Guntur Kaaram Dum Masala Song: గుంటూరు కారం నుంచి అదిరిపోయిన ఫస్ట్ సింగిల్ దమ్ మసాలా సాంగ్ ప్రోమో.. పాట వచ్చేది ఆ రోజే
Guntur Kaaram Dum Masala Song: గుంటూరు కారం మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ దమ్ మసాలా సాంగ్ ప్రోమో అదిరిపోయింది. ఈ పాటను నవంబర్ 7న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ చెప్పారు.
Guntur Kaaram Dum Masala Song: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం మూవీ నుంచి దమ్ మసాలా సాంగ్ రాబోతోంది. ఈ పాటకు సంబంధించిన ప్రోమోను ఆదివారం (నవంబర్ 5) మేకర్స్ రిలీజ్ చేశారు. దమ్ మసాలా పూర్తి సాంగ్ మంగళవారం (నవంబర్ 7) రిలీజ్ చేయనున్నట్లు ఈ ప్రోమో ద్వారా వెల్లడించారు.
గుంటూరు కారం మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా రిలీజైన దమ్ మసాలా సాంగ్ ప్రోమోలో.. మహేష్ చాలా స్టైలిష్ గా కనిపించాడు. "ఎదురొచ్చే గాలి.. ఎగరేస్తున్న చొక్కా పై గుండి" అంటూ ఈ పాట సాగిపోయింది.
రామజోగయ్య శాస్త్రి ఈ పాటను రాశాడు. సంజిత్ హెగ్డే, తమన్ పాడారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి నటించారు. తమన్ మ్యూజిక్ అందించాడు. అతడు, ఖలేజా తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో.. గుంటూరు కారం సంక్రాంతి బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేస్తుందని భావిస్తున్నారు.
ఇది మాస్ యాక్షన్ మూవీగా వస్తోంది. మహేశ్ ఈ చిత్రంలో పక్కా మాస్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లలో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పేశారు మేకర్స్. దీంతో అభిమానుల్లో ఈ మూవీపై విపరీతమైన ఆసక్తి ఉంది. మహేశ్ - త్రివిక్రమ్ కాంబినేషన్‍లో ఇది మూడో చిత్రం.