Guppedantha Manasu Serial: మనుకు లవ్ ప్రపోజ్ చేసిన ఏంజెల్ - వసుపై శైలేంద్ర రివేంజ్ - రిషిని చంపుతానని వార్నింగ్
Guppedantha Manasu Serial: నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో ఎండీ సీట్ ఎరగా వేసి తనను మోసం చేసిన వసుధార, మనుపై రివేంజ్ తీర్చుకునే అవకాశం కోసం ఎదురుచూస్తుంటాడు శైలేంద్ర. రిషి పేరుతో వసుధారను, తండ్రి బంధంతో మనును అవమానిస్తాడు శైలేంద్ర.

Guppedantha Manasu Serial: మనును కలవడానికి ఏంజెల్ వస్తుంది. ఏంజెల్ రొమాంటిక్‌గా మాట్లాడితే మను మాత్రం పెడసరిగా సమాధానాలు చెబుతూ ఆమె మనసును నొప్పిస్తాడు. ఆమె అడిగిన ఏ ప్రశ్నకు సరిగ్గా సమాధానం చెప్పడు. ఎందుకొచ్చావ్ అని మను అడిగిన ప్రశ్నకు నీ కోసం అని బదులిస్తుంది ఏంజెల్.
ఏంటి నీ బాధ అని మను కోపంగా అడిగితే నువ్వే నా బాధ అని ఏంజెల్ చెబుతుంది. ఆమె ప్రశ్నలతో మను ఇరిటేట్‌గా ఫీలవుతాడు. నన్ను కలిశావు...మాట్లాడావ్..ఇక చాలు ఇక్కడి నుంచి వెళ్లు అని ఏంజెల్‌తో అంటాడు మను. అతడి మాటలతో ఏంజెల్ అలుగుతుంది. ఇంకోసారి నిన్ను కలవడానికి రానని అంటుంది.
లవ్ స్టోరీ ఉందా...
వెళ్లేముందు నీ జీవితంలో ఎవరైనా అమ్మాయి ఉందా..ఏదైనా లవ్‌స్టోరీ ఉందా మనును అడుగుతుంది ఏంజెల్. ఒకరిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించా...కానీ నాది వన్ సైడ్ లవ్ అని మను సమాధానం ఇస్తాడు. నేను ప్రేమించింది మా అమ్మను అని సమాధానమిస్తాడు. అమ్మ తప్ప తన జీవితంలో ఏ అమ్మాయి లేదని ఏంజెల్‌కు బదులిస్తాడు మను.
ఎవరైనా ప్రపోజ్ చేశారా?
నువ్వు ఇంత వరకు ఏ అమ్మాయిని ప్రేమించలేదా...నీకు ఎవరైనా ప్రపోజ్ చేశారా అంటూ మనుపై ప్రశ్నల వర్షం కురిపిస్తుంది ఏంజెల్. నువ్వు ఇంత అందంగా, ముద్దుగా ఉంటే వందల్లో ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి. కానీ నీ మూడీతనం, కోపానికి భయపడి అమ్మాయిలు చాలా మంది తమ మనసులోని మాటలను బయటపెట్టి ఉండరని ఏంజెల్ అంటుంది. కానీ మను మాత్రం సమాధానం చెప్పడు.
నా మీద నీ ఒపీనియన్ ఏంటి బావ అని మనును అడుగుతుంది ఏంజెల్. నేను నీకు బావను కాదని మను సమాధానమిస్తాడు. అయితే ఇప్పుడే అనుపమ అత్తయ్యకు ఫోన్ చేసి మను నాకు బావ అవుతాడో కాదో తేల్చుకుంటానని ఏంజెల్ చెబుతుంది. ఈ టాపిక్ ఆపేసి ఇక్కడి నుంచి వెళ్లిపోమని ఏంజెల్‌తో కోపంగా అంటాడు మను.
నిన్ను కలవను...
మను ప్రవర్తన కారణంగా డిసపాయింట్ అయిన ఏంజెల్ కోపంగా వెళ్లబోతూ కిందపడుతుంది. ఆమెకు చేయి అందించి లేపుతాడు. మీకు మీ క్యారెక్టర్‌కు ఓ దండం. జీవితంలో నిన్ను కలవనని మనుతో చెప్పి కోపంగా ఏంజెల్ వెళ్లిపోతుంది.
వసు ఎమోషనల్...
రిషిని గుర్తుచేసుకొని వసు ఎమోషనల్ అవుతుంది. మీరు ఎక్కడున్నారు. మీ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాని కన్నీళ్లు పెట్టుకుంటుంది. వసుధారను మహేంద్ర ఓదార్చుతాడు. నీ కోసమైనా రిషి తిరిగి వస్తాడని అంటాడు.
రిషి రావడం పక్కా. కానీ ఎప్పుడొస్తాడన్నది మాత్రం అంతుపట్టడం లేదని వసుధార అంటుంది. ఎంత ప్రయత్నించిన రిషి జాడ మాత్రం కనిపెట్టలేకపోతున్నామని మహేంద్ర అంటాడు. రిషి కోసం ఇలాగే వెతుకుదాం...ఏదో ఒకరోజు మన ప్రయత్నం ఫలించి రిషి అడ్రెస్ దొరుకుతుందని వసుధారతో అంటాడు మహేంద్ర.
రిషి ఎప్పటికీ రాడు...
రిషి ఎప్పటికి తిరిగిరాడని అప్పుడే ఆ రూమ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన శైలేంద్ర అంటాడు. రిషి బతికి ఉంటేనే కదా తిరిగిరావడానికి అని చెబుతాడు. మోసం చేసిన వాళ్లకు మంచి జరగదని వసుధారపై శాపాలు పెడతాడు శైలేంద్ర.
మీరు చేసిన మోసానికి రిషి అస్సలు దొరకకూడదని కోరుకుంటున్నానని శైలేంద్ర చెబుతాడు. ఒకవేళ రిషి తిరిగి వచ్చిన వాడిని పైకి పంపిస్తానని శైలేంద్ర వార్నింగ్ ఇస్తాడు. శైలేంద్ర మాటలతో కోపం పట్టలేక అతడి కాలర్ పట్టుకుంటాడు మహేంద్ర. రిషి కాలి గోరు కూడా టచ్ చేసే ధైర్యం శైలేంద్రకు లేదని వసుధార అంటుంది.
వసు ప్రేమ యాక్టింగ్...
వసుధార మాటలను నటన అంటూ కొట్టిపడేస్తాడు శైలేంద్ర. రిషిపై నువ్వు చూపుతున్న ప్రేమ కూడా నటనేనని వసుధారను అవమానిస్తాడు శైలేంద్ర. రిషిని తాను ఎప్పటికైన తిరిగి తీసుకొస్తానని శైలేంద్రతో ఛాలెంజ్ చేస్తుంది వసు.
చచ్చినవాడిని ఎలా తిరిగి తీసుకొస్తారని శైలేంద్ర సమాధానమిస్తాడు. అతడి మాటలతో వసుధార, మహేంద్ర కోపం పట్టలేకపోతారు. ఈ కోపమే నాకు కావాల్సింది. కోపంలో ఉంటేనే నేను మిమ్మల్ని దెబ్బకొట్టగలనని చెప్పి శైలేంద్ర అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
మను ఇరిటేట్...
వసుధార, మహేంద్రలాగే మనును కూడా ఇరిటేట్ చేయాలని శైలేంద్ర అనుకుంటాడు. మను కోసం అతడి క్యాబిన్‌కు వెళతాడు. తండ్రి టాపిక్ తీసుకొచ్చి మను మనసును నొప్పిస్తాడు శైలేంద్ర. వసుధారకు భర్త ఎక్కడున్నాడో తెలియదు. మహేంద్రకు కొడుకు ఎక్కడున్నాడో తెలియదు. నీకు తండ్రి ఎవరో తెలియదు అంటూ మనును అవమానిస్తాడు. శైలేంద్ర సన్నాఫ్ ఫణీంద్ర. మరి మను సన్నాఫ్ ఎవరు అంటూ తండ్రి పేరుతో మనును నానా మాటలు అంటాడు వైలేంద్ర.
రిషి స్థానంలోకి...
నేను వరస్ట్...కానీ నన్ను మోసం చేసిన మీరు చాలా వరస్ట్ అని అంటాడు. నీ తెలివితేటలతో నాలాంటివాళ్లను మోసం చేయడంలో కాదు నీ తండ్రిని వెతుక్కోవడంలో చూపించు అని మనుకు సలహా ఇస్తాడు శైలేంద్ర. తండ్రి ఎవరో తెలియకపోయినా...తల్లి నిన్ను ఆదరించకపోయినా నీకు ఈ అన్నయ్య ఉన్నాడు.
తమ్ముడిగా నిన్ను నేను దత్తత తీసుకుంటాను. రిషి ఎలాగు రాడు కాబట్టి వాడి ప్లేస్‌లోకి నిన్ను తీసుకొస్తానని అంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన వసుధార శైలేంద్రపై ఫైర్ అవుతుంది. కొంచెం కూడా బుద్దిలేదా హెచ్చరిస్తుంది. నోటికి ఏది వస్తే అది వాగొద్దు అని అంటుంది. ఆమె వార్నింగ్‌ను శైలేంద్ర లెక్కపెట్టడు.
వసుధార మాటలను లెక్కపెట్టకుండా నీ తండ్రి ఎవరో తెలుసుకో...లేదంటే నీ జీవితానికే అర్థం లేదంటూ మనుతో చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు శైలేంద్ర.