Guppedantha Manasu December 12th Episode:శైలేంద్ర కుట్రలకు ధరణి పుల్‌స్టాప్ - మారిపోయిన దేవయాని - వసు అనుమానం
Guppedantha Manasu December 12th Episode: మంచివాడిగా మారిపోయినట్లు నటిస్తోన్న శైలేంద్ర నిజస్వరూపాన్ని కళ్లారా ధరణి చూస్తుంది. జగతి మర్డర్ కేసు నుంచి బయటపడటానికి తనపై తానే ఎటాక్ చేయించుకున్నాడనే నిజం తెలుసుకుంటుంది. ఆ తర్వాత నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో ఏం జరిగిందంటే?
Guppedantha Manasu December 12th Episode: ముకుల్ ఇన్వేస్టిగేషన్ నుంచి తెలివిగా బయటపడతాడు శైలేంద్ర. ముకుల్ తనను బ్లాక్‌మెయిల్ చేసినట్లుగా, రిషినే జగతిని చంపినట్లుగా ఫేక్ ఆడియో వాయిస్‌లను క్రియేట్ చేసి ముకుల్‌కు షాకిస్తాడు. కొడుకు తెలివి చూసి దేవయాని మురిసిపోతుంది. దేవయాని, శైలేంద్ర మాట్లాడుకుంటుండగా ధరణి వస్తుంది.
ఆమెను చూసి దేవయాని కంగారు పడుతుంది. ధరణికి అన్ని నిజాలు తెలియడంతో ఆమె ఎక్కడ తమ కుట్రలను బయటపెడుతుందోనని భయపడుతుంది. ప్రేమతో ధరణిని నమ్మించాలని శైలేంద్ర మరో ప్లాన్ చేస్తాడు.
ధరణి ఫైర్...
ధరణి రూమ్‌లోకి వచ్చి రావడంతోనే కిల్లర్‌తో మాట్లాడిన వాయిస్ మీదే కదా అని శైలేంద్రపై ఫైర్ అవుతుంది. మీరు రౌడీకి డబ్బులిస్తుంటే తాను చూశానని, టెక్నాలజీ అని చెప్పి అందరిని నమ్మించినట్లుగా నన్ను నమ్మించలేరని అంటుంది. నిజం దాచడం వెనుక ఏదో కుట్ర ఉందని ధరణి అనుమానపడుతుంది. నిజం నీకోసమే దాచానని శైలేంద్ర అబద్ధం ఆడుతాడు. నిజం నిరూపితమైతే నాకు శిక్ష పడుతుంది. జైలుకు వెళతాను. అప్పుడు నువ్వు ఒంటరిగా మారిపోతావని ధరణిపై ప్రేమను కురిపించినట్లుగా నాటకం ఆడుతాడు శైలేంద్ర.
తోడుగా ఉంటే చాలు...
నిన్ను ఇష్టపడటం మొదలుపెట్టిన తర్వాత నీ ప్రేమ తప్ప నాకు ఏం కడపడటం లేదని, లైఫ్ లాంగ్ నాకు నువ్వు తోడుగా ఉంటే చాలని, ఎండీ సీట్ కూడా అక్కరలేదని ధరణిని అబద్దాలతో నమ్మిస్తాడు శైలేంద్ర. కొడుకు మాత్రమే కాదు తాను కూడా మారిపోయానని ధరణితో అంటుంది దేవయాని.
ఇన్ని రోజులు వేరు, ఇప్పుడు వేరు. పంతాలు, కక్షలు మర్చిపోయానని, మీరిద్దరు సంతోషంగా ఉంటే చాలు అని దేవయాని మంచిదానిలా మారిపోయినట్లు యాక్టింగ్ చేస్తుంది. అయినా ధరణి కోపం తగ్గదు. ఆవేశంగా రూమ్ నుంచి వెళ్లిపోతుంది. తనను ఎలా కూల్ చేయాలో తెలుసునని తల్లితో అంటాడు శైలేంద్ర.
శైలేంద్రపైనే అనుమానం...
శైలేంద్ర ఇచ్చిన ట్విస్ట్‌తో ముకుల్ డైలామాలో పడతాడు. జగతి మేడమ్ శిష్యుడిగా తొందరగా కేసును సాల్వ్ చేసి ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని అనుకున్నానని, కానీ రానురాను ఈ మర్డర్ కేసు ఫజిల్‌గా మారుతుందని అనుపమతో అంటాడు ముకుల్. శైలేంద్రనే నిజమైన హంతకుడిని అనుపమకు చెబుతాడు ముకుల్.టెక్నాలజీని అడ్డుపెట్టుకొని తప్పించుకున్నాడని అంటాడు.
ఆ తర్వాత రిషి గురించి ముకుల్‌ను అడుగుతుంది అనుపమ. లాస్ట్ టైమ్ రిషి ఫోన్ సిగ్నల్స్ శైలేంద్ర జాయిన్ ఆయిన హాస్పిటల్ ఏరియాలోనే చూపించాయని, ఆ తర్వాత సిటీలో సిగ్నల్స్ ఎక్కడ కనిపించడం లేదని ముకుల్ అంటాడు. రిషి కార్ కూడా సిటీ బయట దొరికిందని అంటాడు.
అతడి మాటలు విని అనుపమ కంగారు పడుతుంది. రిషిని ఎవరైన కిడ్నాప్ చేశారా? అతడికి ఏదైనా ప్రమాదం జరిగిందా అన్నది తెలియడం లేదని ముకుల్ అంటాడు. ఎంత ట్రై చేసినా ఎలాంటి క్లూ దొరకడం లేదని అనుపమకు చెబుతాడు ముకుల్.
ఎటాక్ కూడా డ్రామానే...
రిషి కనబడకుండా పోవడం వెనుక శైలేంద్ర మీద ఎటాక్ చేసిన రౌడీల ప్రమేయం ఉండొచ్చని అనుపమ అనుమానం వ్యక్తం చేస్తుంది. శైలేంద్ర మీద జరిగిన ఎటాక్ కావాలనే అతడు చేయించుకున్నట్లుగా అనిపిస్తుందని అనుపమకు బదులిస్తాడు ముకుల్. ప్రాణాలు పోకుండా జరిగిన ఎటాక్ అదని, జగతి హత్య విషయంలో శైలేంద్ర ఫ్యామిలీ ఇన్‌వాల్వ్‌మెంట్ తప్పకుండా ఉండి ఉంటుందని సందేహం వ్యక్తం చేస్తాడు.
ధరణి షాక్...
శైలేంద్రపై ఎటాక్ చేసిన రౌడీలు అతడిని కలవడానికి ఇంటికి వస్తారు. ఆ రౌడీలతో శైలేంద్ర మాట్లాడుతోండగా ధరణి చూస్తుంది. రౌడీలతో శైలేంద్ర మాట్లాడిన మాటల్ని చాటు నుంచి వింటుంది. మీరు ప్రతిదీ నేను చెప్పిన స్క్రిప్ట్ ప్రకారం అద్భుతంగా చేశారని రౌడీలను మెచ్చుకుంటాడు శైలేంద్ర. .
మీరు సూపర్ అంటూ వారిని పొగుడుతారు. అంతా బాగానే చేశారు కానీ చివరలో మీ ఫ్యామిలీని వదిలిపెట్టం అనే డైలాగ్ నేను చెప్పమనలేదు కదా అది ఎందుకు అన్నారని రౌడీలను అడుగుతాడు శైలేంద్ర. ఫ్యామిలీ సెంటిమెంట్ కదా అని డైలాగ్ వాడానని రౌడీ అంటాడు. ఆ డైలాగ్ బాగా పండిందని రౌడీని మెచ్చుకుంటాడు శైలేంద్ర. మరోసారి రౌడీతో ఆ డైలాగ్ చెప్పించుకుంటాడు శైలేంద్ర.
అతడి వాయిస్‌ను ధరణి గుర్తుపడుతుంది. తన భర్తపై ఎటాక్ చేసింది వాళ్లేనని, ఇదంతా భర్త ఆడించిన డ్రామా అనే నిజం తెలుసుకుంటుంది. భర్త మారిపోయాడన్నది అబద్ధమని, అతడు ఆడుతోన్న నాటకమని అర్థం చేసుకుంటుంది.
శైలేంద్ర నిజ స్వరూపం గురించి...
తాను ఇంకా మౌనంగా ఉంటే శైలేంద్ర ఎంత మంది ప్రాణాలు తీస్తాడోనని ధరణి భయపడుతుంది. ఇప్పుడే శైలేంద్ర నిజస్వరూపం వసుధార, మహేంద్రలకు చెప్పాలని నిర్ణయించుకుంటుంది.
ఏ తప్పు చేయని రిషి కనిపించడం లేదని, జగతి ప్రాణాలు తీసిన శైలేంద్ర మాత్రం సంతోషంగా కళ్ల ముందే ఉండటం మహేంద్ర తట్టుకోలేకపోతాడు. రిషి గురించి మహేంద్ర, వసుధార ఆలోచిస్తుండగా ధరణి కంగారుగా వారి దగ్గరకు వస్తుంది. జగతి ప్రాణాలు తీసింది శైలేంద్రనే అని చెబుతుంది.
శైలేంద్ర కిల్లర్‌కు డబ్బులు ఇస్తోండగా తాను చూశానని, ముకుల్ వినిపించిన వాయిస్ శైలేంద్రతో పాటు వినిపించిన మరో వాయిస్ ఆ కిల్లర్‌దేనని అంటుంది. జగతిపై ఎటాక్ గురించి తానే వసుధారకు చెప్పి హెచ్చరించానని చెబుతుంది.
శైలేంద్ర మారిపోలేదు...
శైలేంద్ర మారిపోయాడని అనుకున్నానని, కానీ అదంతా అబద్ధమని మహేంద్రతో అంటుంది ధరణి. నన్ను ప్రేమగా చూసుకుంటానని, ఇకపై ఎవరికి ఎలాంటి హాని చేయనని తనకు మాటిచ్చాడని, పిచ్చిదానిలా అతడి మాటలు నమ్మానని ధరణి కన్నీళ్లు పెట్టుకుంటుంది.
కానీ అతడు మారిపోలేదని, తనను మభ్యపెట్టడానికే, అతడి నిజస్వరూపం బయటపెట్టకుండా ఉండటానికే నాటకం ఆడుతున్నాడని ధరణి బాధపడుతుంది. శైలేంద్రపై జరిగిన ఎటాక్ కూడా ఫేక్ అని, ముకుల్‌కు వాయిస్ దొరకడంతో ఆ కేసు నుంచి బయటపడటానికే తనకు తానే రౌడీలకు డబ్బులిచ్చి పొడిపించుకున్నాడని అంటుంది.
నిజం తెలుసుకున్న అనుపమ...
ఆ ఎటాక్ గురించి ఎవరికి అనుమానం రాకుండా నా కళ్ల ముందే అదంతా జరిగేలా ప్లాన్ చేశాడని అంటుంది. శైలేంద్రను పొడిచిన రౌడీలకు అతడు డబ్బులివ్వడం తాను చూశానని అంటుంది. జగతి చావుకు, ఇప్పుడు రిషి కనిపించకపోవడానికి అన్నింటికి కారణం మా అయనేనని అంటుంది. అప్పుడే ఇంట్లోకి అడుగుపెట్టిన అనుపమ ధరణి మాటలు విని షాకవుతుంది.
ధరణి మాటలను నమ్మదు. శైలేంద్ర దుర్మార్గాల గురించి మీకు తెలియదని, మొదటి నుంచి రిషిని చంపడానికే శైలేంద్ర ప్రయత్నించాడని, ఎండీ సీట్‌పై ఆశపడి జగతిని చంపాడని, రిషిని చంపేందుకు ప్రయత్నిస్తున్నాడని అనుపమతో చెబుతుంది ధరణి. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.