Guppedantha Manasu August 9th Episode: గుప్పెడంత మనసు - భర్త దగ్గర రహస్యం దాచిన వసు - శైలేంద్రకు రిషి వార్నింగ్
Guppedantha Manasu August 9th Episode: గుప్పెడంత మనసు సీరియల్ ఆగస్ట్ 9 ఎపిసోడ్‌లో బాధ్యత లేకుండా ఎండీ పదవిని వదిలిపెట్టి వెళ్లిపోయావని వసుధారను అవమానిస్తాడు శైలేంద్ర. తన కళ్ల ముందే భార్యను నానా మాటలు అంటోన్న శైలేంద్రకు రిషి వార్నింగ్ ఇస్తాడు.
Guppedantha Manasu August 9th Episode: తనను ఎండీగా రంగా ప్రకటించిన మరుక్షణమే అతడిని అంతం చేయడమే తన ప్లాన్ అని తల్లి దేవయానితో చెబుతాడు శైలేంద్ర. రంగా బతికిఉంటే మన రహస్యాలు బయటపడే ప్రమాదం ఉందని అంటాడు. వారి ప్లాన్‌ను ధరణి వింటుంది. ఎవరిని చంపేయబోతున్నారని శైలేంద్ర, దేవయానిలను అడుగుతుంది ధరణి. కానీ తెలివిగా శైలేంద్ర సమాధానం దాటవేస్తాడు.
నిజం కనిపెట్టిన వసు...
మను తండ్రి మహేంద్రనే అనే నిజాన్ని వెల్లడిస్తూ మను కోసం తాను రాసిన లెటర్‌ను శైలేంద్రనే దొంగిలించాలని వసుధార అనుమానపడుతుంది. సీసీటీవీ ఫుటేజ్‌లో అదినిజమని తేలుతుంది. వసుధార రాసిన లెటర్‌ను ఆమె క్యాబిన్ నుంచి దొంగిలిస్తూ శైలేంద్ర కనిపిస్తాడు.
వసుధార ఆ వీడియో చూస్తుండగా వెనుక నుంచి రిషి వస్తాడు. రిషిని చూడగానే ల్యాప్‌ట్యాప్ మూసేస్తుంది వసుధార. ఏం చూస్తున్నావని వసుధారను అడుగుతాడు రిషి. వసుధార తడబడుతుంది. చివరకు రిషి పట్టుపట్టడంతో వీడియో చూపిస్తుంది. శైలేంద్ర దొంగతనం చేసిన లెటర్‌లో ఏముంది అని వసుధారను అడుగుతాడు రిషి. కానీ వసుధార సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోతుంది.
మనుకు మాత్రమే చెబుతా...
మనుకు తప్ప ఎవరికి లెటర్‌లో ఉన్న రహస్యం గురించి చెప్పకూడదని రిషికి బదులిస్తుంది వసుధార. నువ్వు చెప్పలేను...చెప్పకూడదు అనుకుంటే నేను నిన్ను ఇబ్బంది పెట్టనని వసుధారతో అంటాడు రిషి. కానీ ఒక్కటి అడుగుతాను...ఆ లెటర్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ నాకు చెప్పడం వల్ల ఏదైనా ప్రాబ్లెమ్ అవుతుందా...ఎవరికైనా ప్రమాదం జరగుతుందా అని వసుధారను అడుగుతాడు రిషి. ఆమె సమాధానం చెప్పేలోపు బుజ్జి నుంచి ఫోన్ రావడంతో రిషి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
బుజ్జి అనుమానాలు...
నాన్నమ్మకు ఆరోగ్యం బాగాలేదని, వెంటనే ఆపరేషన్ చేయాలని డాక్టర్లు అన్నారని రిషితో ఫోన్‌లో చెబుతాడు బుజ్జి. నానమ్మకు ఆరోగ్యం కంటే నీకు ముఖ్యమైన పనులు ఏమున్నాయని, ఎందుకు ఇంటికి రావడం లేదని నిలదీస్తాడు. నువ్వు నిజంగానే రిషి అని నాకు ఎప్పుడో డౌట్ వచ్చిందని చెబుతాడు.
వసుధారకు నచ్చిన కలర్ డ్రెస్‌లు కొనడం, ఆమెకు నచ్చిన పనులే ఎప్పుడు చేసినప్పుడే నువ్వు రిషివి అని అర్థమైందని బుజ్జి అంటాడు. నువ్వు ఉంగరం నాకు ఇచ్చి వసుధారకు ఇవ్వమని చెప్పినప్పుడే నీకు, వసుధారకు పరిచయం ఉందని తేలిపోయిందని తన మనసులోఇన్నాళ్లు దాచుకున్న అనుమానాలు మొత్తం రిషి ముందు బయటపెట్టేస్తాడు బుజ్జి. నువ్వు రిషివే అయితే రంగాగా ఎందుకు నటించావని రిషిని అడుగుతాడు బుజ్జి. త్వరలో వాటికి సమాధానాలు తెలుస్తాయని రిషి సమాధానమిస్తాడు.
శైలేంద్రకు క్లాస్...
మను కోసం రాసిన లెటర్‌ను దొంగతనం చేసిన శైలేంద్ర చెడామడా వాయిస్తుంది వసుధార. అసలు నువ్వు మనిషివేనా, కొంచెం కూడా బుద్ది లేదా...ఎదుటివాళ్ల లెటర్ ఎలా చదువుతావు అని క్లాస్ ఇస్తుంది. వసుధార ఎంత తిట్టినా శైలేంద్ర పట్టించుకోడు. ఆ లెటర్ నా దగ్గరే భద్రంగా ఉందని అంటాడు.
మనుకు నేను ద్రోహం చేసినట్లు తిడుతున్నావు...అసలు వాడిని మోసం చేసింది నేను కాదు నువ్వు...మను తండ్రి ఎవరో తెలిసిన ఇన్నాళ్లు తెలియనట్లు నాటకం ఆడావు అంటూ శైలేంద్ర రివర్స్ అవుతాడు.
మను కాలేజీ నుంచి ఎందుకు వెళ్లిపోయారో చెప్పమని శైలేంద్రను నిలదీస్తుంది వసుధార. నువ్వు తిట్టినా పడతాను..కొట్టిన పడతాను కానీ నిజం మాత్రం చెప్పనని శైలేంద్ర అంటాడు. బాధ్యత లేకుండా కాలేజీ వదిలిపెట్టి వెళ్లిపోయిన వాళ్లతోనే మాట్లాడాలంటే కంపరంగా ఉందని శైలేంద్ర అంటాడు.
రిషి ఎంట్రీ...
అప్పుడే అక్కడికి రిషి ఎంట్రీ ఇస్తాడు. నా భార్యను నువ్వు ఏవేవో మాటలు అంటుంటే చూస్తూ ఊరుకోనని శైలేంద్రపై కోప్పడతాడు రిషి. వసుధార ఏదైనా పదవి తీసుకుంటే ఎన్ని కష్టాలు ఎదురైన వాటిని దాటుకుంటూ ఆ బాధ్యతకు న్యాయం చేస్తుందని అంటాడు.తన వ్యక్తిత్వం గురించి నీకు ఏం తెలుసుని మాట్లాడుతున్నావు అంటూ శైలేంద్ర ను హెచ్చరిస్తాడు రిషి.
వసుధారపై నమ్మకంతోనే తానే ఎండీ బాధ్యతల్ని ఆమెకు అప్పగించనానని, కానీ పరిస్థితుల ప్రభావం వల్ల ఆ పదవికి రాజీనామా చేసిందని శైలేంద్రకు చెబుతాడు రిషి. ఇంకోసారి నా భార్యను ఒక్క మాట అన్న ఊరుకునేది లేదని శైలేంద్రకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు రిషి.
ప్లాన్ రివర్స్...
మను కోసం రాసిన లెటర్‌ను వెంటనే నాకు ఇవ్వమని శైలేంద్రను అడుగుతుంది వసుధార. తాను ఇవ్వనని, అవసరమైనప్పుడు ఆ లెటర్‌ను అస్త్రంగా వాడుకుంటానని శైలేంద్ర సమాధానమిస్తాడు. మనుకు ఆ లెటర్ ఇస్తే మహేంద్ర ప్రాణాలకు ప్రమాదమని వసుధారను బ్లాక్‌మెయిల్ చేయబోతాడు శైలేంద్ర.
కానీ శైలేంద్ర ప్లాన్ రివర్స్ అవుతుంది. ఆ లెటర్‌ను నువ్వు మనుకు ఇస్తే...మహేంద్ర, మను కలిసిపోతారని, అప్పుడు నీ గొయ్యినువ్వే తవ్వుకున్నట్లు అవుతుందని శైలేంద్రకు షాకిచ్చి వెళ్లిపోతుంది వసు.
సరోజ కోపం...
రంగా ఇంట్లో నుంచి వెళ్లిపోయి చాలా రోజులు కావడంతో రాధమ్మ ఎమోషనల్ అవుతుంది. మనవడిని చూడాలని ఉందని కన్నీళ్లు పెట్టుకుంటుంది. రంగాకు సరోజ ఫోన్ చేస్తుంది. ఫోన్ వసుధార లిఫ్ట్ చేయడంతో సరోజ షాకవుతుంది. మా బావ ఫోన్ నీ దగ్గర ఉందంటే...అతడు నీతోనే ఉన్నాడా అని వసుధారను అడుగుతుంది సరోజ. అవునని వసుధార సమాధానం చెప్పగానే...ఇది ఫోన్‌లో తేల్చుకునే విషయం కాదని వసుధార ఫోన్ కట్ చేస్తుంది. ధన్‌రాజ్ ద్వారా వసుధార, రంగా అడ్రెస్ కనిపెట్టాలని సరోజ అనుకుంటుంది.
అనుపమ హ్యాపీ...
అనుపమను కలవడానికి వసుధార వస్తుంది. ఆమెను చూడగానే అనుపమ ఆనందంగా ఫీలవుతుంది. ధైర్యంగా ఉంటే జీవితంలో సాధ్యం కానీది ఏది ఉండదని నిరూపించావని, రిషి చనిపోయాడని అందరూ అన్నా...అతడు బతికే ఉన్నాడని నిరూపించడమే కాకుండా అతడిని తిరిగి తీసుకొచ్చావని వసుధారపై ప్రశంసలు కురిపిస్తుంది.
మీరు మాతో పాటు ఉంటే మేము మరింత సంతోషంగా ఉంటామని అనుపమతో అడుగుతుంది వసుధార. మీరు మహేంద్రను ఒంటరిగా వదిలిపెట్టి అతడి నుంచి దూరంగా ఎందుకు వచ్చారని అనుపమను అడుగుతుంది వసుధార. దేవయానికి మను తండ్రి ఎవరన్నది తెలిసిందని, అది అడ్డం పెట్టుకొని తనను బ్లాక్‌మెయిల్ చేసిందని వసుధారతో చెబుతుంది అనుపమ. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.