Guppedantha Manasu March 8th Episode: రిషికి అన్యాయం - మను ప్రేమలో వసు -తీరిన శైలేంద్ర ఎండీ కల
Guppedantha Manasu March 8th Episode: నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో వసుధార, మను పోస్టర్స్ చూసిన లెక్చరర్స్, స్టూడెంట్స్ ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నది నిజమేనని నమ్ముతారు. స్టూడెంట్స్‌కు రోల్ మోడల్‌గా ఉన్న మీరు ఇలాంటి తప్పుడు పనులు చేయడం ఏంటని వసుధారను నిలదీస్తారు.
Guppedantha Manasu March 8th Episode: వసుధార, మను క్లోజ్‌గా దిగిన ఫొటోలను కాలేజీ మొత్తం అంటిస్తాడు రాజీవ్. ఈ ఫొటోల ద్వారా వసుధార పరువు తీయడమే కాకుండా మను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేస్తాడు. ఈ ఫొటోలు అంటించింది మను అంటూ తప్పు మొత్తం అతడిపై నెట్టేసే ప్రయత్నం చేస్తాడు శైలేంద్ర. అనుపమతో పాటు కాలేజీ లెక్చరర్స్ కూడా మనునే తప్పు పడతారు. ఈ పోస్టర్స్ మీకు తెలియకుండా కాలేజీలోకి ఎలా వచ్చాయని మనును నిలదీస్తారు.
తప్పు చేసిన వసుధార...
మీ ఇద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉందంటూ వసుధార, మనులను లెక్చరర్స్ తప్పు పడతారు. తమ బంధాన్ని అనుమానించిన లెక్చరర్స్‌పై వసుధార ఫైర్ అవుతుంది. నేను కాలేజీ ఎండీ, మను బోర్డ్ మెంబర్. మేము ఏదో కాలేజీ పని మీద వెళ్లినప్పుడు గిట్టనివాళ్లు మాపై బురదజల్లడానికి ఈ ఫొటోలు తీశారని వసుధార ఫైర్ అవుతుంది.
మీరు చేసేది అంత చేసి మాపై ఎందుకు అరుస్తున్నారంటూ లెక్చరర్స్ వసుధారపై రివర్స్ ఎటాక్ చేస్తారు. స్టూడెంట్స్, కాలేజీ భవిష్యత్తు గురించి ఆలోచించే మీరు ఇలా తప్పు చేయడం బాగాలేదని వసుధారను నానా మాటలు అంటూ అవమానిస్తారు.
రిషి సంతాపసభ...
ఇదంతా అబద్ధమని వసుధార చెబుతుంది. అయినా వసుధార మాటలను లెక్చరర్స్, స్టూడెంట్స్ నమ్మరు. మీరు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో మాకు అర్థం కావడం లేదని వసుధారతో అంటారు. రిషి ఆత్మశాంతి కోసం సంతాప సభ ఏర్పాటుచేస్తే, నేను బతికి ఉన్నానంటే రిషి బతికి ఉన్నట్లే అని చెప్పి సంతాపసభను అడ్డుకున్నారు, రిషి ప్రాణామైతే ఇదేమిటి అని వసుధారను నిలదీస్తారు.
ఇప్పుడు రిషిపై వసుధారకు ఉన్న ప్రేమ ఏమైంది, చచ్చిపోయిందా, దారితప్పిందా చెప్పాలని వసుధారను ప్రశ్నిస్తారు. ఉన్నతమైన పదవుల్లో ఉంటూ ఇలాంటి తప్పుడు పనులు ఎలా చేస్తారు అంటూ మాటలతో వసుధారను అవమానిస్తారు. స్టూడెంట్స్ అందరికి మీరు రోల్‌మోడల్, మీ జీవితం చాలా మందికి స్ఫూర్తి, అలాంటి మీరే ఇలాంటి పనులు చేస్తే ఎలా అంటూ ఇష్టం వచ్చినట్లుగా లెక్చరర్స్ మాట్లాడటంతో వసుధార కన్నీళ్లు పెట్టుకుంటుంది.
మనుపై నింద...
వసుధార, మను మధ్య ఉన్న ప్రేమ నిజమని లెక్చరర్స్ స్టూడెంట్స్ కన్ఫామ్‌అవుతారు. వసుధార కోసమే మను యాభై కోట్లు ఇచ్చాడంటూ నిందలు వేస్తారు. బంగారం లాంటి రిషిని మోసం చేశారని, ఆయన గౌరవాన్ని, డీబీఎస్‌టీ కీర్తి ప్రతిష్టలకు భంగం తెచ్చిపెట్టారంటూ వసుధారపై ఫైర్ అవుతారు. ఎండీ పదవికి అర్హులు కాదని, ఆ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తారు. మీ లాంటి వాళ్ల చేతుల్లో కాలేజీ ఉంటే పతనం కావడం ఖాయమని చెబుతారు.
శైలేంద్ర సపోర్ట్...
వసుధార నిప్పు అని, ఆమె తప్పుచేసిందంటే తాను నమ్మనని శైలేంద్ర అంటాడు. వసుధారకు సపోర్ట్ చేసినట్లుగా మాట్లాడుతాడు. మను కావాలనే ఇదంతా చేశాడని స్టూడెంట్స్, లెక్చరర్స్‌ను నమ్మిస్తాడు. నువ్వు ఇంత నీచుడివని ముందే పసిగట్టాల్సిందని మనుపై ఫైర్ అవుతాడు. మను వల్లే వసుధార దోషిగా మారిందని చెబుతాడు. ఈ పోస్టర్స్ వెనుక మీరే ఉన్నారని అనుమానంగా ఉందని అంటారు. అందరూ కలిసి మనుదే తప్పని తేల్చేస్తారు.
ఎండీ పదవికి రాజీనామా...
వారి మాటలను నిజమని వసుధార నమ్ముతుంది. మీరు ఇలా నమ్మకద్రోహం చేస్తారని అనుకోలేదని అంటూ మను చెంప పగలగొడుతుంది. తాను ఎండీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటిస్తుంది వసుధార. రిషి సార్ గౌరవం నిలబెట్టడానికి, కాలేజీ పేరు ప్రతిష్టలకు భంగం కలగకుండా ఉండాలనే తాను రాజీనామా చేస్తున్నట్లు చెబుతుంది.
తనకు అవమానం జరిగిన ఈ కాలేజీలోకి ఇక ఎప్పటికీ అడుగుపెట్టనని వసుధార కోపంగా వెళ్లిపోతుంది. వసుధారకు నచ్చజెప్పేందుకు మహేంద్ర, అనుపమ ప్రయత్నిస్తారు. కానీ వసుధార వారి మాటలను పట్టించుకోదు. వసుధార నిర్ణయంతో శైలేంద్ర ఆనందపడతాడు. గట్టి దెబ్బ కొట్టావు నిన్ను వదలనని శైలేంద్రకు వార్నింగ్ ఇస్తాడు మను.
ఎండీ సీట్‌లో శైలేంద్ర...
వసుధార ఎండీ పదవికి రాజీనామా చేయడంతో ఆ బాధ్యతల్ని శైలేంద్ర చేపట్టేందుకు రెడీ అవుతాడు. ఎండీ సీట్‌లో కూర్చోవడానికి ముహూర్తం ఫిక్సవుతుంది.
పంతులు వచ్చి పూజలు పూర్తిచేసి శైలేంద్రను ఎండీసీట్‌లో కూర్చొమని అంటాడు. శైలేంద్ర ఎండీ కావడం ఇష్టం లేకపోవడంతో మహేంద్ర, అనుపమ సీరియస్‌గా ఉంటారు. ఎండీ సీట్‌పై చేయివేయగానే ఓ వైబ్రేషన్ ఫీల్ వచ్చి శైలేంద్ర ఆనందంగా ఫీలవుతాడు. నేను సాధించానని గట్టిగా ఆరుస్తాడు.
శైలేంద్ర పగటి కలలు...
శైలేంద్ర కలవరింతలు విని డ్రైవర్ కంగారుగా బ్రేక్ వస్తాడు. దాంతో శైలేంద్ర తూలి కిందకు పడబోతాడు. క లలో నుంచి మేల్కొంటాడు. శైలేంద్ర కలవరింతలు విని ధరణి కంగారు పడుతుంది. కల బాగున్నా తాను ఎండీ సీట్‌లో కూర్చోలేకపోయానని శైలేంద్ర అనుకుంటాడు. కలను చెడగొట్టినందుకు ధరణిపై ఫైర్ అవుతాడు శైలేంద్ర. మీరు కలలో సాధించింది రియల్‌గా జరగదని, పగటి కలలు నెరవేరవని ధరణి క్లాస్ ఇస్తుంది.
ఎండీ సీట్ కోసం ముహూర్తం...
పంతులుకు ఫోన్ చేసిన శైలేంద్ర ఎండీ సీట్‌లో కూర్చోవడానికి తనకు మంచి ముహూర్తం పెట్టాలని, దోషం లేకుండా పూజ చేయాలని చెబుతాడు. పూజలు వద్దని పంతులు చెప్పినా శైలేంద్ర వినడు. ఎండీ సీట్ కోసం శైలేంద్ర ఏదో కుట్ర చేశాడని ధరణి అనుమానపడుతుంది. వసుధారకు ఫోన్ చేసి హెచ్చరించాలని అనుకుంటుంది. కానీ ధరణి చేతుల నుంచి ఫోన్ లాక్కుంటాడు శైలేంద్ర.
వసుధార షాక్...
కాలేజీలో అంటించిన పోస్టర్స్ చూసి మహేంద్రం, అనుపమ కంగారు పడుతుంటారు. అప్పుడే వసుధార కాలేజీలోకి అడుగుపెడుతుంది. కాలేజీ నిండా తన పోస్టర్స్ అంటించడం చూసి షాకవుతుంది. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.