కుటుంబసభ్యులకు తెలియకుండా శృతిని రహస్యంగా పెళ్లి చేసుకోవాలని రవి ఫిక్సవుతాడు. ఇందుకోసం మీనా చెల్లెలు సుమతి సాయం అడుగుతాడు. ప్రభావతి గురించి భయపడి రవికి హెల్ప్ చేయడానికి సుమతి ఒప్పుకోదు. నేను చేసిన తప్పుకు మా అక్క మీనా జీవితాంతం శిక్షను అనుభవించాల్సివస్తుందని, అంటుంది.
నువ్వు సాయం చేయకపోతే శృతితో పాటు తాను ఆత్మహత్య చేసుకోవాల్సివస్తుందని, మా వల్ల నీకు ఏ సమస్య రాకుండా చూసుకుంటామని సుమతిని కన్వీన్స్ చేసేందుకు ప్రయత్నిస్తాడు రవి.
శృతి కూడా సుమతికి ఫోన్ చేసి...మాకు నువ్వు తప్ప సాయం చేసేవారు ఎవరూ లేరని అంటుంది. మా ఇద్దరికి పెళ్లి జరగకపోతే చచ్చిపోతామని సుమతితో అంటుంది శృతి. చివరకు శృతి, రవి కలిసి సుమతిని కన్వీన్స్‌చేస్తారు. తన వల్ల మీనా కాపురానికి ఎలాంటి అపద వస్తుందోనని సుమతి కంగారుపడుతూనే వారి పెళ్లి జరిపించడానికి అంగీకరిస్తుంది.
శృతి, రవి తమ ప్లాన్ మొత్తాన్ని సుమతికి వివరిస్తారు. ఆ ప్లాన్ ప్రకారం శృతి స్నేహితురాలిగా అబద్ధం ఆడుతూ ఆమె ఇంటికి వెళుతుంది సుమతి. కానీ సుమతిని చూసి శోభన, సురేంద్ర అనుమానపడతారు. నిన్ను ఎప్పుడూ చూడలేదు. ఎవరు నువ్వు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తారు.
చివరకు శృతిని కలవడానికి ఒప్పుకుంటారు. సుమతిని జాహ్నవిగా తన తల్లిదండ్రులకు పరిచయం చేస్తుంది శృతి. జాహ్నవి పెళ్లి రెండు రోజుల్లో ఉందని, పెళ్లికి పిలవడానికి వచ్చిందని అబద్ధం ఆడుతుంది. జాహ్నవి పెళ్లికి తాను వెళ్లితీరుతానని తల్లిదండ్రులతో అంటుంది. బయటకు వెళ్లడానికి వీలులేదని శృతిని రూమ్‌లో పెట్టి లాక్‌చేస్తారు సురేంద్ర, శోభన.
ఔట్ స్టేషన్ గిరాకి రావడంతో రెండు రోజులు ఊరు వెళ్లేందుకు బట్టలు సర్ధుతుంటాడు బాలు. రెండు రోజులు భర్తకు దూరంగా ఉండటానికి మీనా మనసు ఒప్పుకోదు. దిగాలుగా మారిపోతుంది. ఈ రెండు రోజులు మా అమ్మతో ఎలా వేగాలా అని భయపడుతున్నావా అని మీనాతో అంటాడు బాలు.
ఔట్ స్టేషన్ గారాకిలకు వెళితే ఎక్కువ డబ్బులు వస్తాయని అప్పులు త్వరగా తీరుతాయని బాలు అంటాడు. నిజంగానే గిరాకి ఉందా...నా బాధ భరించలేకవెళుతున్నారా అంటూ భర్తను అడుగుతుంది మీనా. ఇలా నేను ఆలోచించలేదే...ఇక నుంచి ఎప్పుడు ఔట్ స్టేషన్ గిరాకిలనే ఒప్పుకుంటానని మీనాను ఆటపట్టిస్తాడు బాలు.
భర్తపై అలిగిన మీనా కోపంగా బట్టలు సర్ధుతుంటుంది. నీకు దూరంగా వెళ్లడం నాకు ఇష్టం లేదని, ఏదో వదిలేసివెళుతున్నట్లుగా ఉందని మీనాను బుజ్జగిస్తాడు బాలు. సినిమాల్లో హీరో ఊరువెళుతున్నప్పుడు హీరోయిన్‌కు ముద్దు పెడతాడుగా అని బాలుతో అంటుంది మీనా. బాలు దగ్గరకు రావడంతో తనకు ముద్దు పెడతాడని అనుకుంటుంది. మీనాను పక్కకు జరిపి దువ్వెన తీసుకుంటాడు బాలు. కర్చీఫ్‌పై తన పేరు రాసి బాలుకు ఇస్తుంది మీనా. ఇది చూసినప్పుడల్లా నేనే నీకు గుర్తొస్తానని అంటుంది. ముఖం తుడుచుకోకుండా చేశావని మీనాపై బాలు సెటైర్ వేస్తాడు. రవిపై ఓ కన్నేసి ఉంచమని మీనాకు చెబుతాడు.
ఆ తర్వాత సుమతికి మరో షాకిస్తాడు రవి. సుమతి తల్లి పూలు అమ్మే గుడిలోనే శృతి, తాను పెళ్లిచేసుకోవాలని అనుకుంటున్నట్లు చెబుతాడు. ఆ పెళ్లి నువ్వే దగ్గరుండి చేయాలని అడుగుతాడు. పంతులుతో మాట్లాడి తాను పెళ్లి ఏర్పాట్లు చేస్తానని, పూల దండలు తేవడంతో సాక్షి సంతకాలు చేస్తానని అంటుంది సుమతి. ఆమెకు డబ్బివ్వబోతాడు రవి. శృతిని బాగా చూసుకుంటే చాలని డబ్బు అవసరం లేదని సుమతి అంటుంది. మీ పెళ్లి వల్ల మా అక్క కాపురానికి ఎలాంటి ఆపద రాకపోతే చాలని చెబుతుంది.
మీనా బయటకు వెళ్లడానికి రెడీ అవుతుంది. ఏదైనా పెళ్లికి వెళుతున్నావా ఇంతలా ముస్తాబయ్యావని మీనాను ఎగతాళి చేస్తుంది ప్రభావతి. అదే టైమ్‌లో ఇంట్లో వాళ్లకు చెప్పకుండా పెళ్లిచేసుకోవడానికి గుడికి బయలుదేరుతాడు. ఈ రోజు మీ అందరిని మోసం చేయాల్సివస్తుందని రవి లోలోన అనుకుంటాడు.
పెళ్లి ఏర్పాట్లు సుమతి మొత్తం చేస్తుంది. శృతి కూడా ఇంట్లో నుంచి తప్పించుకొని టెంపుల్ దగ్గరకు వస్తుంది. బాలు కారుకు పిల్లి అడ్డు రావడంతో ఏదో కీడు శంకిస్తుందని బాలు అనుకుంటాడు. శృతి, రవి పెళ్లిని మీనానే జరిపించిందని ఆమెపై నిందలు పడతాయి. అక్కడితో నేటి గుండెనిండా గుడిగంటలు సీరియల్ ముగిసింది.
టాపిక్