Gundeninda Gudigantalu: శృతి, రవి మిస్సింగ్ - బాలు తండ్రిని జైల్లో పెట్టిన పోలీసులు- బకరా అయినా సంజు
Gundeninda Gudigantalu: గుండెనిండా గుడిగంటలు అక్టోబర్ 10 ఎపిసోడ్‌లో తర్వాత రవి ఇంటికి వెళ్లడానికి శృతి ఒప్పుకోదు. తల్లిదండ్రులతో పాటు సంజు ...రవిపై ఎటాక్ చేసే ప్రమాదముందని భావిస్తుంది. శృతిని రవి, సత్యంకలిసి కిడ్నాప్ చేశారని వారిపై సురేంద్ర పోలీస్ కేసు పెడతాడు.
Gundeninda Gudigantalu: రవి, శృతి పెళ్లికి సాక్షి సంతకం పెడుతుంది మీనా. ఈ పెళ్లి కారణంగా తన చెల్లి సుమతితో పాటు తల్లిపై నిందలు పడకూడదని ఆ పని చేస్తుంది. రవి, శృతి పెళ్లి కారణంగా ఎదురయ్యే కష్టాలన్నీ తానే అనుభవించాలని అనుకుంటుంది. రవి చేసిన మోసాన్ని జీర్ణించుకోలేకపోతుంది.
రవి, శృతిలను ఆశీర్వదించకుండా కోపంగా గుడి నుంచి బయటకు వస్తుంది. అప్పుడే మీనాకు బాలు ఫోన్ చేస్తాడు. అతడికి రవి పెళ్లి గురించి చెప్పబోతుంది. కానీ ఛార్జింగ్ లేదని ఫోన్ కట్ చేస్తాడు బాలు. ఇంటికొచ్చి పెళ్లి గురించి మీరే సమాధానం చెప్పుకోమని కోపంగా రవితో చెప్పి గుడి దగ్గర నుంచి మీనా వెళ్లిపోతుంది.
రవి ఇంటికి రానన్న శృతి...
రవి ఇంటికి రావడానికి శృతి అంగీకరించదు. అక్కడికి వెళితే బాలుతో పాటు మీ నాన్న ఊరుకోడని, మా నాన్న కూడా రౌడీలతో నీపై ఎటాక్ చేయించేందుకు వెనుకాడడని శృతి అంటుంది. సంజు కూడా మనల్ని చంపేసిన చంపేస్తాడని, కొన్నాళ్లు ఓ ఫ్రెండ్ గెస్ట్‌హౌజ్‌లో దాక్కుందామని శృతి అంటుంది. మనం ఇంటికి వెళ్లకపోతే పెళ్లికి వచ్చినందుకు వదిన ఇరకాటంలో పడుతుందని రవి ఎంత చెప్పిన శృతి అతడి మాట వినదు.
సంజు బకరా
శృతిని వెతుక్కుంటూ గుడికివస్తాడు సంజు. కాస్ట్‌లీ గిఫ్ట్‌తో శృతిని సర్‌ప్రైజ్ చేయాలని అనుకుంటాడు. కానీ అక్కడ శృతి కనిపించదు. ఫోన్ చేస్తే స్విఛాఫ్ అని వస్తుంది. ఆవేశంగా శోభన, సురేంద్రల దగ్గరకి వస్తాడు సంజు. శృతి ఎక్కడికి వెళ్లిందని అడుగుతాడు. శృతి గురించి మీరు ఏమైనా నా దగ్గర దాస్తున్నారా అని నిలదీస్తాడు సంజు. గిఫ్ట్ తీసుకురమ్మని చెప్పి తనను ఫూల్ చేసి గుడి నుంచి వెళ్లిపోయిందని, ఎక్కడికి వెళ్లిందో చెప్పమని గొడవ చేస్తాడు.
శృతి డబ్బింగ్ చెప్పడానికి వెళ్లిందని సంజుకు శోభన, సురేంద్ర అబద్ధం చెబుతారు. ఇక నుంచి శృతి ఎక్కడికి వెళ్లినా తనకే చెప్పి వెళ్లాలని, ఇంకోసారి ఇలాంటిది రిపీట్ అయితే ఊరుకునేది లేదని, మా నాన్నకు ఈ విషయం తెలిస్తే సీన్ వేరేలా ఉంటుందని శోభన, సురేంద్రలకు వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు సంజు.
సురేంద్ర, శోభన భయం...
రవిని శృతి పెళ్లిచేసుకొని వెళ్లిపోయి ఉండొచ్చని శోభన, సురేంద్ర కంగారుపడతారు. ఈ కుట్ర వెనుక రవి తండ్రి సత్యం ఉన్నాడని సురేంద్ర కోపంతో ఊగిపోతాడు. ఎలాగైనా శృతిని వెనక్కి తీసుకొచ్చి సంజుకు ఇచ్చి పెళ్లిచేయాలని ఫిక్సవుతాడు లేదంటే నీలకంఠం, సంజు తమను ప్రాణాలతో ఉండనివ్వరని భయపడతాడు.
మీనాపై ప్రభావతి ఫైర్...
బయటకు వెళ్లినా మీనా చాలా సమయమైన ఇంటికి తిరిగిరాకపోవడంతో ఆమెపై ప్రభావతి కోపంతో ఎగిరిపడుతుంది. వంట చేయకుండా వెళ్లిందని చిందులు తొక్కుతుంది. ఆఫీస్ టైమ్‌లో మనోజ్ ఇంట్లోనే ఉండటంతో సత్యానికి డౌట్ వస్తుంది. తాను ఆఫీస్‌కు ఎప్పుడైనా వెళ్లొచ్చు...ఎప్పుడైనా రావచ్చునని తండ్రితో అంటాడు మనోజ్. అలా వెళ్లిరావడానికి అదేమైనా పబ్లిక్ పార్కా అని సత్యం అనగానే మనోజ్ కంగారు పడతాడు. ప్రభావతి టాపిక్ డైవర్ట్ చేస్తుంది.
సురేంద్ర గొడవ....
అప్పుడే ఆవేశంగా సత్యం ఇంటికొచ్చిన సురేంద్ర గొడవ చేస్తాడు. మా ఇంటికొచ్చి గొడవ చేస్తున్నావు ఏమైందని సురేంద్రను అడుగుతాడు సత్యం. రవి, శృతి ప్రేమ సంగతి తెలియని ప్రభావతి బాలునే సురేంద్రతో గొడవపడి ఉంటాడని అనుమానపడుతుంది. నీ పెన్షన్ ఆపించాననే కోపంతో నీ కొడుకు రవి ద్వారా నా కూతురు శృతిని కిడ్నాప్ చేశావని, తన కూతురు ఎక్కడుందో చెప్పమని సత్యాన్ని నిలదీస్తాడు సురేంద్ర.
రవి ఫోన్ స్విఛాఫ్...
నీలాంటి మర్యాద లేని మనుషుల దగ్గరకు వెళ్లొద్దని, మీ అమ్మాయితో మాట్లాడొద్దని రవిని హెచ్చరించామని, ఈ విషయంలో రవి తప్పేం ఉండదని కొడుకును వెనకేసుకొని వస్తాడు సత్యం. రవితో ఇప్పుడే మాట్లాడిస్తానని కొడుకుకు సత్యం కాల్ చేస్తాడు. రవి ఫోన్ లిఫ్ట్ చేసేలోపు అతడి దగ్గరి నుంచి ఫోన్ లాక్కున్న శృతి స్విచాఫ్ చేస్తుంది. సత్యం షాకవుతాడు.
సత్యంపై మాటలతో రెచ్చిపోతున్న సురేంద్రపై మనోజ్, ప్రభావతి మాటల దాడి మొదలుపెడతారు. ఇంకోమాట ఇష్టం వచ్చినట్లు నువ్వు తిరిగి ఇంటికి వెళ్లవని సురేంద్రకు వార్నింగ్ ఇస్తాడు మనోజ్. మర్యాదగా ఇంట్లో నుంచి వెళ్లిపోకపోతే పోలీస్ కేస్ పెడతానని ప్రభావతి అంటుంది.
సత్యంపై పోలీస్ కేస్...
మీరేంటి పోలీసులను పిలిచేది...మీరు మర్యాదగా అడిగితే చెప్పరనే నీపై , రవిలపై కేసు పెట్టానని సురేంద్ర కోపంగా అంటాడు. మా ఇంటికి శనిలా పట్టుకున్నావని కోపంగా సురేంద్ర కాలర్ పట్టుకొని అతడిని కొట్టబోతాడు సత్యం. ఇద్దరి గొడవను పోలీసులు వచ్చి ఆపుతారు. రవి ఎక్కడున్నాడని పోలీసులు సత్యాన్ని అడుగుతారు. కొడుకు రెస్టారెంట్‌లో పనిచేస్తున్నాడని, ఫోన్ చేస్తే స్విఛాఫ్ అని వస్తుందని సురేంద్ర సమాధానమిస్తాడు.
సెల్‌లో సత్యం...
మీరు స్టేషన్‌కు రావాలని సత్యంతో పోలీసులు అంటారు. తన భర్త ఎలాంటి తప్పు చేయనప్పుడు స్టేషన్‌కు ఎందుకు రావాలని ప్రభావతి పోలీసులతో అంటుంది. సురేంద్ర తమపై కక్షతో తప్పుడు కేసు పెట్టాడని అంటుంది. చిన్న స్టేట్‌మెంట్ తీసుకొని విడిచిపెతామని చెప్పి సత్యాన్ని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళతారు పోలీసులు. స్టేషన్‌కు వచ్చిన తర్వాత మాట మారుస్తారు.
శృతి ఎక్కడుందనే నిజం చెప్పిన తర్వాతే సత్యాన్ని వదిలిపెడతామని అంటారు. నిజం చెప్పేవరకు సత్యాన్ని సెల్‌లోనే ఉంచుతామని చెబుతారు. రవి, శృతి పెళ్లిచేసుకున్నారని, సత్యాన్ని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి భర్తకు చెబుతుంది మీనా. అక్కడితో నేటి గుండెనిండా గుడిగంటలు సీరియల్ ముగిసింది.