Guppedantha Manasu August 10th Episode: అన్నయ్య విలనిజంపై రిషి ఆరాలు - డేంజర్‌లో పడ్డ రంగా - మరదలితో మను పెళ్లి
Guppedantha Manasu August 10th Episode: గుప్పెడంత మనసు ఆగస్ట్ 10 ఎపిసోడ్‌లో తన కుటుంబానికి అన్యాయం చేసింది శైలేంద్రనేనా కాదా అన్నది తెలుసుకోవాలని రిషి ఫిక్సవుతాడు. శైలేంద్రను మాటల్లో పెట్టి గుట్టు లాగాలని అనుకుంటాడు.
Guppedantha Manasu August 10th Episode: శైలేంద్ర కారణంగానే మను, అనుపమ...మహేంద్రకు దూరమయ్యారనే నిజం వసుధార కనిపెడుతుంది. మను తండ్రి ఎవరన్నది దేవయానికి తెలిసిందని, అది అడ్డం పెట్టుకొని తనను బ్లాక్‌మెయిల్ చేసిందని వసుధారతో చెబుతుంది అనుపమ.
ఆ నిజం బయటపడకూడదనే మనును బలవంతంగా ఒప్పించి కష్టాల్లో ఉన్న కాలేజీతో పాటు మహేంద్రను ఒంటరిగా వదిలిపెట్టి వచ్చామని అనుపమ ఎమోషనల్ అవుతుంది. తాను చేసిర పొరపాటు వల్లే దేవయానికి నిజం తెలిసిపోయిందని వసుధార బాధపడుతుంది. ఇదంతా మా తలరాత దానికి నువ్వేం చేస్తావని వసుధారతో అంటుంది అనుపమ.
నిజాలు విన్న మను...
ఇకనైనా మనుకు నిజం చెప్పమని అనుపమను కోరుతుంది వసుధార. మనుకు నిజం తెలిస్తే ఎన్ని అనర్థాలు జరుగుతాయో, మహేంద్రకు ఏమవుతుందోనని అనుపమ భయపడుతుంది. అలాంటివేమి జరగవని వసుధార ఎంత చెప్పిన అనుపమ మాత్రం మాట వినదు.
వసుధార, అనుపమ మాటలను చివరలో వింటాడు మను. తన తండ్రి ఎవరన్నది శైలేంద్ర, దేవయానిలకు తెలిసిపోయింది. కానీ నాకు మాత్రం తెలియలేదని అనుకుంటాడు. ఇక నుంచి తండ్రి గురించి ఎవరని అడగాల్సిన పనిలేదని, ఏం చేయాలో క్లారిటీ వచ్చిందని మనసులో అనుకుంటాడు.
రిషికి శైలేంద్ర వార్నింగ్...
మరోవైపు ఒంటరిగా ఉన్న రిషి దగ్గరకు శైలేంద్ర వస్తాడు. నువ్వు రిషిలా మాత్రమే నటిస్తున్నావు. కానీ రిషివి కాదు. మరి ఎందుకు నా భార్యను ఒక్క మాట అన్న ఊరుకునేది లేదని బిల్డప్‌లు ఇచ్చావు. నాకే వార్నింగ్ ఇస్తావా అంటూ రిషిపై శైలేంద్ర ఫైర్ అవుతాడు. వసుధారకు డౌట్ రాకుండా ఉండాలనే అలా మాట్లాడానని శైలేంద్రను బురిడీ కొట్టిస్తాడు రిషి.
బోర్డ్ మీటింగ్‌లో ఎండీగా...
కాలేజీలో బోర్డ్ మీటింగ్ ఏర్పాటుచేయబోతున్నట్లు...అందులో ఎండీగా తన పేరు ప్రకటించాలని రిషితో అంటాడు శైలేంద్ర. పని పూర్తవ్వగానే ఒప్పందం ప్రకారం మిగిలిన డబ్బులు ఇవ్వడమే కాకుండా నిన్ను ఊరికి పంపిస్తానని రిషికి మాటిస్తాడు శైలేంద్ర. పని పూర్తవ్వగానే నన్ను ఏం చేయవని గ్యారెంటీ ఏంటి అని శైలేంద్రను అడుగుతాడు రిషి.
తన ప్లాన్‌ను రిషి కనిపెట్టడం చూసి శైలేంద్ర షాకవుతాడు. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డుపెడతానని, నేను ఉండగా నిన్ను ఎవరూ ఏం చేయలేరని రిషిని నమ్మిస్తాడు.
కూపీ లాగిన రిషి...
ఎండీ సీట్ అంటే ఎందుకు అంత ఇష్టమని శైలేంద్రను అడుగుతాడు రిషి. ఎండీ సీట్ చేపట్టాలనేది నా జీవితాశయమని, డీబీఎస్‌టీ సామ్రాజ్యంలో రాజుగా ఉండాలన్నది తన కల, కాలేజీలో నా మాట శాసనంగా మారాలని మనసులో ఉన్న మాటలు బయటపెడతాడు శైలేంద్ర. రిషి,జగతి, వసుధార ఇలా ఒక్కొక్కరు తన కలకు అడ్డుగా నిలుస్తూ వచ్చారని, ఈ సీట్ కోసం ఎన్ని చేశానంటే...అని ఆగిపోతాడు.
తనను మాటల్లో పెట్టి రంగా గట్టు మొత్తం లాగుతున్నాడని శైలేంద్ర గ్రహిస్తాడు. ఏం లేదని టాపిక్ డైవర్ట్ చేస్తాడు. మహేంద్ర ఫ్యామిలీ నాశనం కావడం నువ్వే కారణమా...ఎండీ సీట్ కోసమే వాళ్లను కష్టాలు పెడుతున్నావా అని శైలేంద్రను అడుగుతాడు రిషి. నేనేం చేయలేదని, ఫ్యామిలీకి ఎవరైనా అలా ద్రోహం చేస్తారా అంటూ బుకాయిస్తాడు శైలేంద్ర. కాలేజీ గవర్నమెంట్ హ్యాండోవర్ కాకుండా ఉండాలనే నీకు డబ్బులు ఇస్తున్నానని అబద్దాలు ఆడుతాడు.
మనుకు ఏంజెల్ ప్రపోజ్...
నేను అంటే నీకు ఇష్టామా...మనం పెళ్లి చేసుకుందామా అని మనుకు ప్రపోజ్ చేస్తుంది ఏంజెల్. నీ జీవితంలో సంతోషాన్ని నింపాలని అనుకుంటున్నానని అంటుంది. మనిషికి...మనిషి తోడుంటే బాధలు దూరమవుతాయాని, అందుకు వసుధార, రిషిలే ఉదాహరణ అని మనుకు చెబుతుంది ఏంజెల్. ఎన్నో కష్టాలు దాటుకొని ఇద్దరు ఒక్కటయ్యారని, వారి ప్రేమను చూస్తుంటే ఆనందంతో పాటు అప్పుడప్పుడు అసూయ కూడా కలుగుతుందని ఏంజెల్ అంటుంది.
కష్టసుఖాల్లో తోడుగా...
మనం కూడా ఎప్పుడే అలాగే కష్టసుఖాల్లో కలిసి ఉండాలని తాను కోరుకుంటున్నట్లు మను పట్ల తన మనసులో దాగి ఉన్న ఇష్టాన్ని ఏంజెల్ బయటపెడుతుంది. వారం రోజులు టైమ్ ఇస్తే ఆ లోగా సమాధానం చెబుతానని ఏంజెల్‌కు రిప్లై ఇస్తాడు. ఇన్నాళ్ల నా నిరీక్షణకు వారం రోజుల్లో తప్పకుండా ఫలితం దక్కనున్నట్లు కనిపిస్తోందని చెబుతాడు. నా ప్రశ్నకు సమాధాన దొరికిన వెంటనే పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందామని ఏంజెల్‌ను ఒప్పిస్తాడు మను.
దేవయాని భయం...
రంగా...రిషి కాదని తెలిస్తే మన పరిస్థితి ఏమిటని దేవయాని భయపడుతుంది. వసుధారతో రంగా కలిసి ఉండటం తనకు నచ్చలేదని చెబుతుంది. ఒకవేళ రంగా దొరికిపోయే పరిస్థితి వస్తే వాడిని లేపేస్తానని దేవయానితో అంటాడు శైలేంద్ర. రంగా ఎవరు అని భర్తను ధరణి అడుగుతుంది. ఆమె ఎంట్రీతో శైలేంద్ర షాకవుతాడు.
రంగా నా ఫ్రెండ్ అని అబద్ధం ఆడుతూ ఆమెను నమ్మిస్తాడు. ఆ రూమ్ నుంచి ధరణిని పంపిస్తాడు. తన తండ్రి గురించి తెలుసుకోవడానికి శైలేంద్రకు ఫోన్ చేస్తాడు మను. కానీ శైలేంద్ర ఫోన్ లిఫ్ట్ చేయకుండా మనును ఆడుకుంటాడు. ఫణీంద్ర ఇంటి నుంచి తమ ఇంటికి వచ్చేస్తారు మహేంద్ర, వసుధార, రిషి. తన ఇంట్లో అడుగుపెట్టగానే జగతి ఫొటో చూసి మహేంద్ర ఎమోషనల్ అవుతాడు. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.