Guppedantha Manasu Today Episode: దేవయానికి దొరికిపోయిన రంగా - శైలేంద్రను భయపెట్టిన ధన్‌రాజ్ - వసు కన్నీళ్లు
గుప్పెడంత మనసు జూలై 8 ఎపిసోడ్ లో సరోజను పెళ్లిచూపులు చూడటానికి శైలేంద్ర, దేవయానిలతో కలిసి ధన్‌రాజ్ వస్తాడు. ఈ పెళ్లిచూపులను చెడగొట్టేందుకు రంగాతో సరోజ క్లోజ్‌గా దిగిన ఫొటోలను శైలేంద్ర, దేవయానిలకు చూపిస్తాడు బుజ్జి. ఆ ఫొటోల్లో రిషి పోలికలతో ఉన్న రంగాను చూసి ఇద్దరు షాకవుతారు.
Guppedantha Manasu Today Episode: ఎమ్ఎస్ఆర్ శిష్యుడు ధన్‌రాజ్... శైలేంద్ర దగ్గరికి వస్తాడు. తన బ్యాక్‌గ్రౌండ్ చూసి ఎవరూ పిల్లను ఇవ్వడం లేదని బాధపడతాడు. అమ్మనాన్న లేని ఒంటరినివాడిని కావడంతో పెళ్లిచూపుల్లో అందరూ తనను రిజెక్ట్ చేస్తున్నారని శైలేంద్రతో అంటాడు ధన్‌రాజ్. పెళ్లికోసం ఓ అబద్ధం ఆడానని, నిన్ను అన్నయ్యగా, దేవయాని మేడమ్‌ను నా తల్లిగా పెళ్లి కూతురు కుటుంబానికి పరిచయం చేశానని, వారికి మనం ముగ్గురం కలిసి దిగిన ఫొటోను పంపించానని శైలేంద్రతో అంటాడు ధన్‌రాజ్.

తాను మార్ఫింగ్ చేసిన ఫొటోను చూపిస్తాడు. అచ్చం ఒరిజినల్‌లానే ఆ ఫొటో ఉండటం శైలేంద్ర షాకవుతాడు. తాను పెళ్లిచేసుకోబోయే అమ్మాయి ఫొటోను దేవయాని, శైలేంద్రలకు చూపిస్తాడు. ఆ ఫొటోలో సరోజ కనిపిస్తుంది.
ధన్‌రాజ్ బ్లాక్‌మెయిల్....
నా పెళ్లిని దగ్గరుండి మీరే ఫిక్స్ చేయాలని శైలేంద్ర, దేవయానిలను అడుగుతాడు ధన్‌రాజ్. అందుకు శైలేంద్ర ఒప్పుకోడు. ఎండీ సీట్ కోసం మీరు చేసిన కుట్రలు, కుతంత్రాలు అన్ని నాకు తెలుసునని, నాతో పాటు పెళ్లిచూపులకు రాకపోతే అవన్నీ బయటపెడతానని శైలేంద్ర, దేవయానిలను బ్లాక్‌మెయిల్ చేస్తాడు ధన్‌రాజ్. అతడి బెదిరింపులతో శైలేంద్ర, దేవయాని భయపడతారు. ధన్‌రాజ్‌తో కలిసి పెళ్లిచూపులకు వెళ్లడానికి అంగీకరిస్తారు.
రంగా అబద్ధం...
రంగా కోసం కాఫీ తయారుచేస్తుంది వసుధార. తనకు కాఫీ అలవాటులేదని రంగా అంటాడు. తాను కష్టపడి తయారుచేశానని, ఒక్కసారి టేస్ట్ చూస్తే మళ్లీ వదలరని వసుధార పట్టుపడుతుంది. చివరకు రంగా కాఫీ తాగడానికి ఒప్పుకుంటాడు. కాఫీ టేస్ట్ చూసి యాక్...అస్సలు బాగాలేదని రంగా అంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన రాధమ్మ కాఫీ టేస్ట్ అమృతంలా ఉందని వసుధారను మెచ్చుకుంటుంది.
ఎన్నాళ్లు నాకు ఈ శిక్ష...
రంగాకు కాఫీ అంటే ఇష్టమనే నిజాన్ని బయటపెడుతుంది రాధమ్మ. కాఫీ అంటే ఇష్టం ఉండి కూడా లేదని తనతో ఎందుకు అబద్ధం ఆడారని రంగాతో వాదిస్తుంది వసుధార. తన ఇష్టాలు ఇప్పుడు మార్చుకున్నానని రంగా బదులిస్తాడు. వ
సుధార మీ ప్రాణం కదా ఎదురుగానే పెట్టుకొని ఆమెను ఎందుకు గుర్తుపట్టడం లేదు... ఇంకా ఎన్నాళ్లు నాకు ఈ శిక్ష.. నా ప్రాణమైన.రిషి నన్ను పరాయిదానిలా చూస్తే ప్రాణం పోతున్నట్లుగా ఉందని మనసులో అనుకుంటూ వసుధార ఎమోషనల్ అవుతుంది. వసుధార కన్నీళ్లు చూసి రిషి కంగారుపడతాడు.
కాఫీ బాగాలేదని అన్నందుకే వసుధార కన్నీళ్లు పెట్టుకుందని రిషి అనుకుంటాడు. కాఫీ నిజంగానే అద్భుతంగా ఉందని వసుధారతో అంటాడు రిషి.
శైలేంద్ర చిరాకు...
ధన్‌రాజ్‌తో కలిసి పెళ్లిచూపులకు బయలుదేరుతారు శైలేంద్ర, దేవయాని. శైలేంద్ర చిరాకుగా ఉండటం చూస్తాడు ధన్‌రాజ్. మీరు ఇలా చిరాకుగా ఉంటే నా అన్నయ్య కాదనే నిజం పెళ్లిచూపుల్లో బయటపడుతుందని, అదే జరిగితే మీ ఇంట్లోనే నా శవాన్ని చూస్తారని శైలేంద్రను భయపెడతాడు ధన్‌రాజ్.
సరోజ తండ్రి సంజీవకు ఫోన్ చేసి అడ్రెస్ కనుక్కుంటాడు ధన్‌రాజ్. బుజ్జితో కలిసి ఈ పెళ్లిచూపులను చెడగొట్టేందుకు సరోజ ప్లాన్ చేస్తుంది. పెళ్లిచూపుల కోసం ఇంటి వరకు ధన్‌రాజ్ రాకుండా చేయాలని ఫిక్సవుతుంది.
పెళ్లిచూపులకు వసుధార, రంగా...
సరోజ పెళ్లిచూపులకు వెళదామని రంగాను అడుగుతుంది రాధమ్మ. తాను మాత్రం రానని రంగా నానమ్మకు బదులిస్తాడు. సంజీవి పెళ్లిచూపులకు పిలిచిన తీరు బాగాలేదని అంటాడు. అంతే కాకుండా పెళ్లిచూపులకు వచ్చిన వారికి తనకు బావ అంటే ఇష్టమని సరోజ చెబితే గొడవలు జరుగుతాయని, తన వల్లే కూతురు పెళ్లి చెడిపోయిందని సంజీవ మరింతగా అవమానిస్తాడని రంగా అంటాడు.
తన బదులుగా వసుధారను పెళ్లిచూపులకు తీసుకెళ్లమని నాన్నమతో చెబుతాడు రంగా. వసుధార ఎవరు అని అడిగితే ఏమని సమాధానం చెబుతానని, ఇప్పటికే వసుధార మన ఇంట్లో ఉండటంపై ఊళ్లో వాళ్లకు చాలా అనుమానాలు ఉన్నాయని రాధమ్మ అంటుంది.దాంతో నాయనమ్మను పెళ్లిచూపులకు పంపిస్తాడురంగా. తాను తర్వాత వస్తానని అంటాడు.
బుజ్జి ప్లాన్...
శైలేంద్ర, ధన్‌రాజ్ కారును అడ్డగిస్తాడు బుజ్జి. తాను సరోజను ప్రేమించానని అబద్ధం ఆడుతాడు. సరోజను పెళ్లి చేసుకుంటే నువ్వు జీవితాంతం బాధపడతాడని బుజ్జి అంటాడు. మరొకరు ప్రేమించిన అమ్మాయిని నువ్వు పెళ్లిచేసుకోవడం కరెక్ట్ కాదని, వెనక్కి వెళ్లిపోదామని ధన్‌రాజ్‌తో అంటాడు శైలేంద్ర.
కానీ బుజ్జి మాటలను ధన్‌రాజ్ నమ్మడు. దాంతో రంగాతో సరోజ క్లోజ్‌గా దిగిన ఫొటోలను ముగ్గురికి చూపిస్తాడు బుజ్జి. ఆ ఫొటోల్లో రిషి పోలికలతో ఉన్న రంగాను చూసి శైలేంద్ర, దేవయాని షాకవుతారు.