Guppedantha Manasu june 21st episode: రంగానే రిషి - బ‌య‌ట‌ప‌డ్డ నిజం - వ‌సు హ్యాపీ - దేవ‌యాని సెంటిమెంట్ డ్రామా-guppedantha manasu june 21st episode ranga reveals secret about rishi ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu June 21st Episode: రంగానే రిషి - బ‌య‌ట‌ప‌డ్డ నిజం - వ‌సు హ్యాపీ - దేవ‌యాని సెంటిమెంట్ డ్రామా

Guppedantha Manasu june 21st episode: రంగానే రిషి - బ‌య‌ట‌ప‌డ్డ నిజం - వ‌సు హ్యాపీ - దేవ‌యాని సెంటిమెంట్ డ్రామా

Nelki Naresh Kumar HT Telugu
Jun 21, 2024 07:26 AM IST

Guppedantha Manasu june 21st episode: నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌లో తాను రిషినేన‌ని కొన్ని ప‌రిస్థితుల వ‌ల్ల రంగాగా న‌టించాల్సివ‌స్తోంద‌ని అస‌లు నిజం వ‌సుధార ముందు బ‌య‌ట‌పెడ‌తాడు రిషి. వ‌సుధార‌కు ఐ ల‌వ్ యూ చెబుతాడు.

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌
గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌

Guppedantha Manasu june 21st episode: రంగా విష‌యంలో వ‌సుధార‌తో గొడ‌వ‌ప‌డుతుంది స‌రోజ‌. త‌న బావ రిషి కాద‌ని..రంగా అని వ‌సుధార‌తో కోపంగా అంటుంది. రిషి ఎక్క‌డున్నాడో తెలుసుకొని ఇక్క‌డి నుంచి వెళ్లిపొమ్మ‌ని అంటుంది. స‌రోజ మాట‌ల‌తో వ‌సుధార హ‌ర్ట్ అవుతుంది. భోజ‌నం చేయ‌కుండా అలుగుతుంది.

మీ ప్రాణం నేను...

తాను రిషి కాద‌నే విష‌యాన్ని వ‌సుధార‌కు అర్థ‌మ‌య్యేలా చెప్పాల‌ని రంగా ఫిక్స‌వుతాడు. కానీ రంగా ఎంత చెప్పిన వ‌సుధార మాత్రం క‌న్వీన్స్ అవ్వ‌దు. మీ కోసం మీ నాన్న ఎంతో బాధ‌ప‌డుతున్నార‌ని, మిమ్మ‌ల్ని చూడాల‌ని ప‌రిత‌పిస్తున్నార‌ని రంగాతో అంటుంది వ‌సుధార‌. మీ ప్రాణ‌మైన న‌న్ను గుర్తుప‌ట్ట‌డం లేదా అని రంగాను అడుగుతుంది వ‌సుధార‌.

రిషి తొంద‌ర‌లోనే దొరుకుతాడు...

నేను రిషి కాద‌ని మీరు గుర్తిస్తే నాకు, మీకు మంచిద‌ని రంగా అంటాడు. మీరు ప‌దే ప‌దే న‌న్ను రిషి అని పిల‌వ‌డం చూసి మా నాన‌మ్మ కంగారు ప‌డుతోంద‌ని చెబుతాడు. మీరు రిషి కోసం ప‌డుతోన్న ఆరాటం చూస్తుంటే మీరు అత‌డిని ఎంత‌గా ప్రేమించారో అర్థ‌మ‌వుతుంది. మీకు రిషి త్వ‌ర‌గా దొర‌కాల‌ని కోరుకుంటున్నాన‌ని వ‌సుధార‌తో చెబుతాడు రంగా.

అతిథి ఆక‌లితో ఉండొద్దు...

వ‌సుధార‌ను భోజ‌నం చేయ‌మ‌ని రంగా బ‌తిమిలాడుతాడు. నా ఇంటికి వ‌చ్చిన అతిథి ఆక‌లితో ఉంటే నా మ‌న‌సుకు క‌ష్టంగా ఉంటుంద‌ని చెబుతాడు. మీరు తిన‌క‌పోతే నేను ప‌స్తులే ఉండాల్సివ‌స్తుంద‌ని అంటాడు. నాకు ఆక‌లిగా లేదు...కానీ మీరు తినిపిస్తానంటే తింటాన‌ని రంగాకు ఆన్స‌ర్ ఇస్తుంది వ‌సుధార‌. చివ‌ర‌కు రంగాను ప‌స్తులు ఉంచ‌కూడ‌ద‌ని అత‌డి కోసం వ‌సుధార డిన్న‌ర్ చేస్తుంది. భోజ‌నం చేసే స‌మ‌యంలో వ‌సుధార‌కు పొల‌మార‌డంతో తానే స్వ‌యంగా నీళ్లు తాగిస్తాడు రంగా.

వ‌సుధార ఛాలెంజ్‌...

రంగా త‌న ప‌ట్ల చూపిస్తున్న ప్రేమ‌, ఆద‌ర‌ణ చూసి అత‌డు రిషి అని క‌న్ఫామ్ అవుతుంది వ‌సుధార‌. మీరు రిషి కాద‌ని అంటోన్న మీ మాట‌, చూపు త‌న‌ను మోసం చేయ‌లేవ‌ని వ‌సుధార మ‌న‌సులో అనుకుంటుంది. మీ చేతే మీరు రంగా కాదు రిషి అని చెప్పిస్తాన‌ని రంగాను చూస్తూ మ‌న‌సులోనే ఛాలెంజ్ చేస్తుంది.

అప్పుడే రంగా అసిస్టెంట్ హ‌డావిడిగా ఇంట్లోకివ‌స్తాడు. వ‌సుధార కోసం రౌడీలు వెతుకుతోన్న సంగ‌తి చెబుతాడు. అసిస్టెంట్ మాట‌లు విని వ‌సుధార కంగారు ప‌డుతుంది. నేను ఉండ‌గా మీకు ఏం కాద‌ని, మీరు పూర్తిగా కోలుకునే వ‌ర‌కు ఇక్క‌డే ఉండ‌మ‌ని వ‌సుధార‌తో అంటాడు రంగా.

దేవ‌యాని నాట‌కం...

మ‌హేంద్ర ఇంటికి దేవ‌యానితో క‌లిసి ఫ‌ణీంద్ర వ‌స్తాడు. మీ అన్న‌య్య ప్ర‌తిక్ష‌ణం నీగురించే ఆలోచించి స‌రిగ్గా నిద్ర‌పోవ‌డం లేద‌ని, భోజ‌నం చేయ‌డం లేద‌ని మ‌హేంద్ర‌తో సెంటిమెంట్ డ్రామా మొద‌లుపెడుతుంది దేవ‌యాని. నువ్వు నా క‌ళ్ల ముందు ఉండాల‌ని, మా ఇంటికి వ‌చ్చేయ‌మ‌ని మ‌హేంద్ర‌ను రిక్వెస్ట్ చేస్తాడు ఫ‌ణీంద్ర‌. ఒంట‌రిగా ఇక్క‌డ ఉండొద్ద‌ని అంటాడు.

కానీ అన్న‌య్య ఇంటికి వెళ్ల‌డానికి మ‌హేంద్ర ఒప్పుకోడు. గ‌తంలో దేవ‌యాని చేసిన అవ‌మానాల‌ను దృష్టిలో పెట్టుకొని అలా మాట్లాడొద్ద‌ని ఫ‌ణీంద్ర అంటాడు. దేవ‌యాని కూడా నీ జీవితం ఏమైపోతుందోన‌నే బాధ‌లో అలా మాట్లాడ‌న‌ని, అందుకు ఇప్పుడు కూడా సారీ చెబుతున్నాన‌ని దేవ‌యాని నాట‌కం ఆడుతుంది. మ‌హేంద్ర‌ను త‌మ ఇంటికి తీసుకొస్తే అనుప‌మను అత‌డికి దూరం చేయ‌వ‌చ్చ‌ని స్కెచ్ వేస్తుంది దేవ‌యాని.

ఎమోషనల్ బ్లాక్ మెయిల్….

కానీ ఫ‌ణీంద్ర‌, దేవ‌యాని ఎంత చెప్పిన వారి ఇంటికి వెళ్ల‌డానికి మాత్రం మ‌హేంద్ర ఒప్పుకోడు. ఈ విష‌యంలో న‌న్ను ఇబ్బంది పెట్టొద్ద‌ని అన్న‌య్య‌ను క్ష‌మాప‌ణ‌లు కోరుతాడు మ‌హేంద్ర‌. మీ అన్న‌య్య మాట‌ల‌ను కాదంటావా...ఆయ‌నంటే నీకు లెక్క‌లేదా అంటూ ఎమోష‌న‌ల్ బ్లాక్‌మెయిల్ కు దిగుతుంది దేవ‌యాని. ఫ‌ణీంద్ర ఆమెపై ఫైర్ అవుతాడు. మ‌హేంద్ర‌కు ఇష్ట‌మైన వంటలు చేసి వ‌స్తాన‌ని చెప్పి భ‌ర్త‌ను తెలివిగా అక్క‌డి నుంచి పంపిస్తుంది దేవ‌యాని.

అనుప‌మ‌పై మాటల దాడి...

కిచెన్‌లోకి వెళ్లి అనుప‌మ‌పై మాటల దాడి మొద‌లుపెడుతుంది దేవ‌యాని. తెలివిగా రిషి, వ‌సుధార‌ను నువ్వే ఇంట్లో నుంచి పంపించావ‌ని అనుప‌మ‌పై నింద‌లు వేస్తుంది. నీ కొడుకుకు ఎండీ ప‌ద‌వి ద‌క్కాల‌నే ఇవ‌న్నీ చేశావ‌ని మాట‌ల‌తో ఇబ్బంది పెడుతుంది. దేవ‌యాని నింద‌ల‌పై అనుప‌మ మౌనంగా ఉంటుంది.

అనుప‌మ‌పై దేవ‌యాని నోరుపారేసుకోవ‌డం చూసి మ‌హేంద్ర ఫైర్ అవుతాడు. ర‌క్త సంబంధాన్ని కాద‌ని దారిన పోయేవాళ్ల‌ను అందలం ఎక్కించొద్ద‌ని మ‌హేంద్ర‌పై కోప్ప‌డుతుంది దేవ‌యాని.

బంధాల కంటే ప‌ది మంది మంచి కోరే వాళ్ల‌కే నా స‌పోర్ట్ ఎప్పుడు ఉంటుంద‌ని, నీ లాంటి క్రిమిన‌ల్ మైండ్ ఉన్న‌వాళ్ల‌కు అస‌లు స‌పోర్ట్ చేయ‌న‌ని మ‌హేంద్ర ఖ‌రాఖండిగా చెబుతాడు. అనుప‌మ‌కు నీకు ఏం సంబంధం ఉంద‌ని, ఈ ప్ర‌శ్న రేపు వేరే వాళ్లు అడిగితే ఏం స‌మాధానం చెబుతావ‌ని మ‌హేంద్ర‌ను నిల‌దీసి అక్క‌డి నుంచి వెళ్లిపోతుంది దేవ‌యాని.

వ‌సుకు క్ష‌మాప‌ణ‌లు...

వ‌సుధార ఒంట‌రిగా ఉండ‌టం చూసి ఆమె ద‌గ్గ‌ర‌కు వ‌స్తాడు రంగా. తాను రిషినే అని, కానీ కొన్ని అనుకొని ప‌రిస్థితుల వ‌ల్ల తాను రంగా న‌టిస్తున్నాన‌ని చెబుతాడు. న‌న్ను క్ష‌మించ‌మ‌ని వ‌సుధార‌ను వేడుకుంటాడు. నా ఊపిరి నువ్వు అలాంటిది నీకు దూరంగా నేను ఇన్నాళ్లు ఉన్నానంటే నా ప‌రిస్థితి ఏమిటో నువ్వే అర్థం చేసుకోమ‌ని వ‌సుధార‌కు చెబుతాడు రంగా. అత‌డి మాట‌ల‌తో వ‌సుధార క‌న్నీళ్లు పెట్టుకుంటుంది. నీ కంట్లో నీళ్తు తిరిగితే నేను త‌ట్టుకోలేన‌ని వ‌సుధార‌తో చెబుతాడు.

ఐ లవ్ యూ చెప్పిన వసు…

రంగాకు ఐ ల‌వ్ యూ చెబుతుంది వ‌సుధార‌. ఐ ల‌వ్ యూ ఎంహెచ్ అని రంగా రొమాంటిక్‌గా బ‌దులిస్తాడు. మీరు లేర‌ని చ‌నిపోయార‌ని ఎంతో మంది ఎన్ని ర‌కాలుగా చెప్పిన న‌మ్మ‌లేద‌ని రంగాతో అంటుంది వ‌సుధార‌. మ‌న మ‌ధ్య ఎడ‌బాటు ఉంటుంది కానీ శాశ్వ‌తంగా మాత్రం ఎప్ప‌టికీ దూరం కామ‌ని రిషి అంటాడు.

ఈ భూమ్మీద ఉంటే మ‌న రెండు గుండె చ‌ప్పుళ్లు వినిపిస్తాయి. లేదంటే ఒకేసారి ఆగిపోతాయ‌ని చెబుతూ రిషి ఎమోష‌న‌ల్ అవుతాడు. తండ్రి గుర్తుచేసుకుంటాడు. మ‌హేంద్ర‌ను చూడాల‌ని ఉంద‌ని అంటాడు. ఇప్పుడే ఇంటికి వెళ్లిపోదామ‌ని అంటాడు. అక్క‌డితో నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ ముగిసింది.

WhatsApp channel