Guppedantha Manasu Serial: గుప్పెడంత మ‌న‌సు - వ‌సు, రంగా రిలేష‌న్‌పై స‌రోజ డౌట్ - శైలేంద్ర‌కు దేవ‌యాని ప‌నిష్‌మెంట్-guppedantha manasu june 17th episode ranga worried about vasudhara health ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu Serial: గుప్పెడంత మ‌న‌సు - వ‌సు, రంగా రిలేష‌న్‌పై స‌రోజ డౌట్ - శైలేంద్ర‌కు దేవ‌యాని ప‌నిష్‌మెంట్

Guppedantha Manasu Serial: గుప్పెడంత మ‌న‌సు - వ‌సు, రంగా రిలేష‌న్‌పై స‌రోజ డౌట్ - శైలేంద్ర‌కు దేవ‌యాని ప‌నిష్‌మెంట్

Nelki Naresh Kumar HT Telugu
Jun 17, 2024 08:49 AM IST

Guppedantha Manasu Serial: గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ జూన్ 17 ఎపిసోడ్‌లో మ‌ను తండ్రి మ‌హేంద్ర‌నే అనే నిజాన్ని లెట‌ర్ ద్వారా బ‌య‌ట‌పెడుతుంది వ‌సుధార‌. కానీ ఆ లెట‌ర్‌ను ఎవ‌రి కంట‌ప‌డ‌కుండా శైలేంద్ర కొట్టేస్తాడు. మ‌ను తండ్రి చ‌నిపోయాడ‌ని దొంగ లెట‌ర్ రాసి మ‌ను క్యాబిన్‌లో పెడ‌తాడు.

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్
గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్

Guppedantha Manasu Serial: కాలేజీ నుంచి వెళ్లిపోతూ మ‌ను తండ్రి మ‌హేంద్ర అనే లెట‌ర్ రాసిపెడుతుంది వ‌సుధార‌. ఆ లెట‌ర్‌ను ఎవ‌రూ చూడ‌కుండా కొట్టేస్తాడు శైలేంద్ర‌. వ‌సుధార రాసిన లెట‌ర్ చూసి దేవ‌యాని కూడా కంగారు ప‌డుతుంది. మ‌ను తండ్రి మ‌హేంద్ర అయి ఉండ‌ద‌ని, మ‌హేంద్ర క్యారెక్ట‌ర్ అలాంటిది కాద‌ని దేవ‌యాని సందేహం వ్య‌క్తం చేస్తుంది.

yearly horoscope entry point

క‌ళ్ల ముందు సాక్ష్యం క‌నిపిస్తుంటే నిజం కాద‌ని ఎలా అంటావ‌ని త‌ల్లితో అంటాడు శైలేంద్ర‌. ప‌క్కా బాబాయే మ‌ను తండ్రి అని, ఈ నిజం తాను ఎప్పుడో చెప్పాన‌ని కానీ నువ్వే న‌మ్మ‌లేద‌ని దేవ‌యానితో అంటాడు శైలేంద్ర‌. ఈ నిజం తెలిసిన వ‌సుధార మ‌ట్టిలో క‌లిసిపోయింది కాబ‌ట్టి మ‌న‌కు..అడ్డు అదుపు ఉండ‌ద‌ని శైలేంద్ర సంబ‌ర‌ప‌డ‌తాడు.

శైలేంద్ర దొంగ లెట‌ర్‌...

మ‌ను ప్ర‌శ్న‌కు స‌మాధానం దొరుకుతుంద‌ని వ‌సుధార కాలేజీ నుంచి వెళ్లిపోతూ చెప్పింది క‌దా...దానికి ఏం చేస్తావ‌ని కొడుకును అడుగుతుంది దేవ‌యాని. అందుకు నేను ఓ ప్లాన్ వేశాన‌ని శైలేంద్ర అంటాడు. వ‌సుధార పేరుతో దొంగ లెట‌ర్ రాస్తాడు శైలేంద్ర‌.

అందులో మీ తండ్రి గురించి నాకు నిజం తెలుసున‌ని, మీ తండ్రి మిమ్మ‌ల్ని వ‌దిలిపెట్టి వెళ్లిపోయాడ‌ని, ఆయ‌న‌ బ‌తికే లేడ‌ని, ఎప్పుడో చ‌నిపోయాడ‌ని ఆ లెట‌ర్‌లో రాస్తాడు శైలేంద్ర‌. తండ్రి చ‌నిపోయాడ‌ని తెలిస్తే ఆ బాధ‌ను మీరు త‌ట్టుకోలేర‌నే మీరు ఎన్నిసార్లు అడిగినా అనుప‌మ మేడ‌మ్ ఇన్నాళ్లు నిజం బ‌య‌పెట్ట‌లేద‌ని ఆ లెట‌ర్‌ను అబ‌ద్దాల‌తో నింపేస్తాడు శైలేంద్ర‌.

ఎండీ సీట్ కోరిక‌...

ప‌నిలో ప‌నిగా త‌న ఎండీ సీట్ కోరిక‌ను లెట‌ర్‌లో శైలేంద్ర‌లో రాస్తాడు. శైలేంద్ర‌కు మాత్ర‌మే ఎండీ సీట్‌లో కూర్చునే అర్హ‌త ఉంద‌ని రాస్తాడు. కానీ మ‌నుకు డౌట్ వ‌స్తుంద‌ని ఎండీ సీట్ గురించి రాసిన ప‌దాల్ని కొట్టేస్తాడు. మ‌ను వ‌స్తుండ‌టంతో ఆ లెట‌ర్‌ను అత‌డి టేబుల్‌పై పెట్టి ప‌క్క‌న దాక్కుంటాడు.

త‌న టేబుల్‌పై ఉన్న లెట‌ర్ చ‌దివి మ‌ను షాక‌వుతాడు. ఆ లెట‌ర్‌లోని కొట్టివేత‌లు చూసి ఖ‌చ్చితంగా ఆ లెట‌ర్ వ‌సుధార రాసి ఉండ‌డ‌ని మ‌ను అనుమాన‌ప‌తాడు.

కొడుకు చెంప ప‌గ‌ల‌గొట్టిన దేవ‌యాని...

మ‌ను తండ్రి చ‌నిపోయిన‌ట్లుగా శైలేంద్ర లెట‌ర్ రాశాడ‌ని విన‌గానే కొడుకు చెంప ప‌గ‌ల‌గొడుతుంది దేవ‌యాని. నీ తెలివి ఏడ్చిన‌ట్లుంద‌ని కొడుకుపై ఫైర్ అవుతుంది. నిజంగానే తండ్రి చ‌నిపోతే ఎప్పుడో కొడుకుకు అనుప‌మ ఈ నిజం చెప్పేద‌ని,ఆ లెట‌ర్ చూసి రాసింది వ‌సుధార కాద‌ని మ‌ను డౌట్ ప‌డ‌తాడ‌ని, ప‌క్క‌గా వ‌సుధార రాసిన లెట‌ర్ నీ ద‌గ్గ‌రే ఉంద‌ని మ‌నుకు ఈ పాటికే తెలిసి ఉంటుంద‌ని కొడుకుకు క్లాస్ ఇస్తుంది అనుప‌మ‌. ఈ లెట‌ర్ మ‌ను కంట ప‌డితే కొంప‌లు అంటుకుంటాయ‌ని దేవ‌యాని అంటుంది.

లెట‌ర్‌ను అస్త్రంగా చేసుకొని...

ఈ లెట‌ర్‌ను చింప‌కుండా దాచి నా ద‌గ్గ‌ర‌కు తీసుకొచ్చి మంచి ప‌నిచేశావ‌డ‌ని కొడుకుతో అంటుంది దేవ‌యాని. ఇక నుంచి ఏ నిర్ణ‌యం తీసుకున్న త‌న‌తో చెప్ప‌మ‌ని, మ‌నుతో జాగ్ర‌త్త‌గా మ‌సులుకోమ‌ని శైలేంద్ర‌కు వార్నింగ్ ఇస్తుంది దేవ‌యాని. వ‌సుధార రాసిన లెట‌ర్‌ను అస్త్రంగా వాడుకొని మ‌ను అడ్డు తొల‌గించుకోవాల‌ని శైలేంద్ర‌, దేవ‌యాని ఫిక్స‌వుతారు.

ధ‌ర‌ణి ఎంట్రీ...

అప్పుడే లోప‌లికి ఎంట్రీ ఇచ్చిన ధ‌ర‌ణి లెట‌ర్ గురించి శైలేంద్ర‌, దేవ‌యాని మాట్లాడుతోన్న మాట‌లు వింటుంది. ఏదో లెట‌ర్ గురించి మాట్లాడుతున్నార‌ని, అది ఏ లెట‌ర్ అని అడుగుతుంది. టాపిక్ డైవ‌ర్ట్ చేస్తాడు శైలేంద్ర‌. వ‌సుధార ఎక్క‌డికి వెళ్లిందో...ఏమైపోయింద‌ని మేము కంగారు ప‌డుతుంటే నువ్వు ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించ‌డం బాగాలేద‌ని అంటాడు.

వ‌సుధార వెళుతూ వెళుతూ ఎండీ సీట్ బాధ్య‌త‌లు ఎవ‌రికైనా అప్ప‌గించుకొండి నాకు సంబంధం లేద‌ని అన్న‌ది...అదేదో నా పేరులెట‌ర్‌లో రాసిన బాగుండేది అని శైలేంద్ర అంటాడు. కొంప‌దీసి ఆ లెట‌ర్‌లో మ‌ను పేరు రాసిందా అని భ‌ర్త‌తో అంటుంది ధ‌ర‌ణి. ఆమె మాట‌లు విన‌గానే శైలేంద్ర కోపం ప‌ట్ట‌లేక‌పోతాడు. కానీ ఏం చేయ‌లేక బ‌తిమిలాడి అక్క‌డి నుంచి ధ‌ర‌ణిని పంపిస్తాడు.

మైమ‌ర‌చిపోయిన రంగా...

రిషి గురించి వ‌సుధార క‌ల‌వ‌రిస్తుంటుంది. వ‌సుధార ప‌క్క‌న కూర్చున్న రంగా ఆమెను చూస్తూ ఉండిపోతాడు. స‌రోజ వ‌చ్చిన ప‌ట్టించుకోడు. అది చూసి స‌రోజ స‌హించ‌లేక‌పోతుంది. ఏం చేస్తున్నావు, చూస్తున్నావ‌ని నిల‌దీస్తుంది. అంత‌లా మైమ‌రిచిపోయి చూసేంత అందంగా వ‌సుధార ఉందా అని బావ‌తో గొడ‌వ‌ప‌డుతుంది స‌రోజ‌.

వ‌సుధార ముందే తెలుసా...

వ‌సుధార నీకు ముందే తెలుసా అని రంగాని అడుగుతుంది స‌రోజ‌. త‌న‌కు ప‌రిచ‌యం లేద‌ని, వ‌సుధార ఎవ‌రో కూడా తెలియ‌ద‌ని రంగా అంటాడు. పెళ్లానికి బాగోక పోతే మొగుడు ద‌గ్గ‌రుండి స‌ప‌ర్య‌లు చేస్తున్న‌ట్లు మ‌రి వ‌సుధార‌కు ఎందుకు సేవ‌లు చేస్తున్నావ‌ని రంగాతో అంటుంది స‌రోజ‌.

వ‌సుధార చిన్న‌గా మూలిగితే కంగారు ప‌డిపోతున్నాడు. చిన్న అలికిడి అయితే ఎందుకు ప‌రిగెత్తుకుంటూవ‌స్తున్నావ‌ని రంగాను అడుగుతుంది స‌రోజ‌. వ‌సుధార నీకు ముందే తెలుసు అని నిజం బ‌య‌ట‌ప‌డితే ఆమెను ఒక్క క్ష‌ణం కూడా ఇంట్లో ఉండ‌నివ్వ‌న‌ని స‌రోజ వార్నింగ్ ఇస్తుంది.

స‌రోజ‌పై ఫైర్‌...

వ‌సుధార నిద్ర‌పోతుంద‌ని, ఆమెను ఇబ్బంది పెట్ట‌కుండా ఇక్క‌డి నుంచి వెళ్లిపొమ్మ‌నిపై స‌రోజ‌పై కోప్ప‌డుతాడు రంగా. అత‌డి మాట‌ల‌తో స‌రోజ అలుగుతుంది. వ‌సుధార‌కు త‌న బ‌ట్ట‌లు కూడా ఇవ్వ‌న‌ని రంగాతో అంటుంది. స‌రోజ‌ను బుజ్జ‌గించి ఆమె కోపాన్ని త‌గ్గిస్తాడు రంగా.

వ‌సుధార దొంగ‌నో, క్రిమిన‌లో అయ్యి ఉంటుంద‌ని, ఆమెకు ఆమెను రౌడీలు త‌రిమి ఉంటార‌ని స‌రోజ అనుమానం వ్య‌క్తం చేస్తుంది. మేడ‌మ్ అలా క‌నిపించ‌డం లేద‌ని, మంచిదానిలా క‌నిపిస్తుంద‌ని రంగా చెబుతాడు. అక్క‌డితో నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ ముగిసింది.

Whats_app_banner