Guppedantha Manasu Serial: శైలేంద్ర అంతు చూస్తానని రాజీవ్ శపథం - కోడలి ముందు పరువు పోగొట్టుకున్న దేవయాని
Guppedantha Manasu Serial: నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో వసుధారతో పెళ్లి ఆగిపోయేలా చేయడమే కాకుండా తనను పోలీసులకు పట్టించిన వాడిని చంపుతానని రాజీవ్ శపథం చేస్తాడు. తనను ప్లాన్ చేసి దెబ్బకొట్టిన వాడిని పట్టుకునే బాధ్యతను శైలేంద్రకు అప్పగిస్తాడు.
Guppedantha Manasu Serial: ఎండీ సీట్ పేరుతో తనను మోసం చేసిన వసుధార, మనుపై కోపంతో రగిలిపోతాడు శైలేంద్ర. ఇద్దరిపై రివేంజ్ తీర్చుకునే అవకాశం కోసం ఎదురుచూస్తుంటాడు. రిషి పేరుతో వసుధారను, తండ్రి పేరుతో మనును ఇరిటేట్ చేసి ఆనందం పొందుతాడు.

దేవయాని ఆలోచనలు...
కొడుకు భవిష్యత్తు గురించి దేవయాని సీరియస్‌గా ఆలోచిస్తుంటుంది. ఆమె దగ్గరకు ధరణి వస్తుంది. మీరు దేని గురించి ఆలోచిస్తున్నారని అత్తను అడుగుతుంది. కోడలికి సమాధానం చెప్పకుండా ఆమెపై చిరాకుపడుతుంది దేవయాని. అత్త మాటలకు ధరణి ధీటుగా బదులిస్తుంది. దేవయాని కంటే తానే తెలివైన దానిని అని ధరణి అంటుంది. పొడుపు కథ వేస్తా.
దానిని మీరు విప్పాలి అంటూ దేవయానిని అడుగుతుంది ధరణి. అప్పుడే మీరు నాకంటే తెలివైన వారని ఒప్పుకుంటానని అంటుంది. పొడుపు కథలు విప్పడంలో నేను ఆరితేరిన దానిని. నువ్వు అడిగే పొడుపు కథను క్షణాల్లో విప్పేసి నీకు తెలివిలేదని నిరుపిస్తానని దేవయాని బిల్డప్‌లు ఇస్తుంది.
అంగట్లో అమ్మేది కాదు. తక్కేట్లో పెట్టి తూచేది కాదు. అది లేకుండా మనిషే కాదు అంటూ పొడుపు కథ పొడుస్తుంది ధరణి. కోడలు అడిగిన పొడుపు కథకు సమాధానం తెలియక గింజుకుంటుంది దేవయాని.
స్క్రీన్‌ప్లే లీక్...
ధరణి నవ్వడంతో తనకు తెలివిలేదని కోడలు అనుకుంటుందని ఆమెపై ఫైర్ అవుతుంది దేవయాని. పొడుపు కథకు మీకు సమాధానం తెలియకపోతే మీ అబ్బాయిని అడిగి అయినా తెలుసుకొండి అని దేవయానితో అంటుంది ధరణి. మీ స్క్రీన్‌ప్లే లీకయ్యిందని, రాజీవ్‌ను కలవడానికి శైలేంద్ర వెళ్లిన విషయం తనకు తెలుసునని దేవయానితో అంటుంది ధరణి.
రాజీవ్ ఏమన్నాడని మీరు శైలేంద్రను అడుగుతారు. అప్పుడు మీ మధ్య డిస్కషన్ ఉంటుందని నాకు తెలుసునని ధరణి అంటుంది. ఆ టైమ్‌లోనే ఈ పొడుపు కథకు సమాధానం చెప్పమని శైలేంద్రను అడగమని దేవయానితో చెప్పి ధరణి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. వసుధారతో అండతోనే కోడలు రెచ్చిపోవడం చూసి దేవయాని సహించలేకపోతుంది.
రాజీవ్‌ను కలిసిన శైలేంద్ర....
రాజీవ్‌ను కలవడానికి పోలీస్ స్టేషన్‌కు వస్తాడు శైలేంద్ర. ప్లాన్ చేసి తానే రాజీవ్‌ను పోలీసులకు పట్టించిన విషయం అతడికి తెలిసిందా లేదా అని భయపడుతుంటాడు. వసుధార, మహేంద్ర వల్లే తాను పోలీసులకు దొరికానని రాజీవ్ భ్రమపడుతుంటాడు.
వారితో పాటు ఈ ప్లాన్ వెనుక ఎవరో ఉన్నారని అంటాడు. తాను మాత్రం కాదని శైలేంద్ర భయంభయంగా రాజీవ్‌కు సమాధానమిస్తాడు. నువ్వు నాకు ఫ్రెండ్‌వి...దేవయాని మేడమ్‌కు నువ్వు, నేను రెండు కళ్లలాంటివాళ్లం. నువ్వు నాకు ఎందుకు హానీ చేస్తావని, నాకు మంచే చేస్తావు కానీ చెడు ఎప్పటికీ చేయవని శైలేంద్రతో రాజీవ్ అంటాడు .రాజీవ్‌కు తనపై ఉన్న నమ్మకం చూసి శైలేంద్ర కన్నీళ్లు పెట్టుకుంటాడు.
చంపేసిన తర్వాతే పెళ్లి...
వసుధారతో తన పెళ్లిని అడ్డుకున్నవాడు ఎవడో తనకు తెలియాలని రాజీవ్ అంటాడు. వాడిని చంపిన తర్వాతే వసుధార మెడలో మూడుముళ్లువేస్తానని అంటాడు. ఊహించుకోవడానికి చాలా భయంగా వాడి చావు ఉంటుందని శపథం చేస్తాడు రాజీవ్.
అతడి ఛాలెంజ్ చూసి శైలేంద్ర భయపడతాడు. తనను పోలీసులకు పట్టించడంలో వసుధార, మహేంద్రలకు సాయం చేసింది ఎవరో తెలుసుకుంటానని మాటివ్వమనని శైలేంద్రను కోరుతాడు రాజీవ్.
శైలేంద్ర టెన్షన్...
శైలేంద్ర మాత్రం రాజీవ్‌కు మాటివ్వడానికి భయపడతాడు. శైలేంద్ర టెన్షన్ చూసి రాజీవ్‌లో అనుమానం మొదలవుతుంది. అదే విషయం శైలేంద్రను అడుగుతాడు. తాను టెన్షన్ పడటం లేదని అబద్ధం ఆడుతాడు రాజీవ్. అక్కడే ఉంటే తాను రాజీవ్‌కు దొరికిపోవడం ఖాయమని కంగారుగా మళ్లీ కలుస్తానని రాజీవ్‌కు చెప్పి పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోతాడు శైలేంద్ర. రాజీవ్ పిలుస్తున్న పట్టించుకోడు.
సమాధానం చెప్పని శైలేంద్ర...
ధరణి వేసిన పొడుపు కథ గురించి సీరియస్‌గా ఆలోచిస్తుంటుంది దేవయాని. పొడుపు కథకు సమాధానం చెప్పకపోతే ధరణి ముందు తాను తెలివిలేని దద్దమ్మగా మిగిలిపోతానని కంగారు పడుతుంది.
శైలేంద్ర స్టేషన్ నుంచి వచ్చిన విషయం గుర్తించదు. . తల్లి సీరియస్‌గా దేని గురించో ఆలోచించడం చూసి అదేమిటని శైలేంద్ర అడుగుతాడు. ధరణి పొడుపు కథ గురించి కొడుకుకు చెబుతుంది దేవయాని.
ఆ పొడుపు కథకు తనకు సమాధానం తెలియదని దేవయానికి బదులిస్తాడు శైలేంద్ర. మోసం చేయడం, చంపడం లాంటివి ఈజీగా చేస్తాను. అంతేకానీ ఇలాంటి పొడుపు కథలకు మాత్రం నేను సమాధానం చెప్పలేనని దేవయానితో శైలేంద్ర అంటాడు.
ధరణి ట్విస్ట్...
పొడుపు కథకు సమాధానం చెప్పాలని ధరణిని బతిమిలాడుతాడు శైలేంద్ర. ఎంత అడిగిన ఆమె మాత్రం సమాధానం చెప్పనని వెళ్లిపోతుంది. రాజీవ్‌ను కలిసిన విషయం దేవయానికి చెబుతాడు శైలేంద్ర.
తనను పోలీసులకు పట్టించింది మహేంద్ర అని రాజీవ్ నమ్ముతున్నాడని అంటాడు. నేను వేసిన ప్రశ్నల వల్ల ఈ ప్లాన్ వెనుక ఎవరో ఉన్నారని రాజీవ్‌లో అనుమానం మొదలైందని, అది నేనే అని తెలిస్తే అతడు ఏం చేస్తాడోనని భయంగా ఉందని తల్లితో అంటాడు శైలేంద్ర.
రాజీవ్‌ను ఫేస్ చేయడం ఎలాగో తెలియడం లేదని అంటాడు. రాజీవ్ సంగతి తాను చూసుకుంటానని, నువ్వు మను, వసుధారలపై రివేంజ్ గురించి ఆలోచించమని కొడుకుతో అంటుంది దేవయాని. అక్కడితో మే 25 నాటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.