Guppedantha Manasu June 16th Episode: మ‌హేంద్ర‌కు అబ‌ద్దం చెప్పిన వ‌సుధార - రిషి జీవితంలో కొత్త అధ్యాయం మొద‌లు-guppedantha manasu june 16th episode mahendra requests to vasudhara for rishi address ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu June 16th Episode: మ‌హేంద్ర‌కు అబ‌ద్దం చెప్పిన వ‌సుధార - రిషి జీవితంలో కొత్త అధ్యాయం మొద‌లు

Guppedantha Manasu June 16th Episode: మ‌హేంద్ర‌కు అబ‌ద్దం చెప్పిన వ‌సుధార - రిషి జీవితంలో కొత్త అధ్యాయం మొద‌లు

HT Telugu Desk HT Telugu
Published Jun 16, 2023 08:14 AM IST

Guppedantha Manasu June 16th Episode: రిషిని వెతుక్కుంటూ వ‌సుధార ప‌నిచేస్తోన్న కాలేజీకి వ‌స్తాడు మ‌హేంద్ర‌. రిషి గురించి అడుగుతాడు. కానీ రిషి అక్క‌డే ప‌నిచేస్తోన్న విష‌యం మ‌హేంద్ర ద‌గ్గ‌ర దాచిపెడుతుంది వ‌సుధార‌. అబ‌ద్దం ఆడుతుంది.

గుప్పెడంత మ‌న‌సు
గుప్పెడంత మ‌న‌సు

Guppedantha Manasu June 16th Episode: వ‌సుధార అడ్రెస్ క‌నిపెట్టిన మ‌హేంద్ర ఆమెను వెతుక్కుంటూ కాలేజీకి వ‌స్తాడు. అక్క‌డ తండ్రిని చూసిన రిషి ఎమోష‌న‌ల్ అవుతాడు. డాడ్ అని పిలుస్తాడు. కానీ దోషిగా ముద్ర‌ప‌డిన త‌న‌ను చూసి తండ్రి ఎక్క‌డ బాధ‌ప‌డుతాడో అని మ‌హేంద్ర‌కు క‌నిపించ‌కుండా రిషి దాక్కుంటాడు.

వ‌సుధార కోసం అక్క‌డి లెక్చ‌ర‌ర్స్‌ను ఎంక్వైరీ చేస్తాడు మ‌హేంద్ర‌. వ‌సుధార ఒక్క‌డే ప‌నిచేస్తుంద‌ని ఆ లెక్చ‌ర‌ర్స్ అత‌డితో చెబుతారు. వ‌సుధార కోసం మ‌హేంద్ర వ‌చ్చాడ‌ని తెలియ‌గానే రిషి ఆలోచ‌న‌లో ప‌డ‌తాడు. త‌న‌కోస‌మే వ‌చ్చాడా? నేను ఇదే కాలేజీలో ప‌నిచేస్తున్న విష‌యం మ‌హేంద్ర‌తో వ‌సుధార చెప్పిందా అని టెన్ష‌న్ ప‌డ‌తాడు.

పాండ్యన్ ప్లాన్…

రిషి, వ‌సుధార రిలేష‌న్‌షిప్‌పై పాండ్య‌న్‌కు అనుమాన‌మ‌స్తుంది. కొత్త‌గా కాలేజీలో జాయిన్ అయినా వారిద్ద‌రూ చాలా రోజులుగా ప‌రిచ‌యం ఉన్న‌ట్లు మాట్లాడుకుంటున్నార‌ని డౌట్ ప‌డ‌తాడు. వారి మ‌ధ్య ఏదో ఉంద‌ని అనుకుంటాడు. ఆ బంధం ఏమిటో తెలిస్తే రిషితో పాటు వ‌సుధార‌పై రివేంజ్ తీర్చుకోవ‌చ్చ‌ని భావిస్తాడు. తాము అనుభ‌వించిన బాధ కంటే ప‌ది రేట్లు రిషి, వ‌సుధార అనుభ‌వించేలా చేయాల‌ని డిసైడ్ అవుతారు. ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న మిస్ట‌రీనే త‌మ‌ ఆయుధమ‌ని, కేడీ బ్యాచ్‌తో పెట్టుకుంటే ఏమ‌వుతుందో రిషి, వ‌సుధార‌ల‌కు చూపిస్తాన‌ని పాండ్య‌న్ ఛాలెంజ్ చేస్తాడు.

రిషి ఫైర్‌...

మ‌హేంద్ర కంటే ముందుగా వ‌సుధార‌ను క‌లుస్తాడు రిషి. అత‌డు కంగారుప‌డ‌టం చూసి ఏమైంద‌ని వ‌సుధార అడుగుతుంది. వ‌చ్చిరావ‌డంతోనే వ‌సుధార‌పై విరుచుకుప‌డ‌తాడు రిషి. చేసిందంతా చేసి ఏం తెలియ‌న‌ట్లుగా నాట‌కాలు ఆడుతున్నావా అంటాడు. నేను ఇక్క‌డ ఉన్న విష‌యం తండ్రి మ‌హేంద్ర‌కు ఎలా తేలిసింద‌ని ఫైర్ అవుతాడు. మ‌హేంద్ర‌కు తాను చెప్ప‌లేద‌ని వ‌సుధార అంటోన్న రిషి మాత్రం ఆమె మాట‌ల‌ను న‌మ్మ‌డు. అబ‌ద్దాలు ఆడ‌టం, మోసం చేయ‌డం నీకేం కొత్త కాదు క‌దా. ఫేక్ ప్రామిస్‌లు చేయ‌డం, ఇచ్చిన మాట మీద నిల‌బ‌డ‌క‌పోవ‌డం నీకు అల‌వాటే క‌దా అని కోప‌గించుకుంటాడు.

వ‌సుధార‌కు వార్నింగ్‌...

నువ్వు చెప్ప‌క‌పోతే మ‌హేంద్ర‌కు మ‌నం ఇక్క‌డున్న విష‌యం ఎలా తెలుస్తుంద‌ని వ‌సుధార‌పై ఎగిరిప‌డ‌తాడు.నా అడ్ర‌స్ ఎవ‌రికి చెప్పొద్ద‌ని ఇదివర‌కే నీతో అన్నాను. ఒక‌వేళ నా గురించి నువ్వే నాన్న‌కు చెప్పావ‌ని తెలిసినా, నీ వ‌ల్ల ఆయ‌న ఇక్క‌డ‌కు వ‌చ్చార‌ని తెలిసినా జీవితంలో నీ మొహం చూడ‌ను అని వార్నింగ్ ఇస్తాడు. అల్రెడీ ఒక‌సారి త‌ప్పు చేసి శిక్ష అనుభ‌విస్తాను. మ‌ళ్లీ త‌ప్పు చేసే ధైర్యం చేయ‌న‌ని వ‌సుధార అంటూ వ‌సుధార ఎమోష‌న్ అవుతుంది. ఇంత‌లోనే మ‌హేంద్ర అక్క‌డ‌కు వ‌స్తుంటాడు. అది గ‌మ‌నించిన రిషి అక్క‌డే ఉన్న ఓ బోర్డ్ చాటు దాక్కుంటాడు.

మ‌హేంద్ర క్లాస్‌...

మ‌హేంద్ర ద‌గ్గ‌ర‌కు రాగానే బాగున్నారా సార్ అని అత‌డిని అడుగుతుంది వ‌సుధార‌. బాధ‌లో ఉన్న‌వాడిని బాగున్నారా అని అడ‌గ‌టం మూర్ఖ‌త్వం అంటూ మ‌హేంద్ర కూడా వ‌సుధార‌కు క్లాస్ ఇస్తాడు. రిషి గురించి తెలుసుకోవ‌డానికే ఇక్క‌డ‌కు వ‌చ్చాన‌ని వ‌సుధార‌తో అంటాడు మ‌హేంద్ర‌. రిషి ఎక్క‌డున్నాడో చెప్ప‌మ‌ని అడుగుతాడు. రిషి అదే కాలేజీలో ప‌నిచేస్తోన్న విష‌యం దాచిపెట్టిన వ‌సుధార త‌న‌కు తెలియ‌ద‌ని మ‌హేంద్ర‌కు స‌మాధానం ఇస్తుంది.

ఏమైపోయాడ‌ని అడిగినా అదే ఆన్స‌ర్ ఇస్తుంది. కానీ వ‌సుధార నిజం దాచిపెడుతుంద‌ని మ‌హేంద్ర క‌నిపెడ‌తాడు. మాట‌ల్లో బెరుకు చూస్తేనే అర్థ‌మ‌వుతుంది నువ్వు అబ‌ద్దం చెబుతున్నావ‌ని అంటాడు. రిషి ఎక్క‌డున్నాడ‌ని క‌న్నీళ్ల‌తో వ‌సుధార‌కు రిక్వెస్ట్ చేస్తాడు మ‌హేంద్ర‌. కానీ మీరు ఎన్నిసార్లు అడిగినా తెలియ‌ని విష‌యం ఎలా చెబుతాన‌ని వ‌సుధార అంటుంది.

వ‌సుధార అబ‌ద్దం...

రిషి గురించి తెలియ‌క‌పోతే నాకు ఫోన్ ఎందుకు చేశావు? నేను తిరిగి ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయ‌లేద‌ని వ‌సుధార‌పై మ‌హేంద్ర సీరియ‌స్ అవుతాడు.నా మ‌న‌సుకు అనిపించింది. అందుకే ఫోన్ చేశాన‌ని మ‌హేంద్ర‌కు స‌మాధాన‌మిస్తుంది వ‌సుధార‌. కానీ ఆమె మాట‌ల్ని అబ‌ద్దం అని కొట్టిపారేస్తాడు మ‌హేంద్ర‌. ఇలా అబ‌ద్దాలు ఆడే నువ్వు, జ‌గ‌తి క‌లిసి రిషిని దోషిని చేశార‌ని, అబ‌ద్దాలు ఆడే మోస‌గాడిని చేశార‌ని ఫైర్ అవుతాడు.

రిషి క‌ష్ట‌ప‌డి నిర్మించుకున్న డీబీఎస్‌టీ సామ్రాజ్యానికి దూరం చేశారు. చివ‌ర‌కు ఈ క‌న్న తండ్రికి దూరం చేశార‌ని మ‌హేంద్ర ఎమోష‌న్ అవుతాడు. స‌మాజం అంగీక‌రించ‌క‌పోయినా నీ మ‌న‌సు అర్థం చేసుకొని నిన్ను భార్య‌గా స్వీక‌రించాడు అదేనా రిషి చేసినా పాపం. న‌లుగురు వేలేత్తి చూపినా నిన్ను ఇంట్లోను, గుండెల్లో పెట్టుకొని చూశాడు. అదేనా రిషి చేసిన పాపం. ఎందుకు రిషికి న‌మ్మ‌క‌ద్రోహం చేశారు? ఏ ఉద్దేశంతో చేశారు అని వ‌సుధార‌ను మ‌హేంద్ర క‌డిగిప‌డేస్తాడు.

రిషి చేసిన పాపం...

కానీ వ‌సుధార మాత్రం స‌మాధానం చెప్ప‌కుండా సైలెంట్‌గా ఉంటుంది. అక్క‌డ జ‌గ‌తి చెప్ప‌క‌, నువ్వు చెప్ప‌క నేను ఏమ‌నుకోవాల‌ని వ‌సుధార‌పై కోప‌గించుకుంటాడు. ఎవ‌రి స్వార్థం కోసం రిషి బ‌లైపోయాడో చెప్ప‌మ‌ని వ‌సుధార‌ను అడుగుతాడు. రిషి గురించి ఏ చిన్న స‌మాచారం తెలిసిన ఈ తండ్రి వాడి కోసం ఎదురుచూస్తున్నాడ‌ని చెప్పు అని క‌న్నీళ్లు పెట్టుకుంటాడు మ‌హేంద్ర‌. రిషి ఇక్క‌డే ఎక్క‌డో ఉన్నాడ‌ని నా మ‌న‌సు చెబుతోంది. రిషిని మోసం చేసిన‌ట్లే న‌న్ను మోసం చేయ‌ద్ద‌ని వేడుకుంటాడు. రిషి క‌నిపిస్తే చెప్ప‌మ‌ని ఆమెకు దండం పెడ‌తాడు. అక్క‌డే ఉన్న రిషి తండ్రి బాధ చూసి ఎమోష‌న్ అవుతాడు. మాట‌ల రాక అక్క‌డే కుప్ప‌కూలిపోతాడు.

జ‌గ‌తి టెన్ష‌న్‌...

మ‌హేంద్ర బాధ‌గా ఇంట్లో అడుగుపెట్ట‌డం చూసి జ‌గ‌తి కంగారు ప‌డుతుంది. వ‌సుధార‌ను క‌లిశావా? రిషి గురించి ఏమైనా చెప్పిందా? ప్ర‌శ్నల వ‌ర్షం కురిపిస్తుంది. జ‌గ‌తితో మాట్లాడ‌టానికి మ‌హేంద్ర ఇష్ట‌ప‌డ‌డు. నా క‌ళ్ల‌ల్లో నీళ్లు గ‌మ‌నించి కూడా ఇన్ని ప్ర‌శ్న‌లు ఎవ‌రైనా అడుగుతారా అని అక్క‌డే ఉన్న ధ‌ర‌ణితో అంటాడు మ‌హేంద్ర‌. క‌న్న కొడుకును చూస్తాన‌నే ఎన్నో ఉహ‌ల‌తో ఇక్క‌డి నుంచి బ‌య‌లుదేరాన‌ని, కానీ అన్నీ గాలిలో క‌లిసిపోయాన‌ని అంటాడు.

రిషి గురించి ఏం తెలియ‌ద‌ని వ‌సుధార చెప్పింద‌ని స‌మాధాన‌మిస్తాడు. దీనికి అంత‌టికి కార‌ణం జ‌గ‌తినే, నా కొడుకును నాకు దూరం చేసి పాపం మూట‌గ‌ట్టుకుంద‌ని అంటాడు. ఒక తండ్రి గుండెకోత‌కు కార‌ణ‌మైంద‌ని జ‌గ‌తిని అవ‌మానిస్తాడు. రిషి కోసం వెతికి అలిసిపోయాన‌ని ఎమోష‌న్ అవుతాడు. ఇన్నేళ్ల‌యినా క‌న్నీళ్లు, క‌డుపుకోత త‌ప్ప ఏం మిగ‌ల‌లేద‌ని బ‌దులిస్తాడు. రిషిని ఎప్పుడు చూస్తానో తెలియ‌ద‌ని వేద‌న‌కు లోన‌వుతాడు.

కొత్త రుషేంద్ర భూష‌ణ్‌...

వ‌సుధార నీ పేరు వింటేనే నా ఊపిరి ఆగిపోయినంత ప‌నైపోతుంది. నీ మ‌న‌సులో నా మీద ఉన్న ప్రేమ చెరిగిపోలేద‌ని, ఇప్ప‌టికీ రిషి సార్‌లా చూసే నీ చూపు మారాలి. అలా జ‌ర‌గాలంటే తాను స‌రికొత్త‌గా క‌నిపించాల‌ని రిషి అనుకుంటాడు. వ‌సుధార మ‌న‌సులో ఉన్న త‌న స్థానాన్ని తానే చెరిపివేయాల‌ని అనుకుంటాడు.

తాను ప్ర‌శాంతంగా నిద్ర‌పోవాలంటే గ‌తం త‌న‌ను వెంటాడ‌కూడ‌ద‌ని అనుకుంటాడు. వ‌సుధారతో పాటు ఆమె చూపు త‌న‌ను డిస్ట్ర‌బ్ చేయ‌కూడ‌ద‌ని, వ‌సుధార క‌ళ్ల‌లో త‌న‌పై ఉన్న ప్రేమ క‌నిపించ‌కూడ‌ద‌ని ఫిక్స్ అవుతావు. పాత రుషేంద్ర భూష‌ణ్ అధ్యాయం ముగిసిపోయేలా చేయాల‌ని అనుకుంటాడు. వ‌సుధార మ‌న‌సులో ఉన్న త‌న జ్ఞాప‌కాల్ని చెరిపివేయాల‌ని నిర్ణ‌యించుకుంటాడు. అక్క‌డితో నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ ముగిసింది.

Whats_app_banner