Guppedantha Manasu Serial: వసుధారను రౌడీలు కిడ్నాప్ చేస్తారు. హీరోలా అక్కడికి రంగా ఎంట్రీ ఇస్తాడు. రంగాను చూసి వసు ఆనందంగా ఫీలవుతారు. రంగా, వసుధారను కలిపి లేపేయాలని రౌడీలు అనుకుంటారు.
కానీ రంగా మాత్రం ఆ రౌడీలను దంచికొడతాడు. వసుధార కట్టను రంగా విప్పబోతుండగా వెనుక నుంచి ఓ రౌడీ వచ్చి రంగా తలపై కర్రతో గట్టిగా కొడతాడు. దాంతో రంగా స్పృహ కోల్పోతాడు. అతడిని మరో రూమ్‌లో బంధిస్తారు...
వీడు నిన్ను కాపాడుతాడని తెగ బిల్డప్‌లు ఇచ్చావు. ఇప్పుడు ఎలా కాపాడుతాడు అంటూ రంగాను ఉద్దేశించ రౌడీలు హేళనగా మాట్లాడుతారు. రంగా కళ్ల ముందే వసుధారను చంపాలని రౌడీలు అనుకుంటారు. అతడికి ముఖంపై నీళ్లు చళ్లి కిటీకి దగ్గరకు తీసుకొస్తారు.
ఇప్పుడు దమ్ముంటే కాపాడరా అంటూ వసుధారను కత్తితో పొడిచేందుకు ఓ రౌడీ ముందుకొస్తాడు. తనను కాపాడమని రంగాను రిక్వెస్ట్ చేస్తుంటుంది వసుధార. కానీ రంగా మాత్రం వసుధారను చంపేయమని రౌడీలతో అంటాడు. అతడి మాట విని వసుధారతో పాటు రౌడీలు షాకవుతారు.
భయపడేవాళ్లకు ఈ భూమిమీద బతికే హక్కులేదని వసుధారతో రంగా అంటాడు. నువ్వు బ్రతకాలంటే చావుకు ఎదురువెళ్లమని, పోరాడమని వసుధారతో చెబుతాడు రంగా. పోరాడితే పోయేది ఏం లేదని అంటాడు. రంగా మాటలతో వసుధారలోని ఆవేశం కట్టలు తెచ్చుకుంటుంది.
తన చేతికి ఉన్న కట్లు విప్పదీసుకొని రౌడీలపై రివర్స్ ఎటాక్ చేస్తుంది. నిన్ను దెబ్బకొట్టాలని అనుకున్న వాడికి నీ పిడికిలి పవర్ ఏమిటో చూపించు...నిన్ను అణగదొక్కలని అనుకున్నవాడిని పాతాళానికి తొక్కేయమని వసుధారతో అంటాడు రంగా.
రంగా ఇచ్చిన ధైర్యంతో కర్ర తీసుకొని రౌడీలను చితక్కొడుతుంది వసుధార. ఆమె కొట్టే దెబ్బలకు తాళలేక రౌడీలు గగ్గోలు పెడతారు. రౌడీలు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో కింద ఉన్న కత్తి తీసుకొని రౌడీని పొడిచేస్తుంది వసుధార. ఆ సీన్ చూసి భయంతో రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు.
రౌడీలతో వసుధార చేసిన ఫైట్ చూసి రంగా ఆమెపై ప్రశంసలు కురిపిస్తాడు. సూపర్ ఫైట్ అని, చాలా రోజుల తర్వాత మంచి యాక్షన్ సినిమా చూసిన ఫీలింగ్ కలిగిందని అంటాడు.
కోపంగా బయటకు వచ్చిన వసుధార రంగాను వదిలిపెట్టి ఒంటరిగా వెళ్లబోతుంది. ఆమెను రంగా ఆపుతాడు. ఇక నుంచి మీ దారి వేరు...నా దారి వేరు. మీ వెంట వచ్చి ఇబ్బంది పెడుతున్నానని, బాధపెడుతున్నానని మీరే అన్నారు. నా వెంట రావొద్దని మీరే ఒట్టు వేసుకున్నారు కదా వసుధార కోపంగా బదులిస్తుంది.
ఇంటికే వెళతున్నారా అని వసుధారను అడుగుతాడు రంగా. ఇంటికి వస్తే రిషితోనే తిరిగొస్తానని మావయ్యతో ఛాలెంజ్ చేశానని వసుధార బదులిస్తుంది. రిషి లేకుండా అక్కడికి వెళ్లేది ప్రసక్తే లేదని వసుధార అంటుంది. మీరు రిషిని తీసుకొస్తానని ఛాలెంజ్ చేశారని నన్ను కాదని రంగా అంటాడు.
మళ్లీ రౌడీలు వచ్చే ప్రమాదం ఉందని వసుధారను వసుధారను వెళ్లకుండా ఆపుతాడు రంగా. అయినా వసుధార వినదు. నన్ను చంపిన పర్వాలేదని అంటుంది. ఆ పాపం నాకు చుట్టుకుంటుందని రంగా నోరు జారుతాడు. పాపం చుట్టుకుంటుందనే బాధ తప్ప నన్ను చంపుతారనే ఆందోళన కొంచెం కూడా మీలో లేదా అని రంగాను నిలదీస్తుంది వసుధార. రంగా అనే ముసుగు తీసి రిషిలా ఉండమని వసుధార అంటుంది.
వసుధార చెప్పిన మాటలను రంగా అంగీకరించడు. చావు నా కళ్ల ముందు ఉన్నప్పుడు నాతో మీరు ఫైట్ చేయించారు. అలా రిషి సార్ మాత్రమే మోటివేట్ చేస్తుంటాడని వసుధార అంటుంది. నేనేదో మీకు ధైర్యం చెప్పడానికి నాలుగు మాటలు అన్నానని రంగా అంటాడు. జగతి టాపిక్ తీసుకొచ్చి రంగాకు గతం గుర్తుకొచ్చేలా చేయాలని వసుధార అనుకుంటుంది. వసుధార ఎంత చెప్పిన తాను రిషిని కాదని రంగా అంటాడు.
తాను మళ్లీ మీ ఇంటికే వస్తానని రంగాతో అంటుంది వసుధార. అన్ని రోజులు మా ఇంట్లో మీరు ఉంటే ఊళ్లో వాళ్లకు అనుమానం వస్తుందని రంగా అంటాడు. ఊళ్లో వాళ్ల మాటలకు భయపడి ఒంటరి ఆడదానికి అన్యాయం చేస్తారా అని రంగాతో వాదిస్తుంది వసుధార.
ఇక నుంచి గెస్ట్‌గా కాకుండా మీ ఇంట్లోనే పై పోర్షన్‌లో అద్దెకు ఉంటానని వసుధార అంటుంది. మీరు వద్దంటే తన దారిన తాను వెళ్లిపోతానని వసుధార అంటుంది. వసుధార క్షేమం కోసం ఆలోచించిన రంగా తన ఇంట్లోనే వసుధార రెంట్‌కు ఉండటానికి ఒప్పుకుంటాడు. రంగా తిరిగి వసుధారను తన వెంట ఇంటికే తీసుకొస్తాడు.
రంగాను ఇంట్లో ఒంటరిగా చూసి సరోజ హ్యాపీగా ఫీలవుతాడు. వసుధార పీడ విరగడైపోయిందని, ఆమెను ఇంటి దగ్గర దిగబెట్టి మంచి పనిచేశావంటూ సంబరపడుతుంది. సడెన్‌గా వసుధార కనిపించడంతో సరోజ షాకవుతుంది. ఆమెను చూస్తూ ఉండిపోతుంది. వసుధారను చీరలో చూసి రంగా ఫిదా అవుతాడు.
ఈ శారీ బాగుందని, కలర్ నాకు ఇష్టమని రంగా అంటాడు. ఈ కలర్ చీరను నాకు తెలియకుండా మీరెప్పుడు కొన్నారు అని వసుధారను అడుగుతాడు రంగా. తాను కొనలేదని, సరోజ ఈ చీర తనకు గిఫ్ట్‌గా ఇచ్చిందని వసుధార అతడికి బదులిస్తుంది. తనకు వసుధార ట్విస్ట్‌లు మీద ట్విస్ట్‌లు ఇవ్వడం సరోజ సహించలేకపోతుంది. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.