Guntur Kaaram Trailer: గుంటూరు కారం ట్రైలర్ వచ్చేసింది.. మహేశ్ మాస్ జాతర
Guntur Kaaram Trailer: గుంటూరు కారం సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. మహేశ్ బాబు మాస్ యాక్షన్ సీన్లు, డైలాగ్స్ అదిరిపోయాయి. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ చిత్రం జనవరి 12న థియేటర్లలో రిలీజ్ కానుంది. ట్రైలర్ ఎలా ఉందంటే..
Guntur Kaaram Trailer: సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ‘గుంటూరు కారం’ మూవీ ట్రైలర్ వచ్చేసింది. ఈ ట్రైలర్‌ను నేడు (జనవరి 7) రిలీజ్ చేసింది మూవీ యూనిట్. మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న ఈ మాస్ యాక్షన్ సినిమా ‘గుంటూరు కారం’ సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన రిలీజ్ కానుంది. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ చిత్రంపై హైప్ నెక్ట్స్ రేంజ్‍లో ఉంది. ఈ తరుణంలో నేడు గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్ అయింది.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
గుంటూరు కారం ట్రైలర్‌లో మహేశ్ బాబు మాస్ యాక్షన్ అదిరిపోయింది. “మీరు మీ పెద్దబ్బాయిని.. అనాథలాగా వదిలేశారని అంటున్నారు. దానికి మీరు ఏమంటారు” అని రమ్యకృష్ణను ఓ రిపోర్టర్ అడగడంతో ట్రైలర్ మొదలైంది. ఆ తర్వాత మహేశ్ బాబు ఎంట్రీ ఉంది. గుంటూరు మిర్చీల మధ్య బీడీ తాగుతూ మాస్ లుక్‍తో రెడ్ కలర్ జీప్ నుంచి మహేశ్ దిగే షాట్ అదిరిపోయింది. “చూడంగానే మజా వచ్చిందా.. హార్ట్ బీట్ పెరిగిందా.. ఈల వేయాలనిపించిందా” అంటూ డైలాగ్స్ ఉన్నాయి. యాక్షన్ సీక్వెన్సుల్లో మాస్ మార్క్ కనిపించింది. ఈ చిత్రంలో రమణ క్యారెక్టర్ చేశారు మహేశ్. రౌడీ రమణ అంటూ రావు రమేశ్ డైలాగ్ ఉంది.
శ్రీలీల వెంట మహేశ్ బాబు తిరిగే సీన్లు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. సిగ్గొచ్చేస్తోందిరా అంటూ మహేశ్ డైలాగ్ ఉంది. “చింపేసుకుంటారా.. వేసుకొని చింపుకుంటారా.. ఎక్కడ చింపాలో.. ఎంత కనపడాలో వాటి యవ్వారమే వేరండి” అంటూ శ్రీలీల చిరిగిన జీన్స్ గురించి మహేశ్ డైలాగ్ సరదాగా ఉంది. ఈ సినిమాలో రౌడీ రమణ అనే క్యారెక్టర్ చేశారు మహేశ్. “వాడొక బ్రేకుల్లేని లారీ” అంటూ ప్రకాశ్ రాజ్ డైలాగ్ ఉంది. ఈ చిత్రంలో మదర్ సెంటిమెంట్ కూడా కీలకంగా ఉండేలా కనిపిస్తోంది. ‘ఎప్పుడో చిన్నప్పుడు కొట్టాల్సిన అమ్మ ఇప్పుడు పిలిపించి ఇస్త్రీ చీర వేసుకొని మరీ కొడుతోంది రా’ అంటూ మహేశ్ చెప్పే డైలాగ్ ఎమోషనల్‍గా ఉంది. “రమణ గాడు.. నీ లైఫ్ ఒక మిరకిల్ రా బాబు” అనే డైలాగ్‍తో గుంటూరు కారం ట్రైలర్ ముగిసింది. మాస్ యాక్షన్ సీన్లతో ట్రైలర్ అదిరిపోయింది. 2 నిమిషాల 47 సెకన్ల పాటు ఉన్న ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. అయితే, కథను పెద్దగా రివీల్ చేయలేదు. థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ట్రైలర్‌కు సూటైంది. టేకింగ్, డైలాగ్‍ల్లో దర్శకుడు త్రివిక్రమ్ మార్క్ కనిపించింది.
యాక్షన్, రొమాన్స్, సెంటిమెంట్‍తో గుంటూరు కారం సినిమా పక్కా కమర్షియల్ చిత్రంలా కనిపిస్తోంది. మహేశ్ అభిమానులకు ఈ చిత్రం జాతరలానే ఉంటుందనే అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈ ట్రైలర్ చూస్తే ఇది పక్కా పండగ సినిమా అనిపిస్తోంది.
గుంటూరు కారం చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా.. జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరాం, ఈశ్వరి రావు, ప్రకాశ్ రాజ్, సునీల్ కీరోల్స్ చేశారు. హారిక, హాసినీ క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మించారు.
మహేశ్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్‍లో గతంలో వచ్చిన అతడు (2005), ఖలేజా (2010) చిత్రాలు కమర్షియల్‍గా అంత పెద్ద సక్సెస్ సాధించలేకపోయినా.. మంచి సినిమాలుగా గుర్తింపు తెచ్చుకున్నాయి. ఇప్పుడు ఆ ఇద్దరి కాంబోలో మూడో చిత్రంగా గుంటూరు కారం వస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈసారి బాక్సాఫీస్ బద్దలు కావడం ఖాయమని మహేశ్ ఫ్యాన్స్ ధీమాతో ఉన్నారు. అందులోనూ చాలాకాలం తర్వాత పూర్తిస్థాయి మాస్ యాక్షన్ క్యారెక్టర్‌ను గుంటూరు కారంలో మహేశ్ చేయడంతో అంచనాలు ఆకాశమంత ఉన్నాయి.
టాపిక్