Guppedantha Manasu: శైలేంద్ర పరువు తీసిన భార్య - మనుపై రౌడీల ఎటాక్ - రంగాను అవమానించిన సరోజ తండ్రి
Guppedantha Manasu: గుప్పెడంత మనసు జూన్ 29 ఎపిసోడ్‌లో రంగా సరోజల పెళ్లికి సరోజ తండ్రి సంజీవ ఒప్పుకోడు. రంగాకు ఆస్తిపాస్తులు లేవని అవమానిస్తాడు. తన దగ్గర తీసుకున్న అప్పు ఎగ్గొట్టడానికే పెళ్లి డ్రామా ఆడుతున్నాడని రంగాను కించపరుస్తాడు.
Guppedantha Manasu: తన కొడుకు శైలేంద్రకు కాలేజీ ఎండీ సీట్ ఇవ్వాల్సిందేనని భర్త ఫణీంద్రను పట్టుపడుతుంది దేవయాని. ఎండీ పదవికి శైలేంద్ర అర్హుడు అని వసుధార అంటేనే ఆ సీట్‌లో నిన్ను కూర్చోబెడతానని శైలేంద్రతో అంటాడు ఫణీంద్ర. వసుధార ఆ మాట ఎప్పటికీ చెప్పదని ధరణి అంటుంది. శైలేంద్రకు కాలేజీలో ఏ కోర్సులు, బ్రాంచీలు ఉన్నాయో కూడా తెలియదని, అలాంటి వాళ్ల చేతిలో కాలేజీని పెడితే డౌన్‌ఫాల్ కావడం ఖాయమని చెప్పి భర్తకు షాకిస్తుంది ధరణి.
ధరణిపై ఫైర్...
ధరణి తనకు వ్యతిరేకంగా మాట్లాడటం దేవయాని సహించలేకపోతుంది. హద్దులు మీరుతున్నావని కోడలిపై ఫైర్ అవుతుంది. ధరణికి ఫణీంద్ర సపోర్ట్ చేస్తాడు. ఎంత చెప్పిన దేవయాని, శైలేంద్ర మారరని, వాళ్ల మాటలు పట్టించుకోవద్దని అంటాడు.
సరోజ తండ్రి వడ్డీ డబ్బులు...
వడ్డీ డబ్బుల కోసం రంగా దగ్గరకు సరోజ తండ్రి సంజీవ వస్తాడు. అతడికి డబ్బులు ఇస్తాడు రంగా. సరోజ, రంగాల పెళ్లి ప్రస్తావనను సంజీవ దగ్గర తీసుకొస్తుంది నాయనమ్మ. రంగాను సరోజ ఇష్టపడుతుందని, ఇద్దరికి పెళ్లిచేస్తే బాగుంటుందని అంటుంది. రంగా, సరోజ పెళ్లికి సంజీవ ఒప్పుకోడు. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని అంటాడు. తన కూతురిని పెళ్లిచేసుకొనే తాహతు రంగాకు లేదని అవమానిస్తాడు. రే కాటికి కాళ్లు చూపుకొని ఉన్న నువ్వు, కిస్తీలు కట్టే ఆటో తప్ప మీకు ఆస్తులు ఏమున్నాయి అంటూ రంగాను తక్కువ చేసి మాట్లాడుతాడు. తీసుకున్న అప్పును ఎగ్గొట్టడానికే ఈ పెళ్లి డ్రామాలు ఆడుతున్నారని రంగాతో నాయనమ్మను నానా మాటలు అంటాడు.
సరోజను పెళ్లిచేసుకోను...
నువ్వు కాళ్లు కడిగి కన్యాదానం చేస్తానని చెప్పిన నీ కూతురిని నేను పెళ్లిచేసుకోవడానికి సిద్ధంగా లేనని సంజీవతో అంటాడు రంగా. వసుధారను చూసి ఈ పిల్లనేనా నువ్వు కాపాడింది అంటూ ఎగతాళి చేస్తాడు సంజీవ. మీకు తినడానికే గతి ఉండదు. కానీ మళ్లీ జనాలను ఉద్ధరించడం మీకే చెల్లిందిరా బాబు అంటూ రంగాపై సెటైర్స్ వేసి మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. పెళ్లి టాపిక్ అనవసరంగా తీసుకొచ్చావని నానమ్మపై రంగా సీరియస్ అవుతాడు.
తన తలను గోడకు బాదుకోవడం మొదలుపెడతాడు. అతడిని మను ఆపుతాడు. బాధలు అందరికి ఉంటాయని అలాగని బతుకును దూరం చేసుకోవద్దని మహేంద్రను వారిస్తాడు. అందరూ తనకు దూరమయ్యారని, ఎందుకోసం ఎవరికోసం బతకాలని మహేంద్ర ఆవేదన వ్యక్తం చేస్తాడు. నీ కోసం ఎదురుచూసేవాళ్లు, నీ ప్రేమను పొందాల్సిన వాళ్లు ఇంకా ఉన్నారని అనుపమ అంటుంది. కాలం కలిసొచ్చిన రోజు తప్పకుండా దేవుడు వాళ్లను నీ దగ్గరకు పంపిస్తాడని మహేంద్రను సర్ధిచెబుతుంది అనుపమ.
దురదృష్టవంతుడు లేడు...
కానీ అనుపమ మాటలను మహేంద్ర పట్టించుకోడు. ప్రపంచంలో నా అంత దురదృష్టవంతుడు ఎవరూ ఉండరు. అందరూ నాకు దూరమైన వాళ్లే తప్ప...కొత్తగా బంధాలు పెట్టుకొని నా జీవితంలోకి వచ్చేవాళ్లు ఎవరూ లేరని, తాను అన్‌లక్కీ ఫెలో అని బాధపడతాడు మహేంద్ర. తన నుంచి దూరంగా వెళ్లిపొమ్మని మను, అనుపమలను కోరతాడు. నా దురదృష్టం మీకు అంటుకొని మీ ఇద్దరికి ఏదైనా ప్రమాదం జరిగినా జరగొచ్చని మహేంద్ర ఎమోషనల్ అవుతాడు.
కన్నీళ్లు...బాధలు తప్ప...
మీ అమ్మ ఓ ఫ్రెండ్‌గా నా లైఫ్‌లోకి వచ్చిన తర్వాత కన్నీళ్లు బాధలు తప్పఆమెకు ఏం మిగలలేదని మనుతో అంటాడు మహేంద్ర. ఒక్కరోజు కూడా సంతోషంగా అనుపమను చూడలేదని అంటాడు. నన్ను వదిలేసి దూరంగా వెళ్లిపొమ్మని మనుతో అంటాడు మహేంద్ర. రేపో మాపో నేను చచ్చిపోతే వదిలేయక తప్పదని, అప్పటివరకు కాకుండా ఇప్పుడే వెళ్లిపొమ్మని చెబుతాడు. మను, అనుపమ మహేంద్రకు సర్ధిచెబుతారు.
మనుపై రౌడీల ఎటాక్...
మను కాలేజీకి బయలుదేరుతాడు. రోడ్‌కు బైక్‌లు అడ్డంపెట్టి అతడి కారును ఆపేస్తారు రౌడీలు, మనుపై ఎటాక్ చేయాలని అనుకుంటారు. రౌడీ గ్యాంగ్ లీడర్‌ను చితక్కొడతాడు మను. గన్ తీసి మిగిలిన రౌడీలను బెదిరించడంతో రౌడీలు భయపడిపోతారు. తనను కొట్టమని ఎవరూ చెప్పరని రౌడీలను అడుగుతాడు మను. మిమ్మల్ని చంపేందుకు శైలేంద్రను తమకు సుఫారీ ఇచ్చాడని రౌడీలు నిజం చెప్పేస్తారు.
శైలేంద్ర పగటి కలలు
ఈ పాటికి శైలేంద్రను రౌడీలు పైకి పంపించి ఉంటారని సంతోషంతో ఇంట్లో కలలు కంటుంటాడు శైలేంద్ర. అతడి ముందు సడెన్‌గా మను ప్రతక్ష్యమవుతాడు. మనును చూడగానే మాట మార్చేస్తాడు శైలేంద్ర. కానీ శైలేంద్ర సుఫారీ ఇచ్చిన రౌడీలను అతడి ముందు నిలబెడతాడు మను. వారిని చూడగానే శైలేంద్ర షాకవుతాడు.