Gunde Ninda Gudi Gantalu: రోహిణికి అడుగడుగున గండం.. మనోజ్‌కు డౌట్.. ప్రభావతికి శిక్ష.. సత్యం లవ్ స్టోరీ చెప్పిన పారిజాతం-gunde ninda gudi gantalu today episode promo rohini tension punishment prabhavathi star maa serial disney plus hotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gunde Ninda Gudi Gantalu: రోహిణికి అడుగడుగున గండం.. మనోజ్‌కు డౌట్.. ప్రభావతికి శిక్ష.. సత్యం లవ్ స్టోరీ చెప్పిన పారిజాతం

Gunde Ninda Gudi Gantalu: రోహిణికి అడుగడుగున గండం.. మనోజ్‌కు డౌట్.. ప్రభావతికి శిక్ష.. సత్యం లవ్ స్టోరీ చెప్పిన పారిజాతం

Sanjiv Kumar HT Telugu

Gunde Ninda Gudi Gantalu Serial Latest Episode Promo: గుండె నిండా గుడి గంటలు లేటెస్ట్ ఎపిసోడ్‌ ప్రోమోలో రోహిణి మావయ్యగా సుశీల ఇంటికి మటన్ కొట్టు మాణిక్యం వస్తాడు. సందర్భం దొరికిన ప్రతిసారి ప్రశ్నలు వేస్తూ నిజం బయటకు లాగడానికి ట్రై చేస్తాడు బాలు. దాంతో రోహిణి అడుగడుగున గండమే వస్తుందని బాధపడుతుంది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో

Gunde Ninda Gudi Gantalu Serial: గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌ ప్రోమోలో సత్యం కుటుంబం అంతా సుశీల ఇంటికి ఉగాది పండుగకు వెళ్తుంది. అక్కడ సత్యం లవ్ స్టోరీ ఉంటుంది. సత్యంను ఇష్టపడ్డ పారిజాతం వచ్చి క్షేమసమాచారాలు అడుగుతుంది.

మనసు పడ్డావా ఏంటీ

మీ అమ్మ మా నాన్నతో సరిగా పోట్లాడి ఉంటే.. ఈ ముగ్గురికి నేను తల్లిని అయ్యేదాన్ని అని పారిజాతం అంటుంది. తర్వాత సత్యం కుటుంబం లోపలికి వెళ్లిన కూడా పారిజాతం వాకిట్లోనే చూస్తూ ఉంటుంది. దాంతో సుశీల పనిమనిషి చంద్రి తిడుతుంది. మాట్లాడితే నువ్ పైకి వస్తున్నావ్. నువ్ కూడా సత్యంపై మనసు పడ్డావా ఏంటీ అని పారిజాతం అంటుంది. దాంతో వీపు మీద ఒక్కటి ఇస్తాను. ఎల్లేహే అని చంద్రి వారించడంతో పారిజాతం వెళ్లిపోతుంది.

తర్వాత అంతా ఇంట్లోకి వెళ్తారు. మనోజ్‌కు, రవికి రెండు రూమ్స్ చూపించి అందులోకి వెళ్లమంటుంది ప్రభావతి. చూశావా నాన్నా.. వాళ్లిద్దరు ఆస్తులు ఉన్నోల్లు కాబట్టి బెడ్స్ ఉన్న గదిల్లోకి పంపించింది. నేను డ్రైవర్‌ను, నా భార్య పూలమ్మేది కాబట్టి మమ్మల్ని పట్టించుకోవట్లేదు. నేను ఈ నేలపైనా అయినా పడుకుంటాను. కానీ, నా భార్య సంగతి చూసుకోవాలిగా. ఇబ్బంది పెట్టకూడదుగా అని బాలు అంటాడు.

అమ్మ వేస్తున్న శిక్ష

నీకేం కర్మరా మీరు నా రూమ్ తీసుకోండి. మీరు ఉన్నన్ని రోజులు ప్రభావతి ఈ నేలపైనే పడుకోవాలి అని సుశీల ఆర్డర్ వేస్తుంది. దాంతో ప్రభావతి షాక్ అవుతుంది. నీకు నవారు మంచం ఇస్తానురా అని సత్యంతో అంటుంది సుశీల. దాంతో నవ్వేసిన సత్యం.. అది పెద్దరాయుడు తీర్పు. ఇకపై నేలపైనే పడుకోవాలి. మనోజ్, రవికి గదులు ఇచ్చి బాలును మాత్రం పట్టించుకోనందుకు నీకు మా అమ్మ వేస్తున్న శిక్ష ఇది అని అంటాడు.

ఈ పల్లెటూరులో ఎలా ఉండాలో, ఇక్కడ ఎలా సర్దుకోవాలో అని మనోజ్ అంటాడు. మన రూమే అగ్గిపెట్టేలా ఉంటుంది. ఇది చాలా కంఫర్ట్‌బుల్‌గా ఉంది. మనింటికి ఎవరైనా వస్తే ఆరు బయట పడుకోవాలి. ఇక్కడ చాలా విశాలంగా ఉంది. ఏదో పారిస్ నుంచి వచ్చినట్లు ఫోజు కొడతావేంటీ అని మనోజ్‌కు రోహిణి చురకలు వేస్తుంది. అవును, మీ మలేషియా మావయ్య వస్తే ఎక్కడ ఉంటారు అని మనోజ్ అనుమానం వ్యక్తం చేస్తాడు.

వేరే గదిలో ఉందాం

దాంతో రోహిణి ఆలోచనలో పడిపోతుంది. అమ్మో ఆయన మలేషియా నుంచి వస్తున్నట్లు చెప్పాను. ఇక్కడ అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వకుండా డౌట్ వస్తుంది. వెంటనే ఫారెన్ నుంచి వచ్చినట్లు బిహేవ్ చేయమని చెప్పాలి అని అనుకుంటుంది రోహిణి. ఇక మనోజ్‌తో మలేషియా మావయ్య ఇక్కడ కంఫర్టుబుల్‌గా ఉంటారో లేదో. మంచి రూమ్ చూసి ఇవ్వాలి. మనం ఉంటున్న గదే ఇచ్చి మనం వేరే చోట ఉందామని రోహిణి అంటుంది.

దాంతో మనోజ్ మరింత చిరాకు పడతాడు. ఆయన వస్తే మనం వేరే గదిలోకి వెళ్లడం ఏంటీ అని కసురుకుంటాడు. ఇదే విషయం ప్రభావతికి చెబితే మనోజ్‌కు సర్దిచెబుతుంది. తర్వాత రోహిణి మావయ్య గురించి బాలు మీనాతో మాట్లాడుతాడు. నాకెందుకు ఆ పార్లరమ్మను చూస్తుంటే తేడా కొడుతుంది. ఎందుకో టెన్షన్ పడుతుంది. చాటుగా వెళ్లి ఎవరితోనే సీక్రెట్‌గా మాట్లాడుతుంది. ఏదేదో దాచిపెడుతుంది. అదేంటో కనుక్కోవాలి అని బాలు అంటాడు.

విషయాలు బయటకు తీస్తా

మీకు అందరిమీద అనుమానాలే అని మీనా అంటుంది. నేను మాట్లాడేది వేరులే. పెళ్లి అయినప్పటి నుంచి ఇప్పటివరకు పుట్టింటి నుంచి ఒక్కరు రాలేదు. ఇప్పుడెందుకు ఆ మలేషియా మామగాడు మనింటికి రాకుండా ఈ పల్లెటూరుకు వస్తున్నాడు. చెప్తా.. వాడెవడో రానివ్వు.. ఎట్లాగైన వాన్ని పట్టుకుని ఈ పార్లరమ్మ సంగతి ఏంటీ తెలుసుకుంటా. అన్ని విషయాలు బయటకు తీస్తా అని బాలు అంటాడు. తర్వాత మలేషియా నుంచి రోహిణి మామ అంటూ మటన్ కొట్టు మాణిక్యం ఎంట్రీ ఇస్తాడు.

అతన్ని విపరీతమైన ప్రశ్నలు అనుమానంగా అడుగుతాడు బాలు. దానికి రోహిణి కవర్ చేస్తుంది. సందర్భం దొరికిన ప్రతిసారి రోహిణి మావయ్యను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తూ నిజం బయటకు లాగేందుకు ప్రయత్నిస్తుంటాడు బాలు. దాంతో ప్రతిసారి కవర్ చేయలేక రోహిణికి తలప్రాణం తోకలోకి వచ్చినట్లు అవుతుందని అనుకుంటుంది. అలా మలేషియా మావయ్య అని రావడం ఏంటో గానీ అడుగడుగున గండం ఏర్పడుతుంది అని తనలో తానే బాధపడుతుంది.

సత్యం లవ్ స్టోరీ

తర్వాత సత్యం చిన్ననాటి ప్రియురాలు పారిజాతం సుశీల ఇంటికి వస్తుంది. ఏమైనా కావాల అని ప్రేమగా అడుగుతుంది. అప్పుడు లవ్ స్టోరీ అడుగుతాడు బాలు. దాంతో సత్యంపై పెంచుకున్న ప్రేమను పారిజాతం చెబుతుంది. దాంతో అంతా ఆశ్చర్యపోతారు. ప్రభావతి మాత్రం ఇదేం కర్మరా నాయనా అనుకుంటూ ఫీల్ అవుతుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.