Guppedantha Manasu August 8th Episode: శైలేంద్రను బకరా చేసిన రిషి - వసుకు కాలేజీలో అవమానం - దేవయాని సంబరం
Guppedantha Manasu August 8th Episode: గుప్పెడంత మనసు సీరియల్ ఆగస్ట్ 8 ఎపిసోడ్‌లో రంగా రూపంలో ఉన్న రిషిని చంపేందుకు శైలేంద్ర స్కెచ్ వేస్తాడు. అతడి ప్లాన్‌ను ధరణి వింటుంది.
Guppedantha Manasu August 8th Episode: కాలేజీలోని ఫైల్స్ అన్ని పెండింగ్‌లోనే ఉండటంతో ఎంప్లాయ్స్‌పై వసుధార ఫైర్ అవుతుంది. చకచకా వాటికి సంబంధించిన పనులు మొత్తం పూర్తవ్వాలని వార్నింగ్ ఇస్తుంది. వర్క్ విషయంలో తాను నిజాయితీగా ఉంటానని, తన చుట్టూ ఉన్నవాళ్లు అలాగే ఉండాలని కోరుకుంటానని అంటుంది. ఫైల్స్‌ను పాస్ చేసేందుకు వసుధార వాటిపై సంతకం చేయబోతుండగా శైలేంద్ర అడ్డుకుంటాడు.
ఏ అధికారంలో ఉన్నావని ఫైల్స్‌పై సంతకాలు చేస్తున్నావని ఫైర్ అవుతాడు. నువ్వు ఇప్పుడు ఎండీవి కాదు..కనీసం ఇన్‌ఛార్జ్ కూడా కాదు. ఎండీ సీట్‌కు రిజైన్ చేసిన తర్వాత నీకు కాలేజీలో ఏ హోదా లేదు..నీ సంతకానికి విలువ లేదు. నువ్వు ఆర్డినరీవే అంటూ అవమానిస్తాడు.
శైలేంద్రకు రిషి సపోర్ట్...
వసుధారతో శైలేంద్ర వాదిస్తోన్న టైమ్‌లో పక్కనే రిషి ఉంటాడు. అతడు కూడా శైలేంద్ర వాదనే కరెక్ట్ అని అంటాడు. వసుధార ఇప్పుడు ఎండీ కూడా కాదని చెబుతాడు. వసుధార సంతకం చెల్లదని అంటాడు. నీకు ఇప్పుడు అధికారం లేదని, ఈ సీట్‌లో కూర్చున్న వారే ఆ ఫైల్స్ పాస్ చేయాలని వసుధారతో అంటాడు రిషి. ఎంప్లాయ్స్ సర్ధిచెప్పబోయిన శైలేంద్ర వినడు. రాజీనామా చేసిన వాళ్లు, అర్హత లేనివాళ్లు సంతకాలు పెడితే ఊరుకునేది లేదని వారి మాటలను లెక్కచేయడు.
రిషి లాజిక్స్...
వసుధార స్టూడెంట్స్ మంచి కోసమే ఫైల్స్ పాస్ చేయాలని అనుకుంటుందేమోనని శైలేంద్రతో అంటాడు రిషి. అదేంటి నువ్వు మారిపోయి ఇలా మాట్లాడుతున్నావని శైలేంద్ర అనుమానపడతాడు. ఎండీ ఎవరన్నది నువ్వే ఎన్నుకోవాలని రిషిని కోరుతాడు శైలేంద్ర. త్వరలోనే బోర్డ్ మీటింగ్ ఏర్పాటు చేసి నెక్స్ట్ ఎండీని తాను ప్రకటిస్తానని రిషి అనౌన్స్‌చేస్తాడు.
వసుధార క్యాబిన్ నుంచి బయటకు రాగానే ఎండీగా నా పేరు ఎందుకు చెప్పలేదని రిషిపై శైలేంద్ర ఫైర్ అవుతాడు. వసుధార అడిగిన వెంటనే నా పేరు చెప్పాల్సిందని అంటాడు. అలా వెంటనే పేరు చెప్పేస్తే తాను రిషి కాదు రంగానని వసుధార ఈజీగా కనిపెడుతుందని శైలేంద్రను బోల్తా కొట్టిస్తాడు రిషి. ఒరిజినల్ రిషి ఇంత సడెన్‌గా మీ పేరు చెప్పడు కదా అని అంటాడు. తమ్ముడి లాజిక్‌కు శైలేంద్ర ఇంప్రెస్ అవుతాడు.
ఏంజెల్ ఎమోషనల్...
కాలేజీలో రిషిని చూసి ఏంజెల్ ఎమోషనల్ అవుతుంది. నువ్వు చనిపోయావని వార్తల్లో న్యూస్ చూడగానే నా గుండె ఆగినంత పనైందని అంటుంది. వసుధార మాత్రం నువ్వు బతికే ఉన్నావని నమ్మంది. ఎవరి మాటలు నమ్మాలో తెలియక ఎన్నో సార్లు కన్నీళ్లు పెట్టుకున్నానని అంటుంది. ఇప్పుడు నిన్ను మళ్లీ చూసిన తర్వాతే నాకు కొండంత ధైర్యం వచ్చిందని అంటుంది.
రిషితో ఏంజెల్ మాట్లాడటం దూరం నుంచి శైలేంద్ర చూస్తాడు. తాను ఏంజెల్ ఫొటో చూపించకుండానే నిజంగానే పరిచయం ఉన్నవాడిలా ఎలా మాట్లాడుతున్నాడని కంగారు పడతాడు. రంగాలా తన ముందు యాక్ట్ చేస్తున్నదని నిజంగానే రిషి కావచ్చుననే అనుమానం శైలేంద్రలో మొదలవుతుంది. ఏంజెల్‌తో రిషి ఏం మాట్లాడుతున్నాడో వినాలని దాక్కుంటాడు. అది రిషి కనిపెడతాడు.
రిషి కాదు రంగానే...
ఈ అమ్మాయి ఎవరో బెస్ట్ ఫ్రెండ్ అని తనతో చాలా చనువుగా మాట్లాడుతూ ప్రాణాలు తీస్తుందని, నేను ఎలాగోలా మ్యానేజ్ చేస్తున్నానని, ఈమె గురించి నాకు ఎందుకు చెప్పలేదని శైలేంద్రకు మెసేజ్ పెడతాడు రిషి. ఆ మెసేజ్ చూసి అతడు రంగానేనని నమ్ముతాడు శైలేంద్ర.
రిషిని సేవ్ చేయడానికి వాళ్ల మధ్యలోకి శైలేంద్ర ఎంట్రీ ఇస్తాడు. మను ఎక్కడ అని ఏంజెల్‌ను అడుగుతాడు. మా బావ నీ ముఖం చూడటానికి కూడా ఇష్టపడటం లేదని ఏంజెల్..శైలేంద్రకు కసిరినట్లుగా ఆన్సర్ ఇస్తుంది. రిషిని తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
ఏంజెల్ ప్రశంసలు...
రిషిని తిరిగి తీసుకొచ్చిన వసుధారపై ఏంజెల్ ప్రశంసలు కురిపిస్తుంది. పొగడ్తలు, ప్రశంసల కోసంతాను ఈ పని చేయలేదని, రిషితో పాటు నా ప్రాణాన్ని నేను వెనక్కి తెచ్చుకున్నానని, రిషి లేకపోతే ఈ వసుధార లేనట్లేనని వసుధార ఎమోషనల్‌గా ఏంజెల్‌కు సమాధానమిస్తుంది. మను ఎందుకు కాలేజీకి రావడం లేదని ఏంజెల్‌ను అడుగుతుంది వసుధార.
ఏమైందో తెలియదు కానీ మహేంద్ర దగ్గర నుంచి వెళ్లిపోవడమే కాకుండా మను, అనుపమ కాలేజీకి కూడా రావడం లేదని ఏంజెల్ బదులిస్తుంది. మను కాలేజీకి దూరం కావడం వెనుక ఏదో బలమైన కారణం ఉండి ఉంటుందని వసుధార అనుమానపడుతుంది.
తండ్రి గురించి తెలుసుకోను...
తన తండ్రి ఎవరో తెలియక ఇప్పటికీ మను నిరంతరం సంఘర్షణ పడుతూనే ఉన్నాడని వసుధారతో అంటుంది ఏంజెల్. తాను రాసిన లెటర్ మను చదవలేదని వసుధార అర్థం చేసుకుంటుంది. మనుకు ఫోన్ చేసి తాను లెటర్ రాసిన సంగతితో పాటు అతడి తండ్రి ఎవరో చెప్పాలని వసుధార అనుకుంటుంది.
కానీ మను మాత్రం ఆమె మాటలు వినడు. తండ్రి గురించి తాను చెప్పే వరకు ఎవరిని అడగొద్దని అనుపమ తన దగ్గర మాట తీసుకుందనే నిజం బయటపెడతాడు. కాలేజీకి ఎందుకు రావడం లేదని అడిగితే మీరు...రిషి వచ్చారు కదా...నా అవసరం లేదని, ఆ టాపిక్ వదిలేయమని ఫోన్ పెట్టేస్తాడు.
శైలేంద్ర ఆనందం...
శైలేంద్ర ఆనందంగా ఇంటికొస్తాడు. రేపో మాపో తాను ఎండీని కాబోతున్నట్లు సంబరపడిపోతాడు. తననే ఎండీ అని రంగా ప్రకటించడం ఖాయమని తల్లితో చెబుతానే. రంగా నిజంగానే నీ పేరు చెబుతాడా అంటూ అనుమానపడుతుంది దేవయాని. రంగాకు పెద్దగా తెలివితేటలు లేవని, మనం మంచివాళ్లమని నమ్ముతున్నాడని, నటన అని తెలుసుకునే తెలివితేటలకు కూడా వాడికి లేవంటూ దేవయానితో చెబుతాడు శైలేంద్ర.
తిరిగిరాని లోకాలకు...
వీలైనంత తొందరగా పని పూర్తిచేసి రంగాను ఊరు పంపించమని కొడుకుతో అంటుంది దేవయాని. రంగా ఇక్కడి నుంచి వెళ్లిపోతే మన రహస్యాలు బయటపడతాయని, తిరిగిరాని లోకాలకు రంగాను పంపిస్తానని శైలేంద్ర తన అసలు ప్లాన్‌ను బయటపెడతాడు.
మన రహస్యాలు తె లిసిన వాళ్లు భూమిపై ఉంటే ప్రమాదమని తల్లితో అంటాడు. పని పూర్తయిన వెంటనే రంగాను చంపేస్తానని తల్లితో చెబుతాడు శైలేంద్ర. అప్పుడే అక్కడికి ధరణి ఎంట్రీ ఇస్తుంది. ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారని భర్తను నిలదీస్తుంది. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగింది.