Best Telugu Albums 2024: ఈ ఏడాది ఎక్కువ మందిని ఊపేసిన తెలుగు సినిమా పాటలు ఇవే.. టాప్-7 ఆల్బమ్స్
Best Telugu Albums 2024: ఈ ఏడాది కొన్ని సినిమాల పాటలు తెలుగు జనాలకు బాగా నచ్చేశాయి. ఎంతగానో అలరించాయి. ఆ చిత్రాలకు బాగా ప్లస్ అవడంతో పాటు పాపులర్‍గా నిలిచిపోయాయి. అలా ఈ సంవత్సరం టాలీవుడ్‍లో టాప్-7 ఆల్బమ్స్ ఏవో ఇక్కడ చూడండి.
ఈ ఏడాది 2024లో టాలీవుడ్‍లో విభిన్న జానర్లలో సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కొన్ని సినిమాల్లోని పాటలు మరింతగా ఊపేశాయి. మాస్, ఫాస్ట్ బీట్, మెలోడీ, డెవోషనల్ ఇలా ఈ ఏడాది రకరకాల సాంగ్స్ వచ్చాయి. పాటల ప్రేమికులకు మంచి అనుభూతి కలిగించాయి. కొన్ని సినిమాల సక్సెస్‍కు పాటలు బాగా ఉపయోగపడ్డాయి. కొన్ని చిత్రాలు హిట్ కాకపోయినా వాటిలోని సాంగ్స్ పాపులర్ అయ్యాయి. ఈ ఏడాది టాలీవుడ్‍లో టాప్-7లో నిలిచిన ఆల్బమ్స్ ఏవో ఇక్కడ చూడండి.
గుంటూరు కారం
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం చిత్రానికి థమన్ సంగీతం అందించారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ ఏడాది జనవరిలో సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయింది. ఈ చిత్రంలోని పాటలకు ముందు మిశ్రమ స్పందన వచ్చినా.. ఆ తర్వాత దుమ్మురేపాయి. ఈ మూవీలోని కుర్చీ మడత పెట్టి సాంగ్ ఏడాదంతా మోతమోగించింది. ఇప్పటికీ ఈ మాస్ సాంగ్ ఊపేస్తోంది. గ్లోబల్ రేంజ్‍లో ఈ పాట పాపులర్ అయింది. మహేశ్ మాస్ డ్యాన్స్ అదిరిపోయింది. ఈ చిత్రంలోని ధమ్ మసాలా, మామ ఏంతైనా సాంగ్స్ అలరించాయి. గుంటూరు కారం మూవీకి మంచి మాస్ బీట్స్ ఇచ్చారు థమన్. ఈ ఏడాది బెస్ట్ ఆల్బమ్‍లలో ముందు వరుసలో నిలిచింది.
దేవర
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర మూవీకి పాటలు ఎంతగానో ప్లస్ అయ్యాయి. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ మూవీకి అనురుధ్ రవిచందర్ సంగీతం అందించారు. చుట్టమల్లే అంటూ వచ్చిన మెలోడీ సాంగ్ ఈ మూవీలో అదుర్స్ అనిపించింది. గ్లోబల్ సెన్సేషన్ అయింది. దేవర టైటిల్ పాట, ఆయుధ పూజ సాంగ్ కూడా ఓ ఊపుఊపాయి. మూవీ సక్సెస్‍లో అనిరుధ్ ఇచ్చిన ట్యూన్స్, బీజీఎం కీలకపాత్రలు పోషించాయి.
పుష్ప 2: ది రూల్
బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2: ది రూల్ సినిమాలోని సాంగ్స్ కూడా అదిరిపోయాయి. అయితే, పుష్ప 1తో పోలిస్తే ఆ రేంజ్‍లో లేకపోయినా ఆకట్టుకునేలా సాగాయి. సూసేకి, పుష్ప.. పుష్ప టైటిల్ సాంగ్స్ అలరించాయి. జాతర సాంగ్ అయితే పూనకాలు తెప్పించింది. దేవీ శ్రీప్రసాద్ మంచి ట్యూన్స్ ఇచ్చారు.
టిల్లు స్క్వేర్
టిల్లు స్క్వేర్ మూవీలోని పాటలు కూడా ఆకట్టుకున్నాయి. డీజే టిల్లు అంటూ సాగే టైటిల్ సాంగ్, టికెట్టే కొనకుండా పాటలు పాపులర్ అయ్యాయి. మిగిలిన సాంగ్స్ కూడా పర్వాలేదనిపించాయి. సినిమాకు తగ్గట్టుగా ఎనర్జిటిక్‍గా సాగాయి. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ మూవీకి రామ్ మిర్యాల, అచ్చు రాజమణి సంగీతం అందించారు.
హనుమాన్
తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన హనుమాన్ చిత్రంలోని పాటలు ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలోని హనుమాన్ చాలీసా మరో ప్రపంచంలోకి తీసుకెళుతుంది. పూలమ్మె పిల్లా, అవకాయ ఆంజనేయ పాట కూడా మెప్పించింది. ఈ చిత్రంలో బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్, పాటల పిక్చరైజేషన్ కూడా ప్రేక్షకులను అట్రాక్ట్ చేసింది. హనుమాన్ మూవీకి అనుదీప్, గౌరహరి మ్యూజిక్ డైరెక్టర్లుగా పని చేశారు.
మిస్టర్ బచ్చన్
హరీశ్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే, ఈ చిత్రంలోని పాటలు చాలా మందిని అలరించాయి. నల్లంచు తెల్లచీర, రెప్పల్ డప్పుల్, సితార పాటలు పాపులర్ అయ్యాయి. మిస్టర్ బచ్చన్ మూవీకి మిక్కీ జే మేయర్ మాస్ బీట్‍లతో దుమ్మురేపారు.
ఊరు పేరు భైరవకోన
సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ హీరోహీరోయిన్లుగా చేసిన ఊరు పేరు భైరవకోన చిత్రానికి పాటలు మంచి పాపులారిటీ తీసుకొచ్చాయి. ‘నిజమేనే చెబుతున్నా’ పాట ఓ రేంజ్‍లో మోగిపోయింది. నా వల్ల కాదే బొమ్మ సాంగ్ కూడా అదిరిపోయింది. పాటలు ఈ మూవీకి ప్లస్ అయ్యాయి.
ఈ పాటలు కూడా..
ఈ ఏడాది మరిన్ని పాటలు కూడా ప్రేక్షకులను ఎంతో మెప్పించాయి. ఓం భీమ్ భుష్‍లోని అణువణువు సాంగ్ అలరించింది. లక్కీ భాస్కర్ మూవీలోని శ్రీమతి గారు పాట ఆకట్టుకుంది. కమిటీ కుర్రోళ్లులోని ఆరోజులు మళ్లీ రావు పాట ఎమోషనల్‍గా చాలా మందికి కనెక్ట్ అయింది. సరిపోదా శనివారం మూవీలోని ఉల్లాసం పాట అదుర్స్ అనిపింది. ఈ మూవీకి జేక్స్ బెజోయ్ ఇచ్చిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ వావ్ అనేలా చేసింది. గుండెల్లో గోదారి మూవీలో 'చుట్టంలా సూసి' పాట ఆకట్టుకుంది. లవ్‍రెడ్డి చిత్రంలోని ఆ బంధం అబద్ధమా అంటూ సాగే బ్రేకప్ సాంగ్ ఎమోషనల్‍గా మనసులను మెలిపెట్టేసింది.
సంబంధిత కథనం