Guppedantha Manasu: వసు ప్రేమకు కరిగిపోయిన రంగా - మరదలి మ్యారేజీ ప్రపోజల్ రిజెక్ట్- శైలేంద్రకు తండ్రి ఫిట్టింగ్
Guppedantha Manasu Serial: గుప్పెడంత మనసు జూన్ 28 ఎపిసోడ్‌లో వసుధార, రిషి ప్రేమకథ విని రంగా ఎమోషనల్ అవుతాడు. కన్నీళ్లు పెట్టుకుంటాడు. వసుధార సెంటిమెంట్ స్టోరీకి రంగా కరిగిపోవడం చూసి సరోజ కలవరపడుతుంది. రంగాను రిషిలా వసుధార ఎక్కడ మార్చేస్తుందో అని భయపడుతుంది.
Guppedantha Manasu Serial: రిషి జీవితం గురించి, అతడి గొప్పతనాన్ని రంగాకు చెబుతుంది వసుధార. డీబీఎస్‌టీ కాలేజీకి రారాజు అని, పేద విద్యార్థులను గొప్ప స్థాయిలో నిలబెట్టాడని రిషి గురించి చెబుతూ ఎమోషనల్ అవుతుంది వసుధార.

పాండ్యన్ లాంటి అల్లరి విద్యార్థులను రిషి ఎలా మంచివాళ్లగా తీర్చిదిద్దింది రంగాకు వివరిస్తుంది వసుధార. ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన ఓ అమ్మాయికి రిషి భర్త అని వసుధార అంటుంది. ఆ అమ్మాయిని తానే అని చెబుతుంది వసుధార. రిషి తన భర్త అనే నిజాన్ని బయటపెడుతుంది.
శైలేంద్ర కుట్రల కారణంగా...
శైలేంద్ర కుట్రల కారణంగా రిషి తనకు ఎలా దూరమైంది రంగాకు వెల్లడిస్తుంది వసుధార. ఆ దుర్మార్గుడు చేసిన పాపాలకు రిషి తల్లితో పాటు తన తల్లి కూడా చనిపోయిందని వసుధార అంటుంది. ఎండీ సీట్ కోసం శైలేంద్ర చేసిన కుట్రలు మొత్తం వెల్లడిస్తుంది. చివరకు తాను ఎండీ సీట్‌ను వదిలేయాల్సివచ్చిందని అంటుంది. ఇదే నాది, రిషి సార్ కథ అని వసుధార అంటుంది.
రంగా కన్నీళ్లు...
వసుధార చెప్పిన ఫ్లాష్‌బ్యాక్ విని రంగా కూడా కన్నీళ్లు పెట్టుకుంటాడు. అది చూసి సరోజ కంగారు పడుతుంది. నిజంగానే రంగా...రిషినా అని అనుకుంటుంది. ఇప్పటికైనా మీరు రిషి అని ఒప్పుకుంటారా రంగాను అడుగుతుంది వసుధార. తాను రిషిని కాదని రంగా బదులిస్తాడు. మీరు చెబుతున్న కథ సెంటిమెంట్ సినిమాలా చాలా ఎమోషనల్‌గా ఉందని అంటాడు. ఆ కథ విని కన్నీళ్లు వచ్చాయని రంగా అంటాడు. అయితే తాను మాత్రం రిషిని కాదని చెబుతాడు.
సరోజ కలవరం...
వసుధార కథ విని రంగా ఎక్కడ కరిగిపోయి ఆమె ప్రేమలో పడతాడోనని సరోజ కలవరపడుతుంది. పదిహేను రోజుల్లోనే రంగాను రిషిలా వసుధార మార్చేయడం ఖాయమని అనుకుంటుంది. నీ నమ్మకం, ప్రేమ నిన్ను రిషిని ఒక్కటి చేస్తుందని రంగా నాయనమ్మ వసుధారను ఓదార్చుతుంది.
మను ప్రేమలో ఏంజెల్...
మను గురించి మాట్లాడటానికి ఏంజెల్‌ను పిలుస్తుంది అనుపమ. మనుపై ఏంజెల్ ప్రశంసలు కురిపిస్తుంది. మను మంచివాడు, పదిమందికి సాయం చేసే గుణమున్నవాడు అని అంటుంది. బావ గొప్పొడు అంటూ పొగడుతుంది. నువ్వు మను విషయంలో అందరిలా ఆలోచించకు.
మనును తండ్రి పేరుతో అవమానించేవాళ్లు చాలా మంది ఉన్నారని, వారిలా అతడి గతంలోకి తొంగిచూడకుండా మను వ్యక్తిత్వాన్ని ఇష్టపడమని ఏంజెల్‌కు సలహా ఇస్తుంది అనుపమ. మను అంటే ఇష్టమనే సంగతిని భయటపెడుతుంది ఏంజెల్. కానీ మనుకు తాను ఇష్టం లేనట్లుగా ఉందని, తండ్రి గురించి తెలుసుకోవడం తప్ప అతడికి ఏ ఎమోషన్స్ లేనట్లుగా కనిపిస్తాడని అనుపమతో చెబుతూ బాధపడుతుంది ఏంజెల్.
మను మనసులో ఏంజెల్...
మను మనసులో నువ్వు ఉన్నావని ఏంజెల్‌తో అంటుంది అనుపమ. నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా అవైడ్ చేయకుండా మాట్లాడుతున్నాడని, నీపై ఉన్న ఇష్టంతోనే నువ్వు ఎంత అల్లరి చేసిన భరిస్తున్నాడని అనుపమ అంటుంది. మను గతాన్ని మరచిపోయి అతడికి కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయమని ఏంజెల్‌తో అంటుంది అనుపమ.
సరోజ మ్యారేజ్ ప్రపోజల్...
వసుధార ప్రేమలో రంగా పడకముందే అతడిని పెళ్లిచేసుకోవాలని సరోజ ఫిక్సవుతుంది.రంగా ముందు పెళ్లి ప్రపోజల్ పెడుతుంది. వెంటనే పెళ్లిచేసుకొని మీ ఇంట్లో కుడికాలు పెట్టాలని అనుకుంటున్నట్లు చెబుతుంది.
నా మెడలో మూడుముళ్లు వేస్తానని ఒక్క మాట చెబితే ఎలాగైనా మా నాన్నను మన పెళ్లికి ఒప్పిస్తానని రంగాతో అంటుంది సరోజ. నీకు నాకు సెట్టవ్వదు అని రంగా సరోజ ఆశలపై నీళ్లు కుమ్మరిస్తాడు. ఏ రోజుకైనా నేను నిన్నే పెళ్లిచేసుకుంటాను. నువ్వే నా మొగుడివి అని సరోజ ఖరాఖండిగా రంగాకు సమాధానమిస్తుంది సరోజ.
వసుధార ఎంట్రీ...
రంగా, సరోజ మాటలను చాటు నుంచి వింటుంది వసుధార. సడెన్‌గా రంగా ముందుకు ఎంట్రీ ఇచ్చి నిజంగా మీరు సరోజ బావనేనా అని అడుగుతుంది. అవునని రంగా అంటాడు. సరోజ మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తుంది పెళ్లిచేసుకోవాలని ఆశపడుతుంది.
అలాంటప్పుడు ఆమెను ఎందుకు దూరం పెడుతున్నారని రంగాను నిలదీస్తుంది వసుధార. సరోజ అంటే మీకు ఇష్టం లేదా అని ప్రశ్నిస్తుంది. ఇది నా సమస్య. మీకు అవనసరం. వేరే వాళ్ల జీవితంలోకి తొంగిచూడటం మంచిది కాదని వసుధారకు సమాధానం చెప్పకుండా దాటేస్తాడు రంగా.
సరోజకు నా కంటే మంచి మొగుడు దొరుకుతాడు. ఆమెను ప్రేమగా చూసుకుంటాడని రంగా సమాధానమిస్తాడు. అతడి మాటలు విని సరోజ ఫైర్ అవుతుంది. నేను నిన్ను తప్ప ఎవరిని పెళ్లిచేసుకునేది లేదని సరోజ అంటుంది.
వసుధారకు క్లాస్...
తమ విషయంలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నావని, మధ్యంలో నీకేం పని అంటూ వసుధారకు క్లాస్ ఇస్తుంది సరోజ. మా బావ మనసులో తాను తప్ప ఎవరూ లేరని సరోజ అంటుంది.
రంగా నిన్ను ఎందుకు పెళ్లిచేసుకోనని అంటున్నాడోతెలుసా...అతడి ఆల్రెడీ పెళ్లయింది కాబట్టి...అతడే నా రిషి కాబట్టి అని సరోజతో అంటుంది వసుధార. నువ్వు అవసరంగా అతడిపై ఆశలు పెట్టుకుంటున్నావు. నువ్వు అన్నట్లు అతడు నిజంగా రిషి కాకుండా రంగా అయితే నిన్ను పెళ్లిచేసుకుంటాడు. లేదంటే అతడు రిషినే అని సరోజుకు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది వసుధార.
సరోజ కన్ఫ్యూజన్...
వసుధార మాటలను పట్టించుకోవద్దని సరోజుకు సర్ధిచెబుతాడు రంగా. రంగాతో తన ప్రేమకు వసుధార అడ్డుగా నిలవడం సరోజ సహించలేకపోతుంది. వసుధారను రంగా ఇంట్లో నుంచి పంపించాలని నిర్ణయించుకుంటుంది.
శైలేంద్ర సింపథీ డ్రామా...
తండ్రి దగ్గర సింపథీ కొట్టేయాలని శైలేంద్ర అనుకుంటాడు. దేవయాని కూడా శైలేంద్రను సపోర్ట్ చేస్తుంది. బోర్డ్ మీటింగ్‌లో శైలేంద్రను ఎందుకు తిట్టారని భర్తను నిలదీస్తుంది. నా కొడుకును అందరి ముందు ఒక్క మాట కూడా అనదొద్దని అంటుంది. శైలేంద్ర మాటలకు కొట్టనందుకు సంతోషించమని దేవయానితోఅంటాడు ఫణీంద్ర.
బాధ్యత గల పదవి చేపట్టాలంటే నిజాయితీ, మానవత్వం, ముందుచూపు లాంటి లక్షణాలు ఉండాలని ఫణీంద్ర చెబుతుంది. కానీ నీలా అసూయ, కక్షసాధింపు చర్యలు ఉండొద్దని శైలేంద్రతో పాటు దేవయానికి క్లాస్ ఇస్తాడు ఫణీంద్ర.
వసుధార ఓకే అంటే...
ఎండీ పదవి చేపట్టడానికి శైలేంద్ర అర్హుడు అని వసుధారను తీసుకొచ్చి ఒక్క మాట చెప్పించమని...వెంటనే అతడిని ఆ సీట్‌లో కూర్చోబెడతానని ఫణీంద్ర అంటాడు. తండ్రి మాటలతో శైలేంద్ర షాకవుతాడు.
కానీ వసుధార ఎప్పటికీ ఆ మాట చెప్పదని ధరణి అంటుంది. కాలేజీలో ఏ కోర్సులు ఉన్నాయో కూడా శైలేంద్రకు తెలియదని, అలాంటివారికి కాలేజీ అప్పగిస్తే విద్యార్థుల భవిష్యత్తు మొత్తం నాశనమవుతుందని చెబుతుంది. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.