Guppedantha Manasu April 18th Episode: కాలేజీ నుంచి వైదొలిగిన రిషి తండ్రి - మనును దత్తత తీసుకున్న మహేంద్ర
నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో మను తండ్రిని తానే అంటూ మహేంద్ర తీసుకున్న నిర్ణయాన్ని బోర్డ్ మెంబర్స్ తప్పు పడతారు. అతడి వల్ల కాలేజీకి చెడ్డ పేరు వచ్చిందని అంటారు. బోర్డ్ సభ్యుల మాటలను సహించని మహేంద్ర కాలేజీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటిస్తాడు.

Guppedantha Manasu April 18h Episode: మను తండ్రి తానే అని మహేంద్ర చెప్పిన మాటను పెద్దది చేసి ఫణీంద్ర ముందు మహేంద్రను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది దేవయాని. మహేంద్ర చేసిన తప్పుకు తాను అవమానంగా ఫీలవుతున్నానని శైలేంద్ర అంటాడు. భూషణ్ ఫ్యామిలీకి మహేంద్ర మచ్చ తీసుకొచ్చాడని అతడిపై ఫైర్ అవుతాడు. వారి మాటలను మహేంద్ర పట్టించుకోడు. మను కోసం తాను ఎంతదూరమైన వెళతానని, వెనక్కి తగ్గేదే లేదని మహేంద్ర అంటాడు.
కాలేజీకి బ్యాడ్‌నేమ్...
మహేంద్ర నిర్ణయంపై బోర్డ్ మెంబర్స్ కూడా ఫైర్ అవుతారు. మీరు చేసిన పనికి మీతో పాటు కాలేజీకి బ్యాడ్‌నేమ్ వచ్చిందని మహేంద్రతో అంటారు. అందరు మీ గురించి, మన కాలేజీ గురించి చీప్‌గా మాట్లాడుతున్నారని చెబుతారుమను గురించి అడిగితే మీరెందుకు అంతలా రియాక్ట్ అయ్యారని బోర్డ్ మెంబర్స్ మహేంద్రను ప్రశ్నిస్తారు. మా బాబాయ్‌కి స్పందించే గుణం ఎక్కువ అంటూ శైలేంద్ర సెటైర్ వేస్తాడు. ఎంత స్పందించే గుణం ఉన్నా మరొకరికి తండ్రిని అని చెప్పడం కరెక్ట్ కాదని బోర్డ్ మెంబర్స్ చెబుతారు.
అనుపమ ఇంఛార్జ్...
మహేంద్ర చెప్పిన దాంట్లో నిజం ఉండొచ్చునని ఓ బోర్డ్ మెంబర్ అంటాడు. నిజంగానే మను...మహేంద్ర కొడుకు కావచ్చునని అంటాడు. అందుకే అనుపమను కాలేజీలోకి తీసుకొచ్చి..మిషన్ ఎడ్యుకేషన్‌కు ఇంఛార్జ్ చేశాడని మాట్లాడుతాడు. ఆ బోర్డ్ మెంబర్‌పై వసుధార ఫైర్ అవుతుంది.
మరొకరి వ్యక్తిగత జీవితాన్ని గురించి మీకు మీరే ప్రశ్నలు వేసుకొని మీకు మేరే సమాధానం చెప్పడం ఏంటి అంటూ కోప్పడుతుంది. మహేంద్రకు సపోర్ట్ చేస్తున్నట్లుగా నటిస్తూ గొడవను మరింత పెద్దది చేస్తాడు శైలేంద్ర. ఫణీంద్ర కూడా మహేంద్ర మాట్లాడింది తప్పేనని అంటాడు.
కాలేజీ నుంచి తప్పుకున్న మహేంద్ర…
తాను చేసిన తప్పుకు గాను ఈ కాలేజీ నుంచి వైదొలుగుతున్నట్లు మహేంద్ర ప్రకటిస్తాడు. అతడి నిర్ణయంతో వసుధార షాకవుతుంది. తాను చేసిన తప్పుకు శిక్ష ఇదేనని మహేంద్ర అంటాడు. కానీ మహేంద్ర కాలేజీ నుంచి వెళ్లిపోవాల్సిన అవసరం లేదని మను అంటాడు.
తాను కాలేజీలో అడుగుపెట్టిన తర్వాతే ఈ సమస్యలు మొదలయ్యాయి కాబట్టి తానే కాలేజీ నుంచి వెళతానని, మీరు కాలేజీలోనే ఉండాలని అంటాడు. మీటింగ్‌లో కూడా తన వల్లే గొడవ జరిగిందని అంటాడు. డైరెక్టర్ పదవికి రిజైన్ చేయనున్నట్లు మను ప్రకటిస్తాడు. మను నిర్ణయంతో శైలేంద్ర హ్యాపీగా ఫీలవుతాడు.
యాభై కోట్ల అప్పు...
మను ఎక్కడికి వెళ్లడని, ఇక్కడే ఉంటాడని మహేంద్ర అంటాడు. మనును కాలేజీ నుంచి పంపించాలని ఎవరైనా అనుకుంటే అతడికి బాకీ ఉన్నా యాభై కోట్లు చెల్లించాలని, ఆ అప్పు తీర్చకుండా మనును కాలేజీ నుంచి బయటకు పంపించడం కరెక్ట్ కాదని మహేంద్ర బోర్డ్ మీటింగ్‌లో ప్రకటిస్తాడు. తాను కాలేజీని వదిలిపెడుతున్నట్లు చెప్పి మీటింగ్ నుంచి బయటకు వస్తాడు.
కాలేజీ విషయంలో బెంగ లేదు...
కాలేజీ బాధ్యతల నుంచి తప్పుకోవాలనే మహేంద్ర నిర్ణయాన్ని వసుధార తప్పుపడుతుంది. అది మీ కాలేజీ, మీ నాన్నగారు మీకు అప్పగించిన కాలేజీ అని అంటుంది. కాలేజీ బాధ్యతల్ని సక్రమంగా చూసుకోవడానికి నన్ను మించి మీరుందరూ ఉన్నారు. రిషి, జగతి, ఇప్పుడు నువ్వు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కాలేజీని నడిపిస్తున్నారని సమాధానమిస్తాడు. కాలేజీ విషయంలో ఎలాంటి బెంగ లేదని, కానీ ముందు ఉన్న బెంగ ఒక్కటేనని అనుపమను చూస్తాడు.
అనుపమ ప్రశ్నలు...
నా విషయంలో ఎందుకు అంత ఎమోషనల్‌గా ఉంటున్నావు. మా కోసం కాలేజీని ఎందుకు వదిలిపెట్టావని మహేంద్రను అడుగుతుంది అనుపమ. జగతి చనిపోయిందని తెలిసి నువ్వు ఎందుకు ఎమోషనల్ అయ్యావు. రిషి కనిపించకుండాపోయాడని తెలిసి నువ్వు ఎందుకు బాధపడ్డావని అనుపమను తిరిగి ప్రశ్నిస్తాడు మహేంద్ర. జగతి నా బెస్ట్ ఫ్రెండ్, స్నేహితురాలికి ఏదైనా జరిగితే ఎవరైనా ఎమోషనల్ అవుతారని అనుపమ బదులిస్తుంది.
నీ బెస్ట్ ఫ్రెండ్ విషయంలో నువ్వు అంతలా రియాక్ట్ అయినప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ విషయంలో నేను రియాక్ట్ కావడంలో తప్పు లేదని మహేంద్ర అంటాడు. నువ్వు, నేను, జగతి ఎప్పుడు వేరు కాదు. మనం ముగ్గురం ఒక్కటేనని మహేంద్ర చెబుతాడు. నీకు సమస్య వస్తే నేను సైలెంట్‌గా ఉండనని చెబుతాడు.
మనును దత్తత తీసుకోనున్న మహేంద్ర...
గొడవలను మర్చిపోయి కాలేజీకి వెళ్లమని మహేంద్రకు సర్ధిచెబుతుంది అనుపమ. కానీ మహేంద్ర మాత్రం ఆమె మాట వినడు. ఈ సమస్యకు పరిష్కారం దొరికేవరకు తాను వదిలిపెట్టనని అంటాడు. మనును దత్తత తీసుకోనున్నట్లు ప్రకటిస్తాడు. అందరి ముందు మను తండ్రిని అని చెప్పిన మాటను ఎలా బెట్టుకుంటావని అందరూ అడుగుతున్నారు. ఆ ప్రశ్నకు నేను చేసే న్యాయం ఇదేనని అంటాడు. అతడి మాటలతో వసుధార, అనుపమ షాకవుతారు.
దేవయాని ఫైర్...
అనుపమకు దేవయాని ఫోన్ చేస్తుంది. మహేంద్రను కాలేజీ నుంచి దూరం చేయడానికి హైదరాబాద్‌కు వచ్చావా అంటూ లిఫ్ట్ చేయడంతోనేఅనుపమను అవమానిస్తుంది మాట్లాడుతుంది దేవయాని. జగతి, నువ్వు కాలేజీ మహేంద్ర జీవితాన్ని కష్టాలు పాలు చేశారని నానా మాటలు అంటుంది. చుట్టపు చూపుకుగా వచ్చిన నీ సమస్యలన్నీ మహేంద్రపై రుద్దుతున్నారని నిందలు వేస్తుంది. మను తండ్రిని నేనే అని చెప్పడం వల్ల మా కుటుంబం పరువు పోయిందని, తలెత్తుకొని తిరగలేకపోతున్నామని అనుపమతో అంటుంది దేవయాని.
మహేంద్ర ట్విస్ట్...
అనుపమ దగ్గర నుంచి ఫోన్ తీసుకుంటాడు మహేంద్ర. నువ్వు అనుపమ, మను మాయలో పడొద్దని ,ఈ నీ మంచి కోసమే చెబుతున్నానని మహేంద్రతో అంటుంది దేవయాని. మీ కంటేనా అంటూ దేవయానిపై సెటైర్ వేస్తాడు మహేంద్ర. మీరు నా కోసం ఎంతో మంచి చేశారని, అవన్నీ తట్టుకోలేకపోతున్నానని చెబుతాడు. ఇంకాసేపట్లో మీ ఇంటికొచ్చి ఓ ఇన్విటేషన్ ఇవ్వనున్నట్లు దేవయానితో అంటాడు మహేంద్ర.
శైలేంద్ర టెన్షన్...
మహేంద్ర దేని గురించి చెబుతున్నాడో దేవయానికి అర్థం కాదు. సస్పెన్స్ తట్టుకోలేకపోతుంది.ఏం ఇన్వేటేషన్ ఇవ్వబోతున్నావని మహేంద్రను ఆత్రుతగా అడుగుతుంది. వచ్చి నప్పుడు చూస్తారుగా అంటూ ఆమె టెన్షన్‌ను మరింత పెంచుతాడు. మహేంద్ర చేయబోయే ఫంక్షన్ ఏదన్నది తెలియక శైలేంద్ర కూడా క్ంగారు పడతాడు. బాబాయ్ కొత్త కాలేజీ ఏదైనా ఏర్పాటుచేస్తాడేమోనని శైలేంద్ర అనుమానం వ్యక్తం చేస్తాడు. అతడి మాటలతో ఫణీంద్ర ఫైర్ అవుతాడు.
మను తండ్రిని తానే అంటూ మహేంద్ర తీసుకున్న నిర్ణయాన్ని బోర్డ్ మెంబర్స్ తప్పు పడతారు. అతడి వల్ల కాలేజీకి చెడ్డ పేరు వచ్చిందని అంటారు.