Guppedantha Manasu February 8th Episode: శైలేంద్ర చెంప ప‌గ‌ల‌గొట్టిన వ‌సు - దేవ‌యాని సంబ‌రం - రిషి సంతాప‌స‌భ‌కు ప్లాన్‌-guppedantha manasu february 8th episode devayani and shailendra feels happy on rishi death ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu February 8th Episode: శైలేంద్ర చెంప ప‌గ‌ల‌గొట్టిన వ‌సు - దేవ‌యాని సంబ‌రం - రిషి సంతాప‌స‌భ‌కు ప్లాన్‌

Guppedantha Manasu February 8th Episode: శైలేంద్ర చెంప ప‌గ‌ల‌గొట్టిన వ‌సు - దేవ‌యాని సంబ‌రం - రిషి సంతాప‌స‌భ‌కు ప్లాన్‌

Nelki Naresh Kumar HT Telugu
Feb 08, 2024 07:23 AM IST

Guppedantha Manasu February 8th Episode: నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌లో రిషి చ‌నిపోయాడు కాబ‌ట్టి ఎండీ సీట్‌ను త‌న‌కు ఇచ్చేసి ఎక్క‌డికైనా వెళ్లిపో అని వ‌సుధార‌కు వార్నింగ్ ఇస్తాడు శైలేంద్ర‌. కానీ అత‌డి బెదిరింపుల‌కు వ‌సుధార భ‌య‌ప‌డ‌దు. శైలేంద్ర కొట్టి దారుణంగా అవ‌మానిస్తుంది.

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌
గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌

Guppedantha Manasu February 8th Episode: రిషి చ‌నిపోయాడ‌ని చెప్పిన దేవ‌యానిపై వ‌సుధార ఫైర్ అవుతోంది. త‌న ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మ‌ని దేవ‌యాని, శైలేంద్ర‌ల‌కు వార్నింగ్ ఇస్తుంది. రిషిని శైలేంద్ర‌నే చంపి ఉంటాడ‌ని ముకుల్‌తో అంటుంది అనుప‌మ‌. రిషి చంపింది శైలేంద్ర కాద‌ని, భ‌ద్ర అని తాను అనుమానిస్తున్న‌ట్లు ముకుల్ అంటాడు.

భ‌ద్ర‌ను వ‌సుధార పోలీసుల‌కు ప‌ట్టించిన రోజు...నిన్ను, రిషిని వ‌ద‌ల‌ను అంటూ వ‌సుధార‌కు అత‌డు ఇచ్చిన వార్నింగ్‌ను అనుప‌మ‌కు గుర్తుచేస్తాడు ముకుల్‌. భ‌ద్ర‌ను ప‌ట్టుకునేందుకు త‌మ టీమ్ ప్ర‌య‌త్నిస్తుంద‌ని, ఏదో ఒక‌రోజు భ‌ద్ర త‌ప్ప‌కుండా త‌మ‌కు దొరుకుతాడ‌ని ముకుల్ అంటాడు. అప్పుడే రిషి మ‌ర్డ‌ర్‌పై ఫుల్ క్లారిటీ వ‌స్తుంద‌ని అనుప‌మ‌తో అంటాడు ముకుల్‌.

దేవ‌యాని ఆనందం...

రిషి అడ్డుతొల‌గిపోవ‌డంతో దేవ‌యాని, శైలేంద్ర సంతోషంగా ఫీల‌వుతారు. రిషి చ‌నిపోయాడు. ఇక మ‌న దారికి అడ్డులేద‌ని ఆనంద‌ప‌డుతుంది దేవ‌యాని. ఇప్పుడు ఆ ఎండీ సీట్ మ‌న‌దేన‌ని శైలేంద్ర కూడా హ్యాపీగా ఫీల‌వుతాడు. నువ్వు క‌ల గ‌న్న‌ట్లే నీ కొడుకు ఎండీ అవుతాడ‌ని చెబుతాడు. ఎండీ ప‌ద‌వి కోసం ఎన్ని ఎత్తులు వేశాం, ఎటాక్స్ చేశాం. కానీ మ‌న ఆశ తీర‌లేద‌ని దేవ‌యాని అంటుంది. నా ప్రాణం పోయిన ఎండీ సీట్ నీ కొడుక‌కు ద‌క్క‌నివ్వ‌ను.

ఆ సీట్ ఎప్ప‌టికి నా కొడుకుదేన‌ని జ‌గ‌తి పంతం ప‌ట్టింది. చివ‌ర‌కు ఆ ఎండీ సీట్ కోస‌మే ప్రాణాల‌ను వ‌ద‌లుకున్న‌ద‌ని దేవ‌యాని చెబుతుంది. వ‌సుధార కూడా నా ప్రాణం పోయినా కూడా ఎండీ సీట్ నీకు ద‌క్క‌నివ్వ‌ను. ఈ సీట్ ఎప్ప‌టికీ రిషిదేన‌ని త‌న‌తో ఛాలెంజ్ చేసింద‌ని, చివ‌ర‌కు రిషినే లేకుండా పోయాడ‌ని త‌ల్లితో అంటాడు శైలేంద్ర‌.

నాకు ఎండీ సీట్ ఇస్తే క‌థ ఇంత వ‌ర‌కు వ‌చ్చేది కాద‌ని చెబుతాడు. బాబాయ్ కూడా పంతానికి పోయి నాపై చేయిచేసుకున్నాడ‌ని, న‌న్ను రెచ్చ‌గొట్టినందుకు అంద‌రూ ఫ‌లితం అనుభ‌విస్తున్నార‌ని శైలేంద్ర ఆనంద‌ప‌డిపోతాడు.

ఫ‌ణీంద్ర రెస్ట్‌...

రిషి చ‌నిపోయిన ఆనందం కంటే దేవ‌యాని క‌ళ్ల‌లో ఎక్కువ‌గా బాధ క‌నిపిస్తుంది. రిషి మీద దిగులుతో ఫ‌ణీంద్ర గుండెనొప్పితో మంచాన ప‌డ్డార‌ని, అత‌డి గురించే త‌న కంగారు అంత అని అంటుంది. తండ్రి రెస్ట్ తీసుకోవ‌డ‌మే మ‌న‌కు మంచిద‌ని శైలేంద్ర అంటాడు. డాడీ మ‌న మ‌ధ్య ఉంటే మ‌నం చేసే ప‌నుల‌కు అడ్డు రావ‌చ్చు. తండ్రి కోలుకునే లోపు తాను ఎండీ సీట్‌లో కూర్చోవాల‌ని శైలేంద్ర అంటాడు.

శైలేంద్ర టైమ్‌...

వ‌సుధార అడ్డును ఎలా తొల‌గిస్తావ‌ని కొడుకును అడుగుతుంది దేవ‌యాని. ఇప్పుడు నాకు మంచిరోజులు వ‌చ్చాయి. ఇది శైలేంద్ర టైమ్‌. వ‌సుధార‌ను ఏం చేయాలో, ఎలా దెబ్బ‌కొట్టాలో నాకు బాగా తెలుసు. రిషి బ‌తికే ఉన్నాడ‌ని పిచ్చిదానిలా ప్ర‌వ‌ర్తిస్తుంది. అంత‌కుమించి న‌న్ను ఏం చేయ‌లేద‌ని శైలేంద్ర అంటాడు.

నువ్వు ఎండీ సీట్‌లో కూర్చునే రోజు కోసం ఎక్కువ రోజులు ఎదురుచూడ‌లేను. ఏం చేసినా తొంద‌ర‌గా వ‌సుధార అడ్డు తొల‌గించ‌మ‌ని కొడుకుతో అంటుంది దేవ‌యాని.

రిషి అండే డీబీఎస్‌టీ కాలేజీ...

వ‌సుధార డ‌ల్‌గా కాలేజీలో అడుగుపెడుతుంది. కాలేజీ కారిడార్‌లోనే లెక్చ‌ర‌ర్స్‌, స్టూడెంట్స్ ఆమె కోసం ఎదురుచూస్తూ క‌నిపిస్తారు. రిషి చ‌నిపోయాడ‌నే వార్త‌ను జీర్ణించుకోలేక‌పోతున్నామ‌ని అంద‌రూ అంటారు. రిషి అంటేనే డీబీఎస్‌టీ కాలేజీ, డీబీఎస్‌టీ కాలేజీ అంటే రిషి...అలాంటి రిషి సార్ మ‌న మ‌ధ్య లేడంటే బాధ క‌లుగుతుంద‌ని అంటారు. రిషి చ‌నిపోయాడ‌ని ఎవ‌రూ చెప్పారు, అత‌డు చ‌నిపోవ‌డం మీరు చూశారా అని నిల‌దీస్తుంది. రిషి క్షేమంగా ఉన్నాడ‌ని అంటుంది.

రిషి సంతాప‌స‌భ‌...

నువ్వు ఒప్పుకుంటే రిషి సంతాప స‌భ‌ను ఏర్పాట‌చేసే ప్ర‌య‌త్నాల్లో లెక్చ‌ర‌ర్స్ ఉన్నార‌ని శైలేంద్ర అంటాడు. నువ్వు ఏర్పాటుచేసుకో సంతాప స‌భ అంటూ శైలేంద్ర‌పై కోప్ప‌డుతుంది వ‌సుధార‌. వీడికి చేయండి సంతాప స‌భ‌. వీడి ఫొటో తెచ్చి దండ వేసి మౌనం పాటించండి అంటూ శైలేంద్ర‌ను అవ‌మానిస్తుంది. బ‌తికి ఉన్న‌వాళ్ల‌కు ఎలా ఏర్పాటుచేస్తారు సంతాప స‌భ క్లాస్ పీకుతుంది.

రిషికి ఏం కాలేదు. క్షేమంగానే ఉన్నాడ‌ని, ఎవ‌రో గిట్ట‌ని వాళ్లు రిషి చ‌నిపోయాడ‌ని పుకార్లు సృష్టించార‌ని, త్వ‌ర‌లోనే అత‌డు తిరిగి వ‌స్తాడ‌ని అంద‌రికి చెబుతుంది వ‌సుధార‌. రిషి చ‌నిపోయాడ‌నే బాధ‌లో వ‌సుధార మెంట‌ల్‌గా డిస్ట్ర‌బ్ అయ్యింద‌ని లెక్చ‌ర‌ర్స్‌, స్టూడెంట్స్‌తో అంటాడు శైలేంద్ర‌. అత‌డి మాట‌ల‌తో వ‌సుధార కోసం పీక్స్‌కు చేరుతుంది. శైలేంద్ర‌ను కొట్ట‌బోతుంది. లెక్చ‌ర‌ర్స్ ఆమెను ఆపి క్యాబిన్‌కు పంపిస్తారు.

వ‌సుధార అస‌హ‌నం...

క్యాబిన్‌లో అడుగుపెట్టిన వ‌సుధార జ‌రుగుతోన్న సంఘ‌ట‌న‌ల ప‌ట్ల అస‌హ‌నానికి లోన‌వుతుంది. కోపంతో త‌న క‌ళ్ల ముందు ఉన్న ఫైల్‌లోని పేప‌ర్స్ అన్ని చింపేస్తుంది. అవ‌న్నీ చాటు నుంచి శైలేంద్ర చూస్తాడు. నువ్వు మెంట‌ల్‌గా డిస్ట్ర‌బ్ అయ్యావ‌ని అర్థ‌మ‌వుతుంది వ‌సుధార‌.

నిన్ను ఎవ‌రైన సైకియాట్రిస్ట్ చూపిస్తే మంచిద‌ని వ‌సుధార‌పై సెటైర్ వేస్తాడు శైలేంద్ర‌. ఎండీ సీట్‌, కాలేజీని ప‌ట్టుకొని వేలాడి నువ్వు సాధించింది ఏం లేదు. కానీ చాలా పోగోట్టుకున్నావ‌ని వ‌సుధార‌ను మాట‌ల‌తో బాధ‌పెడ‌తాడు శైలేంద్ర‌. జ‌గ‌తి, రిషిని దూరం చేసుకున్నావు. ముందు ముందు ఎవ‌రిని దూరం చేసుకుంటావో ఏమో అని భ‌య‌పెడ‌తాడు.

ఎండీ సీట్‌ను నాకు ఇచ్చేయ్‌...

ఎప్పుడు ఏ పొర‌పాటు చేయ‌ని నిన్ను ఎండీ సీట్‌లో కూర్చున్న త‌ర్వాత అంద‌రూ త‌ప్పుప‌డుతున్నార‌ని, ఇవ‌న్నీ అవ‌స‌ర‌మా నీకు అంటూ మాట‌ల‌తో వ‌సుధార‌ను ఇబ్బంది పెడ‌తాడు శైలేంద్ర‌. ప‌ద‌వి అంటే ముళ్ల‌కిరీట‌మేన‌ని అందుకే ఎండీ సీట్‌ను త‌న‌కు ఇచ్చి ఎక్క‌డికైనా వెళ్లి ప్ర‌శాంతంగా బ‌త‌క‌మ‌ని వ‌సుధార‌కు వార్నింగ్ ఇస్తాడు. ఎలాగూ రిషి చ‌నిపోయాడు క‌దా అని అంటాడు. శైలేంద్ర మాట‌ల‌తో కోపం ప‌ట్ట‌లేక‌పోతుంది వ‌సుధార‌. శైలేంద్ర చెంప‌పై గ‌ట్టిగా ఒక్క‌టిఇస్తుంది.. రిషి చ‌నిపోయాడ‌ని అనోద్ద‌ని చాలా సార్లు చెప్పాన‌ని వార్నింగ్ ఇస్తుంది.

నువ్వు రెచ్చ‌గొడుతుంటే, మాట‌లు అంటుంటే క‌న్నీళ్లు పెట్టుకుంటూ సెలైంట్‌గా ఉంటాన‌ని అనుకుంటున్నావా..అది జ‌ర‌గ‌దు. నేను భ‌రించినంత వ‌ర‌కే భ‌రిస్తాను. ఆ త‌ర్వాత ఊరుకునేది లేదు. ఎంత‌కైనా తెగిస్తాను. ఏం చేస్తానో కూడా నాకు తెలియ‌ద‌ని అంటుంది. ఎండీ సీట్ కాదు క‌దా...కాలేజీ గేట్ కూడా నిన్ను దాట‌నివ్వ‌ను. మ‌ర్యాద‌గా నా క్యాబిన్‌లో నుంచి వెళ్లిపో లేదంటే మెడ‌ప‌ట్టి గెంటిస్తాన‌ని శైలేంద్ర‌ను హెచ్చ‌రిస్తుంది. వెళ్తావా లేదంటే సెక్యూరిటీని పిలిచి బ‌య‌ట‌కు గెంటించాలా అని అంటుంది. దాంతో అవ‌మానం త‌ట్టుకోలేక క్యాబిన్ నుంచి కోపంగా బ‌య‌ట‌కు వ‌స్తాడు శైలేంద్ర‌.

వ‌సుధార‌పై ప్ర‌తీకారం...

త‌న‌ను అవ‌మానించిన వ‌సుధార‌పై ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని నిర్ణ‌యించుకుంటాడు. వ‌సుధార‌ను శాశ్వ‌తంగా కాలేజీ నుంచి బ‌య‌ట‌కు పంపించేలా చేయాల‌ని ఫిక్స్ అవుతాడు. ప్లాన్‌ను అమ‌లు చేయ‌డం మొద‌లుపెడ‌తాడు. రిషి దూర‌మైన బాధ‌ను మ‌హేంద్ర త‌ట్టుకోలేక‌పోతాడు. ఓ చోట చెట్టు క్రింద కూర్చొని రిషి గురించి ఆలోచిస్తుంటాడు. అత‌డితో ఆనందంగా గ‌డిపిన జ్ఞాప‌కాల్ని గుర్తుచేసుకుంటాడు. రిషి చ‌నిపోయిన నిజం...నిజం కాక‌పోతే బాగుండున‌ని క‌న్నీళ్లు పెట్టుకుంటాడు.

నీలాగే రిషి కూడా త‌న‌ను ఒంట‌రి వాడిని చేశాడ‌ని జ‌గ‌తిని గుర్తుచేసుకొని బాధ‌ప‌డ‌తాడు. ఏ వైపు చూసిన రిషి జ్ఞాప‌కాలే క‌ళ్ల‌ముందు క ద‌లాడుతున్నాయ‌ని ఆవేద‌న‌కు లోన‌వుతాడు. మందుతాగి ఆ జ్ఞాప‌కాల నుంచి బ‌య‌ట‌ప‌డాల‌ని అనుకుంటాడు. కానీ అత‌డి ద‌గ్గ‌ర నుంచి మందు బాటిల్‌ను అనుప‌మ లాక్కుంటుంది. అక్క‌డితో నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ ముగిసింది.

Whats_app_banner