Guppedantha Manasu Today Episode: రిషి సమక్షంలో వసు బర్త్‌డే సెలబ్రేషన్స్ -మను ప్లాన్‌కు శైలేంద్ర మైండ్‌బ్లాక్
Guppedantha Manasu March 13th Episode: నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో వసుధార బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తాడు మను. రిషి లేని లోటు కనబడకుండా ఆ వేడుకకు వచ్చిన వారందరి చేత రిషి ముఖకవళికలతో మాస్క్ తయారు చేయించి తొడిగిస్తాడు మను. అతడి ప్లాన్‌కు వసుధార ఇంప్రెస్ అవుతుంది.
Guppedantha Manasu March 13th Episode: వసుధారకు సర్‌ప్రైజ్ బర్త్‌డే విషెస్ చెబుతారు కాలేజీ స్టూడెంట్స్. సర్‌ప్రైజ్‌లు, సెలబ్రేషన్స్ నచ్చని వసుధార ఆ స్టూడెంట్స్‌పై ఫైర్ అవుతుంది. ఈ సర్‌ప్రైజ్ బర్త్‌డే ప్లాన్ మనుదేనని అపోహపడి అతడికి క్లాస్ ఇస్తుంది. ఆ తర్వాత సర్‌ప్రైజ్ బర్త్‌డే ప్లాన్ మనుది కాదని స్టూడెంట్స్ ద్వారా తెలుసుకొని పశ్చాత్తాపపడుతుంది వసుధార. మనుకు సారీ చెబుతుంది.
మేము నమ్మిన వ్యక్తులు కొందరు మోసం చేయడం వల్లే అందరిని అనుమానించాల్సివస్తుందని అంటుంది. వసుధార తరఫున మనుకు మహేంద్ర కూడా క్షమాపణలు చెబుతాడు. తనతో పాటు వసుధారను ఓ చోటుకు రమ్మని అంటాడు మను. ఎక్కడికో చెప్పమనని మనును అడుగుతుంది వసుధార. కానీ మను మాత్రం సస్పెన్స్‌లో పెడతాడు. నేను చేసిన పని మీకు నచ్చకపోతే నా మొహం నీకు చూపించను. కాలేజీకి, మీకు దూరంగా వెళ్లిపోతానని అంటాడు.
వసుధార కళ్లకు గంతలు...
వసుధార కళ్లకు గంతలు కట్టి ఆమెను ఆడిటోరియం లోకి తీసుకెళతారు మను, మహేంద్ర. వసుధార బర్త్‌డే కోసం గ్రాండ్‌గా ఏర్పాట్లు చేస్తారు. ఈ వేడుకలోరిషి లేని లోటు కనబడకుండా చేసేందుకు మను కొత్త ప్లాన్ వేస్తాడు. ఆ బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు వచ్చిన వారందరి చేత రిషి ఫేస్ మాస్కులను తొడుగుతాడు.
ఫేస్ మాస్క్ ప్లాన్ తనదేనని మను అంటాడు. రిషి లేకుండా ఏ సెలబ్రేషన్స్ చేసుకోను అన్నారుగా...ఇప్పటికిప్పుడు రిషిని నేను తీసుకురాకపోయినా...అతడు ఉన్నాడనే ఫీలింగ్ మీకు కలిగించడానికే అందరి చేత రిషి మాస్క్ తొడిగించానని మను అంటాడు. మను ప్లాన్‌తో పాటు బర్త్‌డే సెలబ్రేషన్స్ చూసి వసుధార ఎమోషనల్ అవుతుంది.
శైలేంద్రపై సెటైర్స్...
నీ సంతోషం కోసమే మను చేసిన ప్లాన్ ఇదని ఫణీంద్ర అంటాడు. రిషి కనిపించకుండా పోయినప్పటి నుంచి నీ ముఖంలో కన్నీళ్లు తప్ప ఆనందం కనిపించడం లేదని, ఆ బాధను పోగొట్టడానికే బర్త్‌డేను సెలబ్రేట్ చేస్తున్నామని వసుధారకు చెబుతాడు ఫణీంద్ర. ఈ ఫేస్ మాస్క్ ఐడియా మీదేనా అంటూ శైలేంద్రపై సెటైర్స్ వేస్తుంది ధరణి.
రిషి కనిపించకుండా పోయినా వసుధార కాలేజీని, తన బాధ్యతలను విస్మరించలేదని స్టూడెంట్స్ అందరికి చెబుతాడు మను. ఫణీంద్ర, రిషి నుంచి వసుధార వరకు అందరు చేసిన కృషి వల్లే డీబీఎస్‌టీ కాలేజీ టాప్ పొజిషన్‌కు చేరుకుందని అంటాడు మను.
మాట వరుసకు కూడా తన పేరు చెప్పకపోవడంతో శైలేంద్ర కోపంతో రగిలిపోతాడు. కాలేజీకి ఎన్నో కష్టాలు ఎదురైన ఓర్పు, సహనంతో వాటన్నింటిని అధిగమిస్తూ వసుధార ముందుకు సాగుతుందని మను అంటాడు.
వసుధార ఇంప్రెస్...
మను స్పీచ్‌కు వసుధార పూర్తిగా ఇంప్రెస్ అవుతుంది. మహేంద్ర, ఫణీంద్రతో పాటు ఏంజెల్ కూడా వసుధారపై ప్రశంసలు కురిపిస్తారు. రిషి ఫేస్ మాస్క్ ధరించి ఆ వేడుకకు రాజీవ్ కూడా వస్తాడు. వసుధార గురించి మను ఇచ్చిన స్పీచ్ విని కోపంతో రగిలిపోతుంటాడు. వసుధారను స్టూడెంట్స్, లెక్చరర్స్ అందరూ పొగుడుతుండటంతో దేవయాని తట్టుకోలేకపోతుంది.
చివరలో శైలేంద్రకు షాకిస్తాడు మను. వసుధారను శైలేంద్ర పొగిడినట్లుగా వీడియో క్రియేట్ చేస్తాడు. వసుధార చాలా గ్రేట్, పట్టుదల గల వ్యక్తి. స్టూడెంట్ స్టాయి నుంచి ఎండీగా ఎదిగిందని ఆ వీడియోలో వసుధారను తెగ పొగుడుతాడు శైలేంద్ర. ఆ వీడియో చూసి మీరు చాలా మారిపోయారని భర్తతో అంటుంది ధరణి. రిషి తిరిగి వస్తాడన్న నమ్మకం ఎప్పటికైనా నిజం కావాలని అందరూ కోరుకుంటారు.
దేవయానికి పంచ్...
వసుధార గురించి మాట్లాడమని దేవయానిని కోరుతాడు మను. కానీ ఈ ఆనందసమయంలో తనకు మాటలు రావడం లేదని తెలివిగా తప్పించుకుంటుంది దేవయాని. ఇంట్లో ఊరికే ఎప్పుడు వాగుతుంటావు. ఇప్పుడు మాత్రం మాట్లాడమంటే ఎందుకు వద్దంటున్నావని దేవయానిపై ఫణీంద్ర కోప్పడతాడు. వీడియో ప్రొజెక్టర్‌లో రిషి ఫొటో కనిపించేలా చేస్తాడు మను. రిషి సమక్షంలో వసుధార బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తాడు. ఆ సెలబ్రేషన్స్ చూసి వసుధార ఆనందపడుతుంది.
రాజీవ్ ప్లాన్ ఫెయిల్….
వసుధారకు కేక్ తినిపించకుండా దూరంగా ఉంటుంది దేవయాని. కానీ ఆమెను ధరణి ఇరికిస్తుంది. మీరు కూడా కేక్ తినిపించాలని పట్టుపడుతుంది. ఫణీంద్ర కూడా కోరడంతో దేవయాని మరో మార్గం లేక వసుధారకు బర్త్‌డే విషెస్ చెప్పి కేక్ తినిపిస్తుంది. శైలేంద్ర కూడా వసుధారకు కేక్ తినిపించి శుభాకాంక్షలు చెబుతాడు. వసుధారకు మను కేక్ తినిపించడం చూసి రాజీవ్ కోపం పట్టలేకపోతాడు. స్టూడెంట్ మాదిరిగా ముఖంపై రిషి మాస్క్ పెట్టుకొని వచ్చి వసుధారకు కేక్ తినిపించాలని రాజీవ్ అనుకుంటాడు. అతడి ప్లాన్‌ను మను అడ్డుకుంటాడు. రాజీవ్ చేతిలోని కేక్‌ను కిందపడేలా చేస్తాడు. దాంతో రాజీవ్ కోపం మరింత పెరుగుతుంది.