Guppedantha Manasu Rishi: గుప్పెడంత మనసు రిషి తెలుగు మూవీ అప్‌డేట్‌ -గేమ్ ఛేంజ‌ర్ సింగ‌ర్‌తో ఫ‌స్ట్ సాంగ్ -ప్రోమో రిలీజ్-guppedantha manasu rishi geetha shankaram movie first lyrical song promo unveiled ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu Rishi: గుప్పెడంత మనసు రిషి తెలుగు మూవీ అప్‌డేట్‌ -గేమ్ ఛేంజ‌ర్ సింగ‌ర్‌తో ఫ‌స్ట్ సాంగ్ -ప్రోమో రిలీజ్

Guppedantha Manasu Rishi: గుప్పెడంత మనసు రిషి తెలుగు మూవీ అప్‌డేట్‌ -గేమ్ ఛేంజ‌ర్ సింగ‌ర్‌తో ఫ‌స్ట్ సాంగ్ -ప్రోమో రిలీజ్

Nelki Naresh Kumar HT Telugu
Nov 02, 2024 12:09 PM IST

Guppedantha Manasu Rishi: గుప్పెడంత మ‌న‌సు రిషి డెబ్యూ తెలుగు మూవీ గీతా శంక‌రం నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వ‌చ్చింది. ఈ సినిమాలోని ఫ‌స్ట్ లిరిక‌ల్ సాంగ్ ప్రోమోను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఫుల్ సాంగ్‌ను న‌వంబ‌ర్ 8న విడుద‌ల‌చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ పాట‌ను ఆస్కార్ విన్న‌ర్ చంద్ర‌బోస్ రాశారు.

 గుప్పెడంత మ‌న‌సు రిషి
గుప్పెడంత మ‌న‌సు రిషి

Guppedantha Manasu Rishi: గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ ఫేమ్ ముఖేష్ గౌడ అలియాస్ రిషి తెలుగులో గీతా శంక‌రం పేరుతో ఓ మూవీ చేస్తోన్నాడు. ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీతోనే రిషి హీరోగా ఎంట్రీ ఇస్తోన్నాడు. ఈ సినిమాలో రిషికి జోడీగా ప్రియాంక శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

అప్‌డేట్ వ‌చ్చేసింది....

గీతా శంక‌రం నుంచి కొత్త అప్‌డేట్‌ను మేక‌ర్స్ రివీల్ చేశాడు. ఈ మూవీలోని మ‌ట్టి బుర్ర సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఫోక్ స్టైల్ మ్యూజిక్‌తో ఈ సాంగ్ ప్రోమో ఆక‌ట్టుకుంటుంది. స్వ‌చ్ఛ‌మైన ప‌ల్లెటూరిని త‌ల‌పిస్తూ ప్రోమోలో లొకేష‌న్స్ క‌నిపిస్తున్నాయి.

ముఖేష్ గౌడ‌, హీరోయిన్ ప్రియాంక శ‌ర్మ కెమిస్ట్రీ ఈ ప్రోమోకు హైలైట్‌గా నిలుస్తోంది. మ‌ట్టి బుర్ర ఫుల్ సాంగ్‌ను న‌వంబ‌ర్ 8న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. మ‌ట్టిబుర్ర పాట‌కు ఆస్కార్ విన్న‌ర్ చంద్ర‌బోస్ సాహిత్యాన్ని అందించ‌గా...సునిధి చౌహాన్ ఈ పాట‌ను అల‌పించింది. అబూ మ్యూజిక్ అందిస్తోన్నాడు.

వ‌రుడు ఫేమ్ భానుశ్రీ మెహ్రా...

విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న గీతా శంక‌రం మూవీకి రుద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. అల్లు అర్జున్ వ‌రుడు ఫేమ్ భానుశ్రీ మెహ్రా ఈ మూవీలో ఓ కీల‌క పాత్ర పోషిస్తోంది. ముర‌ళీధ‌ర్ గౌడ్‌, నాగ మ‌హేష్‌, అజిత్ జ‌య‌రాజ్ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు.

గీతాశంక‌రం సినిమా షూటింగ్ ప్రారంభ‌మై చాలా రోజులు అవుతోంది. ఇప్ప‌టికే ఈ ల‌వ్‌స్టోరీ థియేట‌ర్ల‌లోకి రావాల్సింది. కానీ ముఖేష్ గౌడ ప్ర‌మాదంలో గాయ‌ప‌డ‌టంతో కొన్నాళ్లు షూటింగ్ నిలిచిపోయింది.

వ‌చ్చే ఏడాది వేస‌విలో...

ఇటీవ‌లే గీతా శంక‌రం లేటెస్ట్ షూటింగ్ షెడ్యూల్‌ను బెంగ‌ళూరులో పూర్తిచేశారు. హీరోహీరోయిన్లు ముఖేష్ గౌడ‌, ప్రియాంక‌శ‌ర్మ‌తో పాటు ప్ర‌ధాన తారాగ‌ణంపై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. ఈసినిమా పాట‌ల రికార్డింగ్ కూడా పూర్త‌యిన‌ట్లు స‌మాచారం. వ‌చ్చే ఏడాది వేస‌విలో గీతా శంక‌రం మూవీని రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తోన్నారు.

ప్రియ‌మైన నాన్న‌కు...

గీతా శంక‌రంతో పాటు తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో బైలింగ్వ‌ల్ మూవీలో ముఖేష్ గౌడ హీరోగా న‌టిస్తోన్నాడు రోడ్ జ‌ర్నీ బ్యాక్‌డ్రాప్‌లో ఎమోష‌న‌ల్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి. తెలుగులోప్రియ‌మైన నాన్న‌కు అనే టైటిల్‌ను క‌న్ఫామ్‌ చేశారు.క‌న్న‌డంలో తీర్థ‌రూప తండేయావ‌రిగే అనే పేరును ఫిక్స్ చేశారు. ప్రియ‌మైన నాన్న‌కు మూవీకి రామేన‌హ‌ల్లి జ‌గ‌న్నాథ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ మూవీ కూడా వ‌చ్చే ఏడాది రిలీజ్ కానుంది.

గుప్పెడంత మ‌న‌సు రీ టెలికాస్ట్‌...

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌తోనే తెలుగులో ఫేమ‌స్ అయ్యాడు ముఖేష్ గౌడ‌. ఈ సీరియ‌ల్‌లో రిషిగా అస‌మాన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. ఆగ‌స్ట్ 31 నాటితో ఈ సీరియ‌ల్‌కు ఎండ్ కార్డ్ ప‌డింది. ప్ర‌స్తుతం స్టార్ మాలో గుప్పెడంత మ‌న‌సు రిపీట్ టెలికాస్ట్ అవుతోంది. గురు

Whats_app_banner