Guppedantha Manasu March 12th Episode: మ‌నును అపార్థం చేసుకున్న వ‌సు - శైలేంద్ర‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన తండ్రి-guppedantha manasu march 12th episode vasudhara misunderstood manu about her birthday celebrations ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Guppedantha Manasu March 12th Episode Vasudhara Misunderstood Manu About Her Birthday Celebrations

Guppedantha Manasu March 12th Episode: మ‌నును అపార్థం చేసుకున్న వ‌సు - శైలేంద్ర‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన తండ్రి

Nelki Naresh Kumar HT Telugu
Mar 12, 2024 07:19 AM IST

Guppedantha Manasu March 12th Episode: నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌లో మ‌ను నిర్వ‌హించ‌నున్న వ‌సుధార బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌కు వెళ్ల‌కూడ‌ద‌ని శైలేంద్ర‌, దేవ‌యాని నిర్ణ‌యించుకుంటారు. లేనిపోని కార‌ణాలు చెప్పి బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్‌కు మీరు రాక‌పోతే ఊరుకునేది లేద‌ని ఫణీంద్ర వార్నింగ్ ఇస్తాడు.

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌
గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌

Guppedantha Manasu March 12th Episode: వ‌సుధార బ‌ర్త్‌డేను గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేయాల‌ని మ‌హేంద్ర‌, మ‌ను నిర్ణ‌యించుకుంటారు. కానీ వ‌సుధార అందుకు నో చెబుతుంది. వ‌సుధార ప్ర‌వ‌ర్త‌న‌ను మ‌హేంద్ర త‌ప్పు ప‌డ‌తాడు.దాంతో వ‌సుధార ఎమోష‌న‌ల్ అవుతుంది. త‌న మ‌న‌సులోని బాధ‌ను రిషి ఫొటోకు చెప్పుకుంటూ ఆవేద‌న‌కు లోన‌వుతుంది. ఎవ‌రికి త‌న మ‌న‌సు అర్థం కావ‌డం లేద‌ని, అంద‌రూ త‌న‌నే త‌ప్పు ప‌డుతున్నార‌ని బాధ‌ప‌డుతుంది.

మీరు నా ప‌క్క‌న ఉంటే ఈ ప్ర‌పంచాన్ని జ‌యించిన‌ట్లుగా అనిపిస్తుంద‌ని రిషి ఫొటో చూస్తూ చెబుతుంది. మీరు న‌వ్వినా.... కొప్ప‌డినా.... చాలా అందంగా ఉంటుంద‌ని అంటుంది. మీరే నా ప్రాణం, సంతోషం రిషి ఫొటోతో చెబుతుంది వ‌సుధార‌. మీరు నా ప‌క్క‌న లేకుండా బ‌ర్త్‌డేను సెల‌బ్రేట్ చేసుకోవ‌డం ఇష్టం లేద‌ని వ‌సుధార అంటుంది. వ‌సుధార‌. మీరు తొంద‌ర‌గా వ‌స్తేనే నా మ‌న‌సు కుదుట‌ప‌డుతుంద‌ని ఉద్వేగానికి లోన‌వుతుంది.

మ‌హేంద్ర ఇన్విటేష‌న్‌...

వ‌సుధార బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌కు అన్న‌య్య ఫ‌ణీంద్ర‌ను ఇన్వైట్ చేస్తాడు మ‌హేంద్ర‌. బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌కు వ‌సుధార ఒప్పుకోలేద‌ని, ఆమెకు తెలియ‌కుండా మ‌ను ....వ‌సుధార బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్ ఈవెంట్‌ను ప్లాన్ చేశాడ‌ని చెబుతాడు. వ‌సుధార బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌కు భార్య దేవ‌యానితో పాటు కొడుకు శైలేంద్ర‌, కోడ‌లు ధ‌ర‌ణితో క‌లిసి వ‌స్తాన‌ని మ‌హేంద్ర‌కు మాటిస్తాడు ఫ‌ణీంద్ర‌.

శైలేంద్ర‌కు క్లాస్‌...

శైలేంద్ర‌, దేవ‌యానిల‌కు వ‌సుధార బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ గురించి చెబుతాడు ఫ‌ణీంద్ర‌. తండ్రి మాట‌లు విని శైలేంద్ర షాక‌వుతాడు. ఈ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌కు తాము రామ‌ని శైలేంద్ర‌, దేవ‌యాని చెబుతారు. రిషి క‌నిపించ‌డం లేద‌నే బాధ క‌నీసం కొంచెం కూడా లేకుండా ఈ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ ఏమిటో అంటూ నోటికి ప‌ని చెబుతుంది దేవ‌యాని. వ‌సుధార బ‌ర్త్‌డేను సెల‌బ్రేష‌న్స్ చేయ‌డానికి మ‌ను ఎవ‌డు అంటూ శైలేంద్ర కూడా అన‌బోతాడు.

కొడుకు ఏం చెబుతాడో ఫ‌ణీంద్ర ముందే గ్ర‌హిస్తాడు. రిషి క‌నిపించ‌కుండాపోయాడ‌నే బాధ‌లో వ‌సుధార ఉంది. ఆ బాధ నుంచి ఆమెను బ‌య‌ట‌కు తీసుకొద్దామ‌నే ఆలోచ‌న నీకు కొంచెం కూడా లేదు. నువ్వు చేయాల్సిన ప‌నులు మ‌ను చేస్తున్నాడ‌నే ఇంగిత‌జ్ఞానం కొంచెం కూడా నీకు లేదంటూ కొడుకుకు క్లాస్ ఇస్తాడు.

మీరు రేపు కాలేజీకి వ‌స్తున్నారు అంతే. లేనిపోని కార‌ణాలు చెప్పి వ‌సుధార సెల‌బ్రేష‌న్స్‌కు రాక‌పోతే ఊరుకునేది లేద‌ని శైలేంద్ర‌, దేవ‌యానిల‌కు ఫ‌ణీంద్ర వార్నింగ్ ఇస్తాడు. దేవ‌యాని ఏదో మాట్లాడ‌బోతుంటే ఫ‌ణీంద్ర ఆమెను మాట్లాడ‌నివ్వ‌డు. నీ మాట‌లు వినాల్సిన అవ‌స‌రం లేద‌ని అంటాడు.

వ‌సుధార‌కు స‌ర్‌ప్రైజ్‌...

క్లాస్ రూమ్‌లో స్టూడెంట్స్ కొట్టుకుంటున్నార‌ని కంగారుగా వ‌సుధార ద‌గ్గ‌ర‌కు వ‌స్తాడు ఓ స్టూడెంట్‌. అత‌డి మాట‌లు నిజ‌మ‌ని వ‌సుధార అనుకుంటుంది. గొడ‌వ‌ను ఆపేందుకు క్లాస్ రూమ్‌కు వ‌స్తుంది. వ‌సుధార రాగానే గొడ‌వ‌ను ఆపేసిన స్టూడెంట్స్ ఆమెకు బ‌ర్త్‌డే విషెస్ చెబుతారు. స‌ర్‌ప్రైజ్ కోస‌మే ఇదంతా చేశామ‌ని అంటారు. ఆ స్టూడెంట్స్‌పై వ‌సుధార సీరియ‌స్ అవుతుంది. అంద‌రికి క్లాస్ ఇస్తుంది.

వ‌సుధార అపోహ‌...

మ‌నునే ఈ స‌ర్‌ప్రైజ్ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ ప్లాన్ చేశాడ‌ని అపోహ ప‌డిన వ‌సుధార అత‌డిపై ఫైర్ అవుతుంది. మీరు చేస్తోన్న ప‌నుల‌కు మీతో మాట్లాడాలంటేనే చిరాకు వేస్తుంద‌నిమ‌నుతో అంటుంది.

మీరు ఏం ఆశించి కాలేజీకి వ‌చ్చార‌ని, మీ మ‌న‌సులో ఏదో దురుద్దేశం ఉంది, ఆ మ‌ర్మ ఏమిటో చెప్పాల‌ని మ‌నును నిల‌దీస్తుంది వ‌సుధార‌. ఎండీ సీట్ కోస‌మే ఇదంతా చేస్తున్నారు క‌దా అని మ‌నుతో అంటుంది వ‌సుధార‌. నాకు ఏ ప‌ద‌వుల మీద ఆశ లేద‌ని మ‌ను ఎంత చెప్పిన వ‌సుధార న‌మ్మ‌దు.

ఎవ‌రు ఏమ‌నుకున్న ప‌ర‌వాలేదు కానీ నాకు ఈ బ‌ర్త్‌డేను సెల‌బ్రేట్ చేసుకోవ‌డం ఇష్టం లేద‌ని వ‌సుధార త‌న నిర్ణ‌యాన్ని అంద‌రి ముందు చెప్పేస్తుంది. మీకు ఎండీ సీట్ కావాలంటే ఇలా ఎమోష‌న‌ల్ బ్లాక్ మెయిల్ చేయ‌కుండా న‌న్ను డైరెక్ట్‌గా అడ‌గితే ఇచ్చేస్తాన‌ని చెప్పి కోపంగా క్యాబిన్‌కు వెళ్లిపోతుంది.

అనుప‌మ కంగారు...

మ‌నుకు వ‌సుధార క్లాస్ ఇవ్వ‌డం దూరం నుంచి మ‌హేంద్ర‌, అనుప‌మ చూస్తారు. ఇలాంటి గొడ‌వ ఏదో జ‌రుగుతుంద‌ని నేను ముందే చెప్పానుగా నువ్వు విన‌లేదు అని మ‌హేంద్ర‌పై ఫైర్ అవుతుంది అనుప‌మ‌. నీ వ‌ల్ల మ‌ను త‌ల‌దించుకోవాల్సివ‌చ్చింద‌ని అనుప‌మ ఎమోష‌న‌ల్ అవుతుంది. సొంత మ‌నిషికి ఇబ్బంది క‌లిగిన‌ట్లు మ‌ను విష‌యంలో నువ్వు ఎందుకు ఫీల‌వుతున్నావ‌ని, నీ మ‌న‌సులో కంగారు, క‌ళ్ల‌లో బాధ క‌నిపిస్తుంద‌ని అనుప‌మ‌తో అంటాడు మ‌హేంద్ర‌.

నేను ఏం అడుగుతున్నాను నువ్వేం చెబుతున్నావు. వ‌సుధార‌కు ఇష్టం లేకుండా బ‌ర్త్‌డేను సెల‌బ్రేట్ చేయాల‌ని ఎందుకు అనుకున్నావ‌ని నేను అడిగితే నువ్వుం ఏదో మాట్లాడుతున్నావ‌ని మ‌హేంద్ర‌పై కోప్పుడుతుంది అనుప‌మ‌.

మ‌ను చెసింది త‌ప్ప‌యితే...

వ‌సుధార‌ది బాధ కాదు దుఃఖం అని మ‌హేంద్ర‌తో అనుప‌మ అంటుంది. ఆ దుఃఖాన్ని అంద‌రం దాటి వ‌చ్చామ‌ని, జ‌గ‌తి చ‌నిపోయిన‌ప్పుడు నేను ఇలాంటి బాధ‌లోనే ఉన్నాన‌ని, న‌న్ను ఆ బాధ నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు రిషి, వ‌సుధార ఇలాంటి ప్ర‌య‌త్నాలే చేశార‌ని, ఇప్పుడు మ‌ను చేసింది త‌ప్పు అయితే అప్పుడు రిషి, వ‌సుధార చేసింది త‌ప్పే అని మ‌హేంద్ర బ‌దులిస్తాడు.

స్టూడెంట్స్ సారీ...

వ‌సుధార కోపంగా క్యాబిన్‌లో ఉండ‌గా స్టూడెంట్స్ వ‌చ్చి ఆమెకు సారీ చెబుతారు. స‌ర్‌ప్రైజ్ ప్లాన్ త‌మ‌దేన‌ని, మ‌నుకు ఈ స‌ర్‌ప్రైజ్ సెల‌బ్రేష‌న్స్‌తో ఎలాంటి సంబంధం లేద‌ని స్టూడెంట్స్ అంటారు. వారి మాట‌లు విని వ‌సుధార ప‌శ్చాత్తాప‌ప‌డుతుంది.

వ‌సుధార క్ష‌మాప‌ణ‌లు...

మ‌నును వెతుక్కుంటూ వ‌చ్చి అత‌డికి సారీ చెబుతుంది వ‌సుధార‌. అవ‌స‌రంగా ఏదేదో ఊహించి మిమ్మ‌ల్ని త‌ప్పుప‌ట్టాను. మీమీద అరిచాన‌ని అంటుంది. మీ విష‌యంలో ముందు నుంచి ఇలాగే జ‌రుగుతుంద‌ని, నేను మిమ్మ‌ల్ని మొద‌టి నుంచి ప్ర‌తి విష‌యంలో అపార్థం చేసుకుంటూనే వ‌స్తున్నాన‌ని మ‌నుతో చెబుతుంది వ‌సుధార‌.

మ‌మ్మ‌ల్ని కొంద‌రు వ్య‌క్తులు న‌మ్మించి మోసం చేశార‌ని, వారి వ‌ల్లే మీ విష‌యంలో కూడా అలాగే అపార్థం చేసుకోవాల్సివ‌స్తుంద‌ని మ‌నుతో అంటుంది వ‌సుధార‌. నేను ఏం చేయాలో, చేయ‌కూడ‌దో అనే విష‌యంలో క్లారిటీ ఉంద‌ని, నా విష‌యంలో మీరు ఎలాంటి భ‌యాలు పెట్టుకోవ‌ద్ద‌ని వ‌సుధార‌కు మాటిస్తాడు మ‌ను. అక్క‌డితో నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ ముగిసింది.

IPL_Entry_Point