Guppedantha Manasu Rishi: గుప్పెడంత మనసు రిషి గీతా శంకరం మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ - మట్టి బుర్ర సాంగ్ లిరిక్స్
Guppedantha Manasu Rishi: గుప్పెడంత మనసు రిషి బర్త్‌డే సందర్భంగా గీతా శంకరం మూవీ ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. మట్టిబుర్ర అంటూ సాగిన ఈ పాటకు ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ సాహిత్యాన్ని అందించారు. శ్వేతా మోహన్ ఈ పాటను అలపించింది.
Guppedantha Manasu Rishi: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ ముఖేష్ గౌడ అలియాస్ రిషి హీరోగా నటిస్తోన్న గీతా శంకరం మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. రిషి బర్త్‌డే సందర్భంగా మట్టిబుర్ర సాంగ్‌తో అతడి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. మట్టిబుర్ర పాటను ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ రాశాడు. శ్వేతా మోహన్ ఈ రొమాంటిక్ డ్యూయెట్‌ను ఆలోపించింది. అబూ మ్యూజిక్ అందించాడు.
మట్టిబుర్ర...
ఈ పాటలో ముఖేష్ గౌడ వెంటపడుతూ హీరోయిన్ ప్రియాంక శర్మ కనిపిస్తోంది. అర్థం చేసుకోవేంట్రా మట్టిబుర్ర అంటూ అతడిని ఆటపట్టించింది. మట్టిబుర్ర పాటలో ముఖేష్ గౌడ, ప్రియాంక శర్మ కెమిస్ట్రీ హైలైట్‌గా నిలిచింది. లిరిక్స్‌తో పాటు రిషి, ప్రియాంక శర్మ జోడి బాగుందని, గీతా శంకరం సినిమా పెద్ద విజయం సాధించాలని ముఖేష్ గౌడ అభిమానులు కామెంట్స్ చేస్తోన్నారు. వచ్చే ఏడాది గీతా శంకరం మూవీని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్...
విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా గీతా శంకరం మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాతో రుద్ర దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు.భానుశ్రీ మెహ్రాతో పాటు మురళీధర్ గౌడ్, నాగ మహేష్, అజిత్ జయరాజ్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
రెండు సినిమాలు...
గుప్పెడంత మనసు సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన రిషి గీతా శంకరం మూవీతోనే హీరోగా పరిచయమవుతోన్నాడు. గీతా శంకరం మూవీతో పాటు ప్రియమైన నాన్న పేరుతో మరో మూవీకి రిషి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ బైలింగ్వల్ మూవీకి రామేనహల్లి జగన్నాథ దర్శకత్వం వహిస్తున్నాడు. గీతా శంకరంతో పాటు ప్రియమైన నాన్నకు మూవీ కూడా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.
మట్టి బుర్ర సాంగ్ లిరిక్స్...
పొద్దు పొద్దున్నే నీ కలలే కంటూవున్నా
ముద్దు ముద్దుగా నీ కొరకే ముస్తాబైనా
పొద్దు పొద్దున్నే నీ కలలే కంటూవున్నా
ముద్దు ముద్దుగా నీ కొరకే ముస్తాబైనా
నీ యనకేనకే ఎపుడూ నే నడిచొస్తున్నా
నీ ఎంగిలినే ఇష్టంగా తింటూ ఉన్నా
ఎంత చెప్పిన ఎంత చేసినా
ఎంత చెప్పిన ఎంత చేసినా కొంత కూడా
అర్ధం చేసుకోవేంట్రా మట్టి బుర్రా
అర్ధం చేసుకోవేంట్రా మట్టి బుర్రా
నన్నర్థం చేసుకోవేంట్రా మట్టి బుర్రా మట్టి బుర్రా
అర్ధం చేసుకోవేంట్రా మట్టి బుర్రా
చిన్న నాటి నుండి నీతోనే చెలిమిగా ఉన్నా
నువ్వెక్కడికెళుతున్నా నీకెదురొస్తున్నా
నీ చనువుగా నీ భుజం పైన చేయేస్తున్నా
ఆ చెయ్యను తియ్యను ఇంకో వెయ్యేళ్ళయినా
నా మనసున తనువున నువ్వే నిలిచావంటున్నా
నా మనిషివి నువ్వే నువ్వే అని అంటున్నా
నేనాడపిల్లయినా ఓ అడుగు మందేసి అనకూడనవంటూవున్నా
అర్ధం చేసుకోవేంట్రా మట్టి బుర్రా
అర్ధం చేసుకోవేంట్రా మట్టి బుర్రా
నన్నర్థం చేసుకోవేంట్రా మట్టి బుర్రా మట్టి బుర్రా
రే అర్ధం చేసుకోవేంట్రా మట్టి బుర్రా
నా మువ్వలు గలుగల్లుమని మూగైపోయే
నా గాజులు గలగలలు మరిచి గమ్మున నిలిచే
నా గోరింటాకే ఎర్రగా నన్నే చూసే
నా కాటుకు రేకే నన్నే కాటే వేసే
నా అందం చందం ఆభరణాలు అన్ని
నువ్వు ముందరలేవని నను ముద్దా ఇటు చూసి
మగవాన్ని నేనైతే మగువల్లే నువ్వొస్తే
ఇంత ఆలస్యం చేసేదాన్న
అర్ధం చేసుకోవేంట్రా మట్టి బుర్రా
అర్ధం చేసుకోవేంట్రా మట్టి బుర్రా
నన్నర్థం చేసుకోవేంట్రా మట్టి బుర్రా మట్టి బుర్రా
అర్ధం చేసుకోవేంట్రా రే మట్టి బుర్రా