Guppedanta manasu march 21st: గుప్పెడంత మనసు.. అల్లాడించేసిన తల్లీకొడుకులు.. అందరి ముందు నిజం బయట పెట్టిన మను
Guppedanta manasu serial march 21st episode: అనుపమ తన కన్నతల్లి అనే విషయాన్ని మను అందరి ముందు బయట పెడతాడు. తల్లి మీద చూపించిన ప్రేమ చూసి అందరూ చలించిపోతారు. గుప్పెడంత మనసు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

Guppedanta manasu serial march 21st episode: గుప్పెడంత మనసు సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. అనుపమ మీద రౌడీలు అటాక్ చేయడంతో మను అమ్మా అని పిలుస్తాడు. దీంతో మను, అనుపమ మధ్య సంబంధం ఏంటో చెప్పమని మహేంద్ర వాళ్ళు నిలదీస్తారు.
తమ దగ్గర నిజాలు ఎందుకు దాచారు కారణం ఏంటని మహేంద్ర మనుని ప్రశ్నిస్తాడు. కానీ మను ఏం చెప్పకుండా మౌనంగా ఉంటాడు. అనుపమ మా దగ్గర అన్ని దాస్తుంది నువ్వు కూడా తన వారసత్వం తీసుకుని దాస్తున్నావా అని మహేంద్ర మరోసారి అడుగుతాడు. ఏమైందని వసు, ఏంజెల్ కూడా అడుగుతారు. మీ పీఏ మాట్లాడాడు ఆ ఫోటోకి మీకు ఏ సంబంధం లేదని చెప్పాడు. మీరు నోరు తెరవకపోవడం వల్ల ఇలా జరిగింది. మీరు నోరు తెరిచి నిజం చెప్తే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని వసు కూడా అడుగుతుంది. మీరిద్దరూ తల్లీకొడుకులు అయితే నువ్వు తనని మేడమ్ అని ఎందుకు పిలిచావ్, నా కొడుకు కూడా జగతిని మేడమ్ అని పిలిచాడని మహేంద్ర అంటాడు.
నిజం ఒప్పుకున్న మను
నువ్వు నిజంగా అనుపమ అత్తయ్య కొడుకువేనా అని ఏంజెల్ అంటే మను కోపంగా అవును నేను నిజమే అంటాడు. నేను తన కొడుకుని తను నా కన్నతల్లి. కానీ నేను తనకి ఒక మాట ఇచ్చాను. తనే ఒట్టు వేయించుకుని నా దగ్గర మాట తీసుకుంది. కానీ ఈరోజు ఆ మాట తప్పాను. అలా మాట తప్పినందుకు నన్ను బాధపెడుతుంది. తను లేకపోతే నేను ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉండేవాడిని కాదు. నాకోసం తన ప్రాణాలు పణంగా పెట్టింది. ఆ పరిస్థితిలో తనకి ఇచ్చిన మాట తప్పాల్సి వచ్చింది. మనసులో ఇంత ప్రేమ పెట్టుకుని ఇంత దుఖాన్ని దిగమింగుకుంటూ ఎందుకు మౌనంగా ఉన్నావని మహేంద్ర అడుగుతాడు.
నాకు ఊహ తెలిసిన తర్వాత కనిపించిన మాట రూపం అమ్మ. తను నా కోసం ఎంతో చేసింది నన్ను సంతోషంగా చూడటం కోసం తన ఆశలు, ఆశయాలు త్యాగం చేసింది. ఏమిచ్చినా తన రుణం తీర్చుకోలేను అంత గొప్పగా పెంచింది. కానీ నన్ను వెంటాడే ప్రశ్నతో తనని వేధించాను. తప్పు చేశాను. డాక్టర్ వచ్చి అనుపమ స్పృహలోకి వచ్చిందని చెప్తుంది. అందరూ చూసేందుకు వెళతారు కానీ మను లోపలికి వెళ్ళకుండా ఆగుతాడు. నీ ప్రాణాలకు తెగించి నీ కొడుకు ప్రాణాలు కాపాడుకున్నావ్ గ్రేట్ అని మహేంద్ర అనుపమని మెచ్చుకుంటాడు. నిజమైన తల్లివి అనిపించావు కానీ నిజాన్ని ఎందుకు దాచావని అడుగుతాడు.
అనుపమని క్షమాపణ కోరిన మను
మీరు నిజాన్ని దాచారు కానీ కొడుకు మీద ప్రేమని దాచలేకపోయారని మీరు కనిపించకుండానే కన్న ప్రేమ చూపించారని వసు అంటుంది. అందరి మాటలకు అనుపమ బాధపడుతుంది. మీరు తన కోసం వెతుకుతున్నారని అర్థం అవుతుందని ఏంజెల్ అంటే నువ్వు వెళ్ళి తీసుకురా అని మహేంద్ర వాళ్ళని బయటకి పంపిస్తాడు. ఏంజెల్ వెళ్ళి అనుపమని చూడటానికి వెళ్ళమని చెప్తే వెళ్లలేను తను ఇబ్బంది పడుతుందని అంటాడు. వసు తనకి నచ్చజెప్పి లోపలికి పంపిస్తుంది. అనుపమ పిలిచిందని వసు అంటే తను నిజంగా పిలిచిందా అంటే తన కళ్ళు నీకోసమే వెతుకుతున్నాయని అంటుంది. ఇద్దరూ నచ్చజెప్పి మనుని అనుపమ దగ్గరకి పంపిస్తారు.
మను రాగానే తనని చూసి అనుపమ ఎమోషనల్ అవుతుంది. బాహుబలి బిజియం వేసి ఎమోషన్ పిండేశారు. తల్లీకొడుకులు కళ్ళతోనే యాక్టింగ్ చేసి సీన్ అదరగొట్టేశారు. మను కన్నీళ్ళు దిగమింగుకుంటూ మాట్లాడతాడు. అనుపమ మాత్రం మౌనంగా ఉంటుంది. నీ మాటల్లో చివర్లో ఒక పదం మిస్ అవుతుంది దాని వల్ల నీ ఎమోషన్ బ్యాలెన్స్ తప్పుతుందని మహేంద్ర అంటాడు. మీ ప్రాణాలకు తెగించి నా ప్రాణాలు కాపాడారు చాలా థాంక్స్. మీరు అలా రాకుండా ఉండి ఉంటే నా మీద అటాక్ చేసేవాళ్ళు కదా పోతే నేనే పోయి ఉండేవాడిని కదా అనేసరికి అనుపమ ఏడుస్తుంది. సారి ఆ టైమ్ లో మీకు ఇచ్చిన మాట తప్పినందుకు నన్ను క్షమించండి. ఇంకెప్పుడు మిమ్మల్ని అలా పిలవను అనేసి చేతులెత్తి దణ్ణం పెట్టేస్తాడు.
శత్రువులు ఎవరో కనిపెట్టాలన్న ఫణీంద్ర
ఫణీంద్ర మహేంద్రకి ఫోన్ చేసి అనుపమకి ఎలా ఉందని ఆరా తీస్తాడు. అటాక్ చేసిన వాడిని పట్టుకోవాలని అసలు వదిలిపెట్టొద్దని ఫణీంద్ర చెప్తాడు. అసలు మను మీద అటాక్ జరగడం ఏంటి? తను ఎవరికీ ఏ హాని చేసింది లేదు తన మీద ఎందుకు అలా చేసి ఉంటారని అనుమానపడతాడు. కొంతమంది మంచి వాళ్ళ మీద దుర్మార్గులు చేశారని మహేంద్ర అంటాడు. మన శత్రువులు మను మీద అటాక్ చేసి ఉంటారని ఫణీంద్ర అంటే అన్ని విషయాలు తొందర్లోనే బయట పెడతానని మహేంద్ర చెప్తాడు. నాకు ఒక విషయం అర్థం కావడం లేదు మను అనుపమ కొడుకు ఏంటని అంటే నాకు తెలియదని మహేంద్ర అంటాడు. దేవయాని ఫోన్ తీసుకుని అనుపమ మీద లేనిపోని ప్రేమ తెగ నటించేస్తుంది.