Guppedantha Manasu February 22nd Episode:అనుప‌మ ఇంటికి గెస్ట్‌గా మ‌ను -వ‌సు మెడ‌లో రాజీవ్ మూడుముళ్లు -మ‌హేంద్ర వార్నింగ్-guppedantha manasu february 22nd episode mahendra questions manu about his family anupama feels tension ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu February 22nd Episode:అనుప‌మ ఇంటికి గెస్ట్‌గా మ‌ను -వ‌సు మెడ‌లో రాజీవ్ మూడుముళ్లు -మ‌హేంద్ర వార్నింగ్

Guppedantha Manasu February 22nd Episode:అనుప‌మ ఇంటికి గెస్ట్‌గా మ‌ను -వ‌సు మెడ‌లో రాజీవ్ మూడుముళ్లు -మ‌హేంద్ర వార్నింగ్

Nelki Naresh Kumar HT Telugu
Feb 22, 2024 07:21 AM IST

Guppedantha Manasu February 22nd Episode: వ‌సుధార మెడ‌లో మూడుముళ్లు వేసి ఆమెను ఎత్తుకురావాల‌ని రాజీవ్ ప్లాన్ చేస్తాడు. మ‌ను ఎంట్రీతో రాజీవ్ ప్లాన్ మొత్తం రివ‌ర్స్ అవుతుంది. ఆ త‌ర్వాత నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌లో ఏం జ‌రిగిందంటే?

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌
గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌

Guppedantha Manasu February 22nd Episode: ఎండీ సీట్‌ను ద‌క్కించుకోవాల‌నే త‌న ప్లాన్‌కు మ‌ను అడ్డు త‌గ‌ల‌డంతో శైలేంద్ర ఏం చేయ‌లేక‌పోతాడు. మ‌నుకు వార్నింగ్ ఇవ్వ‌బోయి అత‌డి చేతిలో త‌న్నులు తింటాడు. అయినా ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా ఎండీ సీట్ కోసం మ‌రో ఎత్తు వేస్తాడు శైలేంద్ర‌. వ‌సుధార‌ను ఎత్తుకుర‌మ్మ‌ని రాజీవ్‌కు చెబుతాడు.

వ‌సుధార‌ను ఎత్తుకెళ్ల‌డం నీకు చాత‌కావ‌డం లేదు. నువ్వేదో పోటుగాడివి అని మా మ‌మ్మీ చెప్పింది. ఆ చిన్న ప‌ని కూడా నీ వ‌ల్ల కావ‌డం లేదంటూ మాట‌ల‌తో రాజీవ్‌ను రెచ్చ‌గొడ‌తాడు శైలేంద్ర‌. ఈ రోజే వ‌సుధార‌ను ఎత్తుకొస్తాన‌ని శైలేంద్ర‌తో ఛాలెంజ్ చేస్తాడు రాజీవ్‌. వ‌సుధార‌ చుట్టూ ఎంత మంది ఉన్నా, త‌ను ఏ ప‌రిస్థితుల్లో ఉన్నా తీసుకొస్తాన‌ని అంటాడు.

వ‌సుధార ఇంటికి గెస్ట్‌...

ఈ రోజు త‌మ ఇంటికి గెస్ట్ రాబోతున్న‌ట్లు అనుప‌మ‌, వ‌సుధార‌ల‌కు చెబుతాడు మ‌హేంద్ర‌. మ‌ను వ‌స్తోన్న విష‌యాన్ని వారి ద‌గ్గ‌ర దాచిపెడ‌తాడు. ఆ గెస్ట్ ఎవ‌ర‌న్న‌ది స‌ర్‌ప్రైజ్ అని అంటాడు. మినిస్ట‌ర్‌, ఫ‌ణీంద్ర‌తో పాటు చాలా మంది పేర్లు చెబుతారు అనుప‌మ‌, వ‌సుధార‌. కానీ మ‌న ఇంటికి వ‌చ్చేది వాళ్లు ఎవ‌రు కాద‌ని మ‌హేంద్ర స‌మాధాన‌మిస్తాడు.

అప్పుడే మ‌ను ఇంట్లోకి అడుగుపెడ‌తాడు. అత‌డిని చూసి వ‌సుధార‌, అనుప‌మ షాక‌వుతారు. మ‌నును చూసి స‌ర్‌ప్రైజ్ అవుతావ‌నుకుంటే షాక్ అయ్యావు ఏంటి అని అనుప‌మ‌ను అడుగుతాడు మ‌హేంద్ర‌. వ‌సుధార‌, అనుప‌మ పొడిపొడిగా ప‌ల‌క‌రించ‌డంతో నేను మీ ఇంటి గెస్ట్‌గా రావ‌డం ఇష్టం లేదా అని మ‌ను వారిని అడుగుతాడు.

శ‌త్రువుల‌ను కూడా గౌర‌విస్తాం...

ఇంటికి ఎవ‌రు గెస్ట్‌గా వ‌చ్చినా గౌర‌వించ‌డం, మ‌ర్యాద‌లు చేయ‌డం మాకు అల‌వాటు. అది శ‌త్రువులైనా అని మ‌నుతో అంటుంది వ‌సుధార‌. డిన్న‌ర్ చేయ‌డానికి వ‌చ్చే గెస్ట్ మీరు అని ఊహించ‌లేద‌ని వ‌సుధార చెబుతుంది. లైఫ్‌లోనూ అన్ని అనుకోకుండానే జ‌రుగుతాయి. ఊహించ‌ని మ‌నుషులు ఎదుర‌వుతుంటారు. ఊహించ‌ని సంఘ‌ట‌న‌లు జ‌రుగుతుంటాయ‌ని వ‌సుధార‌కు మ‌ను బ‌దులిస్తాడు. మ‌నుతో మాట్లాడ‌టం ఇష్టం లేక తాను వంట చేస్తాన‌ని కిచెన్‌లోకి వెళ్లిపోతుంది అనుప‌మ‌.

మ‌హేంద్ర అనుమానం...

అనుప‌మ‌కు, మ‌నుకు మ‌ధ్య ఏదో గ‌తం ఉంద‌ని, అదేదో తెలుసుకోవ‌డానికే మ‌నును త‌న ఇంటికి డిన్న‌ర్‌కు ఆహ్వానిస్తాడు మ‌హేంద్ర‌. వ‌సుధార‌ను ఎత్తుకురావ‌డానికి ఆమె ఇంటికి బ‌య‌లుదేరుతాడు రాజీవ్‌. ఈ రోజు నా నుంచి నిన్ను ఎవ‌రు కాపాడ‌లేర‌ని మ‌న‌సులో అనుకుంటాడు. ఈ రోజే వ‌సుధార‌ మెడ‌లో మూడు ముళ్లు వేసి ఆ ఇంటి నుంచి త‌న ఇంటికి ఆమెను ఎలాగైనా తీసుకురావాల‌ని ఫిక్స‌వుతాడు.

అనుప‌మ కంగారు...

రిషి దూర‌మైన బాధ‌ను మ‌నుతో పంచుకొని ఎమోష‌న‌ల్ అవుతాడు మ‌హేంద్ర‌. రిషి తొంద‌ర‌లోనే తిరిగివ‌స్తాడ‌ని, మ‌ళ్లీ అంద‌రం సంతోషంగా ఉండొచ్చున‌ని మ‌హేంద్ర‌ను వ‌సుధార ఓదార్చుతుంది. మ‌ను, మ‌హేంద్ర మాట్లాడుకోవ‌డం చూసి అనుప‌మ కంగారు ప‌డుతుంది. త‌మ మ‌ధ్య ఉన్న బంధం గురించి అత‌డు ఎలాంటి నిజాలు బ‌య‌ట‌పెడ‌తాడోన‌ని టెన్ష‌న్ ప‌డుతుంటుంది.

నువ్వు మాకు గొప్ప సాయం...అలాంటి నీ గురించి తెలుసుకోక‌పోతే ఎలా అని మ‌నుతో అంటాడు మ‌హేంద్ర‌. మీ అమ్మ నాన్న ఎవ‌రు, మీ నేటివ్ ప్లేస్ ఏది అని అడుగుతాడు. మ‌హేంద్ర ప్ర‌శ్న‌ల‌కు మ‌ను స‌మాధానం చెప్ప‌కుండా మౌనంగా ఉండిపోతాడు. అయినా మ‌హేంద్ర ప‌ట్టు వ‌ద‌ల‌కుండా అదే ప్ర‌శ్న‌ను మ‌ళ్లీ అడుగుతాడు. మ‌ను ఎక్క‌డ ఏం నిజం బ‌య‌ట‌పెడ‌తాడోన‌ని కంగారుగా అక్క‌డికి వ‌స్తుంది అనుప‌మ‌. బ‌ల‌వంత‌పెట్టి విష‌యం రాబ‌ట్ట‌డం క‌రెక్ట్ కాద‌ని అంటుంది. మ‌ను మౌనంగా ఉన్నాడు అంటే అత‌డికి చెప్ప‌డం ఇష్టం లేద‌ని అర్థ‌మ‌ని టాపిక్ డైవ‌ర్ట్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తుంది.

మ‌నుకు ఇష్ట‌మైన వంట‌కాలు...

వంట చేసే నువ్వు ఇక్క‌డికి ఎందుకొచ్చావ‌ని అనుప‌మ‌పై సెటైర్స్ వేస్తాడు మ‌హేంద్ర‌. కాఫీ, టీ ఏమైనా తాగుతారో అడుగుదామ‌ని వ‌చ్చాన‌ని అంటుంది. డిన్న‌ర్ టైమ్‌లో కాఫీ, టీ ఎవ‌రైనా తాగుతారా అని మ‌హేంద్ర బ‌దులిస్తాడు. తాను ఇంత‌కుముందు తాగేవాడిన‌ని ఇప్పుడు ఆ అల‌వాటును వ‌దిలేశాన‌ని మ‌హేంద్ర‌తో అంటాడు మ‌ను. మ‌ను ఇష్టాల‌ను బాగానే గుర్తించావు.

అలాగే మ‌నుకు ఇష్ట‌మైన వంట‌లు ఏవో తెలుసుకొని చేస్తే బాగుండేద‌ని మ‌హేంద్ర అంటాడు. మ‌నుకు ఇష్ట‌మైన క‌ర్రీస్ గురించి అత‌డిని అడుగుతాడు మ‌హేంద్ర‌. ఆలు క‌ర్రీ అని మ‌ను కంటే ముందు అనుప‌మ ఆన్స‌ర్ ఇస్తుంది. మ‌నుకు ఆ క‌ర్రీ ఇష్ట‌మ‌ని నువ్వు ఎలా క‌నిపెట్టావ్ మ‌హేంద్ర అడ‌గ్గా అనుప‌మ‌ మాట మార్చేస్తుంది. చాలా మంది ఆ క‌ర్రీని ఇష్ట‌ప‌డుతారు క‌దా..అలా గెస్ చేశాన‌ని అంటుంది. మ‌నుకు ఇష్ట‌మైన వంట‌ల‌న్నీ చేస్తుంది.

రాజీవ్ ఎంట్రీ...

వ‌సుధార ఇంటికి రాజీవ్ వ‌స్తాడు. డార్లింగ్ వ‌సు...మై డియ‌ర్ మ‌ర‌ద‌లు పిల్లా ఎక్క‌డున్నావ్ అని గ‌ట్టిగా కేక‌లు వేస్తాడు. వ‌సుధార కాకుండా అనుప‌మ అత‌డికి క‌నిపిస్తుంది. మీకు ఈ ఇంటికి సంబంధం ఏంటి? మీరు ఈ ఇంట్లో ఎందుకు ఉంటున్నారు అని అనుప‌మ‌ను అడుగుతాడు రాజీవ్‌. నేను జ‌గ‌తి ఫ్రెండ్‌న‌ని అనుప‌మ బ‌దులిస్తుంది. జ‌గ‌తిని నేనే చంపాల‌ని అనుకున్నాన‌ని అనుప‌మ‌తో అంటాడు రాజీవ్‌. ఆ మాట‌తో అనుప‌మ కోపం ప‌ట్ట‌లేక రాజీవ్‌ను కొట్ట‌డానికి చేయి ఎత్తుతుంది. వ‌సుధార ఆమెను ఆపేస్తుంది.

రాజీవ్‌కు వార్నింగ్‌...

నువ్వు ఇక్క‌డికి ఎందుకొచ్చావ్‌, మ‌ర్యాద‌గా బ‌య‌ట‌కు వెళ్ల‌మ‌ని రాజీవ్‌ను వార్నింగ్ ఇస్తుంది వ‌సుధార‌. అంత ఆవేశం నీకు ప‌నికిరాద‌ని, క‌నీసం నాకు కొంచెమైన మ‌ర్యాద ఇవ్వ‌మ‌ని వ‌సుధార‌కు కూల్‌గా బ‌దులిస్తాడు రాజీవ్‌. న‌న్ను కూర్చొబెట్టి మంచినీళ్లు, కాఫీ, టీలు ఇస్తే బావ‌గా నేను సంతోషంగా ఫీల‌వుతాన‌ని వ‌సుధార‌తో అంటాడు రాజీవ్‌. నీ లాంటివాడికి మ‌ర్యాద ఇచ్చేది ఏంటి వ‌సుధార బ‌దులిస్తుంది.

అడ్డుకున్న అనుప‌మ‌...

వ‌సుధార‌ను ఎందుకు విసిగిస్తున్నావ్ రాజీవ్‌ను హెచ్చ‌రిస్తుంది అనుప‌మ‌. బావ మ‌ర‌ద‌ళ్ల మ‌ధ్య వంద ఉంటాయి. ఇవ‌న్నీ మీకు ఎందుకు అని అనుపమ మాట‌ల‌ను లెక్క‌చేయ‌డు రాజీవ్‌. మ‌ర్యాద‌గా బ‌య‌ట‌కు వెళ్ల‌మ‌ని రాజీవ్‌ను మ‌రోసారి హెచ్చ‌రిస్తుంది వ‌సుధార‌.

ఈ రోజు బ‌య‌ట‌కు వెళ్ల‌డానికి రాలేద‌ని, నిన్ను తీసుకెళ్ల‌డానికి వ‌చ్చాన‌ని త‌న ప్లాన్‌ను బ‌య‌ట‌పెట్టేస్తాడు రాజీవ్‌. న‌న్ను ఆపే శ‌క్తి అనుప‌మ‌కు లేద‌ని అంటాడు. వ‌సుధార చేయి ప‌ట్టుకొని త‌న వెంట బ‌ల‌వంతంగా తీసుకెళ్ల‌డానికి ప్ర‌య‌త్నిస్తాడు. అనుప‌మ ఆప‌డంతో ఆమెను బెదిరిస్తాడు రాజీవ్‌. లేడీస్‌ను కొట్టే అల‌వాటు నాకు లేద‌ని భ‌య‌పెడ‌తాడు. ఈ రోజు నా నుంచి నిన్ను ఎవ‌రు కాపాడ‌లేర‌ని వ‌సుధార‌తో చెబుతాడు రాజీవ్‌.

షాక్ తిన్న రాజీవ్‌...

అప్పుడే ఆ రూమ్‌లోకి మ‌ను ఎంట్రీ ఇస్తాడు. మ‌నును చూసి రాజీవ్ షాక‌వుతాడు. ఏంటి భ‌య్యా నువ్వు ఇక్క‌డ‌...స‌రాస‌రి ఇంటికి వ‌చ్చేస్తావా...ఈ ఇంట్లో నీకు ఏం ప‌ని అని మ‌నును అడుగుతాడు. విల‌న్స్‌ను బ‌త‌క‌నివ్వ‌రా అని బాధ‌గా అడుగుతాడు. అస‌లు ఎందుకొచ్చావ్ అని రాజీవ్‌ను నిల‌దీస్తాడు మ‌ను. ఇది నా మ‌ర‌ద‌లు ఇళ్లు వ‌చ్చే హ‌క్కు నాకు ఉంద‌ని రాజీవ్ బ‌దులిస్తాడు.

అప్పుడు గ‌న్‌...ఈసారి బుల్లెట్స్‌...

మ‌నును చూసి భ‌య‌ప‌డిపోతాడు రాజీవ్‌. నువ్వు ఇంట్లో ఉన్నావ‌ని తెలిస్తే నేను వ‌చ్చేవాడిని కాద‌ని అంటాడు. వేరే ప్లాన్ చేసుకునేవాడిన‌ని చెబుతాడు. ఇంకోసారి వ‌సుధార జోలికి వ‌స్తే బాగుండ‌ద‌ని రాజీవ్‌ను హెచ్చ‌రిస్తాడు మ‌ను. పోయిన‌సారి గ‌న్ మాత్ర‌మే చూపించారు. ఈ సారి బుల్లెట్స్ చూపిస్తాన‌ని వార్నింగ్ ఇస్తాడు. అక్క‌డితో నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ ముగిసింది.

టీ20 వరల్డ్ కప్ 2024