గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: పెళ్లి రోజు గది లేక బాలు, మీనా ఇబ్బందులు.. సుశీల ట్విస్ట్.. తల్లికి రోహిణి ఫోన్-gunde ninda gudi gantalu today episode september 11th 2025 no room for balu meena stat maa serial jiohotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: పెళ్లి రోజు గది లేక బాలు, మీనా ఇబ్బందులు.. సుశీల ట్విస్ట్.. తల్లికి రోహిణి ఫోన్

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: పెళ్లి రోజు గది లేక బాలు, మీనా ఇబ్బందులు.. సుశీల ట్విస్ట్.. తల్లికి రోహిణి ఫోన్

Hari Prasad S HT Telugu

గుండె నిండా గుడి గంటలు సీరియల్ గురువారం (సెప్టెంబర్ 11) ఎపిసోడ్ కూడా బాలు, మీనా పెళ్లి రోజు చుట్టూనే తిరిగింది. తమ పెళ్లి రోజు అయినా కూడా బాలు, మీనాకు ప్రత్యేకంగా గది లేకపోవడం, దీనిపై సుశీల ఇంట్లో వాళ్లందరినీ నిలదీయడంలాంటి సీన్లు చూడొచ్చు.

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: పెళ్లి రోజు గది లేక బాలు, మీనా ఇబ్బందులు.. సుశీల ట్విస్ట్.. తల్లికి రోహిణి ఫోన్

గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 508వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. బాలు, మీనా పెళ్లి రోజు సెలబ్రేషన్స్ కొనసాగాయి. అయితే సంజూకి బాలు గట్టి వార్నింగ్ ఇచ్చి పంపించడం, రోహిణికి ప్రభావతి మళ్లీ క్లాస్ పీకడం, అటు సుశీల కూడా బాలు, మీనా పరిస్థితి చూసి ఇంట్లో వాళ్లను నిలదీయడంలాంటి సీన్లతో ఈ ఎపిసోడ్ సాగింది.

బాలుని భరించలేకపోతున్నాన్న ప్రభావతి

గుండె నిండా గుడి గంటలు సీరియల్ గురువారం (సెప్టెంబర్ 11) ఎపిసోడ్ బాలు, మీనా పెళ్లి రోజు సందర్భంగా అందరూ మాట్లాడుతూ ఉంటారు. ప్రభావతి కూడా మాట్లాడాలని సుశీల ఒత్తిడి చేస్తుంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడుతుంది. బాలుని పుట్టినప్పటి నుంచి తాను భరించలేకపోతున్నానని అంటుంది.

వీళ్ల పెళ్లి తనకు ఇష్టం లేకుండా జరిగిందని, మీనా కూడా వీడిని భరించలేక వెళ్లిపోతుందని అనుకున్నానని చెబుతుంది. కానీ మీనా మాత్రం వాడు ఏం చేసినా భరిస్తోంది.. తప్పు చేసినా వెనకేసుకొస్తోంది.. వాడిని ఇలాగే చూసుకో అంటూ ఇద్దరిపై ఇష్టం లేకుండానే ప్రశంసలు కురిపిస్తుంది.

బాలులో ఏదో వెలితి ఉందన్న మీనా

ఆ తర్వాత బాలు, మీనా కూడా తమ గురించి మాట్లాడతారు. మీనాలాంటి భార్య దొరకడం తన అదృష్టమని బాలు అంటాడు. అటు మీనా కూడా బాలు గురించి మాట్లాడుతూ.. సరిగ్గా ఏడాది కిందట ఇతన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నానా అని బాధపడ్డానని, ఇప్పుడు మాత్రం చాలా సంతోషంగా ఉందని అంటుంది.

ఎప్పుడూ నవ్వుతూ, అందరినీ నవ్విస్తూ ఉండే బాలులో ఏదో వెలితి ఉందని, అది మాత్రం ఇప్పటి వరకూ తాను తెలుసుకోలేకపోయానని మీనా అంటుంది. అటు మౌనిక మాట్లాడుతూ.. అసలు భార్య ఎలా ఉండాలో మీనా వదినను చూసి నేర్చుకోవాలి, తాము కూడా వీళ్లలాగే అన్యోన్యంగా ఉండాలని అనుకుంటున్నట్లు చెబుతుంది. అది చూసిన సంజూ ఈ ఉపన్యాసాలు ఆపితే వెళ్దామని అంటాడు.

సంజూకి బాలు వార్నింగ్

తాను కారు వరకు వచ్చి దిగబెడతానని బాలు వెంట వెళ్తాడు. నీకు ఏ కష్టం వచ్చినా, ఎవరు ఏమన్నా ఈ అన్నయ్య ఉన్నాడని మరచిపోకమ్మా అని బాలు ఆమెతో అంటాడు. కారు డోరు తీసి చెల్లిన లోపల కూర్చోబెడతాడు. ఇటు బావ గారు అంటూ వచ్చి సంజూకి కూడా కారు డోరు తీసి మర్యాద చేస్తాడు. తర్వాత కావాలని డోరు మూయడంతో సంజూ వేళ్లు నలుగుతాయి. అయ్యయ్యో అని బాలు అంటుంటే నాటకాలు వద్దని సంజూ అంటాడు. అర్థమైందిగా.. నా చెల్లిని బాధపెట్టావో.. నేను బాధపడతాను.. తర్వాత నువ్వు బాధ పడతావు జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి సంజూని పంపిస్తాడు.

రోహిణిని మళ్లీ నిలదీసిన ప్రభావతి.. తల్లికి ఫోన్

ఇటు రోహిణి దగ్గరికి వెళ్లి ప్రభావతి.. ఫంక్షన్ బాగా జరిగింది కదా అంటుంది. అందరూ వచ్చారు.. మీ ఇంటి నుంచి మాత్రం ఎవరూ రాలేదని రోహిణిని నానా మాటలు అంటుంది. తల్లి లేదు.. తండ్రి జైల్లో ఉన్నాడు అని ప్రభావతి అనడంతో రోహిణి బాధపడుతుంది. ఆమె వెళ్లిన తర్వాత తల్లికి ఫోన్ చేస్తుంది.

తన కొడుకు ఎలా ఉన్నాడని ఆరా తీస్తుంది. బాలు, మీనా పెళ్లి రోజు సంబరాలు.. ప్రభావతి అన్న మాటలు చెప్పుకొని బాధపడుతుంది. వచ్చే వారం తాను ఇంటికి వస్తానని తల్లికి చెబుతుంది. తాను కనీసం చీర, సారె కూడా తెచ్చే పరిస్థితుల్లోనూ లేనని ఆమె బాధపడుతుంది.

బాలు, మీనాకు గది ఎందుకు ఇవ్వలేదన్న సుశీల

రాత్రికి సుశీల.. బాలు, మీనాలకు దిష్టి తీయాలనుకుంటుంది. వాళ్లకెందుకు అని ప్రభావతి అనడంతో ఆమెకు క్లాస్ పీకుతుంది. నీకు ముగ్గురు కొడుకులు ఉంటే.. వీళ్లను మాత్రం ఎందుకు వేరుగా చూస్తావని నిలదీస్తుంది. తాను ఎవరినీ వేరుగా చూడనని, కావాలంటే అందరికీ దిష్టి తీస్తానని చెబుతుంది. ఈ రోజుల్లో తిడుతూనే అయినా ఉమ్మడి కుటుంబాన్ని కొనసాగిస్తున్నావని ప్రభావతిని పొగుడుతుంది. ఆ తర్వాత ఇంట్లో వాళ్లందరికీ సుశీల దిష్టి తీస్తుంది.

తాము మేడ మీదికి వెళ్లి పడుకుంటామని బాలు అనడంతో ఇవాళ పెళ్లి రోజు పైన ఎలా పడుకుంటారు.. అయినా మీకు గది ఎందుకు లేదు అని సుశీల అడుగుతుంది. మూడు గదులే ఉన్నాయి కదా అని ప్రభావతి అంటే.. నీకు ఉన్నది కూడా ముగ్గురు కొడుకులే కదా.. బాలు, మీనా కూడా సంపాదిస్తున్నారు కదా.. అందరికీ గదులు ఉన్నాయి కదా.. ఈరోజు ఎవరు వాళ్లకు గది ఇస్తారు.. ఒరెయ్ పెద్ద దున్నపోతు, చిన్న దున్నపోతు అంటూ మనోజ్, రవిలను నిలదీస్తుంది. రవి, శృతి తాము ఇస్తామని అంటారు. కానీ బాలు, మీనా వద్దని వెళ్లిపోతారు.

మేడ మీద గది కట్టాలన్న సుశీల

ఆ తర్వాత సత్యం దగ్గరికి వెళ్లిన సుశీల.. బాలు, మీనా పరిస్థితి గురించి మాట్లాడుతుంది. వాళ్లతో ఎందుకిలా ప్రవర్తిస్తున్నారంటూ నిలదీస్తుంది. ఈ పరిస్థితి రావద్దనే మేడ మీద గది కట్టాలని అనుకుంటున్నట్లు సత్యం చెబుతాడు. శృతి వాళ్ల అమ్మ కట్టిస్తానంటే మీరే వద్దన్నారని ప్రభావతి అనడంతో మన ఇంట్లో గది కట్టడానికి వాళ్లెవరు అని సత్యం అంటాడు.

నీకు కక్కుర్తి తప్ప ఆత్మ గౌరవంలాంటివి ఏమీ లేవా అని సుశీల కూడా అనడంతో ప్రభావతి అలిగి వెళ్లిపోతుంది. పైన గది కట్టాలని, అవసరమైతే తాను కూడా డబ్బు ఇస్తానని సుశీల అంటుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం