్వు భరించగలవా అంటూ వసుధారను అడుగుతాడు మహేంద్ర. భరించలేనని సమాధానమిస్తుంది వసుధార. ఒకవేళ ఏంజెల్‌తో రిషి ఏడడుగులు వేయాలని నిశ్చయించుకుంటే నా కంటే సంతోషించేవాళ్లు ఎవరూ ఉండరని అంటుంది. ఈ మాట మనస్ఫూర్తిగానే అంటున్నావా మహేంద్ర అడిగిన ప్రశ్నకు ఇంతకంటే ఏం చెప్పలేనని మౌనంగా ఉండిపోతుంది వసుధార.
రిషి, ఏంజెల్‌ల నిశ్చితార్థం ముహూర్తం ఫిక్స్ చేయడానికి విశ్వనాథం అన్ని ఏర్పాట్లు చేస్తాడు. ఈ వేడుక కోసం అందంగా ముస్తావు అవుతుంది ఏంజెల్. ఆమె ముస్తాబు బాగుంది కానీ ఏదో తగ్గిందని పనిమనిషి సుభద్రమ్మతోపాటు విశ్వనాథం చెబుతారు. పూలు పెట్టుకోవడం మర్చిపోయావని సుభ్రదమ్మ గుర్తుచేస్తుంది. పెళ్లి కూతురిలా ఉన్నావని మనవరాలిని చూసి విశ్వనాథం మురిసిపోతాడు.
అప్పుడే రిషి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు. అతడిని చూసి మహేంద్ర, జగతి ఎక్కడని అడుగుతాడు విశ్వనాథం. వస్తున్నారని రిషి సమాధానం చెబుతాడు. వసుధార తన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని ఏంజెల్ కంగారుగా రిషిని అడుగుతుంది. అప్పుడే వసుధార లోపల అడుగుపెడుతూ కనిపిస్తుంది.
ఆమెపై ఏంజెల్ ఫైర్ అవుతుంది. రిషి నాతో పెళ్లికి ఒప్పుకున్నప్పటి నుంచి నువ్వు ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని నిలదీస్తుంది. మా పెళ్లికి నువ్వే పెద్ద అని వసుధారతో అంటుంది ఏంజెల్. నువ్వు లేకుండా నిశ్చితార్థం ఎలా జరుగుతుందని అనుకుంటున్నావని చెబుతుంది. ముహూర్తాలు ఫిక్స్ చేద్దామని పంతుల తొందరపెడతాడు. మన ఎంగేజ్‌మెంట్ డేట్ ఎప్పుడు ఉంటుందోనని ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నానని ఏంజెల్ సంతోషపడుతుంది.
ఏంజెల్ తో నిశ్చితార్థం ముహూర్తం ఫిక్స్ చేసుకోవడానికి రిషి రెడీ అవుతుంటాడు. అతడిని చూస్తూ వసుధార గతంలోకి వెళుతుంది. ఈ వసుధార భవిష్యత్తు ఏమిటన్నది భగవంతుడు కాదు ఇప్పుడు మీరే నిర్ణయించబోతున్నారని రిషిని ఉద్దేశించి అనుకుంటుంది.
జగతి, మహేంద్ర.... రిషి దగ్గరకు వెళ్లడంతో సీన్‌లోని ఎమ్ఎస్ఆర్ ఎంట్రీ ఇస్తాడు. గతంలో డీబీఎస్‌టీ కాలేజీ సొంతం చేసుకోవాలని ప్రయత్నించి రిషి చేతిలో ఓడిపోతాడు ఎమ్ఎస్ఆర్. ఈ సారి రిషి లేకపోవడంతో ఎలాగైనా కాలేజీని తన సొంతం చేసుకోవడానికి శైలేంద్రతో కలిసి మాస్టర్ ప్లాన్‌తో రెడీ అవుతాడు. ఈ రోజు ఈ కాలేజీ నాదని అన్ని అధికారాలతో ఇంటికి వెళ్లాలని ఫిక్స్ అవుతూ డీబీఎస్‌టీ కాలేజీలో అడుగుపెడతాడు.
అప్పుడే అక్కడకు తండ్రితో కలిసి శైలేంద్ర వస్తాడు. మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రత్యక్షమయ్యావు. ఎందుకొచ్చావ్ ఇక్కడికి అంటూ ఎమ్ఎస్ఆర్‌పై సీరియస్ అవుతాడు ఫణీంద్ర. నేను మీకు పెద్ద ఎమౌంట్ అప్పుగా ఇచ్చానని ఫణీంద్రతో అంటాడు ఎమ్ఎస్ఆర్. ఎవరికిచ్చావ్ అంటూ ఫణీంద్ర కోప్పడుతాడు.కానీ అతడి ప్రశ్నకు కూల్‌గా మీ అబ్బాయికి ఆ డబ్బు ఇచ్చానని అంటాడు. మా ఫ్రెండ్ దగ్గరే అప్పు తీసుకున్నానని, కానీ అతడి వెనుక ఎమ్ఎస్ ఆర్ ఉన్న విషయం తనకు తెలియదని శైలేంద్ర తండ్రిని నమ్మిస్తాడు.
ప్రతిసారి నువ్వు వెన్నుపోటు పొడవాలని చూడకు అంటూ ఎమ్ఎస్ఆర్ పై ఫైర్ అవుతాడు ఫణీంద్ర. మోసం పోయేవాళ్లు ఉన్నంత వరకు మోసం చేసేవాళ్లు ఉంటారు. ముందు వెనుక చెక్ చేసుకోవాల్సింది మీరు అంటూ ఫణీంద్రకు పంచ్ ఇస్తాడు ఎమ్ఎస్ఆర్ . . ఫణీంద్ర ప్రమేయం లేకుండానే కాలేజీ లోపలికి వెళ్లబోతాడు ఎమ్ఎస్ఆర్. అతడిని ఫణీంద్ర కొట్టబోతాడు. కానీ శైలేంద్ర వచ్చి ఆపుతాడు. కూర్చొని అన్ని విషయాలు మాట్లాడుకుందామని అంటాడు.
తన కళ్ల ముందే ఏంజెల్‌తో రిషి నిశ్చితార్థానికి ఏర్పాట్లు జరగడం వసుధార తట్టుకోలేకపోతుంది. కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇద్దరు నక్షత్రాలు, రాశులు చెప్పమని అంటాడు పంతులు. ఏంజెల్ చెబుతుంది. కానీ రిషి మాత్రం మౌనంగా ఉంటాడు. వెంటనే లేచి ఇప్పుడు ఏ ముహూర్తాలు, జాతకాలు చూడాల్సిన అవసరం లేదని పంతులుగారిని వెళ్లిపొమ్మని అంటాడు. అతడి తీరుకు విశ్వనాథం, ఏంజెల్ షాక్ అవుతారు. మహేంద్ర, జగతి ఆనందపడతారు.
నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? అంటూ రిషిపై సీరియస్ అవుతుంది ఏంజెల్. మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి విశ్వనాథంతో చెబుతాడు రిషి. ఆ తర్వాత జగతి, మహేంద్రలను చూపించి వాళ్లు నా తల్లిదండ్రులు అని చెప్పబోతూ మధ్యలోనే మాటల్ని ఆపేస్తాడు రిషి.
వాళ్లు నా ఆత్మీయులు అని చెబుతాడు. మీరు రిషి గురించి తెలుసుకునే విషయాలు చాలా ఉన్నాయని, అవి మీరు తెలుసుకోవాలని విశ్వనాథంతో అంటాడు మహేంద్ర. కానీ రిషి వారిస్తాడు. చెప్పాల్సింది మీరు కాదు నేను...నేను చెబుతానని వారిస్తాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.