Guppedantha Manasu: వ‌సు ప్రేమ‌కు రంగా ఫిదా - మ‌నుకు ఏంజెల్ మ్యారేజ్ ప్ర‌పోజ‌ల్ - కాలేజీలో శైలేంద్ర ప‌రువు పాయే-guppedantha manasu june 22nd episode ranga feels jealous of vasudhara love for rishi ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu: వ‌సు ప్రేమ‌కు రంగా ఫిదా - మ‌నుకు ఏంజెల్ మ్యారేజ్ ప్ర‌పోజ‌ల్ - కాలేజీలో శైలేంద్ర ప‌రువు పాయే

Guppedantha Manasu: వ‌సు ప్రేమ‌కు రంగా ఫిదా - మ‌నుకు ఏంజెల్ మ్యారేజ్ ప్ర‌పోజ‌ల్ - కాలేజీలో శైలేంద్ర ప‌రువు పాయే

Nelki Naresh Kumar HT Telugu
Jun 22, 2024 07:22 AM IST

Guppedantha Manasu June 22nd Episode: గుప్పెడంత మ‌న‌సు జూన్ 22 ఎపిసోడ్‌లో శైలేంద్ర కాలేజీకిఎండీ కావాల‌ని స్టూడెంట్స్ ధ‌ర్నా చేస్తారు. వి వాంట్ శైలేంద్ర అంటూ నినాదాలు చేస్తారు. ఆ న‌కిలీ స్టూడెంట్స్ బాగోతాన్ని తెలివిగా బ‌య‌ట‌పెడ‌తాడు మ‌ను. శైలేంద్ర ప‌రువు తీస్తాడు.

గుప్పెడంత మ‌న‌సు జూన్ 22 ఎపిసోడ్‌
గుప్పెడంత మ‌న‌సు జూన్ 22 ఎపిసోడ్‌

Guppedantha Manasu June 22nd Episode: తానే రిషి అని వ‌సుధార ముందు నిజం బ‌య‌ట‌పెడ‌తాడు రంగా. కొన్ని ప‌రిస్థితుల వ‌ల్ల రంగాగా నాట‌కం ఆడాల్సివ‌స్తుంద‌ని చెబుతాడు. తండ్రి మ‌హేంద్ర‌ను చూడాల‌ని ఉంద‌ని, ఇప్పుడే మ‌న ఇంటికి వెళ్లిపోదామ‌ని వ‌సుధార‌తో అంటాడు రిషి. భ‌ర్త‌ను తీసుకొని త‌న ఇంటికి ఆనందంగా బ‌య‌లుదేరుతుంది వ‌సుధార‌.

స‌డెన్‌గా ఫ్ల‌వ‌ర్ వాజ్ కింద‌ప‌డ‌టంతో క‌ల‌లో నుంచి బ‌య‌ట‌ప‌డుతుంది. త‌న చేయిప‌ట్టుకున్న రిషి క‌నిపించ‌డు. ఫ్ల‌వ‌ర్ వాజ్ చ‌ప్పుడుకు రంగాతో పాటు ఇంట్లో వాళ్లంద‌రూ మేల్కొంటారు. ఏదైనా క‌ల క‌న్నావా అని రంగా నాయ‌న‌మ్మ వ‌సుధార‌ను అడుగుతుంది. ఏమ‌ని స‌మాధానం చెప్పాలో తెలియ‌క ప‌దే ప‌దే రిషి పేరు క‌ల‌వ‌రిస్తుంది.

రిషి కోసం ఆరాటం...

క‌నిపించ‌ని రిషి కోసం వ‌సుధార ప‌డుతోన్న ఆరాటం, ప్రేమ చూసి రంగాతో పాటు అత‌డి నాయ‌న‌మ్మ ఫిదా అవుతారు. ప్రాణం కంటే ఎక్కువ‌గా ప్రేమించే భార్య రిషి జీవితంలో ఉండ‌టం అత‌డి అదృష్టం అని రంగా అంటాడు. వ‌సుధార‌పై పొగ‌డ్త‌లు కురిపిస్తాడు రంగా. కొంప‌దీసి నువ్వే రిషినా అని రంగాను అడుగుతాడు అత‌డి అసిస్టెంట్‌. తాను రంగాన‌ని, రాధ‌మ్మ మ‌న‌వ‌డిని అని అసిస్టెంట్‌కు రంగా బ‌దులిస్తాడు.

మ‌నుకు ఫోన్‌...

మ‌నుకు మిడ్‌నైట్‌ ఫోన్ చేస్తుంది ఏంజెల్‌. ఓ ఇంపార్టెంట్ విష‌యం చెప్పాల‌ని, వెంట‌నే క‌లుద్దామ‌ని అంటుంది. ఇప్పుడు క‌ల‌వ‌డం కుద‌ర‌దు అని మ‌ను ఫోన్ క‌ట్ చేయ‌బోతాడు. తాను మీ ఇంటి బ‌య‌టే ఉన్నాన‌ని మ‌నుతో అంటుంది ఏంజెల్‌.

ఆమె చెప్పే ఇంపార్టెంట్ విష‌యం ఏమిటో అని కంగారుగా మ‌ను బ‌య‌ట‌కు వ‌స్తాడు. త‌న‌కు ఐస్‌క్రీమ్ తినాల‌ని ఉంద‌ని, తోడుగా రావాల‌ని మ‌నును కోరుతుంది ఏంజెల్‌. తాను రాన‌ని బెట్టు చేస్తాడు మ‌ను. బావ అంటూ మ‌నుతో స‌ర‌సాలు ఆడుతుంది. అత‌డి కోపాన్ని త‌గ్గించేందుకు ప్ర‌య‌త్నిస్తుంది ఏంజెల్‌. అయినా మ‌ను ప‌ట్టువీడ‌దు.

మ‌ను ఫిలాస‌ఫీ...

నువ్వు ఎలా రావో చూస్తాన‌ని గ‌ట్టిగా అత్త‌య్య అని అనుప‌మ‌ను పిలుస్తుంది ఏంజెల్‌. మిడ్‌నైట్‌ అమ్మ‌ను డిస్ట్ర‌బ్ చేయ‌ద్ద‌ని, నీ వెంట వ‌స్తాన‌ని ఏంజెల్‌తో అంటాడు మ‌ను. ఐస్‌క్రీమ్ తీన‌డానికి ఏంజెల్‌తో క‌లిసి వెళ‌తాడు . ఇన్‌డైరెక్ట్‌గా మ‌ను ముందు పెళ్లి ప్ర‌పోజ‌ల్ పెడుతుంది ఏంజెల్‌. ఇంట్లో పెళ్లిచేసుకోమ‌ని తాత‌య్య గోల చేస్తున్నాడ‌ని మ‌నుతో అంటుంది ఏంజెల్‌.

రిషిని తాను పెళ్లిచేసుకోవాల‌నుకున్న సంగ‌తి, ఆ త‌ర్వాత జ‌రిగిన గొడ‌వ‌ల గురించి మ‌నుతో మొత్తం చెబుతుంది ఏంజెల్‌. త‌మ ప్రేమ విష‌యం దాచిపెట్టిన రిషి, వ‌సుధార‌ల‌పై చాలా రోజుల పాటు కోపం త‌గ్గ‌లేద‌ని అంటుంది. రిషితో నా ల‌వ్ స్టోరీని దాచిపెట్టాన‌ని నువ్వు ఎప్పుడు అనుకోవ‌ద్ద‌ని మ‌నుతో అంటుంది ఏంజెల్‌.

ఇదంతా నాకు ఎందుకు చెబుతున్నావ‌ని ఏంజెల్‌ను అడుగుతాడు మ‌ను. అస‌లు నీది మ‌ట్టి బుర్ర అనుకుంటా....ఇంత చెప్పినా నీకు అర్థం కాలేదా అని ఇరిటేట్‌ అవుతుంది ఏంజెల్‌.

శైలేంద్ర కాలేజీ ఎండీ కావాలి....

శైలేంద్ర కాలేజీకి ఎండీ కావాలి అని స్టూడెంట్స్ ధ‌ర్నా చేస్తారు. వారు కాలేజీ స్టూడెంట్స్ కాద‌ని, శైలేంద్ర అరెంజ్ చేసిన మ‌నుషుల‌ను మ‌హేంద్ర క‌నిపెడ‌తాడు. మీరు అయితేనే కాలేజీని చ‌క్క‌దిద్దుతారు. మా భ‌విష్య‌త్తు బాగుప‌డుతుంది అని శైలేంద్ర‌పై న‌కిలీ స్టూడెంట్స్ ప్ర‌శంస‌లు కురిపిస్తారు.

మీరు నా కోసం ఎలాంటి అఘాయిత్యాలు, గొడ‌వ‌లు ప‌డోద్దు అని శైలేంద్ర ఆ స్టూడెంట్స్‌కు న‌చ్చ‌జెప్పిన‌ట్లుగా నాట‌కం ఆడుతాడు. ఓ న‌కిలీ స్టూడెంట్స్ లోని ఒక‌త‌ని ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి శైలేంద్ర త‌న‌కు ఐదు వంద‌లు ఇచ్చాడ‌ని, నీకు ఎంత ఇచ్చాడ‌ని అడుగుతాడు మ‌ను. నాకు రెండు వంద‌లే ఇచ్చాడ‌ని ఆ న‌కిలీ స్టూడెంట్ మ‌నుకు బ‌దులిస్తాడు.

శైలేంద్ర మిమ్మ‌ల్ని మోసం చేశాడ‌ని మ‌ను అన‌గానే ఆ స్టూడెంట్ కోపం ప‌ట్ట‌లేక‌పోతాడు. డ‌బ్బుల కోసం శైలేంద్ర‌ను నిల‌దీస్తాడు. శైలేంద్ర ఆడుతోన్న డ్రామాను మొత్తం బ‌య‌ట‌పెట్టేస్తాడు. శైలేంద్ర మ‌న‌ల్ని మోసం చేస్తున్నాడ‌ని, వీడు పెద్ద మోస‌గాడిలా ఉన్నాడ‌ని అక్క‌డి నుంచి న‌కిలీ స్టూడెంట్స్ వెళ్లిపోతారు.

శైలేంద్ర ప‌రువు పాయే...

వీ వాంట్ శైలేంద్ర ఎండీ అంటూ మ‌ను, మ‌హేంద్ర అత‌డిని ఆట‌ప‌ట్టిస్తారు. గొడ‌వ చూసి కాలేజీ స్టూడెంట్స్ అక్క‌డికి వ‌స్తారు. శైలేంద్ర కాలేజీ ఎండీ అన‌గానే న‌వ్వుకుంటారు. శైలేంద్ర‌కు ఎండీ అయ్యే అర్హ‌త లేద‌ని అంటారు. ఆయ‌న ఎండీ ఏంటి కామెడీ కాక‌పోతే అని శైలేంద్ర ప‌రువు మొత్తం తీస్తారు. మాకు మీరే ఎండీ కావాల‌ని ఉంద‌ని మ‌నును కోరుతారు.

మ‌హేంద్ర బ్లాక్‌మెయిల్‌...

డ‌బ్బులిచ్చి బ‌య‌టి వాళ్ల‌తో కాలేజీలో శైలేంద్ర గొడ‌వ చేయించిన విష‌యం వెంట‌నే ఫ‌ణీంద్ర‌కు ఫోన్ చేసి చెబుతాన‌ని మ‌హేంద్ర అంటాడు. ఆ మాట విన‌గానే శైలేంద్ర కాళ్ల‌బేరానికి వ‌స్తాడు. ఈ నిజం నాన్న‌కు తెలిస్తే త‌న‌ను చిత‌క్కోడ‌తాడ‌ని, వ‌ద్ద‌ని బ‌తిమిలాడుతాడు. ఏంజెల్‌, మ‌ను మాట్లాడుకుంటుండ‌గా అక్క‌డికి శైలేంద్ర వ‌స్తాడు.

నా క్యాబిన్‌లోకి ఎందుకొచ్చావు బ‌య‌ట‌కు వెళ్లిపో అని శైలేంద్ర‌కు వార్నింగ్ ఇస్తాడు. ఇది నా కాలేజీ...నా కాలేజీ నుంచే న‌న్ను బ‌య‌ట‌కు వెళ్ల‌మ‌ని అంటున్నావా అంటూ మ‌నుపై రివ‌ర్స్ అవుతాడు. ఇది మా తాత క‌ట్టించిన కాలేజీ అంటూ గొంతు పెంచి మ‌నుతో మాట్లాడుతాడు. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.

WhatsApp channel