Jyothi Rai: పద్మశ్రీ అవార్డు గ్రహీతకు జ్యోతిరాయ్ ఆర్థిక సహాయం - గుప్పెడంత మనసు జగతిపై నెటిజన్ల ప్రశంసలు
Jyothi Rai: పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెర మొగులయ్యకు జ్యోతిరాయ్ ఆర్థిక సహాయాన్ని అందజేసింది. ఈ వీడియో ద్వారా తనపై సోషల్ మీడియాలో వస్తోన్న విమర్శలపై జ్యోతిరాయ్ రియాక్ట్ అయ్యింది.
Jyothi Rai: గుప్పెడంత మనసు సీరియల్‌లో జగతి పాత్రతో తెలుగు సీరియల్ ఫ్యాన్స్‌కు చేరువైంది జ్యోతిరాయ్. హీరో రిషికి తల్లిగా సెంటిమెంట్ రోల్‌లో కనిపించింది. కొడుకు ప్రేమ, అనురాగానికి దూరమై ఎన్నో కష్టాలు ఎదుర్కొనే మహిళగా తన యాక్టింగ్‌తో అభిమానుల మనసుల్ని కదిలిచింది. సీరియల్‌లోనే కాదు రియల్ లైఫ్‌లో కూడా తన మంచి మనసును చాటుకున్నది జ్యోతిరాయ్.
మొగిలయ్యకు ఆర్థిక సాయం...
ఆర్థిక ఇబ్బందులతో కష్టాలు పడుతోన్న పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెర మొగులయ్యకు ఆర్థిక సహాయం అందజేసింది జ్యోతిరాయ్. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. అక్షయ తృతీయ రోజు కిన్నెర మొగిలయ్యకు యాభై వేల రూపాయలు సాయాన్ని అందించినట్లు వెల్లడించింది.
నా మనసు కలిచివేసింది...
మొగులయ్యను కలిసి ఆయనతో ముచ్చటిస్తోన్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది జ్యోతిరాయ్. మొగిలయ్య అర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నాడనే వార్త నా మనసును కలిచివేసింది. నేను ఎదుర్కొంటున్న సవాళ్లను పక్కనపెట్టి ఆయనకు నా చేతనైనా సాయం చేయాలని నిర్ణయించుకున్నా. నేను చేసిన ఈ సాయం ఆయన కళకు కూడా తోడ్పాటుగా ఉంటుందని భావిస్తున్నా. భవిష్యత్తులో మొగిలయ్యకు మరింత సహకారం అందించాలనుకుంటున్నా అని ఇన్‌స్టాగ్రామ్‌లో జ్యోతిరాయ్ పోస్ట్ పెట్టింది. కిన్నెర మొగిలయ్యకు సాయం చేసి తన గొప్ప మనసును చాటుకోన్న జ్యోతిరాయ్‌ని నెటిజన్లతో పాటు అభిమానులు అభినందిస్తోన్నారు.
ట్రోల్స్‌పై రియాక్ట్...
అంతే కాకుండా మొగులయ్యకు సాయం చేసిన వీడియో ద్వారా తనపై కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో వస్తోన్న పుకార్లకు చెక్ పెట్టింది జ్యోతిరాయ్. జ్యోతిరాయ్ అశ్లీల వీడియోలు లీక్ అయ్యాయంటూ కొన్ని వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్నాయి. వాటిపై తనదైన శైలిలో జ్యోతిరాయ్ రియాక్ట్ అయ్యింది.
చిల్లరగాళ్లు చేస్తోన్న పని ఇది...
మొగులయ్య సాయం చేసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన జ్యోతిరాయ్..ఈ వీడియోను వైరల్ చేసే ధైర్యం మీకు ఉందా...ఇది ఫేక్ కాదు రియల్ వీడియో అంటూ పేర్కొన్నది. చదువు సంస్కారం లేని కొంతమంది చిల్లరగాళ్లు ఫేక్ వీడియోలతో తన వ్యక్తిగత ఇమేజ్‌ను దెబ్బతీయాలని చూస్తున్నారని జ్యోతిరాయ్ అన్నది. అసత్యాలతో నా మీద చీకట్లు కుమ్మరించిన జ్యోతిలా వెలిగిపోతాను. ఆ చీకట్లే నాలోని వెలుగును మరింత ప్రజ్వలింపజేస్తాయి. నా నిరాశల నుంచే నేను ఓ ఫీనిక్స్ పక్షిలా పైకి ఎగురుతాను అంటూ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
తెలుగు డైరెక్టర్‌తో...
ఇటీవలే గుప్పెడంత మనసు సీరియల్‌లో జ్యోతి రాయ్ క్యారెక్టర్ ముగిసింది. ఆమెను శత్రువులు చంపేసినట్లుగా చూపించి క్యారెక్టర్‌ను ఎండ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఏ మాస్టర్ పీస్ పేరుతో సూపర్ హీరో మూవీ చేస్తోంది జ్యోతిరాయ్. ఈ మూవీ డైరెక్టర్ సుకు పూర్వజ్‌తో జ్యోతిరాయ్ రిలేషన్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వారి ఫొటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్నాయి. తన పేరును జ్యోతి పూర్వజ్‌గా మార్చుకున్నది జ్యోతిరాయ్.