Guppedantha Manasu Mahendra: బ‌ల‌రామ్‌గా మారిన గుప్పెడంత మ‌న‌సు మ‌హేంద్ర - కొత్త సీరియ‌ల్‌లో విల‌న్‌గా!-guppedantha manasu fame sai kiran to play key role in bhanumathi serial star maa tv actor ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu Mahendra: బ‌ల‌రామ్‌గా మారిన గుప్పెడంత మ‌న‌సు మ‌హేంద్ర - కొత్త సీరియ‌ల్‌లో విల‌న్‌గా!

Guppedantha Manasu Mahendra: బ‌ల‌రామ్‌గా మారిన గుప్పెడంత మ‌న‌సు మ‌హేంద్ర - కొత్త సీరియ‌ల్‌లో విల‌న్‌గా!

Nelki Naresh Kumar HT Telugu
Jan 30, 2025 01:35 PM IST

Tv Serial: గుప్పెడంత మ‌న‌సు ఫేమ్ సాయికిర‌ణ్ తెలుగులో మ‌రో కొత్త సీరియ‌ల్ చేయ‌బోతున్నాడు. త్వ‌ర‌లో స్టార్ మాలో టెలికాస్ట్ కాబోతున్నభానుమ‌తి సీరియ‌ల్‌లో కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ఈ తెలుగు సీరియ‌ల్‌లో శంక‌ర్‌కుమార్ చ‌క్ర‌వ‌ర్తి, చైత్ర జంట‌గా న‌టిస్తున్నారు.

గుప్పెడంత మ‌న‌సు మ‌హేంద్ర
గుప్పెడంత మ‌న‌సు మ‌హేంద్ర

Guppedantha Manasu Mahendra: గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ ఫేమ్ సాయికిర‌ణ్ స్టార్‌మాలో మ‌రో కొత్త టీవీ సీరియ‌ల్‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చాడు. ఈ సీరియ‌ల్‌లో విల‌న్‌గా సాయికిర‌ణ్ న‌టించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. భానుమ‌తి పేరుతో స్టార్ మా ఛానెల్‌లో ఓ కొత్త సీరియ‌ల్ త్వ‌ర‌లో బుల్లితెర ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

yearly horoscope entry point

త‌మిళ సూప‌ర్ హిట్ సీరియ‌ల్ చిన్న మ‌రుమ‌గ‌ల్ కు రీమేక్‌గా భానుమ‌తి తెర‌కెక్కుతోంది. ఈ తెలుగు సీరియ‌ల్‌లో శంక‌ర్‌కుమార్ చ‌క్ర‌వ‌ర్తి, చైత్ర లీడ్ రోల్స్‌లో క‌నిపించ‌బోతున్నారు.

బ‌ల‌రాం పాత్ర‌లో...

భానుమ‌తి సీరియ‌ల్‌లో సాయికిర‌ణ్ కూడా ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. లేటెస్ట్ ప్రోమోలో సాయికిర‌ణ్‌ను మేక‌ర్స్ చూపించారు. బ‌ల‌రాం అనే క్యారెక్ట‌ర్‌లో అత‌డి న‌టిస్తోన్న‌ట్లు చూపించారు. ఈ ఫ్యామిలీ డ్రామా సీరియ‌ల్‌లో నెగెటివ్ షేడ్స్‌తో సాయికిర‌ణ్ క్యారెక్ట‌ర్ సాగుతుంద‌ని స‌మాచారం.

భానుమ‌తిని పెళ్లి చేసుకోవాల‌ని అనుకున్న అబ్బాయి తండ్రిగా ఈసీరియ‌ల్‌లో సాయికిర‌ణ్ క‌నిపించ‌నున్నాడు. భానుమ‌తి కార‌ణంగానే అత‌డు జైలు పాలైన‌ట్లుగా ప్రోమోలో చూపించారు.

అన్న‌పూర్ణ స్టూడియోస్ ....

అన్న‌పూర్ణ స్టూడియోస్ సంస్థ భానుమ‌తి సీరియ‌ల్‌ను నిర్మిస్తోంది. మా ఇంటి మ‌హాల‌క్ష్మి అనే క్యాప్ష‌న్‌తో ఈ సీరియ‌ల్ రూపొందుతోంది. ఫిబ్ర‌వ‌రిలో భానుమ‌తి సీరియ‌ల్ స్టార్ మా ఛానెల్‌లో టెలికాస్ట్ కానున్న‌ట్లు స‌మాచారం. త్వ‌ర‌లోనే సీరియ‌ల్ లాంఛ్ డేట్‌ను అనౌన్స్ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

గ‌త ఏడాది ఎండ్ అయిన గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌లో మ‌హేంద్ర పాత్ర‌లో సాయికిర‌ణ్ న‌టించాడు. కొడుకు ప్రేమ కోసం ప‌రిత‌పించే తండ్రిగా పాజిటివ్ క్యారెక్ట‌ర్‌లో బుల్లితెర అభిమానుల‌ను మెప్పించాడు. ఈ సీరియ‌ల్ న‌టుడిగా అత‌డికి మంచి పేరు తెచ్చిపెట్టింది.

మౌన‌రాగం, కోయిల‌మ్మ‌...

గుప్పెడంత మ‌న‌సు కంటే ముందు మౌన‌రాగం, ఇంటిగుట్టు, అభిలాష‌, కోయిల‌మ్మ‌తో పాటు సీరియ‌ల్స్‌లో సాయికిర‌ణ్ న‌టించాడు. మైథ‌లాజిక‌ల్ క‌థాంశాల‌తో రూపొందిన‌ శివ‌లీల‌లు, వెంక‌టేశ్వ‌ర వైభ‌వంతో పాటు మ‌రికొన్ని టీవీ సీరియ‌ల్స్‌లో క‌నిపించాడు. ప్ర‌స్తుతం ప‌డ‌మ‌టి సంధ్యారాగం సీరియ‌ల్‌లో న‌టిస్తున్నాడు.

ఇటీవ‌లే టీవీ యాక్ట‌ర్ స్ర‌వంతిని పెళ్లి చేసుకున్నాడు సాయికిర‌ణ్‌. వీరిద్దరు కలిసి కోయిల‌మ్మ సీరియ‌ల్‌లో న‌టించారు. ఆ టైమ్‌లో సాయికిర‌ణ్, స్ర‌వంతి మ‌ధ్య ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారిన‌ట్లు స‌మాచారం.

నువ్వే కావాలితో హీరోగా...

హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సాయికిర‌ణ్ ఆ త‌ర్వాత సీరియ‌ల్ యాక్ట‌ర్‌గా మారాడు. త‌రుణ్‌, రిచా జంట‌గా న‌టించిన నువ్వే కావాలి మూవీలో సాయికిర‌ణ్ ఓ హీరోగా క‌నిపించాడు. ప్రేమించు, డార్లింగ్ డార్లింగ్, మ‌న‌సుంటే చాలు తో పాటు మ‌రికొన్ని చిన్న సినిమాల్లో క‌థానాయ‌కుడిగా క‌నిపించాడు.

Whats_app_banner