Guppedantha Manasu December 18th Episode: రిషి జ్ఞాపకాల్లో వసు -మహేంద్ర రాంగ్‌స్టెప్ -కష్టాల్లో డీబీఎస్‌టీ కాలేజీ
Guppedantha Manasu December 18th Episode:రిషి జ్ఞాపకాలతో వసుధార ఎమోషనల్ అవుతుంది. తాను ఒంటరినైపోయానని కన్నీళ్లు పెట్టుకుంటుంది. రిషి కోసం ఎన్నిరోజులు అయినా ఎదురుచూడాలని తన మనసుకు తానే సర్ధిచెప్పుకుంటుంది. ఆ తర్వాత నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో ఏం జరిగిందంటే?

Guppedantha Manasu December 18th Episode: శైలేంద్రను మహేంద్ర గన్‌తో షూట్ చేసి చంపబోతుండగా వసుధార, అనుపమ వచ్చి అడ్డుకుంటారు. బుల్లెట్ గురి తప్పుతుంది. శైలేంద్ర ప్రాణాలతో బతికిపోతాడు. బలవంతంగా మహేంద్రను శైలేంద్ర దగ్గర నుంచి తీసుకొస్తారు వసుధార, అనుపమ. ఇంటికి తిరిగి వచ్చి రావడంతోనే నువ్వు ఎందుకు వచ్చావు అక్కడికి అంటూ అనుపమపై ఫైర్ అవుతాడు. శైలేంద్రకు ప్రాణం పోయాడానికి వచ్చావా, వాడి ఆయుష్షు పెంచడానికి వచ్చావా అంటూ అనుపమను కోపంలో నానా మాటలు అంటాడు మహేంద్ర.
నీ ప్రస్ట్రేషన్ పీక్స్‌కు చేరింది కాబట్టే మధ్యలో వచ్చానని మహేంద్రకు బదులిస్తుంది అనుపమ. వాటర్ తాగమని మహేంద్రకు బాటిల్ ఇస్తుంది. ఆమె ఇచ్చిన బాటిల్‌ను విసిరికొడతాడు మహేంద్ర. నువ్వు చేసిన పనికి ఫుల్ బాటిల్ తాగితే కానీ తాను మామూలు మనిషి కాలేనని అంటాడు.
అనుపమ రావడం వల్లే శైలేంద్ర బతికిపోయాడని, లేదంటే ఈ పాటికి వాడి శవాన్ని పాడే మీద పడుకోబెట్టేవారని కోపంగా అంటాడు. అదే జరిగితే నువ్వు జైలులో ఊచలు లెక్కబెట్టేవాడివని అనుపమ బదులిస్తుంది. అలాంటి వాడికోసం జైలుకి వెళ్లిన పర్వాలేదని అంటాడు.
వసుధార సమాధానం...
అనుపమను తానే రమ్మన్నానని మహేంద్రకు చెబుతుంది వసుధార. శైలేంద్రను చంపడానికి సిద్ధమైన మీరు నా మాటలు వినరని, కంట్రోల్ కాలేరని అనుపమను ఫోన్ చేసి తానే పిలిచానని అంటుంది. అప్పటివరకు ఆవేశం మీదున్న మహేంద్ర వసుధార మాటలతో సెలైంట్ అవుతాడు. ఇప్పటివరకు నన్ను తిట్టినట్లు వసుధారను తిట్టవేం, ఆమెపై విరుచుకుపడవేం అని మహేంద్రను నిలదీస్తుంది అనుపమ.
శైలేంద్రను చంపితే ఒక్క బుల్లెట్‌తో వాడు సుఖంగా చనిపోతాడు. నువ్వు జైలులో కూర్చుంటావు. వసుధార నీ కోసం జైలుకు రావాలా? రిషి కోసం వెతకాలా అని నిలదీస్తుంది. శైలేంద్ర చనిపోతే రిషి దొరుకుతాడా? కనీసం రిషి ఎక్కడున్నాడో కూడా తెలియకుండాపోతుందని మహేంద్రను నిలదీస్తుంది అనుపమ.
రాంగ్ స్టెప్ వెస్తే నష్టం...
అనుపమ మాటలను వసుధార సమర్థిస్తుంది. ఆవేశంలో శైలేంద్ర ప్రాణాలు తీస్తే మనకే నష్టమని, తొందరపడి రాంగ్‌స్టెప్ వేస్తే రిషి గురించి ఎప్పటికీ తెలిసే అవకాశం ఉండదని అంటుంది. శైలేంద్ర ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా నిజం చెప్పలేదంటే దాని వెనుక ఏదో కుట్ర ఉందని వసుధార అనుమానపడుతుంది.
కావాలనే శైలేంద్ర నిజం చెప్పలేదని మహేంద్ర బదులిస్తాడు. నిజంగా వాడికి రిషి గురించి తెలిస్తే చావుకు భయపడి చెప్పేవాడు. వసుధార బలహీనతను అడ్డుపెట్టుకొని ఎండీ సీట్ కొట్టేయాలని రిషిని తానే కిడ్నాప్ చేసినట్లు శైలేంద్ర అబద్దం ఆడి ఉంటాడని అనుపమ కూడా అనుమానపడుతుంది.
పగ ముఖ్యం కాదు...
ఇప్పుడు మనం చేయాల్సింది శైలేంద్రపై పగ తీర్చుకోవడం కాదు. రిషి ఎక్కడున్నాడో తెలుసుకోవడం అని వసుధార ఎమోషనల్ అవుతుంది. రిషి ఎక్కడున్నా క్షేమంగా ఉంటాడని వసుధారను ఓదార్చుతుంది అనుపమ. వసుధార బాధను అర్థం చేసుకొని సెలైంట్‌గా ఉండమని, నీ ఇష్టం వచ్చినట్లు చేస్తానంటే వెళ్లి శైలేంద్ర, దేవయానిలను కాల్చేయ్ అంటూ మహేంద్ర చేతికి గన్ ఇస్తుంది అనుపమ. వాళ్లను కాదు నిన్ను కాల్చాలి అంటూ అనుపమపై మళ్లీ ఫైర్ అవుతాడు మహేంద్ర.
వసుధార ఎమోషనల్...
రిషి ఆచూకీ కోసం ముకుల్‌కు ఫోన్ చేయాలని వసుధార అనుకునేలోపు రిషి కార్ వచ్చి ఇంటి ముందు ఆగుతుంది. రిషి కార్ చూడగానే వసుధార ఆనందం పట్టలేకపోతుంది. రిషి తిరిగి వచ్చాడని ఎమోషనల్ అవుతుంది. రిషిని చూడాలని ఆనందంగా బయటకు వస్తుంది. కానీ రిషి కాకుండా కారులో నుంచి ముకుల్ దిగుతాడు. అది చూసి వసుధార షాకవుతుంది. రిషి కారు దొరికింది కానీ ఇప్పటివరకు అతడి ఆచూకీ మాత్రం దొరకలేదని వసుధారతో చెబుతాడు ముకుల్.
ముకుల్ షాక్...
శైలేంద్ర తనను బెదిరించిన సంగతి ముకుల్‌కు చెబుతుంది వసుధార. ఆమె మాటలు విని ముకుల్ షాకవుతుంది. తనకు ఎండీ సీట్ మీద ఆశ ఉందనే విషయం తేలిపోతుందని ముకుల్ అంటాడు. ఈ ఆధారాలతో శైలేంద్రను అరెస్ట్ చేసినా ఆ తర్వాత తాను బెదిరించలేదని మాట మార్చి అతడు జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని ముకుల్ అంటాడు.
ఆ తర్వాత శైలేంద్ర తనపై తానే ఎటాక్ చేయించుకున్న సంగతిని ముకుల్‌కు చెబుతాడు మహేంద్ర. వారి ద్వారా శైలేంద్ర నిజం స్వరూపం తెలిసి ముకుల్ కూడా ఆశ్చర్యపోతాడు. ప్రస్తుతం రిషి ఎక్కడున్నాడో తెలుసుకోవడం చాలా ముఖ్యమని ముకుల్ కూడా అంటాడు. పొరపాటుగా మనం రాంగ్ స్టెప్ వేస్తే రిషి ప్రాణాలకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని సలహాఇస్తాడు.
ఇక నుంచి శైలేంద్రపై అబ్జర్వేషన్ పెడతానని, త్వరలోనే రిషిని క్షేమంగా తీసుకొస్తానని వసుధార, మహేంద్రలకు మాటిచ్చి వెళతాడు ముకుల్.
రిషి జ్ఞాపకాలు...
కారుతో రిషికి, తనకు ఉన్న జ్ఞాపకాలు గుర్తొచ్చి వసుధార ఎమోషనల్ అవుతుంది. రిషి తనను కారు ఎక్కమని చెప్పినట్లుగా కల కంటుంది. కానీ అదంతా కల అని గుర్తొచ్చి కన్నీళ్లు పెట్టుకుంటుంది. మీతో కలిసిఎన్నో ప్రయాణాలు చేసిన తాను ఇప్పుడు ఒంటరినైపోయానని ఏడుస్తుంది. మీరు లేకుండా బతకలేకపోతున్నానని మనసులో ఉన్న బాధను బయటకు చెప్పేస్తుంది. రిషి ఎక్కడున్నా తెలియజేసి, మా ఇద్దరిని ఒక్కటి చేయమని కారులో ఉన్న వినాయకుడి విగ్రహాన్ని వేడుకుంటుంది వసుధార.
బోర్డ్ మీటింగ్...
వసుధార కాలేజీ ఎండీ క్యాబిన్‌లో కూర్చొని రిషి గురించి ఆలోచిస్తుంటుంది. ఆమె దగ్గరకు ఫణీంద్ర, మహేంద్ర వస్తారు. బోర్డ్ మెంబర్స్ మీటింగ్ ఏర్పాటుచేయమని అంటున్నారని వసుధారతో అంటాడు మహేంద్ర. రిషి లేకుండా మీటింగ్ ఏర్పాటుచేయడం ఎలా అని మహేంద్ర సంశయిస్తాడు. రిషి కనిపించే వరకు ఆగుదామని అంటే బోర్డ్ మెంబర్స్ వినడం లేదని ఫణీంద్ర అంటాడు.
వసుధార అబద్ధం...
మిషన్ ఎడ్యుకేషన్ టూర్‌పై రిషి అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్లాడని అబద్ధం ఆడుదామని వసుధార అంటుంది. కానీ అబద్ధం ఆడటానికి మహేంద్ర ఒప్పుకోడు. భవిష్యత్తులో నిన్ను అందరూ తప్పుపట్టే అవకాశం ఉందని వసుధారతో అంటాడు. ఫణీంద్ర కన్వీన్స్ చేయడంతో ఇష్టం లేకపోయినా అబద్ధం ఆడటానికి మహేంద్ర ఒప్పుకుంటాడు. కానీ రిషికి తెలియకుండా ఓ అబద్ధం చెప్పాల్సిరావడంతో వసుధార బాధపడుతుంది. కానీ మరోదారిలేక నోటీస్ టైప్ చేసి బోర్డులో పెడుతుంది.
మీరు వస్తారనే ఆశతో ఎన్ని రోజులు అయినా ఎదురుచూస్తానని రిషిని ఉద్దేశించి మనసులో అనుకుంటుంది వసుధార. ఎవరు ఎన్ని ప్లాన్స్ చేసినా మీరు నన్ను చేరుకోవడమో...నేను మిమ్మల్ని చేరుకోవడమో తప్పకుంగా జరిగి తీరుతుందని అనుకుంటుంది. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.