Guppedantha Manasu June 20th Episode: చంపేస్తానని శైలేంద్రకు మను వార్నింగ్ - రంగా విషయంలో వసుతో సరోజ గొడవ
Guppedantha Manasu June 20th Episode:నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో రంగా విషయంలో వసుధారతో సరోజ గొడవపడుతుంది. అతడు రంగా కాదు రిషి అని వసుధార చెప్పిన మాటలను సరోజ సహించలేకపోతుంది.
Guppedantha Manasu June 20th Episode: వసుధార కాలేజీ నుంచి వెళ్లిపోవడంతో ఎండీ సీట్ తనదేనని శైలేంద్ర సంబరపడతాడు. కానీ అతడికి మను అడ్డుగా నిలుస్తాడు. మనును బెదిరించడం కాకుండా బతిమిలాడి అతడి అడ్డు తొలగించుకోవాలని ఫిక్సవుతాడు శైలేంద్ర. ఎండీ సీట్‌కు వసుధార రిజైన్ చేయడమే కాకుండా కాలేజీ నుంచి దూరంగా వెళ్లిపోయినా కూడా ఆ పదవి నాకు దక్కకుండా నువ్వు అడ్డుపడుతున్నావని మనుతో అంటాడు శైలేంద్ర.

నువ్వనేవాడివి లేకపోతే ఈ కాలేజీ ఎప్పుడో నా అధీనంలోకి వచ్చేదని చెబుతాడు. గతంలో జరిగినవి వదిలేసి నువ్వు నా దారికి అడ్డురాకు...నేను నీ దారికి అడ్డురానని మనుతో డీల్ కుదుర్చుకుంటాడు శైలేంద్ర.
డీల్‌కు ఒప్పుకోని మను...
కానీ శైలేంద్ర డీల్‌కు మను ఒప్పుకోడు. ఎండీ సీట్‌లో కూర్చునే అర్హత నీకు లేదని శైలేంద్రతో అంటాడు. ఎంత ఆరాటపడ్డా, ఏం చేసినా ఎండీ సీట్ నీకు దక్కదని అంటాడు. ముందు అర్హత సంపాదించుకోమని శైలేంద్రకు వార్నింగ్ ఇస్తాడు మను.
నాకు నీతులు చెబుతున్నావా....
నీకు నీ కన్న తండ్రి ఎవరో తెలియదు కానీ నువ్వు నాకు నీతులు చెబుతున్నావా...నా అర్హతల గురించి మాట్లాడుతున్నావా అంటూ మనుపై ఫైర్ అవుతాడు శైలేంద్ర. అతడి మాటలతో మను కోపం పట్టలేకపోతాడు. నీ తండ్రి ఎవరో నాకు తెలుసు అని మనుతో చెబుతాడు శైలేంద్ర. నీ తండ్రి పూర్తి బయోడేటా నా దగ్గర ఉందని మనుతో అంటాడు.
నీకు నా తండ్రి గురించి తెలిసే అవకాశం లేదని శైలేంద్ర మాటలను కొట్టిపడేస్తాడు మను. నేను నిన్ను నమ్మను. నమ్మలేను. నా ఎమోషన్స్‌తో ఇంకోసారి ఆడుకుంటే కాలేజీలో నీ స్మారక చిహ్నం కట్టిస్తానని శైలేంద్రకు వార్నింగ్ ఇస్తాడు మను. అది చనిపోయేవాళ్లకు కదా కట్టేదని శైలేంద్ర చెప్పగా...అదే చంపేస్తానని అంటున్నా...జాగ్రత్త అని శైలేంద్ర హెచ్చరించి వెళ్లిపోతాడు మను.
వసుధార కోసం రౌడీల అన్వేషణ...
వసుధారను వెతుక్కుంటూ రంగా ఊరిలోకి శైలేంద్ర నియమించిన రౌడీలు వస్తారు. కానీ వసుధార గురించి వాళ్లకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకదు. రంగా అసిస్టెంట్‌కు వసుధార ఫొటో చూపించి ఈ అమ్మాయిని ఎక్కడైనా చూశావా అని రౌడీల బాస్ అడుగుతాడు. లేదని రంగా అసిస్టెంట్ అబద్ధం ఆడుతాడు. రౌడీల గురించి రంగా, వసుధారలకు చెప్పడానికి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళతాడు.
కొడుకుకు దేవయాని క్లాస్...
మను తండ్రి ఎవరో తనకు తెలుసునని చెప్పిన అతడు ఎంతకు తన మాటలు నమ్మడం లేదని, వసుధార రాసిన లెటర్ మన దగ్గర ఉండి కూడా ఉపయోగం లేదని తల్లి దేవయానితో అంటాడు శైలేంద్ర. కొడుకుకు క్లాస్ ఇస్తుంది దేవయాని. నీకు కొంచెం కూడా తెలివిలేదని కొడుకుపై ఫైర్ అవుతుంది.
మను తండ్రి మహేంద్ర అనే నిజం బయటపడితే మనకే ప్రమాదమని అంటుంది. అదే జరిగితే మహేంద్ర, ఫణీంద్ర కలిసి మనును కాలేజీకి ఎండీని చేస్తారని కొడుకుతో అంటుంది దేవయాని. ఆ పని జరగకుండా ఉండాలంటే మహేంద్ర, అనుపమ మధ్య గొడవలను సృష్టించి వాళ్లను విడదీయాలని దేవయాని, శైలేంద్ర నిర్ణయించుకుంటారు.
రంగా కోసం ప్రేమతో...
రంగా కోసం ప్రేమతో స్పెషల్‌గా డిన్నర్ ప్రిపేర్ చేసి తీసుకొస్తుంది సరోజ. మీ నాన్న రంగాతో వడ్డీల మీద వడ్డీలు కట్టించుకుంటున్నాడు. నువ్వేమో వాడి కోసం భోజనం తీసుకొస్తున్నావని సరోజపై రంగా నాయనమ్మ సెటైర్ వేస్తుంది. రంగా నా మెడలో మూడుముళ్లు వేస్తే వడ్డీలు కట్టనవసరం లేదని సరోజ అంటుంది. రంగాతో నా పెళ్లి జరిగితే...మా మధ్యలోకి వచ్చేవాళ్లు...మమ్మల్ని విడదీసేవాళ్లు ఎవరూ ఉండరని వసుధారను చూస్తూ కోపంగా అంటుంది సరోజ. తనను ఉద్దేశించే సరోజ అలా మాట్లాడుతుందని వసుధార అర్థం చేసుకుంటుంది.
రిషి ఇష్టాలేమిటో తెలుసు...
ఏం స్పెషల్స్ తీసుకొచ్చావని సరోజను అడుగుతూ అక్కడికి వచ్చిన రంగా...వసుధారను చూసి మౌనంగా ఉండిపోతాడు. నీకు ఇష్టమైన కర్రీ తీసుకొచ్చానని సరోజ అంటుంది. అదేమిటో గెస్ చేయమని రంగాను అడుగుతుంది. ఆలూ కర్రీ అని వసుధార బదులిస్తుంది. నా రిషికి బంగాళదుంప కర్రీ అంటే ఇష్టం. అతడు రంగా కాదు...రిషి అని అంటుంది. రిషి ఇష్టాలేమిటో నాకు తెలుసు అని సరోజకు బదులిస్తుంది వసుధార.
సరోజ ఫైర్...
వసుధార మాటలతో సరోజ కోపం పట్టలేకపోతుంది. ఆయన మీ రిషి సార్ కాదు..మా రంగా బావ అని అంటుంది. ఎన్ని సార్లు మొత్తుకున్నా నీకు అర్థం కాదా...ఆ రిషి ఎక్కడున్నాడో తెలుసుకొని అతడి దగ్గరకే వెళ్లమని వసుధారను హెచ్చరిస్తుంది సరోజ.
వసుధార అబద్ధం...
సరోజ మాటలతో వసుధార హర్ట్ అవుతుంది. అన్నం తిననని అంటుంది. ఆకలిగా లేదని అబద్ధం ఆడుతుంది. సరోజ తరఫున వసుధారకు రంగా క్షమాపణలు చెబుతాడు. అయినా వసుధార పట్టువీడాకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. వసుధార అన్నం తిననని అనడంతో రంగా కూడా తాను భోజనం చేయడానికి ఒప్పుకోడు.
వేరేవాళ్లు ఆకలిగా ఉంటే మనం ఎలా తినగలమని అంటాడు. వసుధార కోసం భోజనం తీసుకొని వస్తాడు రంగా. డిన్నర్ చేయమని ఆమెను బతిమిలాడుతాడు మీరు అనుకుంటున్నట్లు నేను మీ రిషిని కాదని, రంగానని వసుధారతో చెబుతాడు రంగా. కానీ వసు మాత్రం అతడి మాటలను నమ్మదు. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.