Guppedantha Manasu Today Episode: మాట తప్పిన వసుధార - రిషిని మర్చిపోయిందంటూ దేవయాని నిందలు - ఒక్కటైన విలన్ బ్యాచ్
Guppedantha Manasu Today Episode: నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో రిషిని మూడు నెలల్లో తిరిగి తీసుకొస్తానని చెప్పిన వసుధార ఆ మాట నిలబెట్టుకోలేకపోవడంతో ఆమెపై దేవయాని ఫైర్ అవుతుంది. రిషిని వసుధార మర్చిపోయిందంటూ బోర్డ్ మీటింగ్‌లో మనసు విరిగేలా మాట్లాడుతుంది.
Guppedantha Manasu april 12th Episode:మను తిరిగి కాలేజీకి రావడంతో అతడిని దెబ్బకొట్టేందుకు విలన్స్ అందరూ ఏకమవుతారు. దేవయాని, శైలేంద్ర, రాజీవ్ ముగ్గురు కలిసి స్కెచ్ వేస్తారు. మను మళ్లీ కాలేజీకి ఏదో ఒక బలమైన ప్లాన్‌తో వచ్చుంటాడు..ఇంతకుముందు కూడా వాడిని తక్కువ అంచనా వేసి దెబ్బతిన్నామని రాజీవ్ అంటాడు.

ఇన్నాళ్లు వేరు. ఇప్పుడు వేరే లెక్క. ఇన్నాళ్లు మను బలహీనత తెలియక వాడిని దెబ్బకొట్టలేకపోయాం. ఇప్పుడు వాడి బలహీనత ఏమిటో తెలిసింది. మనల్ని ఎదుర్కోవడం వాడి తరం కూడా కాదని దేవయాని అంటుంది.
మనుకు అవమానం...
పేరెంట్స్, స్టూడెంట్స్ బోర్డ్ మీటింగ్‌లోనే మనును మళ్లీ అవమానించాలని శైలేంద్ర ఫిక్సవుతాడు. తండ్రి గురించి పదే పదే అడిగి మను మనసును ముక్కలు చేస్తానని దేవయాని, రాజీవ్‌లతో అంటాడు శైలేంద్ర.
దుఃఖం వాడికి ఆనందం మనకు అని అంటాడు.ఎంత వీలైతే అంత తొందరలో మనును కాలేజీ నుంచి వెళ్లిపోయేలా చేస్తా. మను లైన్ క్లియర్ అయిన వెంటనే వసుధారను కాలేజీ నుంచి నువ్వు తీసుకెళ్లమని రాజీవ్‌కు చెబుతాడు శైలేంద్ర. అతడి మాటలతో వసుధార తన సొంతమైనట్లు రాజీవ్ ఆనందపడతాడు.కొడుకు విజయాన్ని చూసేందుకు దేవయాని కూడా కాలేజీకి బయలుదేరుతుంది.
మనుకు థాంక్స్...
కాలేజీకి తిరిగి వచ్చిన మనుకు థాంక్స్ చెబుతుంది వసుధార. శైలేంద్ర చేసిన అవమానం వల్ల మీరు మళ్లీ కాలేజీకి వస్తారో లేదోనని తాను భయపడిట్లు చెబుతుంది. దారిలో వస్తుంటే ఎన్నో కుక్కలు మొరుగుతాయి. మొరిగిన కుక్కలకు భయపడి ఆగితే మనం ముందుకు వెళ్లలేం, మన పని మనం చేసుకోలేం అని శైలేంద్రను ఉద్దేశించి అంటాడు మను.
పేరెంట్స్, స్టూడెంట్స్ మీటింగ్ కోసమే మనును కాలేజీకి పిలిపించినట్లు చెబుతుంది వసుధార. ఆ మీటింగ్‌ను విజయవంతం చేసే బాధ్యతను మనుకు అప్పగిస్తుంది వసుధార. ఆ మీటింగ్‌ను సక్సెస్ చేస్తానని వసుధారకు మాటిస్తాడు మను.
రిషి టాపిక్...
బోర్డ్ మీటింగ్‌లో మను, వసుధారలను అవమానించే ఛాన్స్ కోసం శైలేంద్ర, దేవయాని ఎదురుచూస్తుంటారు. నువ్వు ఎండీ సీట్‌లో కూర్చున్న దగ్గర నుంచి అన్ని విడ్డూరాలే జరుగుతున్నాయని వసుధారపై సెటైర్ వేస్తుంది దేవయాని. రిషి ఉన్నప్పుడు ఇలాంటి మీటింగ్‌లు ఎప్పుడు జరగలేదని అంటుంది.
రిషి ఉన్నప్పుడు ఎంఎస్ఆర్ మన కాలేజీని సొంతం చేసుకోవడానికి ఎన్ని కుట్రలు చేసిన అన్నింటిని తిప్పికొట్టి కాలేజీకి ఏ సమస్య కాకుండా రిషి చూసుకున్నాడు. కాలేజీని టాప్‌లో నిలబెట్టాడు అంటూ రిషితో వసుధారను కంపేర్ చేస్తుంది దేవయాని.
ఇప్పుడు రిషి సంగతి అనవసరం అని ఫణీంద్ర చెప్పిన దేవయాని మాత్రం తన మాటల ధాటిని ఆపదు. రిషి గురించి వసుధార పట్టించుకోవడం లేదు. నువ్వు ఎందుకు మాట్లాడుతావు అంటూ గొడవను మరింత పెద్దది చేస్తాడు శైలేంద్ర.
మను సపోర్ట్...
కావాలనే ఆ మాట శైలేంద్ర అన్నాడని అర్థం చేసుకున్న మను అతడిపై ఫైర్ అవుతాడు. వసుధార ఎప్పుడు రిషి గురించే ఆలోచిస్తుంటుందని, అతడి అడుగుజాడల్లోనే నడుస్తుంటుందని దేవయాని, శైలేంద్రలతో అంటాడు మను. వసుధారను మను సపోర్ట్ చేయడం దేవయాని సహించలేకపోతుంది. శైలేంద్ర ఏదో అడిగితే నువ్వు దానిని హైలైట్ చేసి మాట్లాడుతున్నావేంటి? అవసరం లేని సపోర్ట్ వసుధారకు ఇస్తున్నావు అంటూ మనుతో ఎగతాళిగా మాట్లాడుతుంది దేవయాని.
వసుధార నిజంగా రిషి గురించి పట్టించుకుంటే...మూడు నెలల్లో అతడిని తిరిగి తీసుకొస్తానని మాట ఇచ్చింది. రిషిని ఎందుకు తిరిగితీసుకురాలేదు. కనీసం రిషి కోసం వెతికినట్లు కూడా కనిపించలేదు అంటూ వసుధార మనసును విరిచేస్తుంది దేవయాని.
అన్ని మీకు చెప్పి చేయాలనే రూల్ ఏం లేదని, కొన్ని మీకు తెలియకుండా జరుగుతాయని వసుధార కఠినంగా సమాధానమిస్తుంది. నేను ఇంకా రిషిని నువ్వు మర్చిపోయావని అనుకున్నాను. కానీ నువ్వు రిషి గురించి ఆలోచిస్తూ మీకు ఎవరికి తెలియకుండా వెతుకుతున్నావా అంటూ వసుధారను దెప్పిపొడుస్తుంది.
మహేంద్ర ఫైర్...
దేవయానిపై మహేంద్ర ఫైర్ అవుతాడు. కాలేజీ బోర్డ్ మీటింగ్‌లో పర్సనల్ విషయాలు ఎందుకు మాట్లాడుతున్నారని నిలదీస్తాడు. రిషి గురించి అడగటం తప్పేనా దేవయాని తనను తాను సమర్థించుకుంటుంది. రిషి కాలేజీకి, కుటుంబానికి ఎంతో చేశాడని చెబుతుంది. ఫణీంద్ర కూడా దేవయానికి సర్ధిచెప్పాలని చూసిన కూడా తన పుల్లవిరుపు మాటలు ఆపదు.
వసుధార నిజంగా రిషి గురించి వెతుకుతుంది అంటే నమ్మశక్యంగా లేదని చెబుతుంది. ఆమె మాటలతో ఫణీంద్ర కోపం పట్టలేకపోతాడు. దేవయాని, శైలేంద్ర ఇద్దరిని బోర్డ్ మీటింగ్ నుంచి బలవంతంగా బయటకు పంపిస్తాడు ఫణీంద్ర. వాళ్లు వెళ్లిపోగానే దేవయాని, శైలేంద్ర మాటలను పట్టించుకోవద్దని వసుధారతో అంటాడు ఫణీంద్ర. నువ్వు ఖచ్చితంగా రిషిని తిరిగి తీసుకొస్తావనే నమ్మకం నాకు ఉందని చెబుతాడు. ఏ అవసరం వచ్చినా తాను ఉన్నాననే విషయం మాత్రం మర్చిపోవద్దని చెబుతాడు.
అనుపమ షాక్...
మనును తీసుకొని ఇంటికొస్తాడు మహేంద్ర. మనును చూసి అనుపమ షాకవుతుంది. ఆమె ఆలోచనలు పసిగట్టిన మహేంద్ర ఏంటి రాకూడదని వ్యక్తి ఇంటికొచ్చినట్లు అలా చూస్తున్నావేంటి అని అంటాడు. మను ఈ రోజు కాలేజీకి కూడా వచ్చాడని అనుపమతో చెబుతాడు మహేంద్ర.
కొంత మందిలా ప్రశ్నలు ఎదురవుతాయనో, అవమానాలు జరిగాయని మను భయపడే రకం కాదని అంటాడు. అనుపమ, మను ఇద్దరు మాట్లాడుకునేలా చేయడానికి అక్కడి నుంచి వసుధార, మహేంద్ర వెళ్లిపోతారు.
ఇంటికొచ్చిన అతిథులను గౌరవించడం మన సంప్రదాయం కాబట్టి మనుతో మాట్లాడమని అనుపమతో చెప్పి మరి అక్కడి నుంచి వెళ్లిపోతాడు మహేంద్ర. విశ్వనాథాన్ని మను కలిసిన విషయం గుర్తుచేస్తుంది అనుపమ. అతడికి దూరంగా ఉండమని మనుకు చెబుతుంది.
రానని చెప్పిన అనుపమ...
పేరెంట్స్ మీటింగ్‌కు అనుపమను రప్పించాలని మహేంద్ర అనుకుంటాడు. వసుధార ఆమెను ఇన్వేట్ చేసేలా చేస్తాడు. కానీ తాను పేరెంట్స్ మీటింగ్‌కు రానని, తనకు కొంచెం ఇబ్బందిగా ఉందని అనుపమ అంటుంది. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.