Guntur Kaaram Pre Release Event: గుంటూరు కారం ప్రీరిలీజ్ ఈవెంట్ వేదిక, టైమ్ ఫిక్స్-guntur kaaram pre release event to be held in guntur tomorrow january 9th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guntur Kaaram Pre Release Event: గుంటూరు కారం ప్రీరిలీజ్ ఈవెంట్ వేదిక, టైమ్ ఫిక్స్

Guntur Kaaram Pre Release Event: గుంటూరు కారం ప్రీరిలీజ్ ఈవెంట్ వేదిక, టైమ్ ఫిక్స్

Hari Prasad S HT Telugu
Jan 08, 2024 12:35 PM IST

Guntur Kaaram Pre Release Event: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కు వేదిక, టైమ్ ఫిక్సయింది. ఈ మూవీ జనవరి 12న సంక్రాంతి సందర్భంగా థియేటర్లలోకి వస్తున్న విషయం తెలిసిందే.

గుంటూరు కారం మూవీలో మహేష్ బాబు
గుంటూరు కారం మూవీలో మహేష్ బాబు

Guntur Kaaram Pre Release Event: సూపర్ స్టార్ మహేష్ బాబు మచ్ అవేటెడ్ మూవీ గుంటూరు కారం ఈ శుక్రవారం (జనవరి 12) రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్ల జోరు పెంచారు. ఇందులో భాగంగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను మంగళవారం (జనవరి 9) నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ గుంటూరులోని నంబూరు క్రాస్ రోడ్స్ లో జరగనుంది.

గుంటూరు కారం ప్రీరిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ మంగళవారం సాయంత్రం 5 గంటల తర్వాత ప్రారంభం కానుంది. 2022లో సర్కారు వారి పాట సినిమా తర్వాత రెండేళ్లుగా మహేష్ బాబు మరో సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడీ మూవీ సంక్రాంతికి రానుండటంతో ప్రీరిలీజ్ ఈవెంట్ కే అతని అభిమానులు పోటెత్తనున్నారు.

గుంటూరు కారం ట్రైలర్ రికార్డ్..

ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముందు ఆదివారం (జనవరి 7) సాయంత్రం గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. మహేష్ ను మరోసారి పక్కా మాస్ అవతార్ లో చూపించినట్లు ట్రైలర్ చూస్తేనే స్పష్టమవుతోంది. అతని యాక్షన్ సీన్స్, డైలాగ్ డెలివరీ గత సినిమాల కంటే చాలా భిన్నంగా ఉన్నాయి. మహేష్ తో అతడు, ఖలేజాలాంటి సినిమాలు తీసిన త్రివిక్రమ్.. ఇప్పుడీ గుంటూరు కారంలో మరో డిఫరెంట్ మహేష్ ను చూపించనున్నట్లు అర్థమైపోయింది.

గుంటూరు మిర్చీల మధ్య బీడీ తాగుతూ మాస్ లుక్‍తో రెడ్ కలర్ జీప్ నుంచి మహేశ్ దిగే షాట్ అదిరిపోయింది. “చూడంగానే మజా వచ్చిందా.. హార్ట్ బీట్ పెరిగిందా.. ఈల వేయాలనిపించిందా” అంటూ డైలాగ్స్ ఉన్నాయి. యాక్షన్ సీక్వెన్సుల్లో మాస్ మార్క్ కనిపించింది. ఈ చిత్రంలో రమణ క్యారెక్టర్ చేశారు మహేశ్.

ఈ ట్రైలర్ కు ఊహించని రెస్పాన్స్ వస్తోంది. 15 గంటల్లోనే ఈ ట్రైలర్ కు ఏకంగా 23 మిలియన్ల వ్యూస్ రావడం విశేషం. మహేష్ తోపాటు ట్రైలర్ లో శ్రీలీల నడుము ఒంపులు, మాస్ స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. మరో హీరోయిన్ మీనాక్షి చౌదరి మాత్రం ఇందులో పెద్దగా కనిపించలేదు. ప్రకాశ్ రాజ్, జగపతి బాబు, ఈశ్వరి రావు, రమ్య కృష్ణ, వెన్నెల కిశోర్ లాంటి వాళ్లు కూడా ఇందులో నటించారు.

గుంటూరు కారం మూవీకి ఈ సంక్రాంతికి హనుమాన్, సైంధవ్, నా సామిరంగ లాంటి సినిమాల నుంచి పోటీ ఎదురు కానుంది. అయితే వీటి పోటీని తట్టుకునేలానే మేకర్స్ ముందుగానే ప్రమోషన్లను గట్టిగానే నిర్వహిస్తున్నారు. సంక్రాంతి సినిమాల్లో అన్నింటి కన్నా ఎక్కువ హైప్ మాత్రం ఈ సినిమాపైనే ఉంది. ఇప్పటికే గుంటూరు కారం నుంచి వచ్చిన సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ముఖ్యంగా గత వారం రిలీజైన కుర్చీ మడతపెట్టి అనే మాస్ సాంగ్ అభిమానులను ఉర్రూతలూగించింది. మహేష్, శ్రీలీల పోటీ పడి వేసిన స్పెప్పులు అదుర్స్ అనిపించేలా ఉన్నాయి. తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సినిమాను నిర్మించింది.

Whats_app_banner