Guppedantha Manasu Serial: శైలేంద్ర శాడిజం పీక్స్ - వసుధార ఎండీ పదవికి ఎసరు - రిషి రీఎంట్రీ ఎప్పుడంటే?
Guppedantha Manasu Serial: గుప్పెడంత మనసు జూన్ 8 ఎపిసోడ్‌లో కాలేజీకి తనిఖీ చేయడానికి వచ్చిన ఆఫీసర్స్‌కు వసుధార, మనులపై కంప్లైంట్ ఇస్తాడు శైలేంద్ర. మరోవైపు రిషి కోసం వసుధార ఇచ్చిన పేపర్ ప్రకటనను చూసి ఆమెపై మినిస్టర్ ఫైర్ అవుతాడు.
Guppedantha Manasu Serial: మను, వసుధారలను టార్చర్ పెట్టి సంబరపడుతుంటాడు శైలేంద్ర. తన జాతకం బాగుందని మురిసిపోతుంటాడు. శైలేంద్ర చేసిన తప్పు తండ్రి ఫణీంద్రకు తెలుస్తుంది. కొడుకును చెడామడా వాయిస్తాడు. బుద్దిలేని వెధవ అంటూ కొడుకును దులిపేస్తాడు. మంచిగా ఉండు, మంచిగా మాట్లాడు...లేదంటే అన్ని మూసుకొని మూలన పండుండు అని కొడుకుకు వార్నింగ్ ఇస్తాడు. మనిషి లక్షణాలు నీలో ఒక్కటి కూడా లేవని శైలేంద్రను హెచ్చరిస్తాడు ఫణీంద్ర.
దేవయాని సపోర్ట్...
కొడుకును ఫణీంద్ర తిట్టడం దేవయాని సహించలేకపోతుంది. తన కొడుకు ఏ తప్పు చేయలేదని సపోర్ట్ చేయబోతుంది. దేవయానిని కూడా తప్పుపడతాడు ఫణీంద్ర. ఎన్ని సార్లు చెప్పిన మీరు మాత్రం మారడం లేదని..మీ కంటే పశువులే నయం అని శైలేంద్ర, దేవయాని ఇద్దరికి కలిపి క్లాస్ ఇస్తాడు ఫణీంద్ర.
శైలేంద్ర శాడిజం...
ఫణీంద్ర వెళ్లిపోగానే అసలు నువ్వు ఏం చేశావని కొడుకును అడుగుతుంది దేవయాని. వసుధార పేపర్‌లో ఇచ్చిన ప్రకటనను చూసి ఆ నంబర్‌కు ఫోన్ చేసి ఎలా టార్చర్ పెట్టింది తల్లితో చెబుతాడు శైలేంద్ర. వసుధార, మను ఇద్దరితో ఆడుకున్నాడనని ఆనందపడతాడు. కొడుకు శాడిజం చూసి దేవయాని కూడా సంతోషపడుతుంది.
లోకాన్ని జల్లెడ పట్టి...
రిషిని తల్చుకొని వసు ఎమోషనల్ అవుతుంది. మీరు లేని జీవితం శూన్యం..ఈ కన్నీళ్లకు ఎప్పుడు ముగింపు పడుతుందని రిషి ఫొటో చూస్తూ బాధపడుతుంది. లోకాన్ని జల్లెడ పట్టి అయినా మీ ఆచూకీ కనిపెడతానని ప్రతిజ్ఞ చేస్తుంది. మన ప్రేమ ఈ లోకానికి ఓ పాఠం.. రిషిధార అంటే ప్రేమకు చిహ్నం అని వసుధార అనుకుంటుంది. మన బంధమే మనల్ని ఒకటి చేస్తుంది. మన ప్రేమను ఈ లోకానికి చాటిచెబుతుంది అని ఫొటో చూస్తూ చెబుతుంది.
డీబీఎస్‌టీ కాలేజీపై చాడీలు...
రిషి చనిపోయాడు కాబట్టి అతడు తిరిగి రావడం కష్టం అని శైలేంద్ర అనుకుంటాడు. వసుధార ఏదైనా తిరకాసు పెట్టి కాలేజీలోనే ఉండిపోతే ఎండీ కావాలనే తన కల తీరదని శైలేంద్ర అనుకుంటాడు. వసుధారను టార్చర్ పెట్టి కాలేజీ నుంచి వెళ్లిపోయేలా చేయాలని ఫిక్సవుతాడు. అప్పుడు కాలేజీని తనిఖీ చేయడానికి ఆఫీసర్స్ వస్తారు. వారిని కాలేజీ బయటే కలిసిన శైలేంద్ర కాలేజీ గురించి లేనిపోని చాడీలు చెబుతాడు. కాలేజీలో చాలా సమస్యలు ఉన్నాయని, సరైన వసతులు లేవని అంటాడు. ఈ విషయమై ఎండీకి కంప్లైంట్ ఇచ్చిన పెడచెవిన పెట్టిందని, రివర్స్ తనకే వార్నింగ్ ఇచ్చిందని వసుధారపై కూడా కూడా వారికి కంప్లైంట్ ఇస్తాడు.
మను, మహేంద్రపై కంప్లైంట్స్...
తనకు నమ్మకస్తుడైన ఓ స్టూడెంట్ ద్వారా కాలేజీ గురించి తాను చెప్పిన మాటలను నిజమని తనిఖీ అధికారులు నమ్మేలా చేశాడు శైలేంద్ర. అసలు వసుధార బోర్డ్ మీటింగ్‌లు పెట్టదని, బోర్డ్ మెంబర్స్ కూడా ఏం పట్టనట్లుగా ఉంటారని అంటాడు. మను, మహేంద్రపై కూడా కంప్లైంట్స్ ఇస్తాడు. కాలేజీకి ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వద్దని తనిఖీ అధికారులకు చెబుతాడు వైలేంద్ర. శైలేంద్ర మాటలు నమ్మి కాలేజీకి ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వరు ఆ ఆఫీసర్స్. అది తెలిసి వసుధార షాకవుతుంది. ఆ ఆఫీసర్స్‌కు ఫోన్ చేసి అడుగుతుంది. కానీ ఇప్పుడు ఏం చేయలేమని వారు చేతులెత్తేస్తారు.
మను...మహేంద్ర షాక్...
ఎగ్జామినేషన్ సెంటర్స్ లిస్ట్‌లో నుంచి తమ కాలేజీ పేరు తీసేయడం చూసి మను, మహేంద్ర షాకవుతాడు. తమకు ఇది పెద్ద అవమానం అని అంటారు. మినిస్టర్‌కు ఫోన్ చేసి సాయం అడుగుతాడు మహేంద్ర. కానీ మినిస్టర్ కూడా తాను ఏం చేయలేనని అంటాడు.
మినిస్టర్ ఫైర్...
కాలేజీకి మినిస్టర్ వస్తాడు. రిషి కనిపించడం లేదని వసుధార ఇచ్చిన పేపర్ ప్రకటనపై ఫైర్ అవుతాడు. రిషి చనిపోతే పేపర్‌లో ప్రకటన ఎలా ఇస్తావని వసుధారను నిలదీస్తాడు. రిషి చనిపోయాడా లేదా ఫణీంద్ర, మహేంద్రలను అడుగుతాడు మినిస్టర్. చనిపోయాడని వాళ్లు సమాధానం చెబుతారు. రిషి చనిపోయిన మాట నిజమని, కానీ వసుధార మాత్రం నమ్మడం లేదని మినిస్టర్‌తో అంటాడు శైలేంద్ర. రిషి మీద ఉన్న ప్రేమతో అతడు బతికి లేడనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతుందని ఆమెపై తన మనసులో ఉన్న ద్వేషం మొత్తం బయటపెడతాడు.
వసుధారకు మతిభ్రమించింది...
రిషి దూరమైనప్పటి నుంచి వసుధార వింతగా ప్రవర్తిస్తుందని, మేము ఎంత చెప్పిన వినడం లేదని అంటాడు. వసుధారకు మతి భ్రమించిందని స్టూడెంట్స్ ఫీలవుతున్నారని శైలేంద్ర చెబుతాడు. శైలేంద్ర మాటలను నిజమని మినిస్టర్ నమ్ముతాడు. వసుధార తీరును తప్పు పడతారు. వసుధార పేపర్‌లో ప్రకటన ఇస్తోన్న చూస్తూ అడ్డుకోలేకపోయినందుకు మనుకు క్లాస్ ఇస్తాడు మినిస్టర్.
ఎండీగా అన్‌ఫిట్...
ఎండీగా వసుధార తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించడం లేదని మినిస్టర్ అపార్థం చేసుకుంటాడు. వసుధార చేసిన తప్పుల వల్లే కాలేజీకి ఎగ్జామినేషన్ సెంటర్ మిస్సయిందని వసుధారతో అంటాడు మినిస్టర్. వసుధార మాత్రం రిషి బతికే ఉన్నాడని మినిస్టర్‌తో వాదిస్తుంది. రిషి చనిపోయాడు అనడానికి పోలీసుల దగ్గర సరైన ఆధారాలు లేవని అంటుంది. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.