Kurchi Madatha Petti Song: మరో మైల్‍స్టోన్ దాటిన ‘కుర్చీ మడతపెట్టి’ పాట.. ‘బుట్టబొమ్మ’ కంటే వేగంగా..-guntur kaaram kurchi madatha petti full video song crosses 200 million mark on youtube faster than butta bomma ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kurchi Madatha Petti Song: మరో మైల్‍స్టోన్ దాటిన ‘కుర్చీ మడతపెట్టి’ పాట.. ‘బుట్టబొమ్మ’ కంటే వేగంగా..

Kurchi Madatha Petti Song: మరో మైల్‍స్టోన్ దాటిన ‘కుర్చీ మడతపెట్టి’ పాట.. ‘బుట్టబొమ్మ’ కంటే వేగంగా..

Kurchi Madatha Petti Song: ‘కుర్చీ మడత పెట్టి’ పాట ప్రపంచాన్ని ఊపేస్తోంది. ఈ సాంగ్ దూసుకెళుతోంది. తాజాగా ఈ వీడియో సాంగ్ మరో మైల్‍స్టోన్ దాటేసింది.

Kurchi Madatha Petti Song: మరో మైల్‍స్టోన్ దాటిన ‘కుర్చీ మడతపెట్టి’ పాట.. ‘బుట్టబొమ్మ’ కంటే వేగంగా..

Kurchi Madatha Petti Song: సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోలేదు. అయితే, ఈ చిత్రంలోని ‘కుర్చీ మడత పెట్టి’ పాట మాత్రం మోత మోగిస్తోంది. ఈ మాస్ డ్యాన్స్ సాంగ్ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. ఏకంగా చాలా మంది విదేశీయులు కూడా ఈ పాటకు స్టెప్స్ వేసిన వీడియోలు సోషల్ మీడియాలో బోలెడు వైరల్ అయ్యాయి. థమన్ ఇచ్చిన నాటు మాస్ బీట్‍కు మహేశ్ బాబు, శ్రీలీల డ్యాన్స్ అదిరిపోయింది. దీంతో కుర్చీ మడతపెట్టి పాట సూపర్ హిట్ అయింది. ఈ సాంగ్‍కు యూట్యూబ్‍లో వ్యూస్ జోష్ ఇంకా పెరుగుతూనే ఉంది.

200 మిలియన్ మార్క్ దాటేసి..

గుంటూరు కారం చిత్రంలోని ఈ ‘కుర్చీ మడతపెట్టి’ ఫుల్ వీడియో సాంగ్‍ యూట్యూబ్‍లో అదరగొడుతోంది. తాజాగా ఈ వీడియో పాట.. యూట్యూబ్‍లో 200 మిలియన్ (20 కోట్ల) వ్యూస్ మార్క్ దాటేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ ఛానెల్‍లో కుర్చీ మడతపెట్టి ఫుల్ వీడియో సాంగ్ అప్‍లోడ్ చేయగా.. తాజాగా 200 మిలియన్ వ్యూస్‍ను క్రాస్ చేసింది. అప్‍లోడ్ అయి 80 రోజులు ముగియకుండానే ఈ ఘనత సాధించింది.

బుట్టబొమ్మ కంటే ఫాస్ట్

తెలుగులో అత్యంత వేగంగా 200 మిలియన్ వ్యూస్ దక్కించుకున్న వీడియో సాంగ్‍గా పుష్పలోని ‘ఊ అంటావా’ ఉంది. ఈ పాటకు 68 రోజుల్లోనే 200 మిలియన్ వ్యూస్ దాటేశాయి. అయితే, ఇప్పుడు కుర్చీ మడతపెట్టి రెండో ప్లేస్‍కు వచ్చింది. ఈ సాంగ్‍ 78 రోజుల్లోనే 200 మిలియన్ వ్యూస్ మార్క్ క్రాస్ చేసింది. అల వైకుంఠపురములో చిత్రంలోని ‘బుట్టబొమ్మ’ పాటను మూడో ప్లేస్‍కు పంపేసింది. బుట్టబొమ్మ సాంగ్‍కు 95 రోజుల్లో ఆ మార్క్ దాటింది. దీంతో, 80 రోజుల్లోనే 200 మిలియన్ వ్యూస్ అధిగమించిన ‘కుర్చీ మడతపెట్టి’ రెండో ప్లేస్‍కు చేరింది.

‘కుర్చీ మడతపెట్టి’ తెలుగు సాంగ్ అందరినీ ఊపేస్తోంది. ఈ పాటకు డ్యాన్స్ చేస్తూ వేలాది మంది సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేశారు. ఇండియాతో పాటు ఇతర దేశాల్లోనూ చాలా పాపులర్ అయింది. అమెరికాలోని ఓ బాస్కెట్ బాల్ ఈవెంట్‍లోనూ ఈ పాటకు డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అయింది. ఇలా.. గ్లోబల్ రేంజ్‍లో ఈ సాంగ్ దుమ్మురేపుతోంది.

మొదట్లో విమర్శలు

గుంటూరు కారంలో ‘కుర్చీ మడతపెట్టి’ పాటపై ఆరంభంలో విమర్శలు వచ్చాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి స్టార్ దర్శకుడు, మహేశ్ బాబు లాంటి సూపర్ స్టార్ కాంబినేషన్‍లోని చిత్రంలో.. ఓ సోషల్ మీడియా మీమ్ పదంతో సాంగ్ ఏంటనే అభ్యంతరాలు తలెత్తాయి. అయితే, విమర్శలు వచ్చినా.. ఈ పాట సూపర్ పాపులర్ అయింది. అభ్యంతరాలు కనుమరుగయ్యాయి. ఆ సినిమాకు ఈ పాటే హైలైట్‍గా నిలిచింది. గ్లోబల్ రేంజ్‍లో పాపులర్ అయింది.

గుంటూరు కారం చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా.. థమన్ సంగీతం అందించారు. కుర్చీ మడతపెట్టి పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు. సోషల్ మీడియాలో పాపులర్ అయిన ‘కుర్చీ మడతపెట్టి’ అనే డైలాగ్‍ను ఈ పాట కోసం తీసుకున్నారు. పక్కా మాస్ బీట్ ఉన్న ఈ సాంగ్‍లో మహేశ్ బాబు, శ్రీలీలతో పాటు పూర్ణ డ్యాన్స్ కూడా ఆకట్టుకుంది. సంక్రాంతి సందర్భంగా ఈ ఏడాది జనవరి 12న గుంటూరు కారం థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రస్తుతం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ స్ట్రీమ్ అవుతోంది.