Guppedantha Manasu May 29th Episode: రిషి, వ‌సుల‌ను విడ‌గొట్టిన‌ జ‌గ‌తి - మోస‌గాడిగా మిగిలిపోయిన రిషి-guppedantha manasu may 29th episode rishi calls off engagement with vasudhara ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Guppedantha Manasu May 29th Episode Rishi Calls Off Engagement With Vasudhara

Guppedantha Manasu May 29th Episode: రిషి, వ‌సుల‌ను విడ‌గొట్టిన‌ జ‌గ‌తి - మోస‌గాడిగా మిగిలిపోయిన రిషి

HT Telugu Desk HT Telugu
May 29, 2023 08:23 AM IST

Guppedantha Manasu May 29th Episode: అబ‌ద్ధ‌పు సాక్ష్యంతో త‌న‌ను మోసం చేసిన వ‌సుధార‌కు దూరంగా వెళ్లిపోతాడు రిషి. తాము విడిపోవ‌డానికి జ‌గ‌తి కార‌ణం కావ‌డంతో కోపంతో వ‌సుధార కూడా జ‌గ‌తికి దూర‌మ‌వుతంది. రిషి, వ‌సుధార వెళ్లిపోవ‌డంతో జ‌గ‌తి ఒంట‌రిగా మిగిలిపోతుంది.

గుప్పెడంత మ‌న‌సు
గుప్పెడంత మ‌న‌సు

Guppedantha Manasu May 29th Episode: వ‌సుధార చెప్పిన అబ‌ద్ధపు సాక్ష్యం కార‌ణంగా తాను అంద‌రి ముందు దోషిగా తేల‌డంతో రుషి గుండె బ‌ద్ద‌ల‌వుతుంది వ‌సుధార‌తో పాటు కుటుంబ‌స‌భ్యులు అంద‌రికీ దూరం గా వెళ్లిపోవాల‌ని నిర్ణ‌యించుకుంటాడు. ఎంగేజ్‌మెంట్ రింగ్‌ను తీసేసి వ‌సుధార‌కు ఇస్తాడు. రిషిధార‌లుగా మ‌నం విడిపోతున్న‌ట్లు...ఇప్పుడు వ‌సుధార మాత్ర‌మే మిగిలి ఉంద‌ని కోపంతో ఉంటాడు. రిషిధార‌ను నీ అబ‌ద్ద‌పు సాక్ష్యాధారాల కూల్చేశాయ‌ని చెబుతాడు. క‌న్నీళ్ల‌తో వ‌సుధార త‌న‌కు దూరం కావోద్ద‌ని ప్రాధేయ‌ప‌డుతుంది. ఈ ఒక్క విష‌యంలో త‌న‌ను క్ష‌మించ‌మ‌ని వేడుకుంటుంది. కానీ రిషి మాత్రం ఆమె మాట‌లు విన‌డు.

న‌మ్మ‌కం లేని చోట‌...

బంధాలు త‌న‌ను హింసిస్తున్నాయ‌ని, త‌న‌కు బంధాలు స‌రిపోవ‌ని వ‌సుధార‌తో కోపంగా అంటాడు రిషి. ప్రేమికులు మ‌ధ్య అభిప్రాయ‌భేదాలు వ‌స్తుంటాయి. పోతుంటాయి. కానీ మ‌న మ‌ధ్య న‌మ్మ‌కం అనే ఇష్యూ వ‌చ్చింది. న‌మ్మ‌కం కోల్పోయిన చోట ప్రేమ నిల‌బ‌డ‌ద‌ని చెబుతాడు. నేను మీ నీడ‌ను సార్ అని వ‌సుధార రిషికి న‌చ్చ‌జెప్పే ప్ర‌య‌త్నం చేస్తుంది.

ఆమె మాట‌ల‌కు రిషిలోని కోపం మ‌రింత పెరుగుతంది. మ‌నిషిగా చంపేశారు. ఇంకా నీడేంటి. వ‌దిలేయ్‌...న‌న్ను వెంటాడ‌కు అని వార్నింగ్ ఇస్తాడు. అత‌డి మాట‌ల‌కు నాకు మీ మీద ప్రేమ‌, అభిమానం ఎప్ప‌టికీ పోవ‌ని వ‌సుధార క‌న్నీళ్ల‌తో స‌మాధాన‌మిస్తుంది. నువ్వు చెప్పింది నిజ‌మే అయితే నాకు ఎప్పుడూ ఎదురుప‌డ‌కు.

న‌న్ను జీవితంలో క‌ల‌వాల‌ని, చూడాల‌ని ప్ర‌య‌త్నించ‌కు క‌ఠువుగా చెప్పి వ‌సుధార‌కు దూరంగా వెళ్లిపోతాడు రిషి. సార్ ఆగండి అని వ‌సుధార చెబుతున్నా రిషి వెన‌క్కితిరిగి చూడ‌కుండా ఆమెకు దూర‌మ‌వుతాడు.

జ‌గ‌తిపై వ‌సు ఫైర్‌...

క‌న్నీళ్ల‌లో మునిగిపోయిన వ‌సుధార‌ను ఓదార్చ‌డానికి జ‌గ‌తి ప్ర‌య‌త్నిస్తుంది. ఆమె భుజంపై చేయివేస్తుంది. జ‌గ‌తిపై వ‌సుధార ఫైర్ అవుతుంది. న‌న్ను ట‌చ్ చేయ‌కండి మేడ‌మ్ అని అరుస్తుంది. మీరేం చెప్ప‌కండి నేను విన‌ద‌ల‌చుకోలేద‌ని చెబుతుంది. జ‌రుగుతున్న సంఘ‌ట‌న‌లు రిషికి చెబుదామ‌ని అంటూనే ఉన్నాన‌ని, నిజాలు దాస్తే రిషి స‌హించ‌లేడ‌ని చెప్పినా మీరే త‌న మాట విన‌లేద‌ని వ‌సుధార అంటుంది.

నేనేం చేసిన మీ బాగు కోస‌మే చేశాన‌ని జ‌గ‌తి బ‌దులిస్తుంది. . ప్ర‌యోజనం ఏముంది మేడ‌మ్ అని జ‌గ‌తితో అంటుంది వ‌సుధార‌. రిషి సార్ ప్రాణాల‌ను కాపాడుకోవాల‌ని నాతో త‌ప్పుడు సాక్ష్యం చెప్పించార‌ని అంటుంది. రిషి సార్ మ‌న‌సు నుంచి న‌న్ను చెరిపిపేశాలా చేశార‌ని క‌న్నీళ్ల‌తో అంటుంది. మీరే మా ప్రేమ‌కు కార‌ణం...ఇప్పుడు మీరే విడిపోవ‌డానికి కార‌ణ‌మ‌య్యార‌ని బ‌దులిస్తుంది.

రిషి తిరిగిరాడు...

రిషి ఏ రోజుకైనా తిరిగివ‌స్తాడు. నిన్ను అర్థం చేసుకుంటాడ‌ని వ‌సుధార‌కు ఓదార్చాల‌ని జ‌గ‌తి అనుకుంటుంది. అది క‌ల‌. మ‌నం త‌న మ‌న‌సును ముక్క‌లు చేశాం..మ‌న బంధానికి రిషి ముగింపు చెప్పాడ‌ని రిషి తీసేసిన ఎంగేజ్‌మెంట్ రింగ్‌ను జ‌గ‌తికి చూపిస్తుంది వ‌సుధార‌.

మీరు చెప్పిన‌ట్లు చేస్తే రిషి సార్ ద‌క్కుతాడ‌ని అనుకున్నాన‌ని, కానీ ఎవ‌రికి కాకుండా ఒంట‌రివాడైపోయాడ‌ని వ‌సుధార ఎమోష‌న‌ల్ అవుతుంది. . మీరు అడిగిన గురుద‌క్షిణ ఇచ్చినందుకు మీరు నాకు మంచి ప్ర‌తిఫ‌లం ఇచ్చార‌ని క‌న్నీళ్ల‌తోనే జ‌గ‌తిపై కోపగించుకుంటుంది.

జ‌గ‌తి ఒంట‌రి...

మీరు న‌న్ను క‌ల‌వాల‌ని చూడ‌కండి.నాతో మాట్లాడ‌టానికి ప్ర‌య‌త్నించ‌కండి...రిషి సార్ లాగే నేను అంద‌రికీ దూరంగా వెళ్లిపోతున్నాన‌ని అంటుంది. జ‌గ‌తి వ‌ద్ద‌ని బ‌తిమిలాడిన వ‌సుధార విన‌దు. న‌న్ను ఆపాడానికి ప్ర‌య‌త్నించ‌కండి. రిషి లేని ప్ర‌పంచం నాకు వ‌ద్దు. ఇది నాకు నేను విధించుకున్న శిక్ష అని జ‌గ‌తికి దూరంగా వెళ్లిపోతుంది. రిషి, వ‌సుధార ఒక‌రి త‌ర్వాత మ‌రొక‌రు వెళ్లిపోవ‌డంతో జ‌గ‌తి ఒంట‌రిగా మిగిలిపోతుంది

క‌న్నీళ్ల‌తో పుట్టింటికి...

రిషి, జ‌గ‌తిల‌కు దూరంగా త‌న ఇంటికి వ‌స్తుంది వ‌సుధార‌. క‌న్నీళ్ల‌తో ఇంట్లోకి వ‌స్తోన్న కూతురును చూసి ఆమె త‌ల్లి కంగారు ప‌డుతుంది. ఏమైంద‌ని ప‌దే ప‌దే అడిగినా వ‌సుధార మాత్రం త‌ల్లికి స‌మాధానం చెప్ప‌దు. ఇక నుంచి రిషి సార్ జీవితంలో తాను లేన‌ని అంటుంది. ఆమె మాట‌ల‌కు త‌ల్లి షాక్ అవుతుంది. నేనే రిషి సార్ మీద అభియోగం మోపి అతడిని బ్రతికుండగానే చంపేశానని అంటుంది. ఈ రోజుతో అన్నీ కోల్పోయాన‌ని అంటుంది. కూతురి మాట‌ల‌కు త‌ల్లి కూడా ఎమోష‌న‌ల్ అవుతుంది.

కుప్ప‌కూలిపోయిన వ‌సుధార త‌ల్లి...

అప్పుడేమో పెళ్లి పీట‌ల మీద నుంచి వెళ్లిపోయావు. ఇంకోసారి నీ మెడ‌లో నువ్వే తాళి వేశాడు. ఇప్పుడు నిశ్చితార్థం చేసుకొని పెళ్లి చేసుకోవాల్సిన భ‌ర్త‌కు ద్రోహం చేశావ‌ని వ‌సుధార‌పై సీరియ‌స్ అవుతుంది. అంత గొప్ప వ్య‌క్తి మీద నింద‌లు వేయ‌డానికి మ‌న‌సు ఎలా వ‌చ్చింద‌ని వ‌సుధార త‌ల్లి కూడా క‌న్నీళ్లు పెట్టుకుంటుంది. ఇప్పుడు నా కూతురు ప‌రిస్థితి ఏంటి? దాని బ‌తుకు ఏంట‌ని క‌న్నీళ్లు గుండెను ప‌ట్టుకొని కుప్ప‌కూలిపోతుంది.

మోస‌గాడిన‌న్న రిషి...

ఆ త‌ర్వాత ఓ టీ స్టాల్ వ‌ద్ద ఒంట‌రిగా కూర్చుంటాడు రిషి. ఆ టీ స్టాల్‌ ఓన‌ర్ కొడుకు మ్యాథ్స్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డానికి ఇబ్బందిప‌డుతుంటాడు. రిషి అత‌డికి స‌హాయం చేస్తాడు. ఆ త‌ర్వాత టీ తాగినందుకు డ‌బ్బులు ఇవ్వ‌బోతాడు. కానీ ఆ టీస్టాల్ ఓన‌ర్ డ‌బ్బులు మాత్రం తీసుకోడు. ప్రాబ్లెమ్‌ను చ‌క్క‌గా సాల్వ్ చేశారు. మీరు స్కూల్‌లో టీచారా? లేదంటే కాలేజీలో లెక్చ‌ర‌రా? అని ఆ పిల్లాడు రిషిని అడుగుతాడు. అందుకు రిషి తాను మోస‌గాడిని అని స‌మాధానం చెప్ప‌డంతో నేటి గుప్పెడంత మ‌న‌సు ఎపిసోడ్ ముగిసింది.

IPL_Entry_Point