Guppedantha Manasu Serial: డీబీఎస్టీ కాలేజీని వదిలిపెట్టాలని వసుధార నిర్ణయించుకుంటుంది. ఆ నిర్ణయాన్ని బోర్డ్ మీటింగ్‌లోనే అందరి ముందు చెప్పాలని అనుకుంటుంది. తనపై నమ్మకంతో రిషి ఎండీ సీట్‌ను అప్పగించిన విషయం గుర్తుచేసుకుంటుంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టలేకపోయానని ఎమోషనల్ అవుతుంది వసుధార. రిషి ఫొటోను చూస్తూ అతడిని క్షమించమని వేడుకుంటుంది.
బోర్డ్ మీటింగ్‌లో వసుధార తీసుకునే నిర్ణయం ఏమిటో తెలుసుకోవాలని మను అనుకుంటాడు. ఎంత అడిగినా బోర్డ్ మీటింగ్‌లోనే మీ ప్రశ్నలు అన్నింటికి సమాధానం దొరుకుతుందని మనుకు బదులిస్తుంది వసుధార. మీ చిరకాల అన్వేషణకు ఆన్సర్ కూడా తెలుస్తుందని అంటుంది.
బోర్డ్ మీటింగ్‌కు వచ్చిన వసుధార డీబీఎస్టీ కాలేజీతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని కన్నీళ్లు పెట్టుకుంటుంది. అమ్మ తనకు జన్మనిస్తే...డీబీఎస్‌టీ కాలేజీ తనకు పునర్జన్మనిచ్చిందని చెబుతుంది. డీబీఎస్‌టీ కాలేజీనే తనకు రిషిని పరిచయం చేసిందని, అతడితో పాటు జగతి, మహేంద్ర, ఫణీంద్రలను ఆప్తులను చేసిందని చెబుతూ ఎమోషనల్ అవుతుంది.
డీబీఎస్టీ కాలేజీకి తాను దూరం కాబోతున్నట్లు చెబుతుంది. ఆమె మాటలతో బోర్డ్ మీటింగ్‌లోని అందరూ షాకవుతారు. ఎండీ సీట్‌కు రాజీనామా చేసినట్లు చెబుతుంది వసుధార. రిజైన్ లెటెర్‌ను మినిస్టర్‌కు ఇస్తుంది. వసుధార చెబుతుంది నిజమో కలో అర్థం కాక శైలేంద్ర కన్ఫ్యూజ్ అవుతాడు. తనను తాను గిల్లి చూసుకుంటాడు. వసుధార చెప్పింది నిజమేనని తెలిసి సంబరపడతాడు.
ఎవరికి ఒక్క మాట కూడా చెప్పకుండా ఎలా ఎండీ పదవికి రిజైన్ చేస్తావని వసుధారపై ఫణీంద్ర ఫైర్ అవుతాడు. వసుధారకు నచ్చజెప్పి ఆ రిజైన్ లెటెర్‌ను వెనక్కి తీసుకునేలా తాను చేస్తానని మహేంద్ర అంటాడు. ఆ లెటెర్‌ను చించేయమని వసుధారతో అంటాడు. లేదంటే నేను చించేస్తానని చెబుతాడు. తాను చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నానని, పూర్తి స్పృహలో ఉండి రిజైన్ లెటర్ రాశానని వసుధార అంటుంది.
ఈ నిర్ణయాన్ని కాదనకూడదు...కాదనలేరు అని అంటుంది. నువ్వు ఆవేశంలో ఉండి ఇవన్నీ మాట్లాడుతున్నావని, తర్వాత దీని గురించి మాట్లాడుకుందామని, ముందు రిజైన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని మహేంద్ర, అనుపమ కలిసి వసుధారకు నచ్చజెపుతారు. కానీ వసుధార మాత్రం తన మాట మీదే నిలబడుతుంది.
కాలేజీకి ఎగ్జామినేషన్ సెంటర్ మిస్సవ్వడంతోనే తాను నిన్న బోర్డ్ మీటింగ్‌లో కోపంగా మాట్లాడానని, ఆ మాటల వల్ల నొచ్చుకొని రిజైన్ చేయాలని నిర్ణయం తీసుకోవద్దని మినిస్టర్ అంటాడు. నీ సారథ్యంలో కాలేజీపై మచ్చ పడకూడదనే అలా అన్నానని వసుధారకు మినిస్టర్ కూడా సారీ చెబుతాడు.
అందరూ కలిసి వసుధార మనసు మార్చేస్తుండటంతో శైలేంద్ర టెన్షన్ పడతాడు. ఏదో బలమైన కారణంతోనే వసుధార జాబ్‌కురిజైన్ చేయాలని నిర్ణయించుకొని ఉండొచ్చని, ఆమెను బలవంతపెట్టడం కరెక్ట్ కాదని చెబుతాడు. ఆమె రాజీనామాను ఆమోదించడమేమంచిదని అని అంటాడు. కొడుకు మాటలతో ఫణీంద్ర ఫైర్ అవుతాడు.
వసుధారను జాబ్‌కు రిజైన్ చేయద్దని ఫణీంద్ర, మహేంద్ర రిక్వెస్ట్ చేస్తారు. ఇక్కడ ఉన్నవాళ్లలో నీకు మాత్రమే ఎండీ సీట్‌లో కూర్చునే అర్హత ఉందని, అందుకే నిన్ను ఎండీ సీట్‌లో రిషి కూర్చుండబెట్టాడని వసుధారతో చెబుతాడు మహేంద్ర.
రిషి కనిపించకుండా పోయి చాలా రోజులు అయినా అతడు బతికే ఉన్నాడని తాను ప్రూవ్ చేయలేకపోయానని వసుధార అంటుంది. కనీసం రిషి బతికి ఉన్నాడని నమ్మకాన్ని కూడా మీలో నిలబెట్టలేకపోయానని వసుధార కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆ విషయంలో తాను ఎండీ సీట్‌కు అనర్హురాలిగా భావిస్తున్నట్లు వసుధార చెబుతుంది. రిషి బతికి ఉన్నాడని నేను అనుకుంటున్నాను. మీరు రిషి చనిపోయాడని నమ్ముతున్నారు. నా నమ్మకం ఒకటి.... మీరు నమ్మేది ఒకటి ఇలాంటి చోట నేను ఎలా పనిచేయగలనని వసుధార బోర్డ్ మెంబర్స్‌తో చెబుతుంది వసుధార.
ఈ విషయంలో మేము ఏం చేయాలో చెప్పమని వసుధారను మినిస్టర్ అడుగుతాడు. మా నిర్ణయాలను మార్చుకోమని అంటున్నావా అని అంటాడు. రిషి బతికి ఉన్నాడని మీరు నమ్ముతారా అని అందరిని అడుగుతుంది వసుధార. అలా ఎలా నమ్ముతాం. మేము నమ్మినంత మాత్రానా రిషి తిరిగి వస్తాడా అని శైలేంద్ర అంటాడు.
రిషి పేరుతో వసుధార ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తుందని మరో బోర్డ్ మెంబర్ ఫైర్ అవుతాడు. మీరు బ్లాక్‌మెయిల్ చేసినంత మాత్రానా చనిపోయిన వ్యక్తిని బతికి ఉన్నాడని చెప్పలేముగా అని అంటారు.
రిషి బతికి ఉన్నాడని ఇక్కడ ఎవరికి నమ్మకం లేదని వసుధార అంటుంది. రిషి బతికి ఉన్నాడని నమ్మకం లేనిచోట వసుధార కూడా చనిపోయినట్లేనని అంటుంది. ప్రాణాలు లేని చోట జీవఛ్చవంలా తాను ఉండలేనని అంటుంది. అందుకే ఎండీ పదవికి రాజీనామా చేసినట్లు చెబుతుంది. తన రిజైన్‌ను ఎవరూ కాదనకూడదని అంటుంది.
నీ తర్వాత ఎండీ సీట్‌లో కూర్చొనే అర్హత ఎవరికి లేదని, అందుకే ఆ పదవిలో నువ్వే కొనసాగాలని వసుధారతో అంటాడు మినిస్టర్. నా తర్వాత ఆ పదవిలో ఎవరు కూర్చున్న తనకు అవనసరమని, అది నాకు సంబంధంలేని విషయమని కఠినంగా సమాధానమిస్తుంది వసుధార. నెక్స్ట్ ఎండీని వారసత్వంగానా...ఎన్నికల ద్వారానా ఎలా ఎన్నుకోవాలన్నది మీరే నిర్ణయించుకోమని చెబుతుంది.
అందరికి థాంక్యూ చెప్పి బోర్డ్ మీటింగ్ నుంచి వెళ్లడానికి సిద్ధమవుతుంది. ఆమెను ఆపడానికి మహేంద్ర, అనుపమ ప్రయత్నిస్తారు. నా వెనుక ఎవరూ రావొద్దని...వస్తే తాను చచ్చినంత ఒట్టే అని వసుధార అంటుంది. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.