Guppedantha Manasu October 19th Episode: ఎండీగా ఫస్ట్‌డేనే వసుధారకు షాక్ - రిషి సాయం - మహేంద్ర లైఫ్‌లోకి మరో జగతి
Guppedantha Manasu October 19th Episode: డీబీఎస్‌టీ కాలేజీ ఎండీ బాధ్యతలు చేపట్టిన తొలిరోజే వసుధారకు పెద్ద సమస్య ఎదురవుతుంది. జీతాలు పెంచమని వసుధారకు లెక్చరర్స్ వార్నింగ్ ఇస్తారు. ఆ సమస్యను రిషి సాల్వ్ చేస్తాడు. ఆ తర్వాత నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో ఏం జరిగిందంటే...
Guppedantha Manasu October 19th Episode: రిషి కోరిక మేరకు డీబీఎస్‌టీ కాలేజీ ఎండీ పదవిని చేపడుతుంది వసుధార. ఎండీ సీట్‌లో కూర్చున్న తొలిరోజే వసుధారకు పెద్ద సమస్య ఎదురవుతుంది. జీతాలు పెంచమని లెక్చరర్స్ డిమాండ్ చేస్తారు. ఇన్ని రోజులు జీతాలు పెంచమని అడగంది ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారని లెక్చరర్స్‌ను క్వశ్చన్ చేస్తుంది వసుధార.

జగతి మేడమ్‌ను అడగాలని అనుకునే లోపు ఆమె చనిపోయిందని లెక్చరర్స్ చెబుతారు. మీకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే మొదటిరోజే చెబుతున్నామని అంటారు.
శైలేంద్ర కుట్ర...
లెక్చరర్స్‌ను కన్వీన్స్ చేయడానికి వసుధార చాలా ప్రయత్నిస్తుంది. కానీ ఆమె మాటల్ని ఎవరూ పట్టించుకోరు. ఎండీ సీట్‌లో కూర్చొని ఎన్ని కబుర్లు అయినా చెబుతారు అంటూ ఎగతాళి చేసినట్లుగా మాట్లాడుతారు. జీతాలు పెంచిన తర్వాతే పాఠాలు చెప్పడం మొదలుపెడతామని వసుధారకు వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతారు. లెక్చరర్స్ మాటలు, వాలకం చూసి వారి వెనుక ఎవరో ఉన్నారని వసుధార అనుకుంటుంది.
ఆమె ఊహించినట్లుగానే లెక్చరర్స్ డిమాండ్స్ వెనుక శైలేంద్ర ఉంటాడు. వసుధారను ఇబ్బంది పెట్టాలనే జీతాలు పెంచమని లెక్చరర్స్‌ను రెచ్చగొడతాడు శైలేంద్ర. జీతాలు పెంచేవరకు మీరు కాలేజీకి రావద్దని చెబుతాడు. వసుధారను ఎండీ సీట్‌కు అనర్హురాలిగా ప్రకటించేందుకు శైలేంద్ర ఈ స్కెచ్ వేస్తాడు.
వసుధార టెన్షన్...
వసుధారకు రిషి ఫోన్ చేస్తాడు. ఆమె డల్‌గా మాట్లాడటంతో ఏమైందని అడుగుతాడు. లెక్చరర్స్ జీతాలు పెంచమని చేసిన డిమాండ్ గురించి చెప్పి భయపడుతుంది. చిన్న విషయానికి భయపడాల్సిన అవసరం లేదని, తాను కాలేజీ వచ్చి ఇష్యూని సాల్వ్ చేస్తానని వసుధారకు ధైర్యం చెబుతాడు రిషి.
వసుధార ఎండీ సీట్‌లో కాకుండా మరో ఛైర్ వేసుకొని కూర్చోవడంతో రిషి సీరియస్ అవుతాడు. నా మాటంటే గౌరవం లేదా అని క్లాస్ ఇస్తాడు. మీ మాటకు కట్టుబడే ఎండీ సీట్‌లో కూర్చున్నానని, కానీ ఆ చైర్‌లో కూర్చలేనని అంటుంది.
లెక్చరర్‌గా రిషి....
జీతాల సమస్యను సాల్వ్ చేయడానికి రిషి డీబీఎస్‌టీ కాలేజీలో లెక్చరర్‌గా జాయిన్ కావాలని డిసైడ్ అవుతాడు. తాను ఎండీగా పనిచేసిన కాలేజీలోనే రిషి లెక్చరర్‌గా జాయిన్ అవుతానని అనడంతో వసుధార షాక్ అవుతుంది. లెక్చరర్‌గా పనిచేయడం తనకు ఇష్టమని వసుధారతో అంటాడు రిషి.
జీతాలు పెంచమని డిమాండ్ చేసిన లెక్చరర్స్ పక్కనపెట్టి రిటైర్డ్ లెక్చరర్స్‌తో విద్యార్థులకు పాఠాలు బోధించాలని రిషి డిసైడ్ అవుతాడు. అతడి ఐడియాకు విద్యార్థులు సపోర్ట్ చేస్తారు.
వసుధార ఎమోషనల్...
రిషి చేసిన సాయంతో వసుధార ఎమోషనల్ అవుతుంది. రిషికి కౌగిలించుకొని ఐ లవ్ యూ చెబుతుంది. ఎండీ సీట్‌లో నువ్వు తలదించుకోకూడదని, నీపై ఎలాంటి మచ్చ పడకూడదనే ఇదంతా చేశానని వసుధారతో అంటాడు రిషి. డీబీఎస్‌టీ కాలేజీ విలువ ఎప్పుడూ పడిపోకూడదని రిషి చెబుతాడు. డీబీఎస్‌టీతో పాటు నువ్వు కూడా నా ప్రాణమని వసుధారతో అంటాడు రిషి. మిషన్ ఎడ్యుకేషన్‌తో పాటు డాడ్ తన బాధ్యత అని చెబుతాడు.
దేవయాని నాటకం...
తల్లి నోటి దురుసు కారణంగా రిషి, మహేంద్ర ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో దేవయానిపై ఫైర్ అవుతాడు శైలేంద్ర. వారిని వెనక్కి వచ్చేలా చేయడం కోసం ఇద్దరు కలిసి కొత్త నాటకం మొదలుపెడతారు. రిషికి మంచి చెబుతోన్నట్లుగా నటిస్తుంది దేవయాని. మహేంద్ర ఎలా ఉండేవాడు...ఎలా అయిపోయాడు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది.
పెద్దదానిగా తాను అన్న మాటలను పట్టించుకోవద్దని చెబుతుంది. మహేంద్రను జాగ్రత్తగా చూసుకుంటానని, తమ ఇంటికి వచ్చేయమని రిషిని కన్వీన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది దేవయాని. బాబాయ్, మీరు ఇలా మా అందరికి దూరంగా ఉండటం తట్టుకోలేకపోతున్నానని శైలేంద్ర కూడా డ్రామాను రక్తికట్టిస్తాడు. మహేంద్ర, తాను చిన్నప్పటి నుంచి కలిసే పెరిగామని, ఎప్పుడూ అతడికి దూరంగా ఉండలేదని, మహేంద్ర లేని ఇంట్లో తాను ఉండలేనని ఫణీంద్ర అంటాడు.
మహేంద్ర ఫైర్...
తనకు అవమానం జరిగిన ఇంటికి తిరిగి వచ్చేది లేదని మహేంద్ర ఖరాఖండిగా చెబుతాడు. తన వల్ల ఇంటి పరువు, గౌరవమర్యాదలు పోయానని ఎలా అన్నారని ఫైర్ అవుతాడు. రిషి, వసుధార తనకు తోడుగా ఉన్నారని, తాను ఇక్కడే ఉంటానని చెబుతాడు. మహేంద్ర మాటలతో దేవయాని షాక్ అవుతుంది.
తల్లి జ్ఞాపకాల నుంచి తండ్రి బయటపడాలంటే మహేంద్ర అక్కడికి రాకపోవడమే మంచిదని దేవయాని, ఫణీంద్రలతో చెబుతాడు రిషి. ప్రశాంతంగా ఉండటానికి కొన్నాళ్లు ఎక్కడికైనా వెళ్లాలని అనుకుంటామని చెబుతారు. రిషి వెంట వెళ్లాలని దేవయాని, శైలేంద్ర అనుకుంటారు.
కొత్త క్యారెక్టర్ ఎంట్రీ...
వారికి ఫణీంద్ర క్లాస్ ఇస్తారు. బుద్ది ఉండే మాట్లాడుతున్నారా, వారి మధ్యలో పానకంలో పుడకలా మీరేందుకు అంటూ ఫైర్ అవుతాడు. రిషి, వసుధారలను ప్రశాంతంగా వదిలేయమని చెబుతాడు.
పెళ్లైనా తర్వాత జంటగా కొత్త ప్లేస్‌కు వెళతారు. తండ్రిని తమతో పాటు తీసుకెళతారు. అక్కడ మహేంద్ర జీవితంలోకి మరో కొత్త పాత్ర ఎంట్రీ ఇస్తుంది. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.