Guppedantha Manasu Today Episode: రిషి కాలేజీ ప్రతిష్ట దెబ్బతీసేందుకు ధర్మరాజు ప్లాన్ - దేవయానికి వసు వార్నింగ్
Guppedantha Manasu Today Episode: రిషి, వసుధార లైఫ్‌లోకి మరో కొత్త విలన్ ఎంట్రీ ఇచ్చాడు. రిషి కాలేజీకి తొలిసారి వచ్చిన స్పాట్ వాల్యుయేషన్ చెడగొట్టడానికి అతడు వేసిన స్కెచ్ సక్సెస్ అయ్యిందా లేదా అన్నది గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్‌లో తేలనుంది.
Guppedantha Manasu Today Episode: రిషి, వసుధార జీవితంలోకి మరో కొత్త విలన్ ఎంట్రీ ఇచ్చాడు. రిషి కాలేజీ ప్రతిష్టను దెబ్బతీయడానికి అతడు పెద్ద స్కెచ్ వేశాడు. అతడి పన్నాగంతో గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది.
దేవయానికి వసు వార్నింగ్...
కాలేజీ వాల్యుయేషన్ పనులతో బిజీగా ఉంటారు రిషి, వసుధార. ఆ పనులతో అలిసిపోయిన రిషి..వసుధార గదిలోనే పడుకుంటాడు. దాంతో అతడిని డిస్ట్రబ్ చేయని వసుధార హాల్‌లో నిద్రపోతుంది. ఆమె కళ్లు తెరవగానే ఎదురుగా దేవయాని ఉంటుంది. నీ స్థానం ఏమిటో కరెక్ట్‌గానే తెలుసుకున్నావంటూ సెటైర్ వేస్తుంది.
ఒకరి స్థానం స్థాయి గురించి తొందరపడి మాట్లాడకూడదంటూ దేవయానికి గట్టిగానే క్లాస్ ఇచ్చింది వసుధార. నా స్థానం రిషి మనసులో ఉంది అంటూ మాటలతోనే దేవయానికి బదులిచ్చింది. నేను నీకు స్పీడ్‌బ్రేక్ లాంటిదాన్ని అంటూ దేవయాని అనగా రిషికి కొన్ని నిజాలు తెలిస్తే ఎవరి స్థానాలు గల్లంతవుతాయో ఊహించుకోండి అంటూ మరోసారి దేవయానిపై వసు ఫైర్ అయ్యింది.
ధర్మరాజు ఎంట్రీ...
ఆ తర్వాత కాలేజీ వాల్యుయేషన్ పనులతో రిషి, వసుధార, జగతి, మహేంద్ర బిజీగా ఉండగా ధర్మరాజు అనే వ్యక్తి కాలేజీలోకి ఎంట్రీ ఇచ్చాడు. పేపర్ వాల్యుయేషన్‌ను సంక్రమంగా జరగకుండా అడ్డుకోవడానికే తాను వచ్చినట్లు ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతూ కనిపించాడు.
అవతలి వ్యక్తి ఎవరన్నది మాత్రం చూపించలేదు. స్పాట్ వాల్యుయేషన్‌కు ఇంఛార్జ్ అంటూ మహేంద్ర, రిషిలను పరిచయం చేసుకున్న అతడు ఇద్దరితో కలుపుగోలుగా మాట్లాడాడు. తప్పు దొరికే అవకాశం కోసం వెతుకుతూ కనిపించాడు.
డూప్లికేట్ కీ…
ఇంతలో మహేంద్ర జేబులో నుంచి స్పాట్ వాల్యుయేషన్ రూమ్‌కు సంబంధించి కీ కిందపడుతుంది. ఈ కీని మహేంద్ర చూసుకోలేదు. ఆ అవకాశాన్ని వాడుకోవాలని ఫిక్సయిన ధర్మరాజు తన దగ్గర ఉన్న సబ్బుపై కీ ముద్రను తీసుకొని హడావిడిగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత డూప్లికేట్ కీ తయారు చేసుకొని వస్తాడు.
స్పాట్ వాల్యుయేషన్ పేపర్స్ ధర్మరాజు ముందే రిషి, వసుధర సీక్రెట్ రూమ్‌లో పెట్టి లాక్ చేస్తారు. వారు వెళ్లిపోగానే తన దగ్గర ఉన్న డూప్లికేట్ కీతో రూమ్ లాక్ ఓపెన్ చేసిన ధర్మరాజు మూడ పేపర్స్ బండిల్స్ ను దొంగతనంగా తన బ్యాగ్‌లో వేసుకొని రూమ్‌కు లాక్ వేయకుండా వెళ్లిపోతాడు.
దొంగను కనిపెట్టిన జగతి...
సీక్రెట్ రూమ్ లాక్ ఓపెన్ చేసి ఉండటం గమనించిన జగతి, వసు టెన్షన్ పడతారు. రుషి, మహేంద్రలకు ఫోన్ చేసి పిలుస్తారు. ఆ తర్వాత సీక్రెట్ రూమ్ కీకి సబ్బు అంటి ఉండటం జగతి కనిపెడుతుంది. దాంతో ఆ దొంగతనం ఎవరో చేశారో తనకు తెలుసు అని రుషి అనడంతో నేటి ఎపిసోడ్ ముగిసింది. ధర్మరాజు అధర్మాన్ని రిషి ఎలా బయటపెట్టడన్నది రేపటి ఎపిసోడ్‌లో చూపించబోతున్నారు.